మన చరిత్రలో ఘనకీర్తీ పొందిన ఎందరో గొప్ప గొప్ప రాజులను చూశాం. కొందరూ రాజుల ధైర్య సాహసాలు విన్నా..తలుచుకున్న ఒళ్లు పులకరించిపోతుంది. మనం కూడా అలానే ఉండాలనే ఫీల్ కలుగుతుంది. అంతటి మహమహా రాజుల తోపాటు కొందరూ విచిత్రమైన నియంత రాజులను కూడా ప్రజలు భరించారు. అయితే కొందరు రాజుల విచిత్ర నమ్మకాలు, భయాలు చూస్తే..వీళ్లేం కింగ్స్ రా బాబు అనుకుంటారు. ఆ విలక్షణమైన రాజులెవరంటే..?
ఇంగ్లాండ్ రాజు జార్జ్ III
ఇతన్ని పాలనకు అనర్హుడిగా చరిత్రకారులు పేర్కొంటారు. అత్యంత వేగవంతంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి ఒక విధమైన నురుగ వస్తుంటుంది. దీంతో అతడి చెప్పే మాటలో స్పష్టత కానరాక సేవకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవారు. అతడు ప్రతిదానికి నిరుత్సాహమే చూపిస్తాడు.
అప్పుడప్పుడూ మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే అతనికి కొన్ని విచిత్రమైన బ్రాంతులు కూడా ఉన్నాయి. ఒక రోజు ఓక్ చెట్టుతో కరచాలనం చేసేందుకు యత్నించి నవ్వులు పాలయ్యాడు కూడా. చివరి అతడి వింత ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు, మంత్రులు ఆ రాజు స్థానంలో అతడి కుమారుడు జార్జ్ IVకి రాజ్యధికారాన్ని అప్పగించారు.
ఫ్రాన్స్ చార్లెస్ VI
ఈ రాజు మరింత విచిత్రంగా ఉంటాడు. తన శరీరం గాజుతో తయారయ్యిందని అందుకే పెళుసుగా ఉందని భావిస్తుంటాడు. పైగా ఇది ఏ క్షణమైన అద్దం విరిగినట్లుగా విరిగిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. ఈ భయంతోనే ప్రజలు తనని కనీసం తాకకుండా ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. ఆయనకు కోపం కూడా ఎక్కువే. రోజూ ఎవరోఒకరు ఆ కోపానికి బలైపోతుండేవారు. ఈ కోపంతో నిద్రలేని రాత్రుళ్లు గడిపేవాడట.
నీరో
రోమన్ చక్రవర్తి నీరోని కొందరూ మంచి పాలకుడని భావించగా, మరికొందరూ ఇతడు స్వప్రయోజనాలనే చూసుకునే స్వయంకుతాపరాధిగా ఆరోపణలు చేస్తున్నారు. అతని రెండో భార్య పొప్పాయా మరణించాకే.. అతడి వికృతి ప్రవర్తన పూర్తిగా బహిర్గతమైందంటారు చరిత్రకారులు. ఆయన ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి, ఆమెనే తన దివగంత భార్య పొప్పియాగా చెబతుండేవాడట.
ఎలాగబలస్ అకా ఆంటోనినస్
ఈయన కూడా రోమన్ చక్రవర్తే. ఇతడిని నైతిక విలువలు లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రాణమున్న ప్రతిదానితో వివాహేతర సంబంధాలు నెరిపేవాడట. అతనికి వయసు, లింగం అనే వ్యత్యాసం లేని విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ వ్యక్తి అట. అందువల్లే కేవలం 18 ఏళ్ల ప్రాయానికి హత్యకు గురయ్యి కానరాని లోకాలకు వెళ్లిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు.
బవేరియా యువరాణి అలెగ్జాండ్రా
ఈ యువరాణి మేధావి, నవలా రచయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు. పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఆమె జెర్మాఫోబియాతో బాధపడుతోంది. ఈ ఫోభియా కారణంగానే తెలుపు తప్ప తక్కిన ఏ రంగు దుస్తులను ధరించేది కాదట. ఆఖరికి వస్తువులను, వ్యక్తులను తాకడానికి అస్సలు ఇష్పడేది కాదట.
అలాగే తాను చిన్నతనంలో పియానో మొత్తాన్ని మింగేసిట్లు నమ్మకంగా చెబుతుంటుంది. ఇంత మేధావి అయినా ఆమెకున్న భయాలు కారణంగా రాజ్యంలోని ప్రజలు ఆమె తీరుని చూసి నవ్వుకోవడమే గాక విచిత్రమైన యువరాణి అని కథలు కథలుగా చెప్పుకునే వారట.
(చదవండి: మంత్రదండంలాంటి ఉంగరం..!)
Comments
Please login to add a commentAdd a comment