ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేశ్ కాకుమాను, కృష్ణప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథా కమావీషు. ఈ చిత్రానికి గౌతమ్-కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గౌతమ్ కథను అందించారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రేమ, కుటుంబం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఐ డ్రీమ్ మీడియా, త్రి విజిల్స్ టాకీస్ బ్యానర్లపై చిన వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్
సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment