Narappa Movie Release Date In Telugu: 'నార‌ప్ప‌' సెన్సార్ పూర్తి.. U /A సర్టిఫికేట్ - Sakshi
Sakshi News home page

'నార‌ప్ప‌' సెన్సార్ పూర్తి.. U /A సర్టిఫికేట్

Published Tue, Jun 29 2021 7:18 PM | Last Updated on Wed, Jun 30 2021 10:35 AM

Venkatesh Narappa Finishes Censor Formalities - Sakshi

హీరో వెంకటేశ్‌ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం నారప్ప. తమిళ చిత్రం ‘అసురన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, కలైపులి ఎస్. థానుఈ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్నలు పోషించారు. ‘నారప్ప’ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా జూలై 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement