Narappa
-
ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఆ పొరపాటు చేయడంతో..
కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటి అమ్ము అభిరామి. ఈమె తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. భైరవ, ఎన్ ఆవిడ చెరుప్పు కానోమ్, ధీరన్ అధికారం ఒండ్రు వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన అమ్ము అభిరామి రాక్షసన్ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా నటించి గుర్తింపు పొందారు. ఇదే సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు పేరుతో హిట్ కొట్టారు. ఆ తరువాత ధనుష్ కథానాయకుడిగా నటించిన అసురన్ చిత్రంలో ఆయన మరదలుగా నటించారు. తెలుగులో వెంకటేశ్ నారప్ప చిత్రంలో కన్నమ్మ పాత్రలో మెప్పించారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా అభిరామి మంచి గుర్తింపు పొందింది. అదేవిధంగా కుక్ విత్ కోమాలి టీవీ కార్యక్రమంలో పాల్గొని పాపులర్ అయిన అమ్ము అభిరామి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తాజాగా నలుగురు కథానాయికల్లో ఒకరిగా నటించిన కన్నగి చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ప్రేమ గురించి పేర్కొంటూ తాను స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడే సహ విద్యార్థి ప్రేమలో పడ్డానని, ఆ విషయం ఇంటిలో తెలిసి దొరికి పోయానని చెప్పారు. అది వన్ సైడ్ లవ్వే అయినా దాచుకోలేక ఇంటిలో దొరికిపోయి దెబ్బలు తిన్నానని చెప్పారు. ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఎలాంటి భర్త రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు తనను అర్థం చేసుకునే వాడు అయితే చాలు అని బదులిచ్చారు. అది ప్రేమ వివాహం అయినా సరే పెద్దలు నిశ్చయించిన వివాహం అయినా సరే అని అమ్ము అభిరామి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. గోలీ సోడా 1.5 అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) -
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
ఆయన చేసిన తప్పు వల్ల.. నేను ఎంట్రీ ఇచ్చాను: శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న పెదకాపు ట్రైలర్ తాజాగా రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రస్టిక్గాకంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ సాగింది. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,నారప్ప లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. చాలా రోజుల తర్వాత పెదకాపు 1 సినిమాతో వస్తున్నాడు. కొత్త హీరో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పెదకాపు సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రాజకీయాలు, పార్టీగొడవల్ని ట్రైలర్లో చూపించారు. ఊరి పెద్దల్ని ఎదురించి హీరో విరాట్ కర్ణ పోరాడే సీన్స్ మెప్పిస్తాయి. ఇందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా నటుడిగా విలన్ పాత్రలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు. ఈ సినిమాకు నటుడుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఇలా చెప్పాడు. నేను ఆ పాత్ర కోసం ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫైనల్ చేశాను. ఆయన కూడా ఆ రోల్లో నటించేందుకు అంగీకరించారు. తీరా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు కానీ ఆయన షూట్‌కు రాలేదు. అప్పటికప్పుడు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం కష్టం. మరోవైపు చాలా మంది ఆర్టిస్టులతో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు నా అసోసియేట్ కిషోరే ఆ కేరెక్టర్చేయమని నన్ను ఒప్పించాడు.' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే.. అందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చాడు. -
‘నారప్ప' కలెక్షన్స్‌లలో ఒక్క రూపాయి కూడా తీసుకోం: సురేశ్ బాబు
విక్టరీ వెంకటేశ్ హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే 'నారప్ప' ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. అందుకే విక్టరీ వెంకటేశ్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న 'నారప్ప' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత సురేష్ బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లలో ఒక్క పైసా కూడా తాము తీసుకోబోమని, అదంతా చారిటీకి అందచేస్తామని చెప్పారు. ‘డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపధ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలని ఉందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వెస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. ఒక్క రోజు మాత్రమే నారప్ప థియేటర్స్‌లో ప్రదర్శితమవుతుంది. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం’ అన్నారు. -
వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప
ప్రస్తుతం ఇండస్ట్రీలో రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రాలను మరోసారి ప్రక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్టార్ హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్ కోసం రి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సినిమాలను రి రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేశ్ మూవీ కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఆయన బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించింది సురేశ్ ప్రొడక్షన్స్. అయితే ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేశారు. స్టార్ హీరో అయిన వెంకటేశ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదే ఈ సినిమాను బిగ్స్క్రీన్పై చూడలేకపోయామనే నిరాశలో ఉండిపోయారు అభిమానులు. ఇప్పుడు వారి కోసం నారప్పు మూవీకి వెంకి బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్ప మూవీ థియేటర్లో సందడి చేయనుంది. కాగా నారప్ప మూవీకి ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్, నాజర్, రాఖీ (నారప్ప చిన్న కుమారుడు)కీ రోల్స్ పోషించారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ – వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. VICTORY @VenkyMama's Raging Blockbuster #Narappa is all set to release on Dec 13th (for only one day) across theatres in AP & Telangana!! 🔥🔥#NarappaInTheatres#Priyamani@KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @sureshprodns @theVcreations @PrimeVideoIN pic.twitter.com/Q4u4VeLQXs — Suresh Productions (@SureshProdns) December 6, 2022 చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల -
'నారప్ప' నటుడు కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
నారప్ప నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం ఆయన నిశ్వితార్ధం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు, సన్నిహితుల, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన కాబోయే భార్య గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిని కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలో మునికన్నగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. కనిపించే కాసేపు అయినా తన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. రీసెంట్గా అర్థశతాబ్ధం సినిమాలో నటించాడు. -
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
'నారప్ప'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్‌కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్తో భాగస్వామి అవడం ఎస్పీ మ్యూజిక్కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్‌తో ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్‌గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్‌గా ఉందన్నాడు. -
‘నారప్ప’లో ఎక్కడా వెంకటేష్ కనిపించలేదు: చిరంజీవి
వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి, సర్వత్రా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళంలో అఖండ విజయం సొంతం చేసుకున్న అసురన్‌కి రీమేక్ ఇది. ఇందులో వెంకీ నటన ఓ రేంజ్లో ఉందని అభిమానులు పండగ చేసుకుంటుండగా, మరోవైపు విమర్శకుల నుంచి సైతం నుంచి నారప్పకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రాల జాబితాలో బిగ్గస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు. తమిళ రీమేక్ చిత్రాలు తెలుగులో విజయం సాధించడం అరుదనే చెప్పాలి. అందుకు ఇటీవల విడుదలైన ‘జాను’ సినిమానే ఉదాహరణ. అక్కడ అఖండ విజయం సొంత చేసుకున్న ‘96’ రీమేక్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కానీ వెంకీ ‘నారప్ప’ మాత్రం ఇందుకు భిన్నంగా తమిళంలో ఎంతటి విజయం సాధించిందో తెలుగులోను అదే రేంజ్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నారప్పలో వెంకీ నటనకు నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వెంకీ నటనను అభినందిస్తూ ఓ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో.. కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్‌ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్, అందుకే అంతగా ఆ రోల్లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్ తెలిపారు. Its a moment of happiness listening to every word of your appreciation @KChiruTweets. Overwhelmed and humbled for your feedback on Narappa. Thank you Chiranjeevi 🤗 pic.twitter.com/mS18fzEgfD — Venkatesh Daggubati (@VenkyMama) July 23, 2021 -
‘నారప్ప’ని అలా వాడేసుకున్న సైబరాబాద్ పోలీసులు
ట్రాఫిక్ రూల్స్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. ట్రెండ్‌ని ఫాలో అవుతూ తమదైన శైలీలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ముఖ్యంగా కరోనాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా పూర్తిగా తొలగి పోలేదని.. ఇంకా ఉందని.. అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నారు. మాస్కులు కచ్చితంగా ధరించాలని గుర్తు చేస్తున్నారు. కరోనాపై అవగాహన కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్‌ని వాడేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, గతంలోనూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ విడుదల కాగా, బైక్‌పై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని.. వారి పోస్టర్‌కు హెల్మెట్ అమర్చి, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. Don't forget your mask. COVID-19 is still awake. #Narappa Always #WearAMask when stepping out. #StaySafe #covid19 #MaskUpIndia pic.twitter.com/S3eEoquPCn — Cyberabad Police (@cyberabadpolice) July 22, 2021 -
'నారప్ప' ఓటీటీ రిలీజ్ వల్ల నిర్మాతలకు అంత లాభమా!
ఒరిజినల్ కథ అయినా, రీమేక్ కంటెంట్ అయినా హీరో వెంకటేశ్ విజృంభిస్తాడు. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు కనులవిందు చేస్తాడు. ఇటీవలే వచ్చిన నారప్పలోనూ అమోఘంగా నటించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు వెంకీ మామ. అయితే ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అంటూ టాలీవుడ్లో చర్చ జరుగుతున్న సమయంలో పెద్ద సినిమా నారప్ప ఓటీటీలో రిలీజై అందరికీ షాకిచ్చింది. అయితే ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నారప్ప ఓటీటీలో రిలీజ్ చేశామని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు సురేశ్‌బాబు, కలైపులి థాను మీడియాకు వెల్లడించారు. ఇదలా వుంచితే ఇంతకీ అమెజాన్ ప్రైమ్ నారప్ప సినిమాను ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంది? నిర్మాతలకు ఎంత లాభం దక్కిందన్నది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. తమిళ అసురన్‌కు రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది సుమారు రూ.40 కోట్లు ముట్టజెప్పి ఈ సినిమాను సొంతం చేసుకుందట. దీని ప్రకారం ఈ డీల్ ద్వారా నిర్మాతలకు సుమారు రూ.17 కోట్ల మేర లాభం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌బాబు వెంకటేశ్ నటించిన మరో రీమేక్ దృశ్యం 2ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇది కూడా ఓటీటీలోనే వస్తుందా? లేదా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? చూడాలి. -
నారప్ప: వెంకటేశ్‌తో ఆడిపాడిన ఈ నటి ఎవరో తెలుసా?
Narappa Movie Actress Ammu Abhirami: తెలుగులో పెద్ద సినిమా రిలీజై నెలలు గడుస్తోంది. అడపాదడపా చిన్న, మధ్య తరహా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతుండగా తాజాగా ఓ భారీ చిత్రం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలైంది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన నారప్ప సినిమా నేటి(జూలై 20) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్‌కు రీమేక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసురన్‌లో మరియమ్మలా, నారప్పలో కన్నమ్మలా ఇద్దరు హీరోలతో ఆడిపాడిన ఈ నటి అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ నటి ఎవరంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. 'నారప్ప' సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా కనిపించే ఈమె పేరు అమ్ము అభిరామి. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన విజయ్ 'భైరవ' సినిమాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. ఆ మరుసటి ఏడాది తమిళ 'రాచ్చసన్', తెలుగు 'రాక్షసుడు' చిత్రాల్లో హీరో మేనకోడలి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఎఫ్‌సీయూకే(ఫాదర్ ఆఫ్ చిట్టి ఉమా కార్తీక్)లోనూ ఉమ పాత్రలో అలరించింది. చూస్తుంటే అమ్మూకు టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తోంది. -
చెట్టు కిందే ఆఫీస్ పెట్టా, నారప్ప యూనిట్ లో నలుగురు చనిపోయారు
-
‘నారప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : నారప్ప జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాణ సంస్థ : సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ నిర్మాతలు : సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను కథ: వెట్రిమారన్ దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది : జూలై(20), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) టాలీవుడ్లో రీమేక్ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేశ్. ఒక విధంగా చెప్పాలంటే ఇతర భాషల్లో ఒక సినిమా హిట్ అయిందంటే.. ఆ మూవీని వెంకీమామ తెలుగులో రీమేక్ చేస్తారా? అనే చర్చలు మొదలవుతాయి. వెంకటేశ్ నేరుగా చేసిన సినిమాలకు సమానంగా రీమేక్ మూవీలు చేశాడని చెప్పొచ్చు. అపజయాలతో కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయన్ని నిలబెట్టింది కూడా రీమేక్‌లే కావడం విశేషం. అయితే.. ఇతర భాషల్లో హిట్టైన ప్రతి సినిమాను వెంకీ రీమేక్ చేయడు. తనకు సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటాడు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్. ఆయన తాజాగా రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ఈ ఏడాది మే 14న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో మంగళవారం(జూలై 20) ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘నారప్ప’ ఏ మేరకు అందుకున్నాడు? ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిన ‘అసురన్’ రీమేక్ వెంకీకి ప్లస్సా.. మైనస్సా? రివ్యూలో చూద్దాం. కథ అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప(వెంకటేశ్) కుటుంబానికి, పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి పండుస్వామికి భూ తగాదా చోటుచేసుకుంటుంది. నారప్పకు చెందిన మూడు ఎకరాల భూమిని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు పండుస్వామి. అతని ప్రయత్నాలను తిప్పికొడతాడు నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా(కార్తీక్ రత్నం). పండుస్వామి మనుషులతో బహిరంగంగానే గొడవకు దిగుతాడు. అంతేకాదు ఒక సందర్భంలో పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు. దీంతో పగ పెంచుకున్న పండుస్వామి.. తన మనుషులతో మునిఖన్నాని హత్య చేయిస్తాడు. అయినా కూడా నారప్ప ఎదురుతిరగడు. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడాన్ని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) జీర్ణించుకోలేకపోతుంది. నిత్యం కొడుకుని తలుచుకుంటూ బాధ పడుతుంది. తల్లి బాధ చూడలేక నారప్ప రెండో కుమారుడు సిన్నప్ప(రాఖీ) పండుస్వామిని చంపేస్తాడు. దీంతో సిన్నప్ప ప్రాణాలను కాపాడేందుకు నారప్ప కుటుంబం గ్రామాన్ని వదిలివెళ్తుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేంటి? తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెద్ద కొడుకు హత్యకు గురైనా నారప్ప ఎందుకు సహనంగా ఉన్నాడు? అసలు నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన రెండో కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ‘నారప్ప’గా అదరగొట్టేశాడు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా అద్భుతంగా నటించాడు. వెంకీ డైలాగులు, స్టైల్, మేనరిజమ్, లుక్స్ అన్నీఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్ కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా కుమారుడు చనిపోయిన సీన్, గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్లలో జీవించేశాడు. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్ర ఆమెది. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం మెప్పించాడు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా తనదైన ముద్ర వేశాడు. లాయర్ పాత్రలో రావు రమేశ్, బసవయ్య పాత్రలో రాజీవ్ కనకాల ఎప్పటిమాదిరే జీవించేశారు. అమ్ము అభిరామి, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ తెలుగు రీమేకే ‘నారప్ప’. అయితే ఒక భాషలో హిట్ అయిన చిత్రం.. ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం సర్వసాధారణం. మూలకథని తీసుకొని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి రీమేక్ చేస్తారు. నారప్ప విషయంలో అలాంటి ప్రయోగాల వైపు వెళ్లలేదు. కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి అంతా కాపీ పేస్ట్ చేసినవే. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంతమేర సఫలం అయ్యాడు. ఒకప్పుడు నిమ్న-అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ లాంటి డైలాగ్‌తో సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇక మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. అసలు అసురన్‌తో పోల్చకుండా ఒక కొత్త కథగా చూస్తే మాత్రం నారప్ప తప్పకుండా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించే సినిమానే. అయితే ఓటీటీల పుణ్యమాని అసురన్ మూవీని చాలా మందే చూశారు. సో నారప్పని అసురన్‌తో తప్పకుండా పోల్చి చూస్తారు. మొదటిసారి చూసే ప్రేక్షకులను మాత్రం ‘నారప్ప’ పక్కా థ్రిల్ చేస్తాడు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
వెంకీస్ నారప్ప
-
ఈ వారం ఓటీటీ ట్రాక్ ఎక్కిన సినిమాల లిస్ట్
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీ పేరే వినిపిస్తోంది. థియేటర్లు ఇంకా తెర తీయకపోడంతో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం దీన్నే నమ్ముకుంటున్నారు. ఇక బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియళ్లు కూడా కొన్ని గంటల ముందే ఓటీటీలో రెడీగా ఉండటంతో టీవీ ఆడియన్స్ కూడా ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు జై కొడుతున్నారు. అటు సినిమాలు కూడా దీంట్లోనే రిలీజ్ అవుతుండటంతో సినీ ప్రియులు కూడా ఓటీటీనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతివారం కొత్త సరుకును దింపుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయో చూసేద్దాం.. నారప్ప శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించాడు. వెంకటేశ్, ప్రియమమణి, కార్తీకర్ రత్నం, వశిష్ట సింహ ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళంలో ధనుష్ నటించిన అసురన్‌కు రీమేక్‌గా వచ్చిందీ చిత్రం. ఇది జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. సార్పట్ట యంగ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా సార్పట్ట. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టింది. ఇది ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇక్కత్ నాగభూషణ్, భూమి శెట్టి, సుందర్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇక్కత్. విడాకులు తీసుకోవాల్సిన జంట అనుకోని కారణాల వల్ల ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మరి ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అనేదే ఇక్కత్. ఈ కన్నడ చిత్రం ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. 14 ఫెరే విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా జంటగా నటించిన సినిమా 14 ఫెరే. దేవన్షు సింగ్ డైరెక్టర్. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఓ ప్రేమజంట. ఈ క్రమంలో వారు పడే పాట్లు కామెడీగా ఉంటాయట. ఈ చిత్రం జూలై 23 నుంచి జీ 5లో అందుబాటులోకి రానుంది. ఫీల్స్ లైక్ ఇష్క్ ఆరుగురు డైరెక్టర్లు ఆరు కథలను అందించిన వెబ్ సిరీస్ ఫీల్స్ లైక్ ఇష్క్. ఇది జూలై 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హంగామా 2 2003లో వచ్చిన హిట్ చిత్రం హంగామాకు సీక్వెల్‌గా వస్తోంది "హంగామా 2". 13 ఏళ్ల తర్వాత శిల్పాశెట్టి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఇది హాట్‌స్టార్‌లో జూలై 23న రిలీజ్ అవుతోంది. వీటితోపాటు కింది సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా ప్రసారం కానున్నాయి.. ♦ ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్ (జూలై 23, నెట్‌ఫ్లిక్స్) ♦ హాస్టల్ డేస్ సీజన్ 2 (జూలై 23, అమెజాన్ ప్రైమ్) ♦ కింగ్డమ్: అషైన్ ఆఫ్ ద నార్త్ (జూలై 24, నెట్‌ఫ్లిక్స్) ♦ స్కై రోజో సీజన్ 2( జూలై 24, నెట్‌ఫ్లిక్స్) -
నాన్‌స్టాప్ షూటింగ్ జరిపాం, బ్రేకుల్లేవు: నారప్ప డైరెక్టర్
Srikanth Addala About Narappa: నారప్ప.. మే 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో నారప్ప ఓటీటీ బాట పట్టింది. రేపటి (జూలై 20) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మీడియాతో ముచ్చటించాడు. ఈ సినిమా విశేషాలను, డిజిటల్ స్ట్రీమింగ్కు గల కారణాలను వెల్లడించాడు. 'అసురన్ రీమేక్ తీయాలని సురేశ్ బాబు ఫిక్సయ్యారు, రీమేక్ రైట్స్ కూడా కొనుక్కున్నారు. అప్పుడే నేను కూడా ఈ సినిమా చేస్తానని చెప్పడంతో డైరెక్టర్‌గా నాకీ అవకాశమిచ్చారు. ఈ జానర్‌ను టచ్ చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం వెంకటేశ్ చాలా కష్టపడ్డాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని సీన్లలో ఆయన జీవించడాన్ని చూసి సెట్లో నాకు నోట మాటలు రాలేవు. ఆయనకు జోడీగా ప్రియమణి అయితే బాగుండనిపించి ఆమెను సెలక్ట్ చేశాం. ఈ సినిమా కోసం సుమారు 58 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపాం, చివరి ఐదు రోజులైతే బ్రేక్ ఇవ్వమని యూనిట్ అంతా అడిగింది, కానీ కుదరదన్నాం. అంత కష్టపడి తీసిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవడం మాకూ బాధగానే అనిపించింది. పైగా పెద్ద సినిమా కావడంతో మొదటి నుంచీ థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఓటీటీకి వెళ్లక తప్పలేదు. దీనివల్ల హీరో వెంకటేశ్ కూడా నిరాశ చెందాడు' అని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు. కాగా తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ 'అసురన్'కు రీమేక్‌గా నారప్ప తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్, ప్రియమమణి, కార్తీకర్ రత్నం, వశిష్ట సింహ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, కలైపులి థాను నిర్మించారు. -
నారప్ప : ఆ టైమ్‌లో నలుగురు చనిపోయారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ సినిమా అసురన్‌కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నారప్ప’షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ‘కరోనా కారణంగా భయం, భయంగానే ‘నారప్ప’షూటింగ్ చేశాం. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయాం. ఫస్ట్ వేవ్‌లో రెండు మూడు కేసులు వస్తేనే చాలా భయపడిపోయి షూటింగ్‌ని రద్దు చేసుకున్నాం. కానీ సెకండ్ వేవ్‌లో వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చినా పెద్దగా కంగారు పడలేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌ని పూర్తి చేశాం.‘నారప్ప’నాన్ షూటింగ్ టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాలు పొగొట్టుకోవాల్సివస్తుంది’అని సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్ సిన్సియర్‌గా వర్క్ చేశాడు ‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్ స్టైల్ నాకు నచ్చింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ ఫ్యామిలీఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనిపించింది. యాక్టర్‌గా వెంకటేశ్ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్‌కు ముందు ఇసకలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్ అయితే చాలా సిన్సియర్‌గా వర్క్ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్‌లోనే కనిపించారు. బ్యాలెన్స్ షూట్ కోసం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్ తీసుకున్న తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు’అని సురేశ్ బాబు అన్నారు. -
అడ్డాల శ్రీకాంత్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
వెంకటేశ్ చాలా ఫీలయ్యాడు : సురేశ్ బాబు
‘నారప్ప’ఓటీటీలో విడుదల చేయడం పట్ల వెంకటేశ్ చాలా ఫీలయ్యారని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సివచ్చిందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘నారప్ప’ యూనిట్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆదివారం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్లో సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప మేము మాత్రమే నిర్మించలేదు. నాతోపాటు.. ఎస్.థామస్ కూడా ఈ సినిమాకు నిర్మాత. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్.థామస్ నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని భావించారు. కరోనా థార్డ్ వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండడంలో న్యాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల్నే థియేటర్‌కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి’అని సురేశ్ బాబు అన్నారు. -
'నారప్ప' ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే...
చెన్నై: అగ్రకథానాయకుడు వెంకటేష్ తాజా చిత్రం నారప్ప. సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 14వ తేదీ థియేటర్లలో విడుదల చేయాలని భావించినా కరోనా పరిస్థితుల్లో సాధ్యపడలేదు. సినిమాను ఈ నెల 20వ తేదీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్.థానుతో సాక్షితో శనివారం ముచ్చటించారు. తమిళంలో తాను నిర్మించిన అసురన్ చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నారప్ప పేరుతో రీమేక్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. నిజానికి నా చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికే ఇష్టపడుతుంటాను. నారప్ప చిత్రాన్ని కూడా మే 14న థియేటర్లలో విడుదల చేయాలని భావించాం. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తే సేఫ్ అవుతామన్న గ్యారెంటీ లేదు. నేను ఇంతకు ముందు తమిళంలో నిర్మించిన కర్నన్ ఆ చిత్రానికి సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు నష్టపోయాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నా’నని కలైపులి ఎస్.థాను వివరించారు. -
అభిమానులకు సారీ చెబుతున్నా : వెంకటేశ్
Narappa: విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. తమిళ మూవీ ‘అసురన్’కి తెలుగు రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది.మణి శర్మ సంగీతం అందించారు. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నారప్ప’గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చదివేయండి. మీ కెరీర్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ‘నారప్ప’. దీనిపై మీ స్పందన ఏంటి? అవును ఎవరికైనా కొన్ని ఫస్ట్ థింగ్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా నా లైఫ్‌లో మొదటి అనుకుంటాను. ‘నార్పప్ప’ఓటీటీలో విడదలఅవ్వడంపై మీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయినట్టున్నారు? అవును. కానీ ప్రస్తుతం ఉన్న టైం వల్ల అలా జరిగింది. ఓటీటీలో విడుదల అవడం వల్ల కొంతమంది ఫాన్స్ హ్యాపీగా ఫీలైతే, మరికొంతమంది బాధపడుతున్నారు. కానీ టైం వల్ల ఇలా జరిగింది. అప్పటి నుంచి నన్ను కానీ, నా సినిమాలని కానీ ఆదరిస్తున్నవారందరికీ నారప్ప సినిమా రిలీజ్ పై చాలా సిన్సియర్ గా సారీ చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో అభిమానులు అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాంటి ఫ్యాన్స్ నాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. అసురన్ రీమేక్ చేయడానికి మిమ్మల్ని కనెక్ట్ చేసిన అంశం ఏంటి? మొదటగా నేను ధనుష్‌కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది. నాకే ఛాలెంజింగ్ గా ఉంటుంది అనిపించింది. అందుకే నా కెరీర్ రీమేక్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. అందరూ అదే అడుగుతారు ఎందుకు రీమేక్ సినిమాలు ఎక్కువ అని. నేనేమి కావాలని చెయ్యను అలా జరుగుతుంది అంతే. చంటి, సుందరకాండ లాంటి సూపర్ హిట్ సినిమాలు అన్ని రీమేక్ చిత్రాలే. అలా అని రీమేక్స్ చెయ్యడం అనేది చిన్న విషయం కూడా కాదు ఆల్రెడీ హిట్టయిన సినిమాని వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మళ్ళీ హిట్టయ్యేలా చెయ్యడం అనేది చాలా రిస్క్ తో కూడుకుంది. ‘నారప్ప’ మీకెంత ఛాలెంజింగ్ గా అనిపించింది? నిజంగా నారప్ప నాకు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. లుక్ కానీ, ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ అని ఛాలెంజింగ్‌గానే అనిపించాయి. నేను అలాంటి యాక్టర్ ని కాదు కానీ ఈ సినిమాకి ఎందుకో అలా చేయాలనిపించింది. ఒక 50 రోజులు అదే ఓ కాస్ట్యూమ్ తో హోటల్ రూమ్ లో ఉన్నాను. చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా తీశాను. ‘అసురన్’ లో ధనుష్ కి నారప్ప లో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది దాన్ని ఎలా చూపించగలరు? ఏదైనా సరే ఫైనల్‌గా అతను ధనుష్, నేను వెంకటేష్. అతను కూడా అవుట్ స్టాండింగ్ జాబ్ ఇచ్చాడు. ఇక్కడ నారప్ప ఎమోషన్స్ ఏంటి అన్నది ముఖ్యం అది నేను చూపించాను అందుకే కదా అన్నా చాలా కష్టంగా ఈ రోల్ అనిపించింది అని. ఒరిజినల్ కి ‘నారప్ప’ కి కంపేరిజన్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా.. ఏ రీమేక్ సినిమాకి అయినా కంపేరిజన్ అనేది ఉంటుంది. నా సినిమాలు సుందరాకాండ, చంటి సినిమాల నుంచే చాలానే మార్పులు ఉంటాయి. అలాగే నారప్ప కి కూడా కావాల్సిన చేంజెస్ చాలానే చేశాం. అలాగే సినిమాలో అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేసారు అది రేపు మీకు కనిపిస్తుంది. ముందు మీ యంగ్ రోల్ కి చాలా మంది యాక్టర్స్ పేర్లు వినిపించాయి, రానా చేస్తున్నాడని కూడా పుకార్లు వచ్చాయి? ఎలా చేస్తాడమ్మా ఇలాంటి వాటిలో? అలా ఏమి లేదు అవన్నీ జస్ట్ టాక్స్ మాత్రమే అవన్నీ ఎవరో అనడం మళ్ళీ మీరు నన్ను అడగడం. అలా ఏమి మేము అనుకోలేదు. మణిశర్మ గారి సంగీతం కోసం ఏమన్నా చెప్పండి? మణిశర్మతో నా మొదటి సినిమా నుంచి కూడా మంచి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు, అలాగే ఈ సినిమాకి కూడా మంచి స్కోర్ ఇచ్చాడు. గడిచిన కొన్నేళ్లలో కొత్త కథలు వస్తున్నాయి రీమేక్స్ అవసరం లేదు అన్నది కొందరి మాట.. ఎవరన్నారు? నా వరకు అయితే రాలేదు. మనం చేసేది ఏదైనా సరే కరెక్ట్ గా సిన్సియర్ గా చేసుకెళ్లిపోవాలని నేను అనుకుంటా. ఇప్పుడు నడుస్తున్న ఓటిటి డామినెన్స్ పై మీ అభిప్రాయం? టైం చాలా త్వరగా మారిపోయింది, సో ఇప్పుడు ఓటిటి హవా నడుస్తుంది. ఒకవేళ కరోనా కానీ తగ్గిపోతే మళ్ళీ ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ తెరుచుకుని మొదటిలా మారుతుంది. ఇక ఈ సినిమా చూశాక మీకేం అనిపించింది? నాకు అయితే చాలా బాగా అనిపించింది. నా కెరీర్ లో ది బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చా అనిపించింది. కొన్ని ఎమోషన్స్ అవన్నీ మీరు చూస్తారు. ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకొనే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక ఫ్యాన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. వెంకటేశ్ బాబు స్క్రీన్ మీద కంటతడి పెడితే ఆ సినిమా సూపర్ హిట్. నారప్పలో అలాంటి సీన్స్ ఉన్నాయా? ఎలా చేశారు? నాకు ఎమోషన్ సీన్స్ అలా వచ్చాయి. నా కెరీర్ బిగినింగ్‌లో ఏడిసే సీన్స్ వస్తే.. ఆపురా బాబూ అన్నారు. ధైర్యం ఉంటే కెమెరా ముందు ఏడవమన్నారు. తర్వాత ధర్మచక్రం సినిమాల్లో అమ్మాయి చనిపోయే సీన్లో నిజంగానే కెమెరా ముందు ఏడ్చేశాను. ఆ సీన్ బాగా పండింది. అప్పటి నుంచి అలా అలా.. వచ్చేశాయి. నారప్పలో కూడా ఏడిపించేశాను. సినిమా చూడండి. వంద సినిమాలు చేస్తారా సర్? మన చేతుల్లో ఏమీ లేదు. నెంబర్లు ఆలోచించకూడదు. (నవ్వుతూ) కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఏం వద్దు అన్నారు. కట్ చేస్తే.. మళ్లీ అంత మాములే. మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల వివాదం గురించి? ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు -
'ఓ నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప'..
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడదులైన నారప్ప ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప..నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.ఇందులో వెంకటేశ్ యువకుడిలా కనిపిస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ప్రియమణి నటించారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. -
అమ్మను కావడానికి ఇంకా టైమ్ ఉంది.. ప్రియమణి క్లారిటీ
పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ► ‘నారప్ప’ అంటే కెరీర్ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్ కూడా ఉంది... ‘పరుత్తువీరన్’లో విలేజ్ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్‌తో వర్క్ చేయడం అంటే నాకు ఒక బోనస్. తెలుగు సినిమా కాబట్టి డబుల్ బోనస్. ► ఉన్నదానికంటే బ్రైట్‌గా కనబడటానికి మేకప్ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్ అయిన స్కిన్‌తో కనబడాల్సి రావడం గురించి.. ‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్‌గానే కనబడాలి. ట్యాన్ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్‌లైట్ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్ టోన్‌ని డార్క్ చేయించాం. మామూలుగా బ్రైట్‌గా కనిపించడానికి మేకప్ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్‌గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ). ► తమిళ ‘అసురన్’కి రీమేక్‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది... రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ. ► రొటీన్‌కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి? అన్నీ కాటన్ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్ స్టాఫ్ ‘ఏంటి మేడమ్.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్వాళ్లు. ఈ క్యారెక్టర్‌కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్ స్టయిల్ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్ ఫ్రెష్‌గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్ చేసేసేవారు (నవ్వుతూ). ► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్ ప్లాన్స్’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు? నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్‌గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను. ► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా? ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే. ► సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు..? (నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుంది. ► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు? ఆయన యూఎస్‌లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్‌లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్‌ని పట్టగలిగారా? రెగ్యులర్ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్కి నాకు కొంచెం టైమ్ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్‌ని పికప్ చేయగలిగాను. ► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్? ఉంది. ఆ సీన్ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ఉంది. అది నాకు పెద్ద సవాల్‌లా అనిపించింది. ఫిజికల్‌గా ఛాలెంజ్ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. -
‘నారప్ప’ ట్రైలర్... వెంకటేశ్ అదరగొట్టేశాడుగా
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. తమిళ మూవీ ‘అసురన్’కి తెలుగు రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేశాయి. ‘నారప్ప’గా వెంకటేశ్ అదరగొట్టేశాడు. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేశ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. -
దృశ్యం, విరాట పర్వం కూడా ఓటీటీలోకే! డీల్ ఎంతో తెలుసా!
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. సూరేష్బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 20 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైం నారప్పకు 40 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘నారప్ప, దృశ్యం-2’లను ఓటీటీకి భారీ మొత్తంలో సురేష్ బాబు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 76 కోట్లకు అమ్ముడు పోయాయట. ఇక ‘దృశ్యం 2’ అయితే శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే నారప్ప, దృశ్యం 2 తో పాటు రానా ‘విరాట పర్వం’ కూడా నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో నారప్ప: రిలీజ్‌డేట్ ఎప్పుడంటే?
Narappa Movie On OTT: అసురన్.. స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది "నారప్ప". విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా ప్రియమణి కథానాయికగా నటించింది. మే 14న థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇంతలోనే నారప్పకు ఓటీటీ ఆఫర్లు వెల్లువలా రావడంతో నిర్మాత సురేష్ బాబు డిజిటల్ స్ట్రీమింగ్కు మొగ్గు చూపాడు. దీంతో భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకోవడంతో 'నారప్ప' రిలీజ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సందర్భంగా నారప్పను జూలై 20 నుంచి ప్రసారం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మీ ప్రియమైనవారితో కలిసి ఇంట్లోనే సురక్షితంగా సినిమాను చూసి ఆస్వాదించండంటూ హీరో వెంకటేశ్ సైతం ట్వీట్ చేశాడు. జూలై 20 నుంచి నారప్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చని పేర్కొన్నాడు. All my well-wishers and fans have been eagerly waiting to watch our film, #Narappa. Your love towards this film has been overwhelming for me and the team, who always ensured to go an extra mile just like Narappa. pic.twitter.com/5lEMa86pRb — Venkatesh Daggubati (@VenkyMama) July 12, 2021 -
నారప్ప ఫస్ట్ లిరికల్ 'చలాకి చిన్నమ్మీ..' వచ్చేసింది
వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించరు. ఆదివారం జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నారప్ప మూవీ నుంచి ‘చలాకీ చిన్నమ్మి’అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది'..అంటూ సాగే ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. అచ్చమైన పల్లెటూరి టచ్ ఉండేలా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఈ పాటను పాడారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నారప్ప టీజర్‌తో ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. Melody Brahma #ManiSharma weaves his magic once again 🎶✨#ChalaakiChinnammi from #Narappa is out now ▶️ https://t.co/u7IrOav16Y#HBDManiSharma@VenkyMama #Priyamani #SrikanthAddala @SureshPromusic @SureshProdns @theVcreations pic.twitter.com/ibwR6zN04i — Suresh Productions (@SureshProdns) July 11, 2021 -
వైరల్: ‘నారప్ప’ సినిమా.. వెంకీ అభిమాని నిరాహార దీక్ష
కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ మూత పడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పరంగా కాస్త కుదుటపడగా, ప్రభుత్వాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టాయి. కానీ డెల్టా వైరస్ తాకిడి నేపథ్యంలో ధియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ వైపే అడుగులేస్తున్నాయి. తాజాగా వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపగా, వెంకి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు సుముఖంగా ఉండడంతో పాటు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్ సినిమా నారప్పను థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాడు. అందుకు బదులుగా అతను ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. వెంకీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలంటూ అతన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాడు. అందుకు ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోటోను కిరణ్ షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. A protest against... #Narappa OTT release by @VenkyMama Fan Please @SBDaggubati Sir.. We demand @SureshProdns #WeWantNarappaInTheatres@Alludukiran2@theVcreations pic.twitter.com/Mhjeh6TPHT — Krish Narappa (@Krish_kaval) June 29, 2021 చదవండి: ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'నారప్ప'
హీరో వెంకటేశ్ కథానాయకుడిగా వస్తోన్న చిత్రం నారప్ప. తమిళ చిత్రం ‘అసురన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, కలైపులి ఎస్. థానుఈ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన `నారప్ప` టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నలు పోషించారు. ‘నారప్ప’ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా జూలై 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. -
Narappa: వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ
వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటించారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు వెంకటేశ్. ఇంతవరకూ చూడని కొత్త అవతారంలో ఆయన్ను చూపించనున్నారు శ్రీకాంత్ అడ్డాల. "వారం రోజుల్లో నారప్ప ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్‌తో పాటు వెంకటేశ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి స్పందిన లభించింది అన్నారు" శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ, కో ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్. చదవండి: Narappa Movie: వెంకటేష్ 'నారప్ప' రిలీజ్ వాయిదా -
ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది : ప్రియమణి
యమదొంగ సినిమాతో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఆమె కన్నడ, మలయాళ చిత్రాలను దృష్టిపెట్టి అక్కడ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రియమణి మళ్లీ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేసారి రెండు బడా చిత్రాల్లో అవకాశాలు ఆమెను వరించాయి. రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన ప్రియమణి, వెంకటేశ్ సరసన నారప్ప సినిమాలోనూ నటించింది. ఇందులో వెంకటేశ్ భార్యగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాలు తన కెరీర్లో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులుగా నిలిచిపోతాయని పేర్కొంది. ఇక వెంకటేశ్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడు సార్లు వచ్చిందని, పలు కారణాల చివరి నిమిషంలో చేజారిపోయాయని తెలిపింది. ఇన్నాళ్లకు వెంకటేశ్‌తో నటించాలనే తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తుంది. నారప్ప, విరాటపర్వం రెండు సినిమాల్లో తాను పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వస్తుందని చెప్పింది. చీరకట్టులో ప్రియమణి అందాలు చదవండి : ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే! నాకు గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియదు : హీరోయిన్ -
చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు?
ఒకవైపు తెలుగు సినిమాలు భారతీయ చిత్ర రంగంలో దూసుకెళ్తుంటే.. మన స్టార్ హీరోలు మాత్రం పర భాష చిత్రాలనే నమ్ముకుంటున్నారు. ఫలితంగా రీమేక్‌ల హవా పెరిగిపోయింది.ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్‌లనే నమ్ముకుంటున్నారు. తమిళ, మలయాళంలో హిట్టైన కథనలను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవీ మొదలు... యంగ్ హీరో నితిన్ వరకు అంతా రీమేక్ చిత్రాలనే నమ్ముకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే రెండు రీమేక్ చిత్రాలను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి కూడా రీమేక్ చిత్రాన్నే నమ్ముకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమాని ‘వకీల్‌సాబ్’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో చిత్రం కూడా రీమేకే కావడం గమనార్హం. రానా, పవన్ కల్యాణ్ ముఖ్యపాత్రలో మలయాళం మూవీ ‘అయ్యప్పనున్ కోషియమ్’ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లతో ఎక్కువ హిట్స్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ ఇప్పటికీ అదే సూత్రాన్ని నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు చిత్రాలు రీమేకులే. వాటిలో ఒకటి ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘అసురన్’. ఈ మూవీని ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. మరో చిత్రం మలయాళం చిత్రం ‘దృశ్యం-2’. అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇవి రెండూ కాకుండా తాజాగా మరొక మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ను కూడ ఆయన రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక యంగ్ హీరో నితిన్ కూడా రీమేక్ చిత్రాన్నే నమ్ముకున్నాడు. ఈ ఏడాది ‘చెక్’, ‘రంగ్‌దే’ చిత్రాలతో అలరించిన నితిన్.. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’కి రీమేక్. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ ‘కర్ణన్’ను రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలు చాలామంది రీమేక్ కథల నమ్ముకుంటున్నారు. రీమేక్‌లను నమ్ముకుంటే సేఫ్ జోన్లో ఉండొచ్చని నిర్మాతల మాట. బాక్సాఫీస్ బద్దలైయ్యే కాసుల వర్షం రాకపోవచ్చు కానీ, నష్టమైతే రాదని వారి అంచనా. అందుకే మన నిర్మాతలు రీమేక్‌లను నమ్ముకుంటున్నారేమో. అదీ కాక మన రచయితలు అవసరమైన కథలను అందించలేకపోతున్నారా? లేదా అగ్రహీరోలు వాటిని టేకాప్ చేయడం లేదా?అనేది తెలియడం లేదు. -
Narappa Movie: వెంకటేష్ 'నారప్ప' రిలీజ్ వాయిదా
కరోనా సెకండ్ వేవ్ సినీ పరిశ్రమపై గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్ స్టోరీ', దగ్గుబాటి రానా 'విరాటపర్వం', చిరంజీవి ఆచార్య వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు చక్కదిద్దుకోగానే అతి త్వరలో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఓ పోస్టును షేర్ చేశారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis. Stay safe ! #NarappaPostponed@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/i5AT8JMsuH — Suresh Productions (@SureshProdns) April 29, 2021 చదవండి: సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా ఓటీటీలో తక్కువ ధర పలికిన అనసూయ సినిమా -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్టైన్మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం.. జగమే తంత్రం.. హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట. వకీల్ సాబ్.. ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. థ్యాంక్ యు బ్రదర్.. యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నారప్ప.. విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రంగ్‌దే.. నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణన్.. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్లో మార్పు ఉండే అవకాశం ఉంది. మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. చదవండి: మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్ బిగ్‌బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్త ఓవర్ చేస్తోందంటూ.. -
వెంకటేశ్ కోసం అభిమాని 140 కి.మీ పాదయాత్ర
ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ కోసం ఓ అభిమాని తన స్వస్థలమైన బిక్కనూర్ నుంచి హైదరాబాద్‌కు నడుచుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించి తెలుసుకున్న వరుణ్ తన బిజీ షెడ్యూల్‌కు కాసేపు విరామం చెప్పి అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. అతడితో కబుర్లు చెప్పి ఫొటోలు సైతం దిగాడు. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో అభిమాని దగ్గుబాటి హీరో వెంకటేశ్‌ను కలిసేందుకు పాద యాత్ర చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్లోని బుద్ధారాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ హీరో వెంకీకి వీరాభిమాని. ఆయనన్నా, ఆయన సినిమాలన్నా ఎంతో పిచ్చి. ఎలాగైనా ఆయనను కలవాలన్న తపనతో 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. కానీ ఆయన నారప్ప కోసం వేరే లొకేషన్లో ఉండటంతో కలవలేకపోయాడు. వెంకటేశ్ అభిమాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. "ఏడేళ్ల వయసులో జనం మనదేరా సినిమా చూశాను. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. ఆ సినిమాను 30 సార్లు చూశాను. ప్రతి ఏడాది వెంకటేశ్ పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా చేస్తాను. ఇప్పటికే రెండు, మూడు సార్లు వచ్చాను, కానీ కలవలేకపోయాను. అందుకే ఈసారి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. కానీ ఆయన నారప్ప షూటింగ్లో ఉండటంతో కలవలేకపోయాను. కాకపోతే ఆయన తిరిగొచ్చాక ఫోన్ చేసి చెప్తామని, అప్పుడు కలవొచ్చని చెప్పారు అని పేర్కొన్నాడు. వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటానంటున్నాడు శ్రీనివాస్. (చదవండి: బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ) కాగా ఈ దగ్గుబాటి హీరో ప్రస్తుతం ప్రియమణితో కలిసి నారప్పలో కనిపించనున్న విషయం తెలిసిందే. అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న విడుదల కానుంది. కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ) -
నారప్ప పూర్తప్ప!
నారప్ప ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మే 14వరకూ ఆగాల్సిందే. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్.థాను, సురేశ్ బాబు నిర్మించారు. ప్రియమణి కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మే 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు వెంకటేశ్. మణిశర్మ సంగీత దర్శకుడు. -
బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ
కరోనా కారణంగా గతేడాది సినిమాల రిలీజ్‌ను ఆగిపోవడంతో.. అంతా ఈ ఏడాదిపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు షూటింగ్ జరుపుకుంటునే.. విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్లో గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా బడా హీరోల మధ్య ఈ ఏడాది బాక్సాఫీస్ వార్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఒకే నెలలో నలుగురు బడా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’(మే13), విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’(మే14), మాస్ మహారాజా రవితేజ‘ఖిలాడి’(మే28) సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ బాక్సాఫీస్ వార్‌లోకి నందమూరి బాలకృష్ణ కూడా దూసుకొచ్చాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘బీబీ3’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. దీంతో చాలా రోజులు తర్వాత టాలీవుడ్ బడా హీరోలు చిరు, బాలయ్య, వెంకటేశ్‌లు కలిసి ఒకే నెలలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 90లలో మాత్రమే సాధ్యమైన ఫీట్ మళ్లీ ఇన్నాళ్టికి కనిపిస్తోంది చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చిరుతో ఢీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి చిరుతో బాక్సాఫీస్ వార్‌కు సిద్దమయ్యాడు బాలయ్య బాబు. కాకపోతే ఈ సారి వీరిద్దరి సినిమాల విడుదలకు రెండు వారాల గ్యాప్ ఉండడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఇక చిరంజీవి, వెంకటేశ్ ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు. ఆచార్య మే 13న విడుదల అవుతుండగా, నారప్ప మే 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య సినిమా రిలీజ్ రోజే రవితేజ ‘ఖిలాడి’ విడుదల కాబోతుంది. వీరిద్దరివి మాస్ సినిమాలే కాబట్టి ఆ మేరకు కలెక్షన్స్ పరమైన షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారు. సమ్మర్లో జరగబోయే బాక్సాఫీస్ వార్‌లో ఏ హీరో విజేతగా నిలుస్తాడో చూడాలి మరి.