'ఓ నార‌ప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నార‌ప్ప'.. | Ooo Narappa Lyrical Video Song From Narappa Movie Released | Sakshi
Sakshi News home page

‘నారప్ప’ నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్‌ రిలీజ్‌

Published Sat, Jul 17 2021 11:31 AM | Last Updated on Sat, Jul 17 2021 12:35 PM

Ooo Narappa Lyrical Video Song From Narappa Movie Released - Sakshi

విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడదులైన నారప్ప ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ నార‌ప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప..నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్‌ చేశారు.ఇందులో వెంకటేశ్‌ యువకుడిలా కనిపిస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన ప్రియమణి నటించారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement