Kings
-
ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!
మన చరిత్రలో ఘనకీర్తీ పొందిన ఎందరో గొప్ప గొప్ప రాజులను చూశాం. కొందరూ రాజుల ధైర్య సాహసాలు విన్నా..తలుచుకున్న ఒళ్లు పులకరించిపోతుంది. మనం కూడా అలానే ఉండాలనే ఫీల్ కలుగుతుంది. అంతటి మహమహా రాజుల తోపాటు కొందరూ విచిత్రమైన నియంత రాజులను కూడా ప్రజలు భరించారు. అయితే కొందరు రాజుల విచిత్ర నమ్మకాలు, భయాలు చూస్తే..వీళ్లేం కింగ్స్ రా బాబు అనుకుంటారు. ఆ విలక్షణమైన రాజులెవరంటే..?ఇంగ్లాండ్ రాజు జార్జ్ IIIఇతన్ని పాలనకు అనర్హుడిగా చరిత్రకారులు పేర్కొంటారు. అత్యంత వేగవంతంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి ఒక విధమైన నురుగ వస్తుంటుంది. దీంతో అతడి చెప్పే మాటలో స్పష్టత కానరాక సేవకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవారు. అతడు ప్రతిదానికి నిరుత్సాహమే చూపిస్తాడు. అప్పుడప్పుడూ మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే అతనికి కొన్ని విచిత్రమైన బ్రాంతులు కూడా ఉన్నాయి. ఒక రోజు ఓక్ చెట్టుతో కరచాలనం చేసేందుకు యత్నించి నవ్వులు పాలయ్యాడు కూడా. చివరి అతడి వింత ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు, మంత్రులు ఆ రాజు స్థానంలో అతడి కుమారుడు జార్జ్ IVకి రాజ్యధికారాన్ని అప్పగించారు. ఫ్రాన్స్ చార్లెస్ VIఈ రాజు మరింత విచిత్రంగా ఉంటాడు. తన శరీరం గాజుతో తయారయ్యిందని అందుకే పెళుసుగా ఉందని భావిస్తుంటాడు. పైగా ఇది ఏ క్షణమైన అద్దం విరిగినట్లుగా విరిగిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. ఈ భయంతోనే ప్రజలు తనని కనీసం తాకకుండా ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. ఆయనకు కోపం కూడా ఎక్కువే. రోజూ ఎవరోఒకరు ఆ కోపానికి బలైపోతుండేవారు. ఈ కోపంతో నిద్రలేని రాత్రుళ్లు గడిపేవాడట.నీరోరోమన్ చక్రవర్తి నీరోని కొందరూ మంచి పాలకుడని భావించగా, మరికొందరూ ఇతడు స్వప్రయోజనాలనే చూసుకునే స్వయంకుతాపరాధిగా ఆరోపణలు చేస్తున్నారు. అతని రెండో భార్య పొప్పాయా మరణించాకే.. అతడి వికృతి ప్రవర్తన పూర్తిగా బహిర్గతమైందంటారు చరిత్రకారులు. ఆయన ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి, ఆమెనే తన దివగంత భార్య పొప్పియాగా చెబతుండేవాడట.ఎలాగబలస్ అకా ఆంటోనినస్ఈయన కూడా రోమన్ చక్రవర్తే. ఇతడిని నైతిక విలువలు లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రాణమున్న ప్రతిదానితో వివాహేతర సంబంధాలు నెరిపేవాడట. అతనికి వయసు, లింగం అనే వ్యత్యాసం లేని విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ వ్యక్తి అట. అందువల్లే కేవలం 18 ఏళ్ల ప్రాయానికి హత్యకు గురయ్యి కానరాని లోకాలకు వెళ్లిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు.బవేరియా యువరాణి అలెగ్జాండ్రాఈ యువరాణి మేధావి, నవలా రచయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు. పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఆమె జెర్మాఫోబియాతో బాధపడుతోంది. ఈ ఫోభియా కారణంగానే తెలుపు తప్ప తక్కిన ఏ రంగు దుస్తులను ధరించేది కాదట. ఆఖరికి వస్తువులను, వ్యక్తులను తాకడానికి అస్సలు ఇష్పడేది కాదట. అలాగే తాను చిన్నతనంలో పియానో మొత్తాన్ని మింగేసిట్లు నమ్మకంగా చెబుతుంటుంది. ఇంత మేధావి అయినా ఆమెకున్న భయాలు కారణంగా రాజ్యంలోని ప్రజలు ఆమె తీరుని చూసి నవ్వుకోవడమే గాక విచిత్రమైన యువరాణి అని కథలు కథలుగా చెప్పుకునే వారట.(చదవండి: మంత్రదండంలాంటి ఉంగరం..!) -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు
ప్రపంచం భారతదేశాన్ని వీరుల భూమి అని గుర్తించింది. ఇక్కడి చరిత్ర మహా వీరోచితులైన రాజులతో పునీతమైంది. చంద్ర గుప్త మౌర్య, అశోక ది గ్రేట్, పృథ్వీ రాజ్ చౌహాన్.. ఇలా వీరంతా భరతమాత ఖ్యాతిని ప్రపంచమంతటా చాటారు. వీరంతా వారి హయాంలో ఎన్నో వీరోచిత పోరాటాలు సాగించారు. అవి చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ రాజుల కీర్తి పతాక భారతదేశానికే పరిమితం కాలేదు. విదేశాలలోనూ వీరిపేరు మారుమోగింది. అలాంటి ఐదుగురు హిందూరాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పృథ్వీ రాజ్ చౌహాన్ పృథ్వీ రాజ్ చౌహాన్ భారతదేశంలోని ప్రముఖ చౌహాన్ రాజవంశానికి చెందిన హిందూ రాజు. పృథ్వీ రాజ్ చౌహాన్ అజ్మీర్, ఢిల్లీలను పాలించాడు. అతని హయాంలోనే భారతదేశంపై మొఘల్ పాలకుల దాడి జరిగింది. పృథ్వీ రాజ్ చౌహాన్ ఎంతో ధైర్యవంతుడని, అతను 13 సంవత్సరాల వయస్సులో యుద్ధంలో గుజరాత్ రాజు భీమ్‌దేవ్‌ను ఓడించాడని చెబుతారు. పృథ్వీ రాజ్ చౌహాన్‌కు 6 భాషలు తెలుసు. యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి 17 సార్లు ఓటమి రుచి చూపించాడు. కానీ 1192 సంవత్సరంలో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ.. కన్నౌజ్ రాజు జయచంద్రతో కలిసి పృథ్వీ రాజ్, అతని స్నేహితుడు చంద్బర్దాయిని బంధించి చంపాడు. అలగ్జాండర్‌లో పోటీపడిన పోరస్ భారతదేశంలోని గొప్ప హిందూ రాజుల పేర్లలో పోరస్ పేరు కూడా వినిపిస్తుంది. పోరస్ సింధు రాజు. అతను అలెగ్జాండర్‌తో ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా అతని ధైర్యం ముందు తలవంచాడు. కింగ్ పోరస్ సామ్రాజ్యం సింధు నది నుండి చీనాబ్ నది వరకు విస్తరించింది. పోరస్ ది గ్రేట్.. అలెగ్జాండర్ మధ్య హైడాస్పెస్ యుద్ధం (క్రీ.పూ. 326) జరిగింది. రాజు పోరస్ క్రీస్తుపూర్వం 321- 315 మధ్య మరణించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నప్పటికీ, అతని మరణానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ఎటువంటి ఆధారాలు లేవు. అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి సాహసం గురించి తెలియనివారెవరూ ఉండరు. అశోకుడు మహా యోధుడు. అయితే భీకర కళింగ యుద్ధం అతనికి వినయ మార్గాన్ని కూడా చూపింది. ఈ యుద్ధం అనంతరం అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. శాంతి వైపు మళ్లాడు. కళింగ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించారని చెబుతారు. అశోక చక్రవర్తి సామ్రాజ్యం ఉత్తరాన హిందూకుష్ నుండి దక్షిణాన గోదావరి వరకు అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు విస్తరించింది. మహారాణా ప్రతాప్ మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలిసిందే. మహారాణా ప్రతాప్ మేవార్ రాచరిక పాలన సాగిస్తున్న సమయంలో అక్బర్ ఢిల్లీని పరిపాలించేవాడు. అక్బర్ కొన్ని మార్గాల ద్వారా మేవార్ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రతీసారి విఫలమవుతూ వచ్చాడు. మహారాణా ప్రతాప్ 72 కిలోల కవచాన్ని ధరించేవాడని, అతను వినియోగించే ఈటె 81 కిలోల బరువు కలిగినదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వీర శివాజీ శివాజీ పరాక్రమానికి మారుపేరు. వీర శివాజీ పరాక్రమం ముందు మొఘలులు తలవంచారు. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. తల్లి పేరు జీజాబాయి. శివాజీ తన సంరక్షకులు దాదాజీ కొండదేవ్, జీజాబాయి, సమర్థ గురు రాందాస్ పర్యవేక్షణలో పెరిగాడని చెబుతారు. శివాజీ సైన్యంలో ముస్లిం యోధులు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ తన యుద్ధాలలో గెరిల్లా యుద్ధ విధానాన్ని అవలంబించాడు. ఈ వ్యూహంతోనే శివాజీ అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫిలడెల్ఫియా ఫుట్‌పాత్‌లపై డ్రగ్స్ బానిసల వికృత చేష్టలు! -
రాజధర్మం
దేశాన్ని పాలించే రాజు నీతిమంతుడైతే, న్యాయ బద్ధంగా వ్యవహరిస్తే ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తే ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. యధా రాజా తథా ప్రజా అని ఆర్యోక్తి. రాజును బట్టే ప్రజలు. చరిత్రలో చక్కని పాలన చేసి, గణుతికెక్కిన రాజులను రామునితోను, ఆ రాజ్యాన్ని రామరాజ్యంతోను పోలుస్తారు. రాముడు అంతటి ఆదర్శవంతుడైన పాల కుడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన పాలకుడు. ప్రాచీన సాహిత్యం ఓ విజ్ఞాన భాండాగారం. పాలకులు పాటించవలసిన ధర్మాలు అందులో చక్కగా చెప్పారు. సుస్థిర దేశ పాలనకు, దేశ సౌభా గ్యానికి అవి ఎంతో ఉపకరిస్తాయి. మహా భారతంలో సభా పర్వంలో నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలడుగు తాడు. పాలకులైనవారు ఎలా ఉండాలో తెల్పుతా యవి. సర్వకాలాలకు వర్తించే ధర్మాలవి. రాజు ఎప్పుడూ ధర్మమందే మనసు నిలపాలి. తను చేయవలసిన రాజకార్యాలను సొంత బుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు రాజు ఏకాంతంగా ఉంటాడు. అతని ఆలోచ నలకు ఏకాగ్రత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులైన వాళ్లను, వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి నియమించాలి. ముఖ్యంగా పన్నులు వసూలు చేయటంవంటి ధనార్జనకు సంబంధించిన పనులలో నిజా యితీపరులను, సమబుద్ధితో వ్యవహరించేవారిని, విలువలను పాటించే వారిని నియమించాలి. అవినీతిపరులను నియమిస్తే ప్రభుత్వ ధనానికి లోటు ఏర్పడుతుంది. ప్రజలకు ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతుంది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను రాజు శాశ్వ తంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసా యాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. సమాజాభ్యుదయానికి ఇవి చాలా అవసరం. మహాభారత కాలం లోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, తక్కువ వడ్డీతో రుణాలు వ్యవసాయదారులకు ప్రభుత్వం ఇచ్చినట్లు నారదుని మాటల వల్ల తెలుస్తోంది. రాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అయితే లోపమున్న పిల్లలను తల్లి ఇంకా ఎంత బాగా ప్రేమి స్తుందో అలా కుంటివారు, గుడ్డివారు, వికలాంగు లకు రాజు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలి. ఎప్పుడో మహాభారత కాలం నాడు చెప్పిన ఈ రాజధర్మాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు! వాసంతి -
చరిత్రపై కుట్ర జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్ర వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ చిత్రంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. హిందువుల చరిత్రపై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అందులో భాగంగానే ఇటువంటి చిత్రాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ముస్లిం రాజులను హీరోలు చూపించే ప్రయత్నంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఈ క్రమంలో అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. ముస్లింలను హీరోలుగా చూపించేందుకు దుబాయ్ వాసులు కలలు కంటున్నారని ఆయన అన్నారు. అమీర్‌ఖాన్ తీసిన పీకే చిత్రం కూడా ఈ కోవలోకే వస్తుందని.. ఈ చిత్రం పాకిస్తాన్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపించారు. డిసంబర్ 1న విడుదల కానున్న పద్మావతి చిత్రంపై ఇప్పటికే అనే వివాదాలు చుట్టుముట్టాయి. రాజపుత్ర వర్గాలు, కర్నీసేన, ఇతర సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ పేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెన్సార్ బోర్డును సంప్రదించాలని పిల్ దాఖలు చేసిన వారికి సుప్రీం కోర్టు సూచించింది. -
చరిత్రపై కుట్ర జరుగుతోంది
-
సూర్య గ్రహణం!
వెంకటేశ్ హీరోగా ‘జెమిని’ సినిమా డెరైక్ట్ చేసిన శరణ్ తాజాగా ‘కింగ్స్’ పేరుతో ఓ ఫాంటసీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. వినయ్‌రాయ్, స్వస్తిక, సాక్షి చౌదరి కాంబినేషన్లో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ -‘‘మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. చైనాలో రెండు వేల థియేటర్స్ నిర్మించిన ఎలియేటర్ సంస్థ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్స్ నిర్మిస్తున్నాం. ఇందుకు భూముల సేకరణ జరుగుతుంది’’ అన్నారు. ‘‘సూర్యగ్రహణం అనే పాయింట్‌తో చిత్రం నిర్మిస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. చిత్ర సమర్పకుడు సి. శంకర్ నారాయణ, హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. -
మళ్లీ ‘వాటర్లూ’..
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయిగానీ భీకర యుద్ధం మాత్రం గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఎక్కడంటారా? బెల్జియం దేశంలోని వాటర్లూ ప్రాంతంలో. ఆంగ్లో-ప్రష్యన్ సంకీర్ణ సేనలు 1815 జూన్‌లో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను వాటర్లూ యుద్ధంలో ఓడించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 52 దేశాలకు చెందిన 6,000 మంది ఔత్సాహికులు ఇలా యుద్ధం చేసి ఆనాటి ఘట్టాన్ని గుర్తుచేశారు. ఈ వేడుకను చూసేందుకు 60,000 మందికి పైగా తరలివచ్చారు. -
బతుకు-బతకనివ్వు, బడుగుకు భరోసానివ్వు!
పద్యానవనం: ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే! ధరణిదేనువు బిదుకంగ దలచితేని జనుల బోషింపుమధిప వత్సముల మాడ్కి జనులు పోషింపబడుచుండ జగతి కల్పలత తెఱంగున సకల ఫలంబు లొసగు.. రాజనీతి అనేక రకాలుగా ఉంటుంది. ధర్మనిరతికి లోబడే ఉండాలనేది పెద్దల మాట. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వేల సంవత్సరాలుగా ధార్మిక, ఆధ్యాత్మికాంశాల్లో మార్గదర్శకాలుగా ఉంటూ వస్తున్నాయి. అయితే, ధర్మసూత్రాలు, నీతిశాస్త్రాల నుంచే కాకుండా నిరంతరం సాగే ప్రకృతి పరిణామాలు, అనేకానేక వ్యావహారిక ఆచరణల నుంచి కూడా మంచిని గ్రహించి రాజులు అనుసరించేవారు. ఆ అనుభవసారంతో జనరంజకమైన సుపరిపాలన అందించేవారు. ఆదివేదమైన రుగ్వేదంలో ఓ గొప్ప మాటుంది. జ్ఞానమనే వెలుగును అన్ని వైపుల నుంచీ ప్రసరించనీయాలనీ, ఆహ్వానించాలనీ! ప్రకృతిలో మౌలికంగా ఎన్నో మంచి అంశాలుంటాయి. వాటి నుంచి సాపేక్షంగా మంచిని గ్రహించి అనుసరించడం ద్వారా మనిషి జీవిత లక్ష్యాల్ని తేలికగా సాధించగలడు. పూర్వం రుష్యాశ్రమ విద్యా బోధనలో ఇటువంటివి చాలా చెప్పేవారు. ప్రాకృతికమైన ఓ అంశంతో పోల్చి జీవన సత్యాల్ని వివరించేవారు. వేమన పద్యాలైనా, బద్దెన సుమతీ శతక పద్యాలైఏనా ఇటువంటివే! ‘అవును కదా!’ అనిపించే నిజాల్ని కళ్లకు కట్టినట్టు చెబితే, చిరు మెదళ్లలో అవి బాగా, బలంగా నాటుకునేవి. ధర్మనిరతి, సత్యనిష్ఠ, మానవతా విలువలు, సచ్ఛీలత ఇలాంటివన్నీ గొప్ప గొప్ప ఆదర్శాలుగా కనిపించేవి, అనుసరణీయం అనిపించేవి. అనుసరణో, అనుకరణో... ఎవరికి వారు యథాశక్తి వాటిని పాటించేందుకు యత్నించేవారు. దాంతో గొప్ప వ్యక్తిత్వ వికాసం జరిగేది. సమాజం విలువలతో విలసిల్లేది. ఇటీవలి కాలం వరకు కూడా అది గొప్పగానే కొనసాగింది. పరంపరగా ఇటువంటి నైతిక జ్ఞాన వ్యాప్తికి భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉండేది. పూర్వపు విద్యా విధానంలో ఇటువంటి అంశాల బోధనకు పెద్దపీట వేసేవారు. ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే! నాగరికత వికాస క్రమంలో విజ్ఞానం కోసం ప్రపంచం ఆర్తితో ఉన్నపుడు వివిధ దేశాల నుంచి విద్యార్థుల్ని ఆకట్టుకున్న నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్ని నడిపిన నేల ఇది. అంతకు పూర్వం, తర్వాత జైనుడు, మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు, బసవేశ్వరుడు, కబీరు, వేమన, నిన్నమొన్నటి వివేకానందుడి వరకు... ఇలా ఎందరెందరో తాత్వికులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, మానవతావాదులు ఈ నేలపై నడచిన వారే! భర్తృహరి సంస్కృతంలో చెప్పిన ఓ గొప్ప మాటను ఏనుగులక్ష్మణ కవి తెలుగులో ఈ పద్యంగా మలిచారు. భూమి అనే గోవు నుంచి ధనం పిండుకోవాలనుకుంటే దూడను పోషించిన విధంగా జనులను పోషించాలి రాజా! అంటాడు. జనుల్ని చక్కగా పోషించే భారాన్ని, బాధ్యతని తీసుకుంటే జగత్తుమొత్తం కల్పవృక్షపు కొమ్మలాగా, తీగెలాగా కోరినవన్నీ ఫలాలుగా అందిస్తుంది అంటాడు. ఆ స్పృహ పాలకులకు ఉండాలి. దూడలను గాలికి వదిలి పాలన్నీ తామే పితుక్కోవాలని అత్యాశకు వెళితే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకే పలాయనం తప్పలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగునాట ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, యువతను ఉర్రూతలూగించిన పద్యం చిలకమర్తి లక్ష్మీనర్సింహం రాశారు. ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు, లేగదూడలై హిందువులేడ్చుచుండ, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి, తెల్లవారను గడుసరి గొల్లవారు’’ అన్న పద్యం నాటి సామ్రాజ్యవాదుల దుర్నీతికి నిలువుటద్దం. ఇక్కడ భర్తృహరి చెప్పిన దానికి పూర్తి విరుద్ధం. పరాయిపాలన పోయి, సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ చెడు పోకడలు పోలేదు. నేటి పాలకులు కూడా భూమిని చెరబట్టి, భూమి మీదే భుక్తి వెతుక్కుంటున్న బడుగు జీవుల్ని ఎండబెట్టి తామే సర్వం దండుకోవాలనీ, తమ వారికి సంపద కొల్లగొట్టిపెట్టాలనీ చూసినప్పుడు మన మానవత, నైతికత, ధార్మికత ఎక్కడ మరుగునపడ్డాయి? అని బాధ కలుగుతుంది. పాలకులారా! గతం నుంచి పాఠాలు నేర్చుకోండి, ‘బతుకు-బతకనివ్వు’ అన్న మంచి మాటను ఆచరించండీ!! అని గట్టిగా అరవాలనిపిస్తుంది. - దిలీప్‌రెడ్డి