believe
-
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు
ప్రపంచం భారతదేశాన్ని వీరుల భూమి అని గుర్తించింది. ఇక్కడి చరిత్ర మహా వీరోచితులైన రాజులతో పునీతమైంది. చంద్ర గుప్త మౌర్య, అశోక ది గ్రేట్, పృథ్వీ రాజ్ చౌహాన్.. ఇలా వీరంతా భరతమాత ఖ్యాతిని ప్రపంచమంతటా చాటారు. వీరంతా వారి హయాంలో ఎన్నో వీరోచిత పోరాటాలు సాగించారు. అవి చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ రాజుల కీర్తి పతాక భారతదేశానికే పరిమితం కాలేదు. విదేశాలలోనూ వీరిపేరు మారుమోగింది. అలాంటి ఐదుగురు హిందూరాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పృథ్వీ రాజ్ చౌహాన్ పృథ్వీ రాజ్ చౌహాన్ భారతదేశంలోని ప్రముఖ చౌహాన్ రాజవంశానికి చెందిన హిందూ రాజు. పృథ్వీ రాజ్ చౌహాన్ అజ్మీర్, ఢిల్లీలను పాలించాడు. అతని హయాంలోనే భారతదేశంపై మొఘల్ పాలకుల దాడి జరిగింది. పృథ్వీ రాజ్ చౌహాన్ ఎంతో ధైర్యవంతుడని, అతను 13 సంవత్సరాల వయస్సులో యుద్ధంలో గుజరాత్ రాజు భీమ్‌దేవ్‌ను ఓడించాడని చెబుతారు. పృథ్వీ రాజ్ చౌహాన్‌కు 6 భాషలు తెలుసు. యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి 17 సార్లు ఓటమి రుచి చూపించాడు. కానీ 1192 సంవత్సరంలో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ.. కన్నౌజ్ రాజు జయచంద్రతో కలిసి పృథ్వీ రాజ్, అతని స్నేహితుడు చంద్బర్దాయిని బంధించి చంపాడు. అలగ్జాండర్‌లో పోటీపడిన పోరస్ భారతదేశంలోని గొప్ప హిందూ రాజుల పేర్లలో పోరస్ పేరు కూడా వినిపిస్తుంది. పోరస్ సింధు రాజు. అతను అలెగ్జాండర్‌తో ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా అతని ధైర్యం ముందు తలవంచాడు. కింగ్ పోరస్ సామ్రాజ్యం సింధు నది నుండి చీనాబ్ నది వరకు విస్తరించింది. పోరస్ ది గ్రేట్.. అలెగ్జాండర్ మధ్య హైడాస్పెస్ యుద్ధం (క్రీ.పూ. 326) జరిగింది. రాజు పోరస్ క్రీస్తుపూర్వం 321- 315 మధ్య మరణించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నప్పటికీ, అతని మరణానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ఎటువంటి ఆధారాలు లేవు. అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి సాహసం గురించి తెలియనివారెవరూ ఉండరు. అశోకుడు మహా యోధుడు. అయితే భీకర కళింగ యుద్ధం అతనికి వినయ మార్గాన్ని కూడా చూపింది. ఈ యుద్ధం అనంతరం అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. శాంతి వైపు మళ్లాడు. కళింగ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించారని చెబుతారు. అశోక చక్రవర్తి సామ్రాజ్యం ఉత్తరాన హిందూకుష్ నుండి దక్షిణాన గోదావరి వరకు అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు విస్తరించింది. మహారాణా ప్రతాప్ మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలిసిందే. మహారాణా ప్రతాప్ మేవార్ రాచరిక పాలన సాగిస్తున్న సమయంలో అక్బర్ ఢిల్లీని పరిపాలించేవాడు. అక్బర్ కొన్ని మార్గాల ద్వారా మేవార్ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రతీసారి విఫలమవుతూ వచ్చాడు. మహారాణా ప్రతాప్ 72 కిలోల కవచాన్ని ధరించేవాడని, అతను వినియోగించే ఈటె 81 కిలోల బరువు కలిగినదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వీర శివాజీ శివాజీ పరాక్రమానికి మారుపేరు. వీర శివాజీ పరాక్రమం ముందు మొఘలులు తలవంచారు. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. తల్లి పేరు జీజాబాయి. శివాజీ తన సంరక్షకులు దాదాజీ కొండదేవ్, జీజాబాయి, సమర్థ గురు రాందాస్ పర్యవేక్షణలో పెరిగాడని చెబుతారు. శివాజీ సైన్యంలో ముస్లిం యోధులు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ తన యుద్ధాలలో గెరిల్లా యుద్ధ విధానాన్ని అవలంబించాడు. ఈ వ్యూహంతోనే శివాజీ అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫిలడెల్ఫియా ఫుట్‌పాత్‌లపై డ్రగ్స్ బానిసల వికృత చేష్టలు! -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
'నారప్ప'తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్
Suresh Productions Music: "నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. పారిస్‌కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్పీ మ్యూజిక్ జత కట్టింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప సినిమాలోని సంగీతాన్ని వరల్డ్ మ్యూజిక్ డయాస్‌పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'సౌత్ బే'తోనూ జట్టు కట్టింది. ఇప్పుడు తాజాగా బిలీవ్, ఎస్పీ మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ సంగీత ప్రపంచానికి కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఎస్పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. 'బిలీవ్తో భాగస్వామి అవడం ఎస్పీ మ్యూజిక్కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్కు ఉన్న ప్రపంచస్థాయి నెట్ వర్క్‌తో ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులకు చేరువవుతుందని ఆశిస్తున్నాం. నారప్పతో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా' అన్నారు. బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్‌గా భాగస్వామి అవడం ఎగ్జైటింగ్‌గా ఉందన్నాడు. -
ఆ శక్తులపై విజయం సాధిస్తాం
గువాహటి: భారత్‌లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
తగని ప్రశ్న తగిన జవాబు
‘నేను ఫెమినిస్టును కాదు’ అంటున్నారు. కానీ స్త్రీ, పురుష సమానత్వం ఉండాలంటున్నారు! ఫెమినిజం, సమానత్వం రెండూ ఒకటే కదా! త్రిష : ఎస్! నేను ఫెమినిస్టును కాదు. ఫెమినిజం అనే భావన విస్తృతమైనది. ‘సమానత్వం’ అనే అర్థంతో ఫెమినిజం అనే మాటను సరిపెట్టేయలేం. ఫెమినిస్టులు ఒక్క సమానత్వం గురించే మాట్లాడరు. వాళ్లు చాలా చేస్తారు. అసమానత్వాన్ని ప్రశ్నిస్తారు. బయటికి వచ్చి పోరాడతారు. స్త్రీల సమస్యలపై, స్త్రీల సంక్షేమంపై, స్త్రీల భద్రతపై సామాజిక, రాజకీయ, సృజనాత్మక వేదికలపై ప్రసంగిస్తారు. ఉద్యమాలు చేస్తారు. మగవాళ్లలో స్త్రీల సమస్యలపై సహానుభూతిని కలిగిస్తారు. నేను ఇవన్నీ చేయడం లేదు. కాబట్టి ఫెమినిస్టును కాదు. స్త్రీ, పురుష సమానత్వం ఆశిస్తున్న ఒక సాధారణ మహిళను. అంతే. త్రిష నటించిన హారర్ థ్రిల్లర్ ‘మోహిని’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఆ చిత్రం ప్రోమో కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో త్రిష వెలిబుచ్చిన అభిప్రాయాలివి. -
''సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తా..''
బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ ఏం చెప్పినా అభిమానులకు సెక్సీగానే ఉంటుంది. ఒకప్పుడు అడల్ట్ స్టార్ గా ఉన్న సన్నీ లియోన్.. బాలీవుడ్ స్టార్ గా మారిపోవడమే కాదు ఇటీవల కొన్ని యాడ్స్ లోనూ తనదైన రీతిలో ప్రచారం చేస్తోంది. అవాంఛిత గర్భం నుంచి తప్పించుకొనేందుకు, లైంగిక వ్యాధులు నిరోధించేందుకు, కండోమ్ ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరమంటూ.. సురక్షిత సెక్స్ పై సన్నీ లియోన్ ఫ్యాన్స్ లో స్ఫూర్తిని నింపుతోంది. సురక్షిత సెక్స్ పై నాకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే నేను కండోమ్ బ్రాండ్ ప్రకటనను ఎంచుకున్నానని సన్నీలియోన్ చెప్తోంది. ప్రముఖ కండోమ్ బ్రాండ్ ప్రమోషన్ కు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చినవారిలో సన్నీలియోన్ ఒకరు. అవాంఛితన గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్ ను ఉపయోగించమని ఆమె తన అభిమానులను అభ్యర్థిస్తోంది. అంతేకాదు.. తాను సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెప్తోంది. కొందరు ఏ కేటగిరీ నటీమణులు కండోమ్స్ ను ప్రోత్సహించరెందుకని అడిగి ప్రశ్నకు.. అది వారి వ్యక్తిగత సౌకర్యం, స్థాయిలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొందరు జీవితంలో ఎదగాల్సిన పరిస్థితులు, వారి గోల్స్ కు సంబంధించి కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయని సన్నీ చెప్పింది. ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని చిత్రించి, తాను స్వయంగా నటించిన ఓ ప్రత్యేక బికినీ క్యాలెండర్ ను సన్నీ లియోన్ ప్రారంభించిన సందర్భంలో సురక్షిత సెక్స్ పై ఆమె సదరు వ్యాఖ్యలు చేసింది. -
నెయ్యితో బరువు తగ్గొచ్చు..!
నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో కొవ్వు పెరిగిపోతుందని భయపడతాం. శరీర బరువు తగ్గించుకోవాలన్నపుడు భోజనంలో నెయ్యి వాడకం మానేస్తాం. అలాగే నెయ్యితో తయారు చేసే స్వీట్లు, వంటకాలకు దూరంగా ఉంటాం. అయితే నెయ్యి తినడం వల్ల బరువు తగ్గుతారంటే నమ్ముతారా? అవును ఇది నజంగానే అధిక క్యాలరీలు కలిగిన పదార్థమే అయినా... నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడ ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలోనూ విరివిగా వాడే నెయ్యి వల్ల బరువు తగ్గుతారని, దీనికి తోడు అనేక ప్రయోజనాలు కూడ ఉన్నాయని చెప్తున్నారు. నెయ్యిని రోజువారీ ఆహరంలో వినియోగించి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొబ్బరి, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే నెయ్యి కూడ కలిగి ఉంటుందంటున్నారు. కొద్దిపాటి ఆమ్లాలు కలిగిన కొవ్వు మాత్రమే కలిగి ఉండే నెయ్యిని... కాలేయం స్వయంగా కరిగించుకొని.. శరీరానికి మంచి శక్తినిస్తుందని చెప్తున్నారు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడంవల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలకు దూరం కావొచ్చని, నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ ఆమ్లం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు. నెయ్యిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం, అలాగే ఒమేగా-3 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. అంతేకాక నెయ్యి మాయిశ్చురైజర్ గా కూడ ఉపయోగ పడుతుంది. పొడిచర్మంతో బాధపడేవారికి, పెదాలు పగిలిపోయే సమస్య ఉన్నవారికి నెయ్యి సహకరించి మృదుత్వాన్ని చేకూరుస్తుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు మందుగా కూడ నెయ్యి ఉపకరిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నెయ్యిలో ఉండే బటిరిక్ ఆమ్లాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కడుపులో ఉండే గ్యాస్ ను బయటకు పంపించి, జీర్ణశక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శరీరంలోని శక్తిహీనతను తగ్గించి కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని రక్షిస్తూ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు సహకరిస్తుంది. ఎ, డి, ఇ, కె, విటమిన్లను కూడ కలిగి ఉండే నెయ్యి... ప్రతిరోజూ భోజనంలో ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించడం కన్నా నెయ్యిని వినియోగించడం ఎంతో శ్రేయస్కరమంటున్నారు. సౌందర్య సాధనంగా కూడ నెయ్యిని వినియోగించవచ్చని, భారత మహిళలు పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా నెయ్యిని వినియోగిస్తారని, తల్లోని చర్మానికి పట్టిస్తే జుట్టు పెరుగుదలను కూడ మెరుగుపరుస్తుందని నమ్ముతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. -
వాళ్లు దేవుణ్ణి నమ్మడం లేదు..!
విత్తు ముందా? చెట్టు ముందా అన్నట్లుగానే ఆస్తిక వాదం, నాస్తిక వాదం మధ్య శతాబ్దాల తర్కం నడుస్తూనే ఉంది. విశ్వం పుట్టుకకు దేవుడు కారణమా? బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా? అన్నదానిపై ఎవరికి తోచిన వివరణ వారిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై యూరప్ ఐస్లాండ్ లో తాజాగా ఓ పోల్ నిర్వహించారు. నిజంగా ప్రపంచం పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మరోసారి చేశారు. ఐస్లాండ్ లోని ఎథికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ విశ్వం పుట్టుకపై సర్వే నిర్వహించింది. ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలుసుకునేందుకు ప్రశ్నల ద్వారా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 25 సంవత్సరాల వయసులోపు 93.9 శాతం మంది విశ్వం పుట్టుకకు బిగ్ బ్యాంగే కారణమని చెప్పగా... మిగిలిన ఆరు శాతం మంది తమకు తెలియదన్నారు. కాగా విశ్వం దేవుడి వల్లే పుట్టిందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. దీని ఆధారంగా స్థానిక రెక్జావిక్ వాసులు, యువత ఏ మతాన్నీ, దేవుణ్ణీ నమ్మడం లేదని తెలుస్తోందని ఐస్లాండ్ పత్రిక నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడి వారిలో 80.6 శాతం మందిలో అదీ 55 ఏళ్ళకు పైబడిన వారు అంతా క్రైస్తవులే ఉన్నారు. 11.8 శాతం మాత్రం నాస్తికులుగా చెప్పాలి. కాగా 25 సంవత్సరాలు... అంతకంటే చిన్న వ్యక్తుల్లో 40.5 శాతం మంది నాస్తికులు కాగా మిగిలిన 42 శాతంమంది క్రైస్తవులని తేలింది. అయితే ఇదే పోల్ పై పలు విమర్శలు కూడ వెల్లువెత్తాయి. ఓ రెడ్డిట్ యూజర్ (ఇంటర్నెట్ మొదటి పేజీ) ఈ పోల్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆరోపించారు. అసోసియేషన్ నిర్వహించిన సర్వే గందరగోళంగా ఉందని, అడిగిన ప్రశ్నల్లో క్లారిటీ లేదని అన్నారు. విశ్వం పుట్టుక గురించి మీరేమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, తెలియదు, ఇతరాలు అన్న ఆప్షన్లు ఇవ్వడంలో అర్థం లేదన్నారు. చాలామంది దేవుడే బిగ్ బ్యాంగ్ కూ కారణమని నమ్ముతారని, ఇతరములు అన్న సమాధానంలో వీటిలో ఏదీ కాక దేవుడే బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడన్న అర్థం కూడా వస్తుందని అన్నారు. మరికొంతమంది యూజర్లు.. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మొదట కాథలిక్ ప్రీస్ట్, భౌతిక శాస్త్రవేత్త జార్జిస్ లెమైట్రే నుంచి పుట్టిందన్నది వాస్తవమన్నారు. ఇలా ఎవరికి తోచిన వాదం వారు చేయగా.. అసలు విశ్వ పుట్టుక విషయం పక్కన పెడితే శాస్త్రీయ సిద్ధాంతాలకూ, దేవుడికీ పోలిక కుదరదని ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. -
'మా ఆయనంటే వందశాతం నమ్మకం'
లండన్: తన భర్త తప్పు చేసినా అతడిపై ఏ మాత్రం విశ్వాసం సన్నగిల్లలేదని ప్రముఖ హాలీవుడ్ సింగర్, మోడల్ కాతీ ప్రైస్ అంటోంది. అతడు ఎలాంటి పనులు చేసినా చివరికి తన వద్దకే వస్తాడని, తన ఇంటి చుట్టే తిరుగుతాడని, తానంటే అతడికి చెప్పలేనంత ప్రేమ అని చెప్తోంది. 38 సంవత్సరాల కాతీ ప్రైస్ వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన కైరాన్ హేలర్‌ను 2013లో వివాహం చేసుకుంది. అంతకుముందే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయి. పీటర్ ఆండ్రే అనే వ్యక్తిని ఆమె 2005లో వివాహం చేసుకోగా వారి దాంపత్యం 2009కే ముక్కలైంది. అనంతరం అలెక్స్ రైడ్ అనే వ్యక్తిని 2010లో వివాహం చేసుకోగా ఆ బంధం కూడా రెండేళ్లపాటే కొనసాగింది. దీంతో 2013లె ఆయు కైరాన్ హేలర్ ను వివాహం చేసుకుంది. అయితే, అతడు ఇటీవల కాతీ స్నేహితురాలైన జేన్ పాట్నీతో అతడు వివాహేతర సంబంధం పెట్టకొని రెడ్ హ్యాండెడ్‌గా కాతికి దొరికిపోయాడు. ఈ విషయం బయటకు తెలిసి నానా రకాలుగా విమర్శలు వచ్చాయి. అయితే, ఆ విమర్శలను పక్కకు పెడితే తన భర్తను వెనకేసుకొచ్చింది కాతీ. 'అందరూ కైరాన్ తప్పుచేశాడని, మోసగాడని, అబద్ధాల కోరని అంటున్నారు. కానీ నేను మాత్రం ఓ కరడుగట్టిన న్యాయమూర్తిలాంటిదాన్ని. అలాంటి విషయాలు పట్టించుకోను. అతడు ఏం మారిపోయాడో నాకే తెలుసు. అతడిని నేను వందశాతం నమ్ముతా' అంటూ కాతీ పేర్కొందని ఓ మ్యాగజైన్ తెలిపింది. తనను తాను తెలుసుకున్న కైరాన్ ప్రస్తుతం బుద్ధిగా ఉంటున్నాడని, తనకు తాను తన పిల్లలు తప్ప మరే లోకం లేదని ఆమె చెప్పినట్లు వివరించింది. -
'టైంపాస్ రొమాన్స్ నమ్ముతా'
ముంబయి: తాను టైంపాస్ రొమాన్స్‌ను నమ్ముతానని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటోంది. ఆమె నటిస్తున్న 'కట్టి భట్టి' చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఆ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మాత్రం ప్రేమ మీద, లివ్ ఇన్ రిలేషన్ షిప్ మీద నమ్మకం లేని పాత్ర తనదని, అయితే, నిజ జీవితంలో ఇందుకు విరుద్ధంగా ఉండటానికే ఇష్టపడతానని ఆమె చెప్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించి డేటింగ్‌కు వెళతారని, ఆ సమయంలో మాత్రం పెళ్లి ఆలోచన మనసులో ఉండదని, దాంతో అభిప్రాయ బేధాలు వస్తే ఎలాంటి బాధ లేకుండానే విడిపోవచ్చని చెప్పింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయంలో తన అభిప్రాయం చెప్పేటప్పుడు తాను చాలా ఓపెన్ గా ఉంటానని చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ తో టైంపాస్ అఫైర్ విషయంలో కూడా చాలా ఓపెన్ గా ఉంటానని, కలిసి చిత్రంలో నటిస్తున్నప్పుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంలో తప్పేముంటుందని అంటోంది ఈ అమ్మడు. -
నమ్మకానికి ప్రతిరూపంగా సేవలందిస్తాం
పోచమ్మమైదాన్ : వ్యాపారానికి పునాది నమ్మకం... దానికి ప్రతిరూపంగా సేవలందిస్తామని కంది గ్రూప్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో, కేయూ క్రాస్ రోడ్లో, కాజీపేటలోని ఫాతిమా కాంప్లెక్స్‌లో, వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో, హెడ్ పోస్టాఫీస్ సమీపంలో ఐదు కంది చిట్‌ఫండ్స్ బ్రాంచిలను శనివారం ఏకకాలంలో ప్రారంభించారు. పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో వరంగల్-1 బ్రాంచ్‌ను ఐసీఏఐ వరంగల్ చెర్మైన్, ప్రముఖ సీఏ పీవీ నారాయణరావు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ చిట్ ఫండ్స్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన, 20 ఏళ్ల అనుభవం ఉన్నవారి పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ కంది చిట్స్ అని అన్నారు. చిట్స్ యూక్షన్ తేదీ నుంచి 15 రోజుల్లో చిట్ డబ్బులు చెల్లిస్తూ... అందరి నమ్మకాన్ని కార్యరూపంలో నిజం చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఉన్నత ప్రమాణాలు, విలువలతో కూడిన సేవలను వరంగల్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందించేలా కంది చిట్‌ఫండ్స్ సంస్థలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిట్ మెంబర్ల సహాయ సహకారాలతోపాటు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ నారాయణరావు మాట్లాడుతూ కంది చిట్ ఫండ్స్ జిల్లా ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రే వూరి ప్రకాష్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఐరన్ అండ్ హార్డ్‌వేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దామోదర్, తెలంగాణ కాటన్ ఇండ్రస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త కంది రవీందర్‌రెడ్డి, కంది చిట్‌ఫండ్స్ సీఈఓ రమణారెడ్డి, తేజస్వీ స్కూల్ కారస్పాండెంట్ జెన్నారెడ్డి, మట్టెవాడ సీఐ శివరామయ్య, చిట్ ఫండ్ జీఎం, బీఎంలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకం: ‘తుమ్ము’ అపశకునమా!
జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో తుమ్ము గురించిన ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఒక వ్యక్తి వాతావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో వ్యక్తి కనుక తుమ్మితే... వాతావరణం సరిగ్గా లేదని, ఏవైనా ఉపద్రవాలు కూడా సంభవించవచ్చని నమ్ముతారు. ఇంత వింత ఎలా ఏర్పడిందనే దానికి నిదర్శనాలు లేవు! జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. ఇది చిన్న అనారోగ్య సూచన. దుమ్ము రేగి నాసికను తాకినా తుమ్ములొస్తాయి. ఇది ఓ క్రియకు ప్రతిస్పందన. అలాంటి తుమ్ముకీ మనిషి అదృష్టానికీ సంబంధం ఏమిటి? మనిషనేవాడికి తుమ్ములు రాక మానవు. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియ చుట్టూ అసహజమైన నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి నమ్మకాలా? మూఢనమ్మకాలా? బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఠక్కున ఆగిపోతారు కొందరు. కాసేపు ఆగి, మంచినీళ్లు తాగి కానీ కదలరు. అదేమిటంటే అపశకునం అంటారు. నిర్లక్ష్యం చేస్తే అదృష్టం టాటా చెప్పి వెళ్లిపోతుందని, దురదృష్టం దర్జాగా వచ్చి తిష్ట వేస్తుందని అంటారు. కొందరైతే ప్రాణాపాయం ఏర్పడుతుందని కూడా భయపడుతుంటారు. ఓ చిన్న తుమ్ముకి ఇన్ని జరుగుతాయా అంటే సమాధానం చెప్పరు. కానీ కచ్చితంగా ఏదో జరుగుతుందని మాత్రం నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంత? హిందూ మతస్తుల్లో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం మంచిది కాదు అనే నమ్మకం బలంగా ఉంది. అనారోగ్యం వల్ల వచ్చే తుమ్ములను ఎవరూ పట్టించుకోరు. కానీ బయటకు బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మాత్రం కంగారు పడిపోతారు. అపశకునమంటూ భయపడి పోతారు. అలాగే గడపకు అవతల ఒక కాలు, ఇవతల ఒక కాలు ఉన్నప్పుడు తుమ్మితే ఆయుక్షీణమంటారు. అయితే... ఇలా ఎందుకు అంటారు అన్నదానికి సశాస్త్రీయమైన ఆధారాలను మాత్రం ఎవరూ చూపించలేక పోతున్నారు. అలాగే బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి, అతడి నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊది ప్రాణం పోశాడు. దీన్ని బట్టి యూదుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. జీవం ఎలా అయితే ముక్కుద్వారా శరీరంలో ప్రవేశించిందో, అలాగే బయటకు పోతుందని వాళ్లు నమ్మేవారు. తుమ్మినప్పుడు వేగంగా బయటకు పోయే గాలితో పాటు శరీరంలోని జీవం బయటకు పోతుందని, అంటే ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్లేనని ఓ నమ్మకం వారిలో ప్రబలింది. ఈ నమ్మకం నుంచే, ఎవరైనా తుమ్మినప్పుడు ‘గీసుంథైత్’ అనడం మొదలైంది. అంటే ‘మంచి ఆరోగ్యం కలుగును గాక’ అని అర్థం. మనవాళ్లు కూడా ‘చిరంజీవ’ అంటారు కదా... అలా అన్నమాట! అయితే ఎలా వచ్చిందో కానీ... ఈ నమ్మకం మధ్యలోకి దెయ్యం వచ్చి చేరింది తరువాతి కాలంలో. తుమ్ముతో మనిషి ఆత్మ బయటకు పోతుందని, తద్వారా దురాత్మ (ప్రేతాత్మ?) వచ్చి శరీరంలో తిష్ట వేస్తుందని అనుకోవడం మొదలయ్యింది. అందుకే ఎవరైనా తుమ్మితే ‘గాడ్ బ్లెస్ యూ’ అనేవారు. నీ శరీరంలో దెయ్యం చేరకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పడమే ఆ దీవెన వెనుక ఉద్దేశం. ఈ నమ్మకం ఎంత బలంగా స్థిరపడిపోయిందంటే... చాలా దేశాల వారు ఎవరైనా వ్యక్తి తుమ్మితే, అతడి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసేవారట. దేవుడికి మొక్కులు మొక్కుకుని, బలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇదంతా నాగరికత తెలియని కాలంలోజరిగింది. కొన్నేళ్ల తరువాత జర్మన్లతో పాటు మరికొన్ని దేశాల వారు కూడా ఇది కేవలం ఓ మూఢ నమ్మకమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తుమ్ము కేవలం ఆరోగ్యానికి సంబంధించినదేనని, తుమ్మితే హెల్త్ చెకప్ చేయించుకోవాలే తప్ప అనవసరమైన భయాలకు పోకూడదని వివరించారు. అప్పట్నుంచి ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తుమ్ముని అపశకునంగా కాక, శారీరకంగా జరిగే అతి సాధారణ ప్రక్రియగా చూడటం మొదలైంది. కాలం గడిచేకొద్దీ తుమ్ము చుట్టూ ఉన్న అపనమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా వరకూ తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఈ నమ్మకం సజీవంగానే ఉంది! -
నమ్మకం: అరిష్టమా? అదృష్టమా?
మంచి నమ్మకం బలమవుతుంది. చెడు నమ్మకం ముదిరితే బలహీనతగా మారుతుంది. కానీ మనం నమ్మేది మంచిదో కాదో తెలుసుకోవడమే పెద్ద చిక్కు. ఎందుకంటే ప్రతి మనిషికీ తాను నమ్మేదే నిజమనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే అన్ని నమ్మకాలూ నిజాలు కావు. అలాంటి నిజం కాని నమ్మకమొకటి ఎన్నో యేళ్లుగా నల్లపిల్లి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. నల్లపిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుందని, నల్లపిల్లి ఇంట్లో ప్రవేశిస్తే దుష్టశక్తి ఇంట్లోకి వచ్చిందని అనుకోవడం వెనుక ఎంత నిజముంది? నల్లపిల్లి పేరు చెబితే వణికిపోయే దేశాలు చాలా ఉన్నాయి. అది కనుక ఎదురొస్తే మనమో లేదా మనవాళ్లెవరో మంచమెక్కుతారని, ప్రాణం కూడా పోవచ్చని వణికిపోతుంటారు పలు దేశాల వాళ్లు. కుక్క ఎదురు పడితే పోని ప్రాణం, పిల్లి ఎదురొస్తే పోవడమేమిటి అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే, దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు కాబట్టి! మొదట్లో నల్లపిల్లి కూడా అన్ని జంతువుల్లాంటిదే. కానీ మధ్య యుగంలో ఎలా మొదలైందో తెలీదు కానీ, నల్లపిల్లికి చెడుకాలం మొదలైంది. దుష్టశక్తుల్ని పారద్రోలడానికి, మేలును పొందడానికి నల్లపిల్లిని బలిచ్చే సంప్రదాయం మొదలైంది. అది కాస్తా తర్వాత అసలు నల్లపిల్లి అంటేనే దుష్టతకు నిలయమని, దుష్టశక్తులు దాని చుట్టూ తిరుగుతుంటాయని, అందువల్లే అది అపశకునమని, అపవిత్రమని నమ్మడం మొదలైంది. అయితే ఇలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. యూరోప్ దేశాల్లో నల్లపిల్లి భయం ఇప్పటికీ ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలో నల్లపిల్లి అంటే దురదృష్టమని, దుష్టశక్తి అని భావిస్తున్నారు. భారతదేశంలో కూడా నల్లపిల్ల వచ్చిందంటే ఇంట్లోకి దెయ్యం వచ్చినట్టేనని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఐర్లాండ్ వారికయితే నల్లపిల్లి అంటే అస్సలు గిట్టదు. వారు దాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడరు. చూశారా, ఏదో అరిష్టం జరుగుతుందని కంగారు పడిపోతారు. పొరపాటున తమ చేతుల్లో గానీ, తమ పెరట్లో కానీ నల్లపిల్లి చచ్చిపోతే, పదిహేడేళ్ల పాటు శని వెంటాడుతుందని భావిస్తారు వారు. అయితే నల్లపిల్లిని అదృష్ట దేవతగా కొలిచేవారు కూడా ఉన్నారు. వారిలో ఈజిప్షియన్లు ప్రథములు. వారు పూజించే ‘బస్త్’ అనే దేవత మనిషి శరీరంతో, నల్లపిల్లి తలతో ఉంటుంది. అందుకే వారికి నల్లపిల్లి ఎంతో పవిత్రమైనది. ఆ దేశంలో నల్లపిల్లిని చంపితే మరణశిక్షను విధించాలనే చట్టం కూడా మొదట్లో ఉండేది. ఆధునిక చట్టాలు వచ్చాక దాన్ని పాటించడం మానేశారు. అంతేకాదు, సూర్యకిరణాలు నల్లపిల్లి కళ్లలో నిక్షిప్తమై ఉంటాయని, అందుకే అవి మెరుస్తుంటాయని భావిస్తారు వారు. యూకేలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నల్లపిల్లి ఎదురొస్తే శుభం చేకూరుతుందని విశ్వ సిస్తారు. బ్రిటన్ చక్రవర్తి చార్లెస్ 1 దగ్గర ఓ నల్ల పిల్లి ఉండేదట. అది చనిపోతే, తన అదృష్టమంతా పోయిందని బాధపడ్డాడాయన. ఆ తర్వాత రోజే రాజ్యాన్ని కోల్పోవడమే కాక, జైలు పాలయ్యాడు కూడా. అప్పట్నుంచే బ్రిటన్‌లో ఈ నమ్మక పెరిగిందని అంటారు. స్కాట్లాండ్ వారికి కూడా నల్లపిల్లి శుభసూచకం. తెల్లవారు జామున దాన్ని చూస్తే మరీ మంచిదని అనుకుంటారు వారు. బహుశా ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాతే నల్లపిల్లి అదృష్టం తెచ్చిపెడుతుందని అంతా నమ్మి ఉంటారు. మరి ఏం చూసి అది అరిష్టం తెచ్చిపెడుతుందని యూరోపియన్ దేశాల్లో నమ్ముతున్నారు? అలా నమ్మడానికి బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అయినా ఒకే విషయం ఒకరికి అదృష్టాన్ని, ఒకరికి దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతోంది? వీటన్నిటికీ సమాధానం దొరికిన రోజు గానీ ఇది నమ్మకమో మూఢనమ్మకమో అర్థం కాదు! -
న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించండి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా న్యాయవాదుల ప్రవర్తన, న్యాయమూర్తుల తీర్పు వుండాలని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహ్మద్ జఫ్రుల్లాఖాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదేశాలు మేరకు తిరువళ్లూరు జిల్లా కోర్టు ఆవరణలో మోగా లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి జఫ్రుల్లాఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం కలిగేలా న్యాయవ్యవస్థ ఉండాలని కోరారు. దీంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వాది ప్రతివాదులతో కోర్టు ఆవరణం క్రిక్కరిసింది. లోక్‌అదాలత్‌లో చాలాకాలం పాటు పెండింగ్‌లో వున్న కేసులను విచారించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా వాహనాలను నడిపిన, సారాయిని ఆక్రమంగా విక్రయించిన కేసులు, విడాకుల కేసులు, ప్రమాదపు కేసులను పరిష్కరించారు. లోక్ అదాలత్ వలన జిల్లా వ్యాప్తంగా పేరుకుపోతున్న కేసుల సంఖ్య తగ్గే అవకాశం వుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి మురుగన్, శాంతి, యశ్వంత్‌రావు ఇంగర్సాల్, తమిళ్స్రితో పాటు న్యాయవాదులు రామ్‌కుమార్, శాంతకుమార్, పరిపూర్ణంతో పాటు పలువురు న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.