sensor
-
ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఉపయోగాలెన్నో..సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలుఏ ప్రమాదం లేదు..అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ మట్కా.. రన్ టైమ్ ఎంతంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. ఈ ఫుల్ యాక్షన్ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా.. చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించనున్నాడు.రన్ టైమ్ ఎంతంటే..మట్కా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 33 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్‌తో కలిసి దాదాపు 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. ఈ ఫుల్ మాస్ ఎంటర్టైనర్లో చివరి 20 నిమిషాలు క్లైమాక్స్ హైలెట్‌గా ఉండనుందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ వెల్లడించారు. -
‘లైడర్’ వచ్చేస్తోంది
రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. తొలి దశలో 1,000 రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తోంది. సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 24సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. రైలు పట్టాలను తొలగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను పెట్టడం వంటి దుశ్చర్యలకు విద్రోహులు పాల్పడుతున్నారు. అలాంటి కుట్రలకు చెక్ పెట్టేందుకు రైలు పట్టాల భద్రత కోసం రైల్వే శాఖ లైడర్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఇప్పటికే పట్టాలు తప్పి జరిగే ప్రమాదాల నివారణ కోసం రూ.15 వేల కోట్లతో రైలు కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుకు రైల్లే శాఖ కార్యచరణ చేపట్టింది. దానికి అదనంగా లైడర్ ప్రాజెక్ట్‌కు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు సంక్లిప్తంగా...దేశవ్యాప్తంగా విస్తరణలైడర్ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మొదటి దశలో వెయ్యి రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు సైతం పిలిచింది. ఈ ప్రాజక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెన్సార్ టెక్నాలజీతో..» లైడర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండే సెన్సార్ టెక్నాలజీ రైలు పట్టాల త్రీడీ నమూనాలను రూపొందించి లోకో పైలెట్ కేబిన్‌లోకి పంపిస్తుంది. » రైళ్లలో ఏర్పాటు చేసే సెన్సార్లు రైలు పట్టాల రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. » రైలు పట్టాలు తప్పినా, పట్టాలు విరిగినా, పట్టాలపై చిన్న బీటలు ఉన్నా సరే వెంటనే గుర్తించవచ్చు. » లేజర్ బీమ్లతో రైలు పట్టాలను సెన్సార్ చేసి.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే గుర్తించే వీలు కలుగుతుంది.» ఆ ప్రమాదం ఎంత దూరంలో ఉందన్నది కూడా ఈ సాంకేతికత కచ్చితంగా తెలియజేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే కనీసం 15 కి.మీ. దూరంలోనే రైలును నిలిపివేసేందుకు లోకో పైలట్‌కు అవకాశం ఉంటుంది. -
ది గోట్ మూవీ.. రన్‌టైమ్ ఎన్ని గంటలో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు.అయితే ఈ సందర్భంగా చిత్రబృందానికి కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. దీంతో గోట్ మూవీకి మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ బోర్డు ఆదేశాలతో ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిన చిత్రబృందం.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. ప్రస్తుం దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. ఇప్పటికే రిలీజైన ది గోట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.#TheGoat bookmyshow 136k interested 🎟️❤️🔥❤️🔥❤️🔥Duration: 3hrs 3mins 14secs.Certified: U/AIn theaters from September 5th!#TheGreatestOfAllTime @actorvijay @vp_offl @thisisysr @archanakalpathi @aishkalpathi @Ags_production pic.twitter.com/dQcNMGFp46— The GOAT Movie (@GoatMovie2024) August 27, 2024 -
హారర్ థ్రిల్లర్‌తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీడీ(క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత అదా శర్మ తెలుగు వారిని పలకరించనున్నారు. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు.హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. -
అడల్ట్ మూవీకి ఓకే చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్స్ ఉన్నప్పటికీ!
లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన చిత్రం 'బార్బీ'. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు మార్గోట్ రాబీ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్కు అర్థం ఏమిటంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్‌తో పాటు.. కొన్ని అసభ్యకరమైన సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని 12 ఏళ్ల వయసులోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్‌ను బట్టి అర్థమవుతోంది. (ఇది చదవండి: టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే) అంతే కాకుండా ఈ చిత్రంలో హస్తప్రయోగంతో పాటు లైంగిక వేధింపుల దృశ్యాలు ఉండడంతో హాలీవుడ్ మూవీ బార్బీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన పదాలు, లైంగిక వేధింపుల సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన బార్బీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. జూలై 21, 2023న థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో విల్ ఫెర్రెల్, ఎమ్మా మాకీ, కానర్ స్విండెల్స్, నికోలా కాగ్లాన్, ఎమరాల్డ్ ఫెన్నెల్, కేట్ మెక్‌కిన్నన్, మైఖేల్ సెరా, సిము లియు, అమెరికా ఫెర్రెరా, కుటి గట్వా, ఇస్సా రే, కింగ్స్లీ బెన్-అదిర్, రియా పెర్ల్‌మాన్, షారన్ ఇవాన్స్ , అనా క్రజ్ కేన్, రీతు ఆర్య, జామీ డెమెట్రియో ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్‌తో పాటు ఫేమ్‌ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్‌లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
విద్యుత్ షాక్ మరణాలను ఆపే సెన్సార్
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలను గుర్తించే సెన్సార్‌ను కనుగొని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. విద్యుదాఘాతంతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద రైతుల మరణాలను ఆపేందుకు సెన్సార్‌ను ఆవిష్కరించారు. ప్రివెన్షన్ ఆఫ్ ఎలెక్ట్రోడ్యూషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్రెమెక్స్ అనే ప్రాజెక్ట్‌ను ఆధ్యాపకులు డాక్టర్ సదానందం, టి.వేణుగోపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.శృతి, పి.మేఘన, ఎండి సమీర్, ఎస్.అనురాగ్, జి.మధుకర్ రూపొందించారు. సహజంగా వ్యవసాయ బావులు, పంట పొలాల వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై రైతులు ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు. విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని రైతును అలర్ట్ చేసే యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీంతో విద్యార్థులు తమ పరిశోధన ద్వారా ప్రమాద సమయంలో అలర్ట్ చేసే సెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యంత్ర పని విధానాన్ని విద్యార్థులు వెల్లడించారు. ’’ప్రాసెసర్ ద్వారా సెన్సార్ స్విచ్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. దీంతో తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు రైతు వస్తుంటే సెన్సార్ స్విచ్ ఒత్తిడితో ఈ యంత్రంలో అమర్చిన కెమెరా ఫొటోలు తీసి వాటిని దానంతట అదే మెమరీ కార్డులో రికార్డు చేస్తుంది. తద్వారా రైతును అప్రమత్తత చేయడమే కాకుండా బజర్ సౌండ్ ఇస్తుంది’’అని వివరించారు. ఒకవేళ రైతు ముందుకు వస్తే విద్యుత్ సరఫరా నేరుగా నిలిపివేయబడుతుందని చెప్పారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'నారప్ప'
హీరో వెంకటేశ్ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం నారప్ప. తమిళ చిత్రం ‘అసురన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, కలైపులి ఎస్. థానుఈ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన `నారప్ప` టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నలు పోషించారు. ‘నారప్ప’ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా జూలై 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. -
సెన్సార్
పాపం క్వాన్! ఒకరోజు అతను కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు పట్టుబడ్డాడు. అదృష్టరేఖ తగిలిందని ఆనందిస్తూ ఉన్నప్పుడు, అది విధి ఆడుతున్న చేదు నాటకం అని తెలుసుకునే లోపలే జరిగిపోయిందది. అందరికీ జరిగేదే..ఏమరుపాటుగా ఉండే ఒక్క క్షణంలో ముంచుకొచ్చే అనర్థం. అసలేం జరిగిందంటే, మరియానా పారిస్‌లో ఉంటున్న విషయం, ఆమె అడ్రసూ ఒక నమ్మకస్తుడైన మిత్రుడి దగ్గరినుంచి దొరికినప్పుడు క్వాన్ నరనరాల్లో సంతోషం (భరోసా లేని భావన!) నిండిపోయింది. తనకి తెలుసు, ఆమె తనని అస్సలు మర్చిపోయుండదు. అంతే–ఇహ రెండో ఆలోచన లేకుండా టేబుల్ దగ్గర కూర్చుని, ఆమెకి ఆ ఉత్తరం రాసేశాడు. ఆ ఉత్తరం తను చేస్తున్న పని మీద ధ్యాస నిలవనీకుండా, పడుకుంటే రాత్రికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న ఆ ఉత్తరం. (అసలు తను ఏం గిలికాడు? ఆ కాగితాల మీద ఏం రాశాడు?) తను రాసింది వేలెత్తి చూపగలిగింది కాదనీ, హానికరమైనది కాదనీ క్వాన్‌కి తెలుసు. కానీ మిగతా విషయాల మాటేమిటి? వాళ్లు ప్రతి ఉత్తరాన్నీ చదివి, పరిశీలించి, వాసన చూసి, తడిమి చూసి, చివరికి వాక్యాల మధ్య ఖాళీలనీ, కామాలనీ, కాగితం మీద పొరపాటున ఒక మరక పడితే దాన్ని కూడా శల్యపరీక్ష చేస్తారు. సెన్సార్ ఆఫీసులో ప్రతి ఉత్తరమూ ఒక చేతి నుంచి మరో చేతికి మారుతూ, రకరకాల పరీక్షలకి గురయి, చివరికి చాలా కొద్ది ఉత్తరాలే బతికి బట్ట కడతాయి. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుంది, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది–ఉత్తరాల్లో ఏ లోపాలూ లేకపోతే. ఉత్తరం రాసినవాడిదీ, ఎవరికి రాశారో వాళ్లదీ స్వేచ్ఛ, ఒక్కోసారి ప్రాణం కూడా ఆ పరీక్షలు పూర్తయేవరకూ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. సరీగ్గా ఈ కారణం వల్లనే క్వాన్ ఆందోళన పడుతున్నాడు. తన ఉత్తరం వల్ల మరియానాకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని. ఆమె తన కలల రాజ్యం పారిస్‌కి ఇప్పుడు క్షేమంగా చేరుకుని ఊపిరి తీసుకుంటున్న సమయాన ఏదైనా కీడు జరుగుతుందేమో అని. ఈ సెన్సార్ వాళ్ల సీక్రెట్ కమాండ్ గ్రూప్ ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లగలరనీ, పారిస్ వెళ్లకుండా వాళ్లని ఏ శక్తీ ఆపలేదనీ, మరియానాని కిడ్నాప్ చేసైనా సరే తీసుకురాగలరనీ అతనికి తెలుసు. సరే–వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. వాళ్ల యంత్రాంగంలోనే దూరిపోవాలి. ఏదో చేసి, సమస్య అంతు చూసి, దాన్ని నిరోధించాలి. అలా ఓ పథకం వేసుకుని, సెన్సార్షిప్ డివిజన్లో ఉద్యోగానికి క్వాన్ అప్లై చేసాడు. ఆ ఉద్యోగమే సంపాదించాలి. తన ఉత్తరాన్ని వెళ్లి పట్టుకోగలగాలి. చివరికి అనుకున్నట్టుగానే ఆ ఉద్యోగం వచ్చింది. సెన్సార్ వాళ్లకి కూడా ఇంకా ఇంకా మనుషులు కావాల్సి వస్తోంది కాబట్టి, వస్తున్నవాళ్ల రిఫరెన్సులూ అవీ అంత శ్రద్ధగా చెక్ చేయడం లేదు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవాళ్లలో కనిపించే లొసుగులు ఏవైనా ఉంటే వాటిని ఉపేక్షిస్తారని కాదు గానీ, సెన్సార్షిప్ డివిజన్ వారికి ఉద్యోగార్థుల పట్ల మరీ అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవడైనా తన ఉత్తరం పట్టుకోవడానికే ఉద్యోగానికి వచ్చినా, అదంత తేలికైన విషయం కాదు. పోనీ, అలా ఒకటి రెండు ఉత్తరాలు చేయిజారిపోయినా, కొత్తగా చేరినవాళ్లు సెన్సార్ చేయబోయే అసంఖ్యాకమైన ఉత్తరాల సంఖ్యతో పోలిస్తే జారిపోయే ఆ ఒకటి రెండూ ఒక లెక్కా? ఆ విధంగా క్వాన్ పోస్టాఫీస్ వారి సెన్సార్షిప్ డివిజన్‌లోకి ఒక స్థిరమైన లక్ష్యంతో దిగ్విజయంగా అడుగుపెట్టగలిగాడు. బయటికి మామూలు సందడితో కనిపించే సెన్సార్షిప్ డివిజన్కీ, లోపల జరిగే గంభీరమైన విషయాలకీ అస్సలు పొంతన లేదు. కొంచెం కొంచెంగా క్వాన్ తన పనిలో మునిగిపోవడం ప్రారంభించాడు. తను మరియానాకి రాసిన ఉత్తరం పట్టుకోవాల్సిన దిశగా అడుగులు వేయగలుగుతున్నందుకు మనస్సు ఇప్పుడు కొంచెం భరోసాతో నిండిపోయింది. బహుశా అందువల్లనే, అతన్ని సెక్షన్–కె కి మార్చినప్పుడు దాని గురించి పెద్దగా భయపడలేదు. ఉత్తరాల్లో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం సెక్షన్–కె లో చేయాల్సిన పని! అతను సరీగ్గా ఆ సెక్షన్‌కి వచ్చిన మూడోరోజున ఆ సెక్షన్‌లోని ఒక ఉద్యోగస్థుడి కుడిచేయి ఒక ఉత్తరం కారణంగా పేలిపోయింది. ఆ డివిజన్ చీఫ్ మాత్రం అది కేవలం ఆ ఉద్యోగస్థుడి నిర్లక్ష్యం కింద తీసిపారేసాడు. ఆ సంఘటన జరిగాక క్వాన్, ఇతర ఉద్యోగస్థులూ భయం భయంగానే విధులని కొనసాగించారు.ఆరోజు డ్యూటీ అయిపోయాక, పనిలో ఉన్న అభద్రతల కారణంగా ఎక్కువ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్ట్రైక్ చేయాలని ఒక ఉద్యోగస్థుడు కొంత కదలిక తీసుకురావడానికి ప్రయత్నించాడు. క్వాన్ మాత్రం దాంట్లో పాలుపంచుకోలేదు. పైగా, కొద్దిగా ఆలోచించి, ఆ ఉద్యోగస్థుడి పేరుని పై అధికారులకి అందజేశాడు. ఫలితంగా క్వాన్‌కి ప్రమోషన్ లభించింది. ద్రోహమే, కానీ ఒక్కసారేగా చేసింది, ఇదేమీ అలవాటుగా మారదులే అని తనకి తాను నచ్చచెప్పుకున్నాడు. సెక్షన్–కె నుంచి ప్రమోషన్ మీదసెక్షన్–జె (ఇక్కడ ఉత్తరాల్లో విషపదార్థాలు ఏమన్నా ఉన్నాయా అని పరీక్షిస్తారు)కి మారడం ద్వారా నిచ్చెనలో తను ఒక మెట్టు పైకెక్కినట్టు భావించుకున్నాడు. కష్టపడి పనిచేస్తూ, అనతికాలంలోనే సెక్షన్–ఇ కి క్వాన్ చేరుకున్నాడు. ఇది చాలా ఆసక్తికరమైనసెక్షన్. ఇక్కడ అతను ఉత్తరాలని చదివి, వాటిని విశ్లేషించాలి. ఏమో, తను మరియానాకి రాసిన ఉత్తరం ఈ సెక్షన్లో దొరికినా దొరకొచ్చు! తను ఉత్తరం రాసినప్పటినుంచి గడచిన కాలం లెక్కేస్తే, బహుశా తన ఉత్తరం కింది సెక్షన్లని దాటుకుని ఈపాటికి ఇక్కడికి చేరుకుని ఉండవచ్చుననిపిస్తోంది. అతిత్వరలోనే అతను పనిలో ఎంత మునిగిపోవాల్సి వచ్చిందంటే, అసలు లక్ష్యం అతని మనసులో మసకబారిపోసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ, అతను ఎర్ర ఇంక్‌తో కొట్టివేసే పేరాలు పెరిగిపోతున్నాయి. నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలోకి పడేస్తున్న ఉత్తరాల సంఖ్య పెరిగిపోసాగింది. పైకి అస్సలేమీ తెలియనివ్వకుండా రకరకాల తెలివైన పద్ధతుల్లో జనాలు రహస్య సందేశాలని పంపించుకోవడాన్ని అతను గమనించడం మొదలుపెట్టినప్పుడు అవి అతన్ని విస్మయానికి గురిచేసాయి. ఇవన్నీ చూసి అతనిలోని సర్వశక్తులూ ఎంత నిశితంగా తయారయ్యాయంటే, ఉత్తరాల్లో కనిపించే ‘వాతావరణం అటూయిటుగా ఉంది’, ‘ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి’లాంటి మమూలు వాక్యాల మాటున కూడా ప్రభుత్వాన్ని పడదోయడానికి ప్రచ్ఛన్నంగా కుట్ర పన్నుతున్న అదృశ్య హస్తాలేవో అతనికి కనబడసాగాయి. అతని సమధికోత్సాహం అతనికి చకచకా ప్రమోషన్లని సంపాదించి పెట్టింది. అయితే, ఈ ఎదుగుదల అతన్ని సంతోషపెట్టిందా లేదా అన్నది మాత్రం మనకి తెలీదు. అతను సెక్షన్–బి కి చేరుకున్నాక, కింది స్థాయి పరీక్షలన్నీ దాటుకుని అతని దగ్గరకి చాలా వచ్చే ఉత్తరాల సంఖ్య అతి స్వల్పం అయిపోయింది. అందువల్ల అతను వాటిని మళ్లీ మళ్లీ చదివేవాడు. ఒక భూతద్దం పెట్టుకుని దాని ద్వారా పరిశీలించేవాడు. అతిచిన్న చుక్కలేవైనా ఉన్నాయా అని మైక్రోస్కోప్‌లో చూసేవాడు. ఆ కాగితాల వాసన కూడా పరిశీలించేవాడు. ఇంత తీక్షణమైన పని తర్వాత ఇంటికి చేరుకునేసరికి నిస్సత్తువగా అనిపించేది. సూప్‌ని అతికష్టం మీద కొంచెం వేడిచేసుకొని తాగి, ఏదో ఒక పండు తిని, తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు తృప్తిగా ఫీలవుతూ పడి నిద్రపోయేవాడు. ఇతని తీరు చూసి తల్లి బాధపడేది కానీ, ఇతన్ని దారిలోకి మాత్రం తీసుకురాలేకపోయేది. లోలా ఫోన్ చేసింది, తను స్నేహితురాళ్లతో బార్ దగ్గర ఉందట. నువ్వొస్తే బాగుంటుందనుకుంటున్నారు. నీకోసం ఎదురుచూస్తూ ఉన్నారట అని ఆవిడ చెప్తూ ఉండేది (అన్నిసార్లూ అవి నిజం కాదనుకోండి). లేదూ, ఒక్కోసారి ఆవిడ టేబుల్ మీద అతను గమనించేలా ఒక వైన్ బాటిల్ పెట్టివుంచేది. అబ్బే, క్వాన్ ఇవేవీ పట్టించుకునేవాడు కాదు. అతని ఆలోచనా ధోరణే వేరు: పక్కచూపు చూశామా, మనం ఉన్న ఉన్నత స్థానాన్నుంచి పడిపోతాం. ఒక పరిపూర్ణమైన సెన్సార్ ఆఫీసర్ అప్రమత్తంగా, నిశితంగా, చురుగ్గా, ఏమరుపాటు లేకుండా ఉండి, మోసగాళ్లని ఏరిపారేయాలి. ఇది దేశభక్తికి సంబంధించిన బాధ్యత. కేవలం త్యాగనిరతి మాత్రమే అందివ్వగల ఆత్మసంతృప్తి. అతని ఆలోచనలు అలా సాగేవి. సెన్సార్షిప్ డివిజన్ మొత్తం మీద, అతని చెత్తబుట్టకి మాత్రమే అత్యధికంగా ఆహారం లభించడమే కాకుండా, ఆ చెత్తబుట్ట అనేక రాజద్రోహపు ఆలోచనలకి నిలయంగా ఉండేది. ఇహ తనని తాను అభినందించుకోవాల్సిన సమయం వచ్చేసింది! తను మరియానాకి రాసిన ఉత్తరం తన చేతికి వచ్చేసింది!! ఎలాంటి పునరాలోచనా లేకుండా తన మామూలు ధోరణిలో అత్యంత సహజంగా అతను దాన్ని సెన్సార్ చేసేశాడు. అంతే సహజంగా అతనికి మరణశిక్ష విధించబడింది. మరుసటిరోజు ఉదయం శిక్ష అమలు అవుతున్నప్పుడు అతను దాన్ని నిరోధించలేకపోయాడు. పనిపట్ల అతనికి ఉన్న శ్రద్ధవల్ల మరొక బలిదానం జరిగింది. -
వారి పేర్లు బయటపెడతా: వర్మ
‘‘మా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. ఎవరెవరు ఆపడానికి ప్రయత్నించారో వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతా. సినిమా ఆపడానికి ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాం. 2019 మే నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. ఇదంతా ఫన్నీగా ఉంటుంది’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమా పనుల నిమిత్తం చైనాలో ఉన్నారు వర్మ. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆన్లైన్ ద్వారా ఆయన పై విధంగా మాట్లాడారు. రామ్‌గోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ నిర్మాతలు. వర్మ ఆన్లైన్ ప్రసంగం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, అంజయ్య మాట్లాడుతూ – ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కోసం 15 రోజులుగా యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయం సాధించాం. సినిమాని ఆపడానికి ఎవరు ప్రయత్నించారో గురువారం మధ్యాహ్నానానికల్లా ప్రతి ప్రేక్షకుడి ఊహకు తెలుస్తుంది. ఆపాలని ప్రయత్నించినవారిపై వర్మ చెప్పినట్లుగానే పరువు నష్టం దావా వేస్తాం. ఈ సినిమాకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది’’ అన్నారు. -
‘బెంజ్’ కార్లలో నిఘా నేత్రం
జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ కార్లలో వినియోగదారులకు తెలియని ఓ రహస్య ఫీచర్ ఉన్నట్లు మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. అదే నిఘా నేత్రం. దాన్నే ట్రాకింగ్ డివైస్ అని, లొకేషన్ సెన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్ ద్వారా ఆ కారు ఎక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయం తెల్సిన వినియోగదారులు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. 1,70,000 మెర్సిడెస్ బెంజ్ కార్లను గతేడాది ఒక్క బ్రిటన్‌లోనే అమ్మామని, వాటన్నింటిలోనూ ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే ఈ సెన్సర్ ఉపయోగాన్ని వాడుకుంటామని యాజమాన్యం పేర్కొంది. థర్ట్ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేశామని, వారికి యజమాని వివరాలతోపాటు కారున్న చోటుకు సంబంధించిన సమాచారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయకూడదు. తాము కార్లను అమ్మేటప్పుడే వినియోగదారుల నుంచి లొకేషన్ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా యాజమాన్యం తెలియజేసింది. కార్లను కొనేటప్పుడు, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్నంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్ తప్పనిసరి అయిందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్ మాజీ రక్షణ మంత్రి డేవిడ్ డేవిస్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ఇలా ‘బిగ్ బ్రదర్’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్ ల్యాండ్ రోవర్, వోక్స్వాగన్ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్ కంపెనీలకు ఉండాలిగానీ మెర్సిడెస్ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్ కారులు చోరీకి గురయ్యాయి. -
నో కట్స్
ఒక్క కట్ కూడా లేకుండానే ‘గుణ’ సెన్సార్ పరీక్ష పాస్ అయి రిలీజ్‌కు రెడీ అయ్యాడు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల రూపొందించిన చిత్రం ‘గుణ 369’. అనఘ కథానాయిక. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సెన్సార్ బోర్డ్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లందరూ గ్యారెంటీ హిట్ అంటున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు. ‘‘నాలుగు గోడల మధ్య రాసిన కథ కాదిది. యథార్థ గాథే మా చిత్రం ముడిసరుకు. సహజంగా ఉంటుంది. కథలో ఉన్న సహజత్వం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్య కిశోర్, శివ మల్లాల. -
ఇదో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం. అలాగే ఈ సినిమాలోని ‘రామా లవ్స్ సీత..’ పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా గురించి రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్డ్స్ క్యారెక్టర్ చేశాను. పూర్తి స్థాయి మాస్ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్ బైజాన్ లొకేషన్స్‌ను నేపాల్–బీహార్ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్ పార్టనర్. ‘రామా లవ్స్ సీత’ సాంగ్ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. లొకేషన్లో బాగా ఎంజాయ్ చేశాం కూడా. పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దానయ్యగారు. ఆయనతో చేస్తే మా హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేస్తారు’’ అన్నారు. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే సర్ప్రైజ్ కాలేదు. సెట్లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్లో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని పేర్కొన్నారు. -
వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
ప్రముఖ చైనా మొబైల్ తయారీదారు వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'వివో ఎక్స్21ఎస్' పేరిట చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. వివో వీ11ప్రో ఫోన్ మాదిరిగా ఈ సరికొత్త 'ఎక్స్21ఎస్' ఫోన్లోనూ అమర్చింది. అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, బెజెల్ లెస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 660 వంటి అధునాతన ఫీచర్లు అదనంగా జోడించింది. దీని ధర సుమారు రూ.26,100గా వుండనుంది. వివో ఎక్స్21ఎస్ ఫీచర్లు 6.41 ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 24.8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎవరు? ఎవరికి?
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కథానాయకుడు కార్తికేయ. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సుపారి’. తేజరెడ్డి, ఆకర్ష కథానాయికలు. నటుడు వినోద్ కుమార్ ప్రత్యేక పాత్ర చేశారు. జె.మోహన్‌కాంత్ దర్శకత్వంలో పండు యాదవ్ సమర్పణలో కేయస్ఆర్ క్రియేషన్స్ పతాకంపై కె.శంకర్‌రాజ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది. కె.శంకర్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఎవరు? ఎవరికి? ఎందుకు సుపారి ఇచ్చారన్నదే చిత్రకథ. రొమాన్స్, లవ్, యాక్షన్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. కార్తికేయ పాత్ర ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా నిలుస్తుంది. వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే మా సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, ‘గబ్బర్‌సింగ్’ చంద్ర, సూర్య, అప్పు, రామారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయ జి. రామిరెడ్డి, సంగీతం: రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ గంటాడి. -
భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. ఇక రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. -
చెమటతో వ్యాధిని గుర్తించొచ్చు!
బోస్టన్: చెమటను పరీక్షించి రోగాన్ని గుర్తించే సరికొత్త సెన్సర్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.రిస్ట్ బ్యాండ్ రూపంలో ధరించేందుకు అనువుగా ఉండే ఈ సెన్సర్ద్వారా మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలు గుర్తించవచ్చు. ఈ సెన్సర్ చెమటను సేకరించి దానిలోని క్లోరైడ్, గ్లూకోజ్ అణువులను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది. ఈ పరికరం వల్ల రోగ నిర్ధారణ కోసం గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఎలా కావాలంటే అలా వంచుకునే సౌలభ్యం ఉన్న ఈ సెన్సర్‌లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులోని మైక్రోప్రాసెసర్ చర్మానికి అతుక్కుని ఉంటుంది.ఇది స్వేద గ్రంధులను ఉత్తేజపరిచి అందులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా చెమటలోని అణువులను విశ్లేషిస్తుంది. -
నయన్ పారితోషికం రూ.7 కోట్లా?
ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదు. చిత్రాలకు వసూళ్లు లేవు. థియేటర్లు మూసు కోవలసిన పరిస్థితి. మరో పక్క చిత్రాలు కొనుగోలు చేయడానికి బయ్యర్లు రావడం లేదు. వ్యాపారం జరగడం లేదు. 400 వందలకు పైగా చిత్రాలు సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోక మగ్గుతున్నాయి. చిత్ర పరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో పడింది. ఇవీ పరిశ్రమ పెద్దలు వాపోతున్న మాటలు. ఇదిలా ఉంటే ఇక తారల విషయానికి వస్తే పారితోషికాలను సినిమా, సినిమాకు పెంచుకు పోతున్నారన్నది నిజం. నటి నయనతార విషయానికే వస్తే కోలీవుడ్‌లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన తన కెరీర్ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఏంటి అప్పుడే ఆశ్చర్య పోతున్నారా? ఈ మొత్తం హీరోల సరసన నటించడానికేనట. నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే. ఇలాంటి చిత్రాలకు ఆ జాన పారితోషికం డిమాండ్ చేస్తున్నదెంతో తెలుసా? అక్షరాలా ఏడు కోట్లట. ఇది ఏ దక్షిణాది తార పొందనటు వంటి మొత్తం అని వేరే చెప్పాలా’ అయితే ఇది టూమచ్ అంటున్నారు సినీ వర్గాలు. నయనతార చిత్రాలు లాభాలు గడిస్తున్నాయి అందుకే అంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే వారూ లేక పోలేదు. -
విభిన్న ప్రతిభావంతులకు సెన్సరీ పార్కు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): కర్నూలులో విభిన్న ప్రతిభావంతులకు రూ.6.50 కోట్లతో సెన్సరీ పార్కు ఏర్పాటుకు ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక నియామకాల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 26 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని, త్వరలో మరో 54 పోస్టులను వారితో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నేడు శోభయాత్ర ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 9 గంటలకు అంబేడ్కర్‌భవన్ నుంచి శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రత్యేక విద్య అభ్యసిస్తున్న దివ్యాంగులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులు, ఆయా సంఘాలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు. -
సెన్సార్ చిక్కుల్లో ఇక సె..లవ్ చిత్రం
-
కర్రపెత్తనం ‘సెన్సార్’
ఎట్టకేలకు ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం సెన్సార్ శృంఖలాలను తెంచుకుంది. ఆ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని బొంబాయి హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని ఇచ్చిన ఆదేశాలు సంస్థ నిర్వాహకులకు చెంపపెట్టు. దేన్నయినా నిషేధించాలన్నా, దేనికైనా అభ్యంతరం చెప్పాలన్నా, పెత్తనం చలా యించి అందరినీ హడలెత్తించాలన్నా చాలామందికి సరదా. పేరు వేరైనా, నిర్వర్తిం చాల్సిన బాధ్యతలు భిన్నమైనా జనం నోళ్లలో ‘సెన్సార్ బోర్డు’గా స్థిరపడిపోయింది గనుక సినిమాలను ఎడాపెడా కత్తిరించుకుంటూ పోదామని సీబీఎఫ్సీ సభ్యులు అనుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగినప్పుడూ, పోరాడినప్పుడూ... న్యాయ స్థానాల్లో ప్రశ్నించినప్పుడూ తప్ప ఇది అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. నిజానికిది పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఈ దేశంలో 1920లో సినిమాటోగ్రాఫ్ చట్టం అమలుకావడం ప్రారంభమయ్యాక అప్పటి ప్రధాన నగరాలైన మద్రాస్, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. వాటికి మొదట్లో పోలీస్ చీఫ్‌లే నేతృత్వం వహించారు. స్వాతంత్య్రానంతరం సెన్సార్ బోర్డు పేరూ మారింది. దాని రూపురేఖలూ మారాయి. కానీ దాని ‘పోలీస్ మనస్తత్వం’ మాత్రం అలాగే ఉండిపోయింది. తమ ముందుకొచ్చిన ప్రతి చిత్రాన్ని అనుమానించడం, దానివల్ల సమాజానికెదో కీడు జరుగుతుందని శంకించడం... తమ కత్తెర్లకు పని చెప్పడం సెన్సార్ బోర్డు సభ్యులకు అలవాటైపోయింది. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు గంగలో కలుస్తున్నాయని, కళాత్మక విలువలకు తీరని అన్యాయం జరుగుతున్నదని వారు గుర్తించలేకపోతు న్నారు. మీరు చేస్తున్న పనికీ, మీకు అప్పగించిన బాధ్యతలకూ పొంతన ఉండటం లేదని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు చీవాట్లు పెట్టాయి. కానీ మారిందేమీ లేదు. పాలకులు కూడా ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుంటున్నారు. సీబీఎఫ్సీలో సాగుతున్న అరాచకాన్ని కొనసాగనిస్తున్నారు. దాని నిర్వహణ తీరు బాగులేదను కుంటే జోక్యం చేసుకుని సరిచేయడం ప్రభుత్వాలకు పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని చేయడానికి అవి సిద్ధపడటం లేదు. తమ సన్నిహితులతో సీబీఎఫ్‌సీని నింపడం అలవాటైపోయింది. అలా నియామకమయ్యేవారిలో అప్పుడప్పుడు నిష్ణాతులైన వారు కూడా ఉంటున్నారన్నది నిజమే అయినా సీబీఎఫ్సీకంటూ శాశ్వతమైన, ఉన్నతమైన విధానాలను రూపొందించడంలో ఎవరూ శ్రద్ధపెట్టలేదు. ఈ విష యంలో షర్మిలా టాగోర్ లాంటివారు కొన్ని చర్యలు తీసుకున్నారు. పహ్లాజ్ కూడా సినిమా రంగంలో అనుభవశాలే. కానీ నిరుడు జనవరిలో సీబీఎఫ్సీ చీఫ్ అయ్యాక ఆయన వరసబెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అంద రినీ దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. నిషేధ పదాల జాబితా ఒకటి విడుదల చేసి, వాటిని ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాల్లో కూడా అనుమతించేది లేదని ప్రకటించినప్పుడు...‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేయాలంటే మరిన్ని కోతలకు సిద్ధపడి వాటికి ‘యూ’ లేదా ‘యూఏ’ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని హుకుం జారీ చేసినప్పుడు పెద్ద కలకలం చెలరేగింది. ఆ అంశాల్లో సెన్సార్‌బోర్డు సభ్యుల మధ్య వాగ్యుద్ధమే నడిచింది. కానీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అనురాగ్ కశ్యప్ మనకున్న కొద్దిమంది సృజనాత్మక దర్శకుల్లో ఒకరు. ధన్‌బాద్ బొగ్గు గని మాఫియా కార్యకలాపాలు ఇతివృత్తంగా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, 1993నాటి ముంబై పేలుళ్ల నేపథ్యంతో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ‘ఉడ్తా పంజాబ్’ కూడా మాదకద్రవ్యాల సమస్యపై నిర్మించిన చిత్రం. పంజాబ్ యువతపైనా, సమాజంపైనా మాదకద్రవ్యాలు కలిగిస్తున్న దుష్పరిణామాలను అది చర్చించింది. ఆ సినిమాపై నిహలానీ తన పరిధులు దాటారు. రాజకీయ నేతలా ఆలోచించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పాలకపక్షం విజయావకాశాలను ఈ చిత్రం ప్రభావితం చేస్తుందని అనుకున్నారు. అందుకే చిత్రం పేరులోగానీ, సంభాషణల్లోగానీ పంజాబ్ పేరు రావడానికే వీల్లేదని శాసించారు. ఇలాంటి సమస్య ఈ పుణ్యభూమిలో లేదని ఆయన భావన కాబోలు! ఫలితంగా చిత్రానికి మొత్తం 89 కోతలుపడ్డాయి. నిహలానీ లాంటివారుంటే ‘మదర్ ఇండియా’, ‘చాందినీ చౌక్’, ‘బొంబాయి’వంటి చిత్రాలు వెలుగు చూసేవే కాదన్నమాట. మన దేశంలోని సినిమాలు ఇటీవల ఊహాలోక విహారాన్ని తగ్గించు కున్నాయని... సామాజిక సమస్యలపై దృష్టిసారిస్తున్నాయని చాలామంది భావిస్తు న్నారు. ఇదొక మంచి పరిణామమని అనుకుంటున్నారు. కానీ పహ్లాజ్ తీరు వేరేగా ఉంది. వాస్తవం నుంచి సినిమా ఎంతగా పారిపోతే అంత ఉత్తమమని ఆయన విశ్వసిస్తున్నారు. పాత్రోచిత సంభాషణలు, ఉద్వేగాలు కనబడకూడదని... ఏ రాష్ట్రం పేరూ, ప్రాంతం పేరూ వినబడకూడదని శాసిస్తున్నారు. సినిమాలన్నీ ‘పంచ తంత్రం’తరహాలో ఉండాలన్నది ఆయన ఉద్దేశమేమో! ఇలాంటి ధోరణులను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరాదు. ఇప్పటికే సీబీఎఫ్సీ ప్రక్షాళన కోసం శ్యాంబెనెగల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఆ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై తదుపరి చర్యలు ప్రారంభించాలి. ‘ఉడ్తా పంజాబ్’ కేసులో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా సీబీఎఫ్‌సీని చక్కదిద్దాలి. స్వతంత్రంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో అది పనిచేసేలా అవసరమైన మార్పులు చేయాలి. బొంబాయి హైకోర్టు చెప్పినట్టు అది అమ్మమ్మ మాదిరిగా ప్రవర్తించడం విరమించుకుంటే... సినిమా తీసేవారిని ఆకతాయిలుగా భావించడం మానుకుంటే సృజనాత్మకత బతికిబట్ట కడుతుంది. ప్రపంచ దేశాల్లో మన పరువు నిలబడుతుంది. సెన్సార్షిప్, సమాజానికి తన పైన తనకు నమ్మకం లేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది. - పోటర్ స్టీవర్ట్ అమెరికన్ కమెడియన్ -
మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. -
సెన్సార్ల తయారీలో నూతన టెక్నాలజీ
సింగపూర్: సెన్సార్ల తయారీలో కొత్త టెక్నాలజీని సింగపూర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నూతన టెక్నాలజీ ద్వారా 'సూపర్ సెన్సిటీవ్ మ్యాగ్నటిక్ సెన్సార్'లను తయారు చేసినట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకు వాడుతున్న సెన్సార్ల కంటే 200 రెట్లు సున్నితత్వం గల సూపర్ సెన్సార్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు తెలిపారు. కొత్త సాంకేతికతతో పరిమాణంలో చిన్నవిగా, తక్కువ ఖర్చులో సెన్సార్లు తయారు చేయడానికి వీలవుతుంది. ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విరివిగా ఉపయోగించే సెన్సార్లలో ఇప్పటివరకు సిలికాన్, ఇండియమ్ యాంటీమోనైడ్ అనే పదార్థాలను ఉపయోగిస్తుండగా సూపర్ మ్యాగ్నటిక్ సెన్సార్లలో గ్రాఫిన్, బోరాన్ నైట్రైడ్లను వాడారు. కొత్త సెన్సార్ల తయారీతో వినియోగ వ్యాపార రంగంలో కీలకమైన ముందడుగు పడిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కలోన్ గోపీనాథన్ తెలిపారు. -
సరదా... సరదాగా...
రెండు ఊళ్ల మధ్య ఉన్న పగ, ప్రతీకారాలను ఓ యువకుడు ఎలా రూపుమాపాడన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘దేశింగు రాజా’. విమల్, బిందుమాధవి జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘భల్లాల దేవ’ పేరుతో రావిపాటి సత్యనారాయణ అనువదించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘సరదా... సరదాగా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. మన తెలుగమ్మాయి బిందుమాధవి చాలా రోజుల తరువాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఈ నెల 12న పాటలను విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, సాహిత్యం: వనమాలి, మాటలు: కృష్ణతేజ. -
సన్నీ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్...
గాసిప్ బాలీవుడ్ సినిమాల హాట్ స్టార్... సన్నీలియోన్ కొత్త సినిమాలకు చిక్కులు తొలగినట్టేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. తరచుగా సెన్సార్ కత్తెరకు పనిపెట్టే సన్నీ కొత్త సినిమా ‘మస్తీజాదే’ డిసెంబరులో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత మే నెలలోనే విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమాలో శృతిమించిన శృంగారం, అందాల ఆరబోత ఉన్నాయని భావించిన సెన్సార్ విడుదలకు అనుమతించాలంటే బోలెడన్ని కట్స్ సూచించిందట. అయితే అసలే సన్నీ సినిమా అంటూ ఎంతో ఆశగా వచ్చే యువ ప్రేక్షకులను నిరాశపరచకూడదనేమో... సినిమా నిర్మాతలు దీనికి ససేమిరా అన్నారట. మొత్తానికి వీరి మధ్య చోటు చేసుకున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టేనని బాలీవుడ్ టాక్. ఇవాళో రేపో ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్తో సెన్సార్ అనుమతించనుందని సమాచారం. రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, వీర్‌దాస్ తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రీతిష్, రంగిత నందిలు నిర్మిస్తున్నారు. పూర్తిగా అడల్ట్ కామెడీ అని బాలీవుడ్ వర్గాలు వర్ణిస్తున్న ఈ సినిమా ఎంత హాట్‌గా ఉంటుందో త్వరలో తేలనుంది. - ఎస్బీ -
‘అడల్ట్’కు ఓకే!
సినిమాలో ఉండాలి గాని మజా సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తే ఏంటి అనుకున్నట్టున్నాడు బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్‌రాఘవన్! రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న తన ‘బదలాపూర్’ సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డు ఇచ్చిన సలహా మనోడికి అస్సలు ఎక్కలేదట. కట్ల ప్రసక్తే లేదని బోర్డుకు తెగేసి చెప్పాడట. ‘యూఏ’ సర్టిఫికెట్ కావాలంటే చెప్పిన సన్నివేశాలు తొలగించాల్సిందేనని అంతే గట్టిగా చెప్పిందట బోర్డు. లేదంటే ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేస్తామందట. రెండో ఆలోచన లేకుండా శ్రీరామ్... ‘అయితే అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసేయండి’ అంటూ ఠక్కున సెలవిచ్చాడట బోర్డుకు! బాగా అడ్వాన్స్డ్గా ఉన్న కొన్ని రొమాంటిక్, గ్రాఫిక్స్‌లో చూపిన వయోలెన్స్ సన్నివేశాలను బోర్డు తొలగించమందనేది ‘ముంబై మిర్రర్’ కథనం. వరుణ్‌ధావన్, హ్యూమా కురేషి, యామీ గౌతమ్, రాధికా ఆప్టే తారాగణం. -
‘చిత్ర’మైన వివాదం!
మన కళ్లముందు జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తాయి. ఇది కలా నిజమా అని సందేహం కలిగిస్తాయి. ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ చలన చిత్రం చుట్టూ ఇప్పుడు అల్లుకున్న వివాదం అలాంటిదే. ఆ చిత్రం ప్రదర్శన యోగ్యమైనది కాదని కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు భావించింది. అనుమతి నిరాకరించింది. ఆ చిత్ర నిర్మాతలు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అది ఆదరాబాదరాగా చిత్రాన్ని చూసింది. దాన్ని వెనువెంటనే అనుమతించింది. ఈలోగా బోర్డు చీఫ్ లీలా శాంసన్, 13మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక చిత్రాన్ని ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు కాదన డమూ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లి కొన్ని కత్తిరింపులతో అనుమతులు తెచ్చు కోవడమూ కొత్తేమీ కాదు. గతంలోనూ అలాంటి ఉదంతాలు జరిగాయి. కానీ ఒక చిత్రం అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం ఆదుర్దాపడటం...ఆ విషయంలో అలిగిన బోర్డు చీఫ్, సభ్యులు రాజీనామాలకు ఉపక్రమించడం గతం లో ఎన్నడూ లేదు. అసలు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు అన్న పేరే చిత్రమైనది. ఆ బోర్డు నెలకొల్ప డంలోని అంతరార్థమూ, బోర్డు సభ్యుల ప్రధాన వ్యాపకమూ చలనచిత్రాలను సెన్సార్ చేయడమైతే...దాని పేరులో ఎక్కడా ఆ సంగతి ఉండదు. దేశంలో తొలి చలనచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913లో విడుదలైతే సినిమాటోగ్రాఫ్ చట్టం 1920 లో అమల్లోకి వచ్చింది. ఆ చట్టంకింద దేశంలో అప్పటికి ప్రధాన నగరాలనదగ్గ మద్రాసు, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో ఆయా ప్రాంతాల పోలీస్ చీఫ్‌ల ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డులు ఏర్పడ్డాయి. ఆ చట్టం స్థానంలో 1952లో మరో చట్టం రావడం, దానికి సైతం 1983లో సవరణలు వచ్చి ప్రస్తుత ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు ఏర్పడటం చరిత్ర. ఆ బోర్డుకు దేశంలోని తొమ్మిది నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మిగిలిన కళారూపాల్లాగే చలనచిత్రం కూడా ఒక కళా రూపం. పైగా అది ప్రజాబాహుళ్యాన్ని ప్రభావితం చేయగల బలమైన మాధ్యమం. ఆ కళారూపానికుండే శక్తిసామర్థ్యాలను గ్రహించబట్టే బ్రిటిష్ వలస పాలకులు ఆలస్యంగానైనా దేశంలో సెన్సార్ బోర్డు నెలకొల్పారు. ఇప్పుడు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డులకు పోలీసు బాస్‌ల సారథ్యం లేకపోయినా చీఫ్లుగా ఉంటున్న వారు అలాం టి మనస్తత్వంతోనే ఉంటున్నారన్నది చలనచిత్ర దర్శకులు, నిర్మాతలు తరచు చేసే ఆరోపణ. ఎవరిని కదిలించినా బోర్డుతో తమకెదురైన అనుభవాలను ఏకరువు పెడతారు. మన దేశంలో ‘సెన్సార్ బోర్డు’ అనేది ఎప్పుడూ అర్థంకాని బ్రహ్మ పదార్థమే! కొన్ని చిత్రాలు చూస్తే వాటికి ‘సెన్సార్’ అనుమతి ఎలా లభించిం దా అనే అనుమానం కలుగుతుంది. చిత్ర ప్రదర్శనకు బోర్డు ససేమిరా కాదన్న కొన్ని చిత్రాలు చివరకు న్యాయస్థానాల జోక్యంతో విడుదలైనప్పుడు చూస్తే వీటిని ఎందుకు కాద న్నారా అనే సందేహం ఏర్పడుతుంది. మహిళా సంఘాలను, అశ్లీల ప్రతిఘటనా వేదికవంటి సంస్థలు చలనచిత్రాల్లో మహిళలను కించపరిచే దృశ్యాలు ఎలా పెరిగి పోయాయో చెబుతాయి. నీచాభిరుచుల్ని ప్రేరేపించి సొమ్ము చేసుకోవాలనుకునే వైఖరివల్ల సమాజంలో విలువలు పతన మవుతున్నాయని ఆందోళన వెలి బుచ్చుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ను బోర్డు కాదనడమేమిటన్న మీమాంస కలగడం సహజమే. హర్యానా, పంజాబ్‌లలో గణనీయమైన సంఖ్యలో అనుచరులున్న దేరా సచ్చా సౌదా సంస్థ అధినేత బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ నిర్మించిన చిత్రమిది. దైవంగా చెప్పుకునే వారిపైనా, వారి మహిమలపైనా ఇంతకు ముందూ చిత్రాలు వచ్చాయి. కానీ, అలాంటి బాబాల పాత్రను మరొకరెవరో పోషించడం ఆనవాయితీ. ఈ చిత్రంలో రాం రహీం సింగ్ తన పాత్రను తనే పోషిం చారు. దీనికే బోర్డు అభ్యంతరం చెప్పింది. చిత్రంలో ఆయన ప్రదర్శించే ఫీట్లు... ఆయన దైవసమానుడని భావించే వారిలో ఆ విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నది బోర్డు ప్రధాన అభ్యంతరం. సభ్యుల రాజీనామా వెనక రాజకీయాలున్నాయని ఆ మంత్రిత్వశాఖను చూస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ఉండొచ్చు. వారి కాలపరిమితి ఎటూ ముగుస్తుంది గనుక... మళ్లీ పునర్నియా మకమయ్యే అవకాశం లేదు గనుక దీన్ని సాకుగా వాడుకున్నారని ఆయన చెబుతు న్నారు. అయితే, రాజీనామాలిస్తూ వారు చేసిన ప్రకటనలోని అంశాలు అంత తీసిపా రేయదగ్గవి కాదు. బోర్డు అభ్యంతరాలను బేఖాతరుచేసి, తగిన అర్హతలు లేనివారితో ఆదరాబాదరగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చిత్రాన్ని అనుమతించడమేమిటన్నది వారి ప్రధాన ప్రశ్న. అలాగే బోర్డు విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని, చలనచిత్రాల గురించి కనీస అవగాహన లేని అధికారులను కేటాయించి బోర్డును ధ్వంసం చేస్తున్నారని వారి ఆరోపణ. ఈమధ్య విడుదలైన ఆమిర్‌ఖాన్ పీకే చిత్రం విషయంలో బోర్డుపై కేంద్రంనుంచి ఒత్తిళ్లు వచ్చాయని లీలా శాంసన్ అంటున్నారు. బోర్డు సభ్యుల రాజీనామాలో రాజకీయాలున్నాయో...సినిమాను ఆదరా బాదరాగా అనుమతించడంలో రాజకీయ ప్రయోజనాలున్నాయో చర్చించడంవల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అసలిలాంటి స్థితి ఎందుకేర్పడిందని కేంద్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. చలనచిత్రాలకు సర్టిఫికేషన్ ఇవ్వడంలో ఇప్పుడను సరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉండటం, బోర్డు పనితీరులో పారదర్శకత లోపించడం... ఒక బలమైన మాధ్యమాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పాలకుల మనస్తత్వం ఈ మొత్తం స్థితికి మూలకారణాలు. కళారంగంలో నిష్ణాతులు, సామా జిక సేవారంగంలో పనిచేస్తున్నవారు, రాజ్యాంగం, చట్టాల్లో అవగాహనకలవారు సభ్యులుగా...స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తే సెన్సార్ బోర్డుకు విశ్వసనీయత, ప్రతిష్ట చేకూరతాయి. ఈ విషయంలో ఏడాదిన్నర క్రితం జస్టిస్ ముద్గల్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో విలువైనవి ఉన్నాయి. వాటిని పట్టించుకునేందుకు కేంద్రం ఇప్పటికైనా ప్రయత్నించాలి. -
సెన్సార్ చేతి రాత
చేతిరాతను చూసి తలరాతను నిర్ణయిస్తారు చాలామంది... ప్రస్తుతం చేతిరాతను చాలామంది మర్చిపోయారు. వరంగల్‌కి చెందిన సతీశ్ మాత్రం వందల కొద్దీ పేజీలు చేతితోనే రాస్తున్నారు. అది కూడా అచ్చంగా ప్రింట్లో అక్షరాల్లాగ. డిగ్రీ చదువుతుండగానే చలనచిత్రరంగంలోకి ప్రవేశించారు సతీశ్. ‘‘నా అక్షరాలు బాగున్నాయని ప్రశంసించిన చిత్రదర్శకుడు ఆదినారాయణరావు, చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించారు. చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ, నా చేతిరాతకు పనికి వచ్చే పని చేయడానికి ప్రయత్నించాను. సినిమా సెన్సార్‌కి స్క్రిప్ట్ రైటర్లు చాలా తక్కువమంది ఉంటారు. నాకు చిత్ర పరిశ్రమలో అంతగా అవకాశాలు కలిసిరాని సమయంలో, అల్లాణి శ్రీధర్ గారి ఫిల్మీ మీడియా సంస్థలో సెన్సార్ స్క్రిప్ట్ వర్క్ పని అప్పచెప్పారు. నేను ఆ వర్క్ అంతా చేతితో రాసి ఇచ్చాను. ఆది చూసి ఆయన నన్నెంతగానో ప్రోత్సహించారు’’ అని తన సినీరంగ ప్రవేశం గురించి తెలిపారు సతీశ్. దర్శకత్వశాఖలో అవకాశాలు లభించక, ఆర్థికం ఇబ్బందుల నుంచి బయటపడటానికి సతీశ్ ఎంచుకున్న మార్గం సెన్సార్ స్క్రిప్ట్‌ను స్వయంగా చేతితో రాయడం. సతీశ్చేతిరాత చూసిన ‘7్టజి సెన్స్’ చిత్ర దర్శకుడు పెద్ది కె. ఈశ్వర్ ఆ సినిమాకి సెన్సార్ స్క్రిప్ట్ రాయమని కోరటంతో సతీశ్ మొట్టమొదటిసారి సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒక సినిమాకి సుమారు 100 - 150 పేజీల వరకు స్క్రిప్ట్ ఉంటుంది. సతీశ్ అదంతా చేతితో రాశారు. ‘‘సతీశ్ చేతి రాత చూసిన తర్వాత ఎన్నో పెద్దపెద్ద సినిమా స్క్రిప్ట్స్ అతనితోనే రాయించాను. అతని చేతి రాత అచ్చు డిటిపి చేసినట్టుగా ఉంటుంది’’ అని ప్రశంసించారు ఎఫ్‌డిసిలో పని చేస్తున్న అనంత్. ‘‘నా చేతిరాత చూసిన దర్శకుడు చంద్రసిద్ధార్థ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ స్క్రిప్ట్ పని నాకు అప్పగించారు. సాహసం, అత్తారింటికి దారేది, డికెబోస్, ప్రతినిధి, జెండాపై కపిరాజు, వెల్కమ్ ఒబామా, వీడికి దూకుడెక్కువ... ఇలా అనేక చలనచిత్రాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాను’’ అంటున్నారు సతీశ్. సతీశ్ చేతిరాత కంప్యూటర్ అక్షరాలు అందంగా ఉండడం వల్ల రెండేళ్లలోనే వందకు పైగా సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశారు. ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే మరో వైపు సెన్సార్ స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉంటున్నారు సతీశ్. ‘‘దర్శకత్వ శాఖలో అవకాశాలు లభించక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వారికి డిటిపి వర్క్ అప్పచెబుతున్నాను. ఒకవేళ నా జీవితంలో నేను సెన్సార్ స్క్రిప్ట్ రాయకుండా ఉండి ఉంటే పరిశ్రమ నుండి తప్పుకునేవాడినేమో!’’ అని చెబుతున్న సతీశ్లోని ఆశావాదాన్ని అందరూ అనుసరిస్తే, ఎప్పటికైనా ఉన్నతస్థాయికి ఎదుగుతారనడంలో సందేహం లేదు. - డా.వైజయంతి -
తడై (Banned)