![Narappa Ammu Abhirami: Interesting And Rare Facts In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/20/Ammu-Abhirami.jpg.webp?itok=8zuNFtVd)
Narappa Movie Actress Ammu Abhirami: తెలుగులో పెద్ద సినిమా రిలీజై నెలలు గడుస్తోంది. అడపాదడపా చిన్న, మధ్య తరహా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతుండగా తాజాగా ఓ భారీ చిత్రం కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన నారప్ప సినిమా నేటి(జూలై 20) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్‌కు రీమేక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసురన్‌లో మరియమ్మలా, నారప్పలో కన్నమ్మలా ఇద్దరు హీరోలతో ఆడిపాడిన ఈ నటి అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ నటి ఎవరంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
'నారప్ప' సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా కనిపించే ఈమె పేరు అమ్ము అభిరామి. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన విజయ్ 'భైరవ' సినిమాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. ఆ మరుసటి ఏడాది తమిళ 'రాచ్చసన్', తెలుగు 'రాక్షసుడు' చిత్రాల్లో హీరో మేనకోడలి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఎఫ్‌సీయూకే(ఫాదర్ ఆఫ్ చిట్టి ఉమా కార్తీక్)లోనూ ఉమ పాత్రలో అలరించింది. చూస్తుంటే అమ్మూకు టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మణిరత్నం తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment