
సూర్య గ్రహణం!
వెంకటేశ్ హీరోగా ‘జెమిని’ సినిమా డెరైక్ట్ చేసిన శరణ్ తాజాగా ‘కింగ్స్’ పేరుతో ఓ ఫాంటసీ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. వినయ్‌రాయ్, స్వస్తిక, సాక్షి చౌదరి కాంబినేషన్‌లో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ -‘‘మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. చైనాలో రెండు వేల థియేటర్స్ నిర్మించిన ఎలియేటర్ సంస్థ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్స్ నిర్మిస్తున్నాం. ఇందుకు భూముల సేకరణ జరుగుతుంది’’ అన్నారు. ‘‘సూర్యగ్రహణం అనే పాయింట్‌తో చిత్రం నిర్మిస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. చిత్ర సమర్పకుడు సి. శంకర్ నారాయణ, హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు.