Six Year Old Girl Missing In Secunderabad At Mahankali Police Station - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో చిన్నారి కృత్తిక అదృశ్యం.. సిద్ధిపేటలో ఆచూకీ లభ్యం

Published Fri, Dec 23 2022 6:42 PM | Last Updated on Fri, Dec 23 2022 9:24 PM

Six Year Old Girl Missing In Secunderabad Mahankali - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో మరో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహంకాళి పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాకే తమ ఆరేళ్ల పాప కృత్తిక అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించగా..చిన్నారి కృత్తిక ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు చిన్నారి మిస్సింగ్‌ కేసును చేధించారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ పోలీసులు సిద్ధిపేటలో చిన్నారిని గుర్తించారు.  కిడ్నాప్‌ చేసిన పాపను సైకో రాము సిద్ధిపేటకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. 

(చదవండి: గోషామహల్‌లో కుంగిన పెద్ద నాల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement