
‘నారప్ప’ఓటీటీలో విడుదల చేయడం పట్ల వెంకటేశ్ చాలా ఫీలయ్యారని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సివచ్చిందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘నారప్ప’ యూనిట్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
ఆదివారం సురేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్లో సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప మేము మాత్రమే నిర్మించలేదు. నాతోపాటు.. ఎస్.థామస్ కూడా ఈ సినిమాకు నిర్మాత. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్.థామస్ నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని భావించారు. కరోనా థార్డ్ వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండడంలో న్యాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల్నే థియేటర్‌కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి’అని సురేశ్ బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment