
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్‌కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్‌పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్‌కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్‌పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా ఎస్‌పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్‌తో భాగస్వామి అవడం ఎస్‌పీ మ్యూజిక్‌కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్‌కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్‌తో ఎస్‌పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్‌గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్‌గా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment