Barbie Movie Gets UA Certificate For Mentioning Objectional Scenes, Deets Inside - Sakshi
Sakshi News home page

Barbie Movie Censor Report: బార్బీ మూవీకి ఓకే చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్స్ ఉన్నా కూడా!

Published Tue, Jul 18 2023 4:05 PM | Last Updated on Tue, Jul 18 2023 4:54 PM

Barbie Movie Gets UA Certificate For Mentioning Objectional Scenes - Sakshi

లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన చిత్రం 'బార్బీ'. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు మార్గోట్ రాబీ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్‌కు అర్థం ఏమిటంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్‌తో పాటు.. కొన్ని అసభ్యకరమైన సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ  చిత్రాన్ని 12 ఏళ్ల వయసులోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్‌ను బట్టి అర్థమవుతోంది. 

(ఇది చదవండి: టైగర్‌ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే

అంతే కాకుండా ఈ చిత్రంలో హస్తప్రయోగంతో పాటు లైంగిక వేధింపుల దృశ్యాలు ఉండడంతో హాలీవుడ్ మూవీ బార్బీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన పదాలు, లైంగిక వేధింపుల సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని  లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో  తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన బార్బీ ట్రైలర్‌ ఇప్పటికే రిలీజ్ కాగా.. జూలై 21, 2023న థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో విల్ ఫెర్రెల్, ఎమ్మా మాకీ, కానర్ స్విండెల్స్, నికోలా కాగ్లాన్, ఎమరాల్డ్ ఫెన్నెల్, కేట్ మెక్‌కిన్నన్, మైఖేల్ సెరా, సిము లియు, అమెరికా ఫెర్రెరా, కుటి గట్వా, ఇస్సా రే, కింగ్స్లీ బెన్-అదిర్, రియా పెర్ల్‌మాన్, షారన్ ఇవాన్స్ , అనా క్రజ్ కేన్, రీతు ఆర్య, జామీ డెమెట్రియో ప్రధాన పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: హీరోయిన్‌​ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement