kancharapalem
-
కంచరపాలెం ఘటనలో ఏం జరిగిందో చెప్పిన DCP
-
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్‌లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్‌లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్‌ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, అనుమానాస్పద కేసు నమోదు
-
మద్యం మత్తులోనే వందేభారత్ రైలుపై దాడి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): నిర్వహణ పనుల నిమిత్తం విశాఖకు వచ్చి.. బుధవారం కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లు వేసిన నిందితులను స్థానిక పోలీసులు, జీఆర్పీ పోలీసుల సహకారంతో రైల్వే భద్రతా దళం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం కంచరపాలెం రైల్వే గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న శంకర్, చందు, రాజు అనే వ్యక్తులు కొత్త రైలు వెళ్లడం గమనించి రాళ్లతో దాడి చేశారు. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ ముగ్గురినీ వెంబడించగా శంకర్ చెప్పును వదిలేసి పారిపోయాడు. రైల్వే పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ స్థానిక పోలీసులకు ఆదేశించగా.. వెస్ట్ ఏసీపీ, కంచరపాలెం సీఐ, టాస్క్‌ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ పాత కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌లో వందేభారత్ రైలును వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి గురువారం తనిఖీ చేశారు. రైలులో ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఆన్‌బోర్డ్ టెక్నీషియన్స్‌తో డీఆర్ఎం మాట్లాడారు. బుధవారం రాత్రి ఈ రైలును కోచ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్న సమయంలో కంచరపాలెం వద్ద ఆకతాయిల వల్ల దెబ్బతిన్న పగిలిన కోచ్‌ల అద్దాలను పరిశీలించారు. పాక్షికంగా పగిలిన అద్దాలను న్యూకోచింగ్ కేర్ సెంటర్లో మార్చారు. గురువారం రాత్రికే ఈ రైలును సికింద్రాబాద్ పంపించేందుకు వాల్తేర్ డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) మనోజ్‌కుమార్ సాహూ, సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ సీహెచ్ రఘువీర్, సీనియర్ కోచింగ్ డిపో ఆఫీసర్ మోనిష్ బ్రహ్మ, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్కే పాత్ర పాల్గొన్నారు. -
గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కంచరపాలెం పోలీసుల స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరివద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ప్యాకెట్లుగా మార్చి గుట్టుగా రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఐదుగురు నిందితులు డిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు రైల్యే ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో వీరిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రవణ్ తెలిపారు. -
నిధులు అవి‘నీటి’ పాలు
తెల్లవారుజాము.. సమయం సుమారు 4 గంటలు.. వినాయక ఉత్సవాలు సంబరంగా జరుపుకొని అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు.. ప్రశాంతంగా.. నిశ్శబ్ధంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దాలు.. జనం తుళ్లిపడి లేచారు. లేచి చూస్తే.. రోడ్లపైనా, అపార్ట్మెంట్లలోకి, షాపుల్లోకి నీరు వెల్లువెలా ముంచెత్తింది. ఈ పరిణామాలన్నీ చూసి.. భూకంపం సంభవించిందా?.. వర్షం ముంచెత్తిందా??.. వరద వెల్లువెత్తిందా???.. అన్న భావనలతో భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరయ్యా రు.. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్న.. ఆకస్మాత్తుగా ముంచెత్తిన వర ద కాని వరదతో ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. రాకపోకలు స్తంభించి వాహనాదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఆ శబ్దాలు.. భూ ప్రకంపనలు కావు.. అలాగని వర్షాలు, వరదలూ ముంచెత్తలేదు.. అది తాటిపూడి పైపులైన్ పేలుడు.. లీకేజీలు సృష్టించిన తాత్కాలిక ఉపద్రవం. నాసిరకం నిర్మాణం కారణంగా ఈ పైపులైన్‌కు పగుళ్లు, లీకులు కొత్తేం కాదు. అంచనా వ్యయానికి మించి రూ.81కోట్లకుపైగా ఖర్చు చేసినా.. ఏటా మరమ్మతులకే సగటున రూ.18 లక్షలు ఖర్చు చేస్తున్నా.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి దెబ్బ కు అవన్నీ లీకేజీ నీళ్లలో కలిసిపోతున్నాయి. ఫలితంగా తరచూ లీకులు, పగుళ్లతో విలువైన నీళ్లు, నిధులు వృథా కావడం.. మరమ్మతులు, నీటిసరఫరా నిలిపివేత కారణం గా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయి. లీకులే లీకులు.. 2012.. 9 2013.. 12 2014.. 5 2015.. 13 2016.. 9 2017.. 9 2018.. 5 2019(ఇప్పటివరకు).. 5 సాక్షి, విశాఖపట్నం: తాటిపూడి పైపులైన్ మరో సారి పగిలింది. అడుగుకో అక్రమం, పైపు పైపులో అవినీతి ప్రవాహం సాగడంతో నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సిన పైప్‌లైన్‌కు నిలువెల్లా పగుళ్లు, లీకేజీలే మిగిలాయి. మంగళవారం తెల్లవారుజామున కంచరపాలెం బీఆర్టీఎస్ రహదారిపై తాటిపూడి పైప్‌లైన్ పగిలి పోయి వేల లీటర్ల నీరు వృథా అయ్యింది. ఈ పైపులైన్ పగలడం ఇది 67వ సారి. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఈ పైపులైన్ దుస్థితికి నిర్మాణంలో అవినీతే కారణమని అధికారులు నివేదికలు ఇచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పనులు పూర్తిచేయకున్నా.. అదనంగా నిధులు.. విస్తరిస్తున్న విశాఖ నగర భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10ఎంజీడీల నీటి సరఫరా చేసేలా తాటిపూడి పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. 2011లో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో విజయనగరం జిల్లా నుంచి తాటిపూడి నుంచి విశాఖ నగరంలోని టీఎస్సార్ కాంప్లెక్స్ వరకూ సుమారు 63 కిలోమీటర్ల మేర పైప్లైన్లు నిర్మించేందుకు రూ.81.28 కోట్లతో ఐహెచ్పీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు పనులు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం రూ.62.28 కోట్లకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ మాత్రం కాంట్రాక్టర్‌కు మరో రూ.19 కోట్లు పెంచి రూ.81.28 కోట్లు సమర్పించింది. సదరు కాంట్రాక్టర్ మాత్రం నిధులు సరిపోవడం లేదంటూ టీఎస్సార్ కాంప్లెక్స్ వరకు కాకుండా 4 కిలోమీటర్ల ముందు కంచరపాలెం సమీపంలోని గోదావరి పైపులైన్‌కు అనుసంధానం చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయకున్నా బిల్లులు మాత్రం చెల్లించేశారు. అలా ఎందుకు చెల్లించారన్న దానికి జీవీఎంసీ అధికారుల వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. పైసలు పోయె.. పగుళ్లు మిగిలె.. కాగా వేసిన 59 కిలోమీటర్ల పైపులైన్లోనూ నాణ్యత ఏమాత్రం లేకపోయినా అప్పటి అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. భారీ పైపులైన్లు వేసినప్పుడు ఇరువైపులా 10 మీటర్ల వరకు వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించాలి. కానీ తాటిపూడి పైపులైన్‌పై ఏకంగా ఫోర్‌లైన్ బీఆర్టీఎస్ రహదారి వెళ్తోంది. దాంతో ఒత్తిడి పెరిగి పైపులు తరచూ పగిలిపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ అధికార యంత్రాంగం మౌనం వహిస్తోంది. పైప్‌లైన్‌పై పలు చోట్ల భవంతులు సైతం వెలిశాయి. పెందుర్తి మార్గంలో ఎల్జీ పాలిమర్స్ దాటిన తర్వాత ఆక్రమణలు మొదలయ్యాయి. ఎస్ఆర్ ఆస్పత్రి ముందు నుంచి పైప్ లైన్ మీదుగా పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. గోపాలపట్నం జంక్షన్లో తాటిపూడి ఎయిర్పంప్పై ఏకంగా ఓ బేకరీనే నిర్మించేశారు. ఇలా ప్రతి చోటా పైపులైన్‌పై ఒత్తిడి పెరుగుతుండటం వల్ల అవి పగిలిపోతున్నాయి. గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకూ పైప్‌లైన్‌పై సుమారు 100కి పైగా కట్టడాలు ఉన్నట్లు జీవీఎంసీ అధికారులు గుర్తించి నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యం. నిర్వహణ అస్తవ్యస్తం.. చిన్నచితకా పనుల విషయంలో నిబంధనల పేరుతో హడావుడి చేసే జీవీఎంసీ ఇంజినీర్లు.. తాటిపూడి కాంట్రాక్టర్‌కు మాత్రం నిర్వహణ విషయంలో మినహాయింపునిచ్చేశారు. 2011 లో ప్రాజెక్టు ప్రారంభమై అదే ఏడాది పూర్తయింది. ఆ తర్వాత ఏడేళ్ల వరకూ అంటే 2018 వరకు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి. కానీ అసంపూర్తి పనులు చేసి పూర్తి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత నిర్వహణ విషయాన్ని గాలికొదిలేసింది. 2012 నుంచే పైపులైన్ లీకేజీలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కార్పొరేషనే మరమ్మతు పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఏడేళ్లలో సుమారు రూ. 1.10 కోట్లు మరమ్మతులకు ఖర్చు చేసింది. ఆడిట్లో అక్రమాలు బట్టబయలు జేఎన్ఎన్యూఆర్ఎం పనులఆడిట్లో తాటిపూడి పైప్‌లైన్ వ్యవహారం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో పాటు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అవకతవకలు జరిగాయని తేటతెల్లమైంది. కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి ఇంజినీర్ల బృందం.. అవకతవకలు జరుగుతున్నా ప్రోత్సహించడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పైగా తాటిపూడి పైపులైన్ నిర్వహణకు ప్రత్యేకంగా టెండర్లు పిలిపించారు. ఏటా రూ.18లక్షలతో పనులు అప్పగించారు. ఇప్పటికే కాంట్రాక్టర్ వల్ల కార్పొరేషన్ ఖజానాకు రూ.కోట్లు చిల్లు పడగా.. ఇప్పుడు ఏటా రూ.18లక్షలు చేతి చమురు వదులుకోవాల్సిన పరిస్థితి. ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నిస్తాం.. తాటిపూడి పైప్‌లైన్ మరమ్మతులు పూర్తయ్యాయి. పారిశ్రామిక అవసరాలకు హెచ్‌పీసీఎల్ నీటిని వినియోగించకపోవడం, తాటిపూడి రిజ ర్వాయర్ వద్ద ప్రెజర్ పెరగడం వల్ల పగులు ఏర్పడిందని అధికారులు ప్రాథమికంగా నిర్థరించారు. పైప్‌లైన్ వెంబడి ఆక్రమణలున్నాయని తెలిసింది. వాటిని తొలగించి.. పైప్‌లైన్‌పై ప్రెజర్ పడకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు, పగుళ్లు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపడతాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం.. తాటిపూడి పైప్‌లైన్ పగలడం వల్ల కేవలం హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, కోరమండల్ పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది తలెత్తింది. ఎన్ఏడీ కొత్త రోడ్డు, పెందుర్తి, తాటిపూడి, వేపగుంట, గోపాలపట్నం, కంచరపాలెం మెట్టు వరకు కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చెయ్యలేకపోయాం. 9 గంటల్లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. బుధవారం నుంచి సరఫరా యథాతథంగా ఉంటుంది. పైప్ లైన్ మరమ్మతులకు సంవత్సరానికి రూ.18 లక్షలు వెచ్చిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, ఎస్ఈ, జీవీఎంసీ నీటిసరఫరా విభాగం బీఆర్టీఎస్ రహదారిలో ప్రకంపనలు.. కంచరపాలెం(విశాఖ ఉత్తరం): కంచరపాలెం బీఆర్టీఎస్ ప్రధాన రహదారిలో తాటిపూడి భూగర్భ ప్రధాన పైప్‌లైను మంగళవారం వేకువజామున 4గంటల సమయంలో పెద్ద శబ్దంతో నాలుగు చోట్ల పగిలింది. ఈ ఘటనలో రహదారి పాక్షికంగా దెబ్బ తింది. రాకపోకలు స్తంభించాయి. పైప్‌లైన్ నుంచి గంటల పాటు నీరు పొంగి ప్రవహించడంతో స్థానిక దుకాణాల్లోకి, ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా నీట మునిగింది. అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న వాచ్మెన్ శ్రీనివాసరావు వస్తుసామగ్రి పూర్తిగా మునిగిపోయాయి. సమీక్షించిన అధికారులు, నాయకులు.. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్యే పి.గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వాచ్‌మన్ శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు మళ్ల విజయప్రసాద్ తెలిపారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు పరిస్థితి సమీక్షించారు. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జీవీఎంసీ అధికారులు తెలిపారు. మళ్లీ ఇక్కడే.. : మళ్ల మూడేళ్ల క్రితం తాటిపూడి పైపులైన్ మరమ్మతులకు గురై కంచరపాలెం నుంచి ఐటీఐ కూడలి, ఊర్వశి జంక్షన్ వరకు రహదారి పాక్షికంగా దెబ్బ తిన్న సంఘటన మరవకముందే మళ్లీ అదేచోట ఇలాంటి సంఘటన జరగడం బాధకరమని మళ్ల విజయప్రసాద్ అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పైప్‌లైన్ నిర్వహణలో, నాణ్యత విషయంలో రాజీపడకుండా.. సమస్య పునరావృతం కాకుండ గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో జోన్–4 జోనల్ కమిషనర్ సింహాచలం, ఈఈ రాజారావు, విద్యుత్ డీఈ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షులు కెపి.రత్నాకర్, ముర్రువాణీ నానాజీ, ఆడారి శ్రీను, నాగేశ్వరరావు, నాయకులు కొణతాల ఉమమహేశ్వరరావు, పల్లా ఎర్నికుమార్, చెంగల ఈశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని నరికిన కూతురు
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): ఇంట్లో జరిగిన గొడవ కన్న కూతురే తండ్రిని నరికి చంపేలా చేసింది. విశాఖ నగరం కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఊర్వశి జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కంచరపాలెం సీఐ భవానీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్వశి థియేటర్ ఎదురుగా ఉన్న ఇంట్లో సముద్రయ్య (48) అనే వ్యక్తి భార్య నాగలక్ష్మి, పిల్లలతోపాటు రమణమ్మ అనే మరో మహిళతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నాగలక్ష్మి తన కుమార్తె బేబి సాయి (20), కొడుకు తరుణ్ (18)తో కలిసి షాపింగ్‌కు వెళ్లి కుమార్తె కోసం దుస్తులు కొనుగోలు చేసింది. ఇది చూసిన సముద్రయ్య ఇంట్లో గొడవకు దిగాడు. కొద్దిసేపటికి గొడవ సద్దు మణిగినా అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన సముద్రయ్య తిరిగి గొడవకు దిగాడు. ఈ సమయంలో తన తల్లిని తిట్టి అనుమానిస్తావా అంటూ కుమార్తె సాయి తండ్రిపై చేయి చేసుకుంది. కూతురు కొట్టడంతో తండ్రి ఆవేశం ఆపుకోలేక జుట్టు పట్టుకుని కొట్టాడు. వంటగదిలో ఉన్న చిన్న కత్తితో తండ్రిపై దాడి చేసింది. దీంతో సముద్రయ్య మెడ భాగంలో గాయమై తీవ్ర రక్త స్రావమైంది. దీన్ని అడ్డుకునే క్రమంలో రమణమ్మ ఛాతీపైన కూడా గాయమైంది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి సముద్రయ్య మృతి చెందినట్లు చెప్పారు. గాయపడిన రమణమ్మను కేజీహెచ్‌కు తరలించారు. వివాహేతర సంబంధంతో కుటుంబంలో గొడవలు.. రైల్వే లోకోషెడ్ ఉద్యోగి అయిన సముద్రయ్య ఎస్.రమణమ్మ (38) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో భార్యతోనే ఉంటానని ఒప్పుకున్న సముద్రయ్య భార్యకు తెలియకుండా రమణమ్మతో సహజీవనం కొనసాగించాడు. అతని వ్యవహారం నచ్చక నాగలక్ష్మి డీజిల్ లోకోషెడ్‌లోని క్వార్టర్స్‌కు వెళ్లిపోయింది. సముద్రయ్య కూడా మూడేళ్లు ఉద్యోగం విడిచి పెట్టి ఒడిశా వెళ్లిపోయాడు. అయితే ఉద్యోగం పోతుందని, పిల్లల భవిష్యత్తు పాడవుతుందని భావించిన నాగలక్ష్మి తన బాధను లోకోషెడ్ అధికారులకు విన్నవించుకోగా సముద్రయ్యను పిలిపించి తిరిగి ఉద్యోగం ఇప్పించారు. అతను రమణమ్మను ఇంటికి తీసుకురావడంతో చేసేదిలేక అందరూ కలిసే ఉంటున్నారు. గురువారం రాత్రి భార్య నాగలక్ష్మి పిల్లల కోసం దుస్తులు కొనుగోలు చేసి ఇంటికి వచ్చింది. ఇది చూసిన సముద్రయ్య గొడవకు దిగాడు. తరువాత బయటకు వెళ్లి మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో మళ్లీ గొడవకు దిగి కూతురి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సాయి బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. తరుణ్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది క్షణికావేశంలో జరిగిన ఘటనగా ప్రాథమికంగా నిర్ధారించారు. -
ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టారు : వైఎస్ షర్మిల
సాక్షి, విశాఖపట్నం : వైజాగ్‌ను మెట్రో సిటీ, బొటానికల్ సిటీ చేస్తానని గొప్పలు చెప్పిన బాబు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కంచరపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 24వేల మంది ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం నాలుగు వేల మందే ఉన్నారని తెలిపారు. కొత్త ఉద్యోగాలు వస్తాయనకుంటే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. విశాఖలో భూములను చంద్రబాబు తన బినామీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. భాగస్వామ్య సదస్సుతో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు కనీసం ఒక్కటి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తీర ప్రాంత రహదారి ఏర్పాటు చేస్తానన్నారు అది కూడా చేయలేకపోయారని దుయ్యబట్టారు. పూర్తి ప్రసంగం షర్మిల మాటల్లోనే.. మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 700మంది ‘కుల, మత, ప్రాంతం, పార్టీలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ప్రతి పేదవాడికి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అందించారు. ఒక్క పైసా పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు వైఎస్సార్‌ది. అందుకే ఆయన చనిపోయినా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 700మంది మరణించారు. కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకాలకు మారుపేరు బాబు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. కమిషన్ల కోసమే పోలవరం.. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్ కోసం చంద్రబాబు తీసుకున్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమ్మకు అన్నం పెట్టనోడు.. నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. క్యాబేజీలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. తమ్ముడు కూడా అన్నలాగే.. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీతో మాకు పొత్తు అని ఆరోపిస్తున్నారు.. నిజంగా మాకు పొత్తు ఉంటే.. కేసులన్నీ మాఫీ చేసుకునేవాళ్లం కదా?. కేసీఆర్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబే.. హరికృష్ణ శవం పక్కన ఉండి పొత్తులకోసం ప్రయత్నించాడు. పొత్తులన్నీ ఈయన పెట్టుకుని.. ఇప్పుడు మాకు పొత్తులున్నాయని అంటున్నారు. మాకు బీజేపీతో గానీ, కాంగ్రెస్‌తో గానీ, కేసీఆర్‌తో గానీ.. పొత్తులేదు.. సింహం సింగిల్‌గానే వస్తుంది...జగన్ సింగిల్ గానే వస్తాడు. పార్టీ సింగిల్ గానే వస్తోంది. దేశంలోని అన్ని సర్వేలు వైఎస్సార్సీపీ బంపర్ మెజార్టీ సాధిస్తుందని చెబుతున్నాయి. నక్కలే గుంపులు గుంపులుగా వస్తాయి. అందుకే..మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, దేవేగౌడ, పవన్ కళ్యాన్‌లను తోడు తెచ్చుకున్నారు. పవన్ ఒక యాక్టర్.. డైరెక్టర్ చంద్రబాబు. యాక్టర్ ఏం చేయాలి.. డైరెక్టర్ చెప్పింది చెయ్యాలి.. అందుకే బాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పవన్ అన్న చిరంజీవి.. ఏం చేశారో గుర్తుంది కదా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. చివరకు హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు.. పవన్ కూడా జనసేనను హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. కాకపోతే టీడీపీకి అమ్మేస్తారు. ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. విశాఖ నార్త్ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్.. విశాఖ వెస్ట్ విజయ్ ప్రసాద్ మల్లా.. ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించండ’ని ప్రజలను కోరారు. -
ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టారు : వైఎస్ షర్మిల
-
సారీ.. నిన్ను ఓడిపోయేలా చేశాను
గతేడాది రిలీజైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆడియన్స్‌కు ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన ఉత్తమ చిత్రమంటూ పొగడ్తల వర్షాలు కురిపించారు. రానా సమర్పించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహా వెంకటేశ్ డైరెక్ట్ చేయగా, తెలుగు మూలాలున్న అమెరికన్ డాక్టర్ పరుచూరి ప్రవీణ నిర్మించారు. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లిస్ట్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ సెలెక్ట్ కాలేదు. కారణం నిర్మాత అమెరికన్ కావడమే. ఈ విషయాన్ని ట్వీటర్లో పేరొన్నారు ప్రవీణా పరుచూరి. ‘‘సారీ వెంకటేశ్ మహా. కేవలం నా వల్ల నీ కష్టాన్ని, శ్రమని నేషనల్ అవార్డ్ వాళ్లు అనర్హంగా భావించారు. నా వల్లే నువ్వోడిపోయావ్. నేనే నిన్ను ఓడిపోయేలా చేశాను’’ అని తన బాధను వ్యక్తపరిచారు. దీనికి దర్శకుడు వెంకటేశ్ మహా సమాధానమిస్తూ – ‘‘అది మీ తప్పు కాదు. ఇంకా ఆ పాత రూల్స్‌తోనే నడుస్తున్న మన దేశానిది. ఒక ఇండియన్ డైరెక్టర్, ఇండియన్ యాక్టర్స్‌తో ఇండియా వాళ్ల కోసం తీసిన సినిమా ఇండియన్ నేషనల్ అవార్డ్స్‌కు అర్హత సాధించకపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు. మార్పుకు సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. -
చిన్న సినిమాలంటే చిన్న చూపు – డి.సురేశ్‌బాబు
‘‘చిన్న సినిమాలంటే చిన్న చూపు ఉండే చెడు అలవాటుకు మనం అలవాటు పడిపోయి ఉన్నాం. మంచి సినిమాలను తక్కువ మంది చూస్తున్నారు. అందుకే ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని ఫిలిం లవర్స్‌కు, సెలబ్రిటీస్‌కి చూపించాం. అందరూ సినిమా చూసి, చాలా బావుందని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. సుబ్బారావు, రాధా బెస్సి, కేశవ, కార్తీక్ తదితరులు ప్రధాన తారాగణంగా వెంకట్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. రానా దగ్గుబాటి సమర్పణలో విజయ్ ప్రవీణ పరుచూరి నిర్మించి, నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ ప్రవీణ అమెరికా నుంచి వచ్చి వెంకటేశ్ మహా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా సినిమా నిర్మించింది. మహా కొత్త డైరెక్టర్ అయినా ప్రతి క్యారెక్టర్‌ను చక్కగా రాసి, నేచురల్‌గా తెరకెక్కించారు. అందుకే సినిమా చూసినవారందరూ అభినందించారు. ఈ సినిమా ఇంకా సక్సెస్ కావాలి. ఇది ఎంత మంచి సినిమానో ఇంకా చాలా మందికి తెలియాలి’’ అన్నారు. ‘‘సినిమాలు చేయాలనే ఆసక్తితో అమెరికా నుంచి ఇండియా వచ్చాను. వెంకట్ మహా చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. సురేశ్‌బాబుగారు, రానాగారి సపోర్ట్‌తో సినిమాకు మంచి పేరు వచ్చింది’’ అన్నారు విజయ ప్రవీణ పరుచూరి. ‘‘యాక్టింగ్ అనేది డెడ్లీ స్పోర్ట్. చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. నేను కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. షూటింగ్ మధ్య దాహం వేసినా ఇంటికి వెళ్లి నీళ్లు తాగి వచ్చేవాళ్లు. నటీనటులు చాలా కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు ఎంతో సపోర్ట్ అందించారు. మా సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వెంకటేశ్ మహా. నటులు మోహన్‌భగత్, కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తీ, సినిమాటోగ్రాఫర్ ఆదిత్య, సౌండ్ డిజైనర్ నాగార్జున, వెంకట్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జన సునామీతో టీడీపీలో కంగారు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కంచరపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. జగన్ సభకు జనం ప్రభంజనంలా వెల్లువెత్తడం అధికార పార్టీ నేతల్లో కలవరం వ్యక్తమవుతోంది. కంచరపాలేనికి విశాఖతోపాటు పరిసర ప్రాంతాల నుంచి జనం సునామీలా పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతగా సభ జనంతో కిటకిటలాడింది. పలు మార్గాల్లో అడుగుతీసి అడుగువేయలేనంతగా కిక్కిరిసిపోయారు. ‘సంతృప్తి’ నివేదికలపై పునరాలోచన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు నుంచి కనకదుర్గవారధి మీదుగా విజయవాడలోకి అడుగిడినప్పుడు, తూర్పు గోదావరిలోకి ప్రవేశించిన సందర్భంగా రాజమండ్రి రైల్‌కమ్ రోడ్ బ్రిడ్జిపై సాగిన పాదయాత్రకు, ఆ తరువాత బహిరంగ సభకు అశేష జనవాహిని తరలిరావడంతో టీడీపీలో ప్రకంపనలు ఏర్పడటం తెలిసిందే. తాజాగా కంచరపాలెం సభకూ జనం తండోపతండాలుగా రావడం అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. సభ వివరాలపై పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతోపాటు విశాఖ పోలీసు కమిషనర్ మహేష్‌చంద్రలడ్డాను పిలిచి సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. జగన్ ప్రసంగానికి ప్రజలు కరతాళధ్వనులతో మద్దతు పలకడం టీడీపీ పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు నిలువుటద్దంలా మారింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం, పార్టీ పట్ల 80%కు పైగా సంతృప్తి ఉందంటూ వివిధ ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్న నివేదికల్లో వాస్తవాలపై బాబు పునరాలోచనలో పడ్డట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో చర్చ కంచరపాలెం సభకు లభించిన స్పందన అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల్లో చర్చకు దారితీసింది. సంతృప్త స్థాయిపై తమకు అందుతున్న నివేదికలన్నీ వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ప్రజల తాజా స్పందనతో తేటతెల్లమవుతోందని కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలే పేర్కొనడం విశేషం. మరోపక్క కొందరు మంత్రులు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సమయంలోనూ కంచరపాలెం సభపైనే చర్చ సాగింది. అధికారులపై సీఎం ఆగ్రహం! జగన్ ప్రభంజనాన్ని ఇతరులతో పోల్చడం, తక్కువగా అంచనా వేయడం ఏమాత్రం సరికాదని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలకు వస్తున్న స్పందన అన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం చూపుతోందని మరోనేత పేర్కొన్నారు. తమ అధినేతకు కంచరపాలెం సభపై విభిన్న మార్గాల ద్వారా స్పష్టత వచ్చిందని, అందువల్లే విశాఖ కమిషనర్ ఉన్నఫళంగా పిలిచారని ఓ టీడీపీ నేత చెప్పారు. జగన్ సభ తర్వాత తన వద్దకు వచ్చిన అధికారులుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని అసెంబ్లీలో కొందరు అధికారుల మాటల ద్వారా వ్యక్తమైంది. -
జనసంద్రగా వైఎస్ జగన్ విశాఖ సభ
-
చరిత్రలో నిలిచిపోయే సభ
సాక్షి, విశాఖపట్నం : వైస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖ నగరానికి చేరిన సందర్భంగా కంచరపాలెంలో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖనగరం జన సంద్రోహమైందని ఆయన తెలిపారు. చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి రాని జనం వైఎస్ జగన్ సభకు తరలివచ్చారని అన్నారు. గత ఎన్నికల్లో వైస్సార్సీపీకి ఎందుకు ఓటు వేయ్యలేదని ప్రజలు ఇప్పడు బాధపడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో విశాఖ ప్రజలు తప్పకుండా వైఎస్ జగన్ పక్షాన నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అయిన విశాఖను జగన్ మాత్రమే అభివృద్ధి చేయగలరని ఆయన తెలిపారు. ప్రజలందరూ కూడా అదే అభిప్రాయంతో ఈ సభకు తరలివచ్చారని అన్నారు. అధికార టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖలో విలువైన భూముల కబ్జా చేశారని.. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. విశాఖ నగరానికి ఎంతో ముఖ్యమైన రైల్వే జోన్‌పై కేంద్రంతో అలుపెరగని పోరాడం చేశామని ఆయన గుర్తుచేశారు. -
జనసంద్రమైన విశాఖ మహానగరం
-
జనసంద్రమైన విశాఖ నగరం
సాక్షి, విశాఖపట్నం : వైస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్ జగన్ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌కు ఆహ్వానం పలుకుతూ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహంచగా, గిరిజనలు వారి సాంప్రదాయ నృత్యాలతో జన నేతకు ఆహ్వానం పలికారు. జగన్ బహిరంగ సభ సందర్భంగా విశాఖ మహానగరం వైఎస్సార్సీపీ జెండాలతో నిండిపోయింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. -
చరిత్రలో నిలిచిపోయే సభ
-
జననేత కోసం.. కంచరపాలెం
-
ఈ నెల 9న కంచెరపాలెంలో వైఎస్ జగన్ బహిరంగ సభ
-
వాళ్లను ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో చూపిస్తాం
‘లీడర్’ టు ‘నేనే రాజు నేనే మంత్రి’.. రానా చేసిన సినిమాలు తీసుకుంటే ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. బలమైన కథ ఉన్న సినిమాలే చేస్తుంటారు. హీరో అయినా ఓకే.. విలన్ అయినా ఓకే.. కథ బాగుంటే గెస్ట్‌గా అయినా ఓకే అన్నది రానా పాలసీ. ఎప్పటికీ నా పాలసీ ఇదే అంటున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో విజయ ప్రవీణ పరుచూరి నిర్మించిన ‘కేరాఫ్ కంచెరపాలెం’ నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు రానా. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రానాతో చిట్ చాట్. ► ఇప్పుడు మీ వయసుకి తగ్గ ఫిజిక్‌తో స్లిమ్‌గా ఉన్నారు.. భల్లాలదేవ పాత్ర కోసం పెంచిన ఫిజిక్‌ని కొంచెం కొంచెంగా తగ్గించినట్లున్నారు? యస్. నిజానికి క్యారెక్టర్స్ కోసం బరువు పెరగడం వల్ల ఇన్ని రోజులూ వయసుకి మించి కనిపించాను. అందరూ అదే అనేవారు. కానీ అలా అనిపించుకోవడం బాగానే అనిపించేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ తెచ్చే పేరు మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు బరువు తగ్గాక వయసుకి తగ్గట్టుగా యంగ్‌గా కనిపిస్తున్నావు అంటుంటే.. ఇది కూడా బాగానే అనిపిస్తోంది (నవ్వుతూ). ► ‘కేరాఫ్ కంచెరపాలెం’ అంటూ ఓ బజ్ క్రియేట్ చేశారు. ఆ సినిమా గురించి ఎలా తెలిసింది? నాన్న (రానా తండ్రి, నిర్మాత డి. సురేష్‌బాబు) చెబితే తెలిసింది. ‘ఆ సినిమా చూడ్రా... చాలా బాగుంది’ అన్నారు. చూసి, ఆశ్చర్యపోయాను. అసలు ఇలాంటి సినిమా చూడలేదు. ప్రేక్షకులకు మంచి ఫీల్‌నిచ్చే సినిమా అవుతుంది. అందుకే మేం ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నాం. ఒక పెద్ద బ్యాకింగ్ ఉంటే ఇలాంటి సినిమాలు వెలుగులోకి వస్తాయి. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్‌రెడ్డి, మహానటి చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘మంచి చిత్రాలకు ఇదే మంచి సమయం’ అనిపించింది. ‘కంచెరపాలెం’తో కనెక్ట్ అవ్వడానికి ఇది ముఖ్య కారణం. ► ‘కంచెరపాలెం’ గొప్పతనం ఏంటి? జీవితాలను చూపించే సినిమా. వైజాగ్ సమీపంలో ఉన్న కంచెరపాలెంలో జరిగే కథ. అందులో నలభై ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి ఉంటాడు. జనరల్‌గా చిన్న చిన్న ఊళ్లల్లో అలాంటి వ్యక్తులు ఉంటే అందరూ అతని గురించే మాట్లాడుకుంటారు. ఆ మాటల్లోంచి పుట్టే కథ, ఇతర సంఘటనలు.. వీటితో ‘కేరాఫ్ కంచెరపాలెం’ చాలా న్యాచురల్‌గా సాగుతుంది. సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. మన కళ్లెదుట నిజంగా జరుగుతున్న కథేమో అన్నంత రియలిస్టిక్‌గా ఉంటుంది. నిర్మాత విజయ ప్రవీణ, దర్శకుడు మహా వెంకటేశ్ మంచి ప్రయత్నం చేశారు. ► మరి.. మీకూ ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరూ చేయొచ్చు కదా? విజయ, వెంకటేష్ పూర్తిగా కొత్తవాళ్లు కాబట్టి ఈ సినిమా తీశారు. అదే మాలాంటివాళ్లం అయితే కంచెరపాలెం సెట్, స్టార్ క్యాస్టింగ్ అంటూ చాలా హడావిడి చేసేస్తాం. అప్పుడు న్యాచురాల్టీ మిస్సవుతుంది. వీళ్లు కంచెరపాలెంకి వెళ్లి అక్కడే మొత్తం సినిమా తీశారు. బేసిక్‌గా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వాలనే తపన ఉంది కాబట్టే, మా బేనర్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్‌తో ఎవరు సినిమా తీయాలనుకున్నా మేం ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ► కంచెరపాలెంలో ఉండేవాళ్లనే ఈ సినిమాలో నటింపజేశారు. మీరు రషెస్ చూశారు కాబట్టి వాళ్ల నటన ఎలా అనిపించింది? మామూలుగా మనం ఏ సినిమా చూసినా ఫలానా ఆర్టిస్ట్ ఆ సినిమాలో ఉన్నాడనీ ఇలా మాట్లాడుకుంటాం కదా. ఈ సినిమాలో ఒక్క ఆర్టిస్ట్‌ని కూడా అలా చెప్పలేం. స్క్రీన్‌కి అలవాటుపడనివాళ్లు. ఈ కథ రాసుకున్నాక వెంకట్ కంచెరపాలెం వెళ్లి, కథలో ఉన్న క్యారెక్టర్స్‌కి తగ్గవాళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ బ్రహ్మాండంగా నటించారు. ► ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి మీరే మాట్లాడారు. నటించినవాళ్లను వెలుగులోకి తీసుకు రాలేదే? ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో చూపిస్తాం. విచిత్రం ఏంటంటే.. ఇందులో నటించినవాళ్లెవరూ ఇప్పుడు వాళ్లలా లేరు. సినిమా నిర్మాణం దాదాపు రెండు మూడేళ్లు జరిగిందనుకున్నాం. ఏడేళ్ల వయసున్నవాళ్లకి ఇప్పుడు పదేళ్లు వచ్చాయి. ఎదిగే వయసులో రూపు రేఖలు మారుతుంటాయి కదా. అలాగే పెద్ద వయసున్నవాళ్లు ఈ సినిమా కోసం గడ్డం పెంచారు. సినిమా అయిపోయింది కాబట్టి తీసేశారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ► ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’... ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని సినిమాలు చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో వెళుతున్నారా? ఎగ్జాట్లీ. ‘నేను హీరోని’ అనిపించుకునేకన్నా ‘నేను నటుడ్ని’ అనిపించుకోవడంలోనే నాకు ఎగై్జట్‌మెంట్ ఉంటుంది. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉన్న కథల్లో నటిస్తే అలా అనిపించుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ‘బాహుబలి’ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. ‘ఘాజి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా డిఫరెంట్ మూవీస్. ముందు ముందు కూడా ఇలాంటివే చేస్తాను తప్ప రూట్ మార్చను. నటుడిగా నేను శాటిస్ఫై అవ్వడం నాకు ముఖ్యం. ► ప్రస్తుతం చేస్తున్న ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’, ‘యన్.టి.ఆర్.’ బయోపిక్ గురించి? కేరళలో వరదల కారణంగా ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’కి బ్రేక్ పడింది. ‘హాథీ....’ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీ. కేరళలో ఉన్నటువంటి దట్టమైన అడవులు దాదాపు ఎక్కడా ఉండవు. ఇప్పుడు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ‘1945’ కోసం కేరళలో వేసిన పెద్ద సెట్ వరదల కారణంగా ఎఫెక్ట్ అయింది. ఆ విధంగా ఈ రెండు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఈలోపు ‘యన్.టి.ఆర్’ సినిమా ముగించేస్తా. -
కేరాఫ్ కంచరపాలెం ట్రైలర్ .. ప్రముఖుల ప్రశంసలు
-
విశాఖ జిల్లా కంచరపాలెం బ్యాంక్ దోపిడికి యత్నం
-
దివీస్ లేబోరేటరీస్ వద్ద ఆందోళన
భీమిలి: విశాఖ జిల్లా భీమిలి మండలం సిటీ నగర్‌లోని దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ముందు కంచేరుపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. దివిస్ లేబోరేటరీస్ ఇక్కడ మూడో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భీమిలి పంచాయతీ పరిధిలోని కంచేరుపాలెం గ్రామాన్ని ఖాళీ చేయాలని స్థానికులను కంపెనీ కోరుతోంది. ఒక్కో ఇంటికి పరిహారంగా రూ. 27 లక్షలు ఇస్తామని మధ్యవర్తులుగా టీడీపీ నాయకులను రంగంలోకి దింపింది. అయితే, తాము ఖాళీ చేసేది లేదంటూ గ్రామంలోని 200 కుటుంబాల వారు సోమవారం దివిస్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. కంపెనీకి చెందిన రెండు యూనిట్లతో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని, మూడో యూనిట్ వస్తే తాము ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు మండిపడ్డారు.