ఒరిజినల్ కథ అయినా, రీమేక్ కంటెంట్ అయినా హీరో వెంకటేశ్ విజృంభిస్తాడు. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు కనులవిందు చేస్తాడు. ఇటీవలే వచ్చిన నారప్పలోనూ అమోఘంగా నటించి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు వెంకీ మామ. అయితే ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న సమయంలో పెద్ద సినిమా నారప్ప ఓటీటీలో రిలీజై అందరికీ షాకిచ్చింది.
అయితే ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నారప్ప ఓటీటీలో రిలీజ్ చేశామని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు సురేశ్‌బాబు, కలైపులి థాను మీడియాకు వెల్లడించారు. ఇదలా వుంచితే ఇంతకీ అమెజాన్ ప్రైమ్ నారప్ప సినిమాను ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంది? నిర్మాతలకు ఎంత లాభం దక్కిందన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
తమిళ అసురన్‌కు రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది సుమారు రూ.40 కోట్లు ముట్టజెప్పి ఈ సినిమాను సొంతం చేసుకుందట. దీని ప్రకారం ఈ డీల్ ద్వారా నిర్మాతలకు సుమారు రూ.17 కోట్ల మేర లాభం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సురేశ్‌బాబు వెంకటేశ్ నటించిన మరో రీమేక్ దృశ్యం 2ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇది కూడా ఓటీటీలోనే వస్తుందా? లేదా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment