Krutika
-
సికింద్రాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
-
సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ పరిధిలో పాప అదృశ్యం
-
సికింద్రాబాద్‌లో చిన్నారి అదృశ్యం.. సిద్ధిపేటలో ఆచూకీ లభ్యం
సాక్షి, సికింద్రాబాద్: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో మరో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహంకాళి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాకే తమ ఆరేళ్ల పాప కృత్తిక అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..చిన్నారి కృత్తిక ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు చిన్నారి మిస్సింగ్ కేసును చేధించారు. ఈ మేరకు నార్త్‌జోన్ పోలీసులు సిద్ధిపేటలో చిన్నారిని గుర్తించారు. కిడ్నాప్ చేసిన పాపను సైకో రాము సిద్ధిపేటకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. (చదవండి: గోషామహల్లో కుంగిన పెద్ద నాల) -
బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: అభాగ్యులైన చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవలే బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లు ఏర్పాటయ్యాయి. బాలల సంక్షేమం, సంరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన వీటిలో అన్ని జిల్లాల నుంచి 85 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వీరందరికీ విజయవాడలోని హరిత బెరంపార్కులో నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారి పరిధిని వివరించడంతోపాటు పోక్సో, జువెనైల్ యాక్ట్, బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ వంటి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. కమిటీలు, బోర్డుల ఏర్పాటు ఇలా.. జువెనైల్ జస్టిస్–2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఈ నియామకాలను పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఒక బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), ఒక జువెనైల్ జస్టిస్ బోర్డును ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీలో చైర్పర్సన్, నలుగురు సభ్యులు, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. 18 ఏళ్లలోపు బాలల హక్కులు, సమస్యలు, సంక్షేమం, సంస్కరణ కోసం సీడబ్ల్యూసీ, జేజేబీలు పని చేస్తాయి. అభాగ్యులకు అండగా.. వీధి, అనాథ బాలలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని సంరక్షణ కేంద్రాలకు అప్పగించడం.. వారికి విద్య, వైద్యం, వసతి కల్పించడం వంటి చర్యలను సీడబ్ల్యూసీ, జువెనైల్ జస్టిస్ బోర్డు పర్యవేక్షిస్తుంటాయి. వివిధ కారణాలతో ఇంటికి దూరమైన బాలలను గుర్తించి.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తాయి. అక్రమ రవాణాకు గురైన బాలలకు ప్రభుత్వపరంగా సాయమందించేలా కృషి చేస్తాయి. నిర్బంధపు బాల కార్మికులు, వేధింపులకు గురైన వారికి చట్టపరంగా అండగా నిలుస్తాయి. బాల నేరస్తుల్లో పరివర్తన తెచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. అన్యాయానికి గురైతే అండదండలు అందించడం వంటి చర్యలు చేపడతాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదుకునే విధంగా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇలా అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి చిన్నారికి సీడబ్ల్యూసీ, జేజేబీ భరోసా ఇవ్వనున్నాయి. బాలల సంక్షేమం, సంస్కరణకు ప్రాధాన్యం బాలల సంక్షేమంతోపాటు వారి సంస్కరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ, జేజేబీలను ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు, బోర్డు సభ్యులు ఎలా పని చేయాలి, ఏం చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నాం. –కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. ► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ► ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, డయల్ 112, డయల్ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయి. -
కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం
కోలీవుడ్‌లో ఒక క్రేజీ చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యువ నటుడు ధనుష్, డీఎంకే నేత స్టాలిన్ కోడలు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధి కలయికలో చిత్రం తెరకెక్కనుంది. కృతిక ఇప్పటికే వణక్కం చెన్నై అనే చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. అలా గే ధనుష్ తన ఉండెర్బార్ ఫిలింస్ పతాకంపై నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు కృతిక దర్శకత్వంలో చిత్రం రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో కృతిక భర్త, నటుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రానికి సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్ పని చేయనున్నట్లు తెలిసింది. కృతిక, అనిరుద్ ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రానికి కలిసి పని చేయడం గమనార్హం. ధనుష్ ఒక పక్క హీరోగా హిందీలో బాల్కి దర్శకత్వంలో షమితబ్ చిత్రంతోపాటు తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేగన్, వేల్లై ఇల్లా పట్టదారి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోపక్క శివకార్తికేయన్ హీరోగా తానా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా కృతిక దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.