సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్.
కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం
Comments
Please login to add a commentAdd a comment