Venkatesh Narappa Release Postponed: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది - Sakshi
Sakshi News home page

Narappa Movie: వెంకటేష్‌ 'నారప్ప' రిలీజ్‌ వాయిదా

Published Thu, Apr 29 2021 12:12 PM | Last Updated on Thu, Apr 29 2021 1:33 PM

Venkatesh Narappa Movie Postponed Annopunces Suresh Productions - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ సినీ పరిశ్రమపై గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య 'లవ్‌ స్టోరీ', దగ్గుబాటి రానా 'విరాటపర్వం', చిరంజీవి ఆచార్య వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా విక్టరీ వెంకటేష్‌ నటించిన నారప్ప సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు చక్కదిద్దుకోగానే అతి త్వరలో సినిమాను రిలీజ్‌ చేస్తామని ప్రకటిస్తూ ఓ పోస్టును షేర్‌ చేశారు. సురేష్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్‌ హిట్‌ అసురన్‌కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేస్తామని చిత్రయూనిట్‌ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. 

చదవండి: సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ : సమ్మర్‌ సినిమాలన్ని వాయిదా
ఓటీటీలో తక్కువ ధర పలికిన అనసూయ సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement