ప్రపంచం భారతదేశాన్ని వీరుల భూమి అని గుర్తించింది. ఇక్కడి చరిత్ర మహా వీరోచితులైన రాజులతో పునీతమైంది. చంద్ర గుప్త మౌర్య, అశోక ది గ్రేట్, పృథ్వీ రాజ్ చౌహాన్.. ఇలా వీరంతా భరతమాత ఖ్యాతిని ప్రపంచమంతటా చాటారు. వీరంతా వారి హయాంలో ఎన్నో వీరోచిత పోరాటాలు సాగించారు. అవి చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ రాజుల కీర్తి పతాక భారతదేశానికే పరిమితం కాలేదు. విదేశాలలోనూ వీరిపేరు మారుమోగింది. అలాంటి ఐదుగురు హిందూరాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పృథ్వీ రాజ్ చౌహాన్
పృథ్వీ రాజ్ చౌహాన్ భారతదేశంలోని ప్రముఖ చౌహాన్ రాజవంశానికి చెందిన హిందూ రాజు. పృథ్వీ రాజ్ చౌహాన్ అజ్మీర్, ఢిల్లీలను పాలించాడు. అతని హయాంలోనే భారతదేశంపై మొఘల్ పాలకుల దాడి జరిగింది. పృథ్వీ రాజ్ చౌహాన్ ఎంతో ధైర్యవంతుడని, అతను 13 సంవత్సరాల వయస్సులో యుద్ధంలో గుజరాత్ రాజు భీమ్‌దేవ్‌ను ఓడించాడని చెబుతారు. పృథ్వీ రాజ్ చౌహాన్‌కు 6 భాషలు తెలుసు. యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి 17 సార్లు ఓటమి రుచి చూపించాడు. కానీ 1192 సంవత్సరంలో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ.. కన్నౌజ్ రాజు జయచంద్రతో కలిసి పృథ్వీ రాజ్, అతని స్నేహితుడు చంద్‌బర్దాయిని బంధించి చంపాడు.
అలగ్జాండర్‌లో పోటీపడిన పోరస్
భారతదేశంలోని గొప్ప హిందూ రాజుల పేర్లలో పోరస్ పేరు కూడా వినిపిస్తుంది. పోరస్ సింధు రాజు. అతను అలెగ్జాండర్‌తో ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా అతని ధైర్యం ముందు తలవంచాడు. కింగ్ పోరస్ సామ్రాజ్యం సింధు నది నుండి చీనాబ్ నది వరకు విస్తరించింది. పోరస్ ది గ్రేట్.. అలెగ్జాండర్ మధ్య హైడాస్పెస్ యుద్ధం (క్రీ.పూ. 326) జరిగింది. రాజు పోరస్ క్రీస్తుపూర్వం 321- 315 మధ్య మరణించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నప్పటికీ, అతని మరణానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ఎటువంటి ఆధారాలు లేవు.
అశోక చక్రవర్తి
అశోక చక్రవర్తి సాహసం గురించి తెలియనివారెవరూ ఉండరు. అశోకుడు మహా యోధుడు. అయితే భీకర కళింగ యుద్ధం అతనికి వినయ మార్గాన్ని కూడా చూపింది. ఈ యుద్ధం అనంతరం అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. శాంతి వైపు మళ్లాడు. కళింగ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించారని చెబుతారు. అశోక చక్రవర్తి సామ్రాజ్యం ఉత్తరాన హిందూకుష్ నుండి దక్షిణాన గోదావరి వరకు అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు విస్తరించింది.
మహారాణా ప్రతాప్
మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలిసిందే. మహారాణా ప్రతాప్ మేవార్ రాచరిక పాలన సాగిస్తున్న సమయంలో అక్బర్ ఢిల్లీని పరిపాలించేవాడు. అక్బర్ కొన్ని మార్గాల ద్వారా మేవార్‌ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రతీసారి విఫలమవుతూ వచ్చాడు. మహారాణా ప్రతాప్ 72 కిలోల కవచాన్ని ధరించేవాడని, అతను వినియోగించే ఈటె 81 కిలోల బరువు కలిగినదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
వీర శివాజీ
శివాజీ పరాక్రమానికి మారుపేరు. వీర శివాజీ పరాక్రమం ముందు మొఘలులు తలవంచారు. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. తల్లి పేరు జీజాబాయి. శివాజీ తన సంరక్షకులు దాదాజీ కొండదేవ్, జీజాబాయి, సమర్థ గురు రాందాస్ పర్యవేక్షణలో పెరిగాడని చెబుతారు. శివాజీ సైన్యంలో ముస్లిం యోధులు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ తన యుద్ధాలలో గెరిల్లా యుద్ధ విధానాన్ని అవలంబించాడు. ఈ వ్యూహంతోనే శివాజీ అనేక యుద్ధాలలో విజయం సాధించాడు.
ఇది కూడా చదవండి: ఫిలడెల్ఫియా ఫుట్‌పాత్‌లపై డ్రగ్స్ బానిసల వికృత చేష్టలు!
Comments
Please login to add a commentAdd a comment