crazy
-
ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!
మన చరిత్రలో ఘనకీర్తీ పొందిన ఎందరో గొప్ప గొప్ప రాజులను చూశాం. కొందరూ రాజుల ధైర్య సాహసాలు విన్నా..తలుచుకున్న ఒళ్లు పులకరించిపోతుంది. మనం కూడా అలానే ఉండాలనే ఫీల్ కలుగుతుంది. అంతటి మహమహా రాజుల తోపాటు కొందరూ విచిత్రమైన నియంత రాజులను కూడా ప్రజలు భరించారు. అయితే కొందరు రాజుల విచిత్ర నమ్మకాలు, భయాలు చూస్తే..వీళ్లేం కింగ్స్ రా బాబు అనుకుంటారు. ఆ విలక్షణమైన రాజులెవరంటే..?ఇంగ్లాండ్ రాజు జార్జ్ IIIఇతన్ని పాలనకు అనర్హుడిగా చరిత్రకారులు పేర్కొంటారు. అత్యంత వేగవంతంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి ఒక విధమైన నురుగ వస్తుంటుంది. దీంతో అతడి చెప్పే మాటలో స్పష్టత కానరాక సేవకులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవారు. అతడు ప్రతిదానికి నిరుత్సాహమే చూపిస్తాడు. అప్పుడప్పుడూ మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే అతనికి కొన్ని విచిత్రమైన బ్రాంతులు కూడా ఉన్నాయి. ఒక రోజు ఓక్ చెట్టుతో కరచాలనం చేసేందుకు యత్నించి నవ్వులు పాలయ్యాడు కూడా. చివరి అతడి వింత ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు, మంత్రులు ఆ రాజు స్థానంలో అతడి కుమారుడు జార్జ్ IVకి రాజ్యధికారాన్ని అప్పగించారు. ఫ్రాన్స్ చార్లెస్ VIఈ రాజు మరింత విచిత్రంగా ఉంటాడు. తన శరీరం గాజుతో తయారయ్యిందని అందుకే పెళుసుగా ఉందని భావిస్తుంటాడు. పైగా ఇది ఏ క్షణమైన అద్దం విరిగినట్లుగా విరిగిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. ఈ భయంతోనే ప్రజలు తనని కనీసం తాకకుండా ఉండేలా జాగ్రత్తపడుతుంటాడు. ఆయనకు కోపం కూడా ఎక్కువే. రోజూ ఎవరోఒకరు ఆ కోపానికి బలైపోతుండేవారు. ఈ కోపంతో నిద్రలేని రాత్రుళ్లు గడిపేవాడట.నీరోరోమన్ చక్రవర్తి నీరోని కొందరూ మంచి పాలకుడని భావించగా, మరికొందరూ ఇతడు స్వప్రయోజనాలనే చూసుకునే స్వయంకుతాపరాధిగా ఆరోపణలు చేస్తున్నారు. అతని రెండో భార్య పొప్పాయా మరణించాకే.. అతడి వికృతి ప్రవర్తన పూర్తిగా బహిర్గతమైందంటారు చరిత్రకారులు. ఆయన ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి, ఆమెనే తన దివగంత భార్య పొప్పియాగా చెబతుండేవాడట.ఎలాగబలస్ అకా ఆంటోనినస్ఈయన కూడా రోమన్ చక్రవర్తే. ఇతడిని నైతిక విలువలు లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రాణమున్న ప్రతిదానితో వివాహేతర సంబంధాలు నెరిపేవాడట. అతనికి వయసు, లింగం అనే వ్యత్యాసం లేని విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ వ్యక్తి అట. అందువల్లే కేవలం 18 ఏళ్ల ప్రాయానికి హత్యకు గురయ్యి కానరాని లోకాలకు వెళ్లిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు.బవేరియా యువరాణి అలెగ్జాండ్రాఈ యువరాణి మేధావి, నవలా రచయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు. పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఆమె జెర్మాఫోబియాతో బాధపడుతోంది. ఈ ఫోభియా కారణంగానే తెలుపు తప్ప తక్కిన ఏ రంగు దుస్తులను ధరించేది కాదట. ఆఖరికి వస్తువులను, వ్యక్తులను తాకడానికి అస్సలు ఇష్పడేది కాదట. అలాగే తాను చిన్నతనంలో పియానో మొత్తాన్ని మింగేసిట్లు నమ్మకంగా చెబుతుంటుంది. ఇంత మేధావి అయినా ఆమెకున్న భయాలు కారణంగా రాజ్యంలోని ప్రజలు ఆమె తీరుని చూసి నవ్వుకోవడమే గాక విచిత్రమైన యువరాణి అని కథలు కథలుగా చెప్పుకునే వారట.(చదవండి: మంత్రదండంలాంటి ఉంగరం..!) -
బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు!
ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే రొట్టె తినేవారు. ఇప్పుడైతే భారతీయుల్లో చాలామంది ప్రతిరోజూ రొట్టెల్ని లాగించేస్తున్నారు. అదేమంటే.. ఆరోగ్యం కోసమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రొట్టెలు క్రేజీ ఫుడ్‌గా మారుతుండగా.. వాటి వినియోగంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం దేశంలో బ్రెడ్స్ అమ్మకాల విలువ 640 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024 మిలియన్ డాలర్లకు చేరిందంటే రొట్టెలు భారతీయులతో ఎలా లొట్టలు వేయిస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు. సాక్షి, అమరావతి: పాశ్చాత్య వంటకమైన బ్రెడ్ భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారంగా మారిపోతోంది. వేగవంతమైన జీవనశైలి, పనిభారం వల్ల వివిధ రకాల బ్రెడ్స్ భారతీయ భోజనశాలను ఆక్రమిస్తున్నాయి. ఎంతగా అంటే మసాలాలతో కూడిన కూరగాయ వంటకాలను భర్తీ చేస్తూ డైనింగ్ టేబుల్‌పై తిష్టవేస్తున్నాయి. జామ్, బటర్, పీనట్ బటర్ వంటి స్ప్రెడ్‌ల ఎంపికతో టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్లు పట్టణ వాసుల ఇళ్లలో నిత్య అల్పాహారాలుగా మారుతున్నాయి. రెడీ టు కుక్ ఆహారం అందుబాటులోకి రావడంతో మహిళలు సూప్, సలాడ్ డిన్నర్లను బ్రెడ్‌తో చేయడానికే మక్కువ చూపుతుండటం విశేషం. దక్షిణాది రాష్ట్రాలే టాప్ జాతీయ పోషకాహార సర్వే ప్రకారం బ్రెడ్ వినియోగిస్తున్న కుటుంబాల్లో ఓ వ్యక్తి సగటున రోజుకు 80 గ్రాముల బ్రెడ్ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో స్త్రీల (66 గ్రా) కంటే పురుషులే (96 గ్రా) ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఒక కుటుంబం ఏడాదికి 31.7 కిలోలుగా పెరగనుంది. భారత్‌లో అతిపెద్ద బ్రెడ్ వినియోగదారుల జాబితాలో దక్షిణ భారతదేశం మొదటి స్థానంలో ఉండటం విశేషం. భారతదేశ బ్రెడ్ మార్కెట్ 2017లో 640.73 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024.54 (సుమారు రూ.837 కోట్లు) మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులు నెలకు బ్రెడ్ కోసం రూ.300 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రొటీన్ బ్రెడ్స్ కూడా వచ్చేశాయ్ దేశంలో ఊబకాయ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది 2030 నాటికి దాదాపు 27 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందుకు భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సంప్రదాయ భారతీయ భోజనంలో అన్నం, రోటీ, వేపుడు పదార్థాలు ఉంటాయి. దీనికితోడు ఆధునిక జీవనశైలిలో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పెరిగిపోయి ఊబకాయానికి దారి తీస్తోంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరమే కానీ.. కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రెడ్లలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్ వంటివి లభిస్తున్నాయి. జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్‌ని అధికంగా అందిస్తున్నాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్స్దే హవా మార్కెట్లో రకరకాల బ్రెడ్స్ వస్తున్నాయి. తృణధాన్యాల వినియోగం కాలక్రమేణా పెరుగుతోంది. హోల్‌గ్రెయిన్, మల్టీ గ్రెయిన్, రై బ్రెడ్, వీట్ బ్రెడ్లు అన్ని సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పట్టణ ప్రజలు రొట్టెల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల కంటే తృణధాన్యాల ఉత్పత్తుల్లో ఎక్కువ డైటరీ ఫైబర్ కంటెంట్ ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. చదవండి: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ఎందుకంటే.. -
వెర్రి వేవేల విధాలు
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ‘ఎవడి వెర్రి వాడికి ఆనందం’ అంటారు. ‘వెర్రి ముదిరిందంటే రోకలి తలకు చుట్టండి అన్నాట్ట’ అనే సామెత మనకు తెలియనిది కాదు. వెర్రికి తిక్క, పిచ్చి, రిమ్మ, మతిభ్రంశం, మతిభ్రమణం, చిత్తచాంచల్యం, ఉన్మాదం వంటి పర్యాయపదాలు చాలానే ఉన్నాయి. వెర్రి లేదా పిచ్చికి సంబంధించి తెలుగులోనే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లోనూ నానుడులు, సామెతలు, జాతీయాలు, పదబంధాలు పుష్కలంగా ఉన్నాయి. కవిత్వంలోనూ, కాల్ప నిక సాహిత్యంలోనూ పిచ్చితనం లేదా వెర్రితనం ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా సాహిత్యాలకూ వెర్రితనానికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది మరి! అప్పుడెప్పుడో అమాయకపు సత్తెకాలంలో ‘వెర్రి వెయ్యి విధాలు’ అని జనాలు వాపోయేవారు గానీ, ఇప్పటి ప్రపంచంలోనైతే కొత్త కొత్త వెర్రితనాలు వెలుగులోకి వస్తూ, వార్తలకెక్కుతూనే ఉన్నాయి. వెర్రి వెయ్యి విధాలు అనే నమ్మకం ప్రబలంగా ఉన్న కాలంలో కొత్తపల్లి సూర్యారావు ‘ఉన్మాద సహస్రము– వెఱి -
వేలం వెర్రిగా ఎలక్ట్రిక్ వాహనాలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అంశం వేలం వెర్రిగా మారిందని, ఈవీ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లంతా కూడా పరిశ్రమలోకి వస్తున్నారని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆక్షేపించారు. అందుకే అగ్నిప్రమాదాల్లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పుణెలోని అకుర్దిలో బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక ప్లాంటును ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది కేవలం అగ్నిప్రమాదాల గురించి మాత్రమే కాదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల వాహనాల్లోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈవీల విషయంలో సమస్యంతా తయారీ ప్రక్రియతోనే ఉంటోంది. ఈవీల వ్యవహారం వేలం వెర్రిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈవీలతో సంబంధం లేని వాళ్లకు ఈ వ్యాపారంతో ఏ పని ఉంది? ఈ విధానాన్ని సరిచేయాలి. బహుశా, ప్రభుత్వంలోని సంబంధిత అధికార వర్గాలు ఈవీల నిబంధనలను సడలించారేమో. అందుకే ఈవీలు మార్కెట్‌ను వరదలా ముంచెత్తుతున్నాయి‘ అని బజాజ్ పేర్కొన్నారు. ‘తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల పేరుతో దేన్నైనా రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. మరి స్కూటర్లకు అగ్నిప్రమాదాలు జరగకుండా మరేమవుతుంది?‘ అని ఆయన ప్రశ్నించారు. ప్లాంటుపై రూ. 750 కోట్ల పెట్టుబడులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీల తయారీ ప్లాంటుపై చేతక్ టెక్నాలజీ (సీటీఎల్), దాని వెండార్ భాగస్వాములు రూ. 750 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఉంటుంది. వార్షికంగా దీని తయారీ సామర్థ్యం 5 లక్షల ద్విచక్ర వాహనాలుగా ఉంటుంది. 2019 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన చేతక్ ఈ–స్కూటర్లను ఇప్పటివరకూ 14,000 పైచిలుకు విక్రయించామని, 16,000 పైగా బుకింగ్స్ ఉన్నాయని బజాజ్ తెలిపారు. ‘చేతక్ అనేది సిసలైన మేక్ ఇన్ ఇండియా సూపర్‌స్టార్. అది ఎంతో మంది వాహనప్రియుల అభిమానం చూరగొంది. దేశీయంగానే డిజైన్ చేసి, ఇక్కడే నిర్మించిన ఎలక్ట్రిక్ చేతక్ .. మా పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలకు, తయారీలో దశాబ్దాల అనుభవానికి, వినియోగదారులు .. ఉత్పత్తులపై మాకున్న లోతైన అవగాహనకు నిదర్శనం‘ అని బజాజ్ తెలిపారు. -
నెహ్రూ జూపార్కులో యువకుడి హల్చల్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్కులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. ఈ క్రమంలో యువకుడు.. సింహం ఎన్‌క్లోజర్‌లో దూకేందుకు ప్రయత్నం చేశాడు. చాలా సేపు .. సింహం ఎన్‌క్లోజర్‌కు దగ్గరలోనే కూర్చోని ఉన్నాడు. దీన్నిగమనించిన సందర్శకులు జూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ యువకుడిని అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడి సందర్శకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. -
బార్బీ బొమ్మకు బ్రదర్వా..!
అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అమ్మాయిలైతే ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అబ్బాయిలు కూడా ఏమీ తగ్గట్లేదు. అమ్మాయిలేమో కుందనపు బొమ్మలా.. బార్బీ డాల్లాగా తయారయ్యేందుకు తెగ ముచ్చట పడతారు. మరి అబ్బాయిలు..! మేం కూడా ‘బొమ్మ’లా తయారవుతానని అనుకున్నాడేమో ఈ ఫొటోలోని అబ్బాయి. రెండేళ్ల నుంచి ఏకంగా అచ్చు బొమ్మలాగే తయారవుతున్నాడు. జపాన్‌కు చెందిన మట్ కువాటాకు 24 ఏళ్లు. అందంగా తయారు కావడం ఇతడికి ఇష్టం. అందంగా కనిపించడమే కాదు.. వినూత్నంగా.. విభిన్నంగా కనిపించడం అంటే మనోడికి పిచ్చి క్రేజ్. అందుకు తగ్గట్టుగానే అచ్చు బొమ్మలా మారిపోతున్నాడు. ఇందుకోసం గంటలు గంటలు మేకప్ వేయించుకుంటున్నాడు. ఇలా తయారై తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటాడు కువాటా. ఇంకేం మనోడికి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని కొందరు.. ఫొటోను ఎడిటింగ్ చేయడం వల్లే ఇలా కనిపిస్తున్నాడని మరికొందరు ఇన్‌స్ట్రాగాంలో విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిని కువాటా కొట్టిపారేస్తున్నాడు. మేకప్ కనుక నిజమే అయితే ఆ మేకప్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే గొప్ప వాడవుతాడంటూ కొందరు కితాబిస్తున్నారు. -
అరవయ్యేళ్లవారు కూడా ఎంజాయ్ చేస్తారు
‘‘కన్ను కొట్టి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్. ఆమె నటించిన క్రేజీ చిత్రం రైట్స్ మాకు దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అనువాద హక్కులకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను చూసి వాళ్లు రేట్ బాగా పెంచారు. భారీ హీరోకు పెట్టే బడ్జెట్‌తో కొనుగోలు చేశాం. దానికి కారణం సినిమా మీద ఉన్న ప్యాషనే’’ అన్నారు నిర్మాత గురురాజ్. ప్రియా ప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రలో ఒమర్ లూలు రూపొందించిన చిత్రం ‘ఒరు అధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సీహెచ్ వినోద్ రెడ్డి సమర్పణలో గురురాజ్ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒమర్ లూలు తీసిన రెండు లవ్ స్టోరీలు సూపర్ హిట్. ఇప్పుడు తీసిన మూడో లవ్‌స్టోరీలో ప్రియా ప్రకాశ్ కన్ను గీటే వీడియా వైరల్ అయ్యాక సినిమాలో మార్పులు, చేర్పులు చేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మాకు దక్కడానికి కారణమైన మిత్రులు సీతారామరాజు, సురేశ్ వర్మకు థ్యాంక్స్. ఇది ప్రేమ కథ అయినప్పటికీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అరవయ్యేళ్ల వాళ్లు కూడా ఇరవయ్యేళ్లవారిలా ఆనందిస్తారు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణమైన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. -
డోంట్ వర్రీ కేరళ
‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా.. కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ‘ప్రేమ దేశం’ సినిమాలోని ఈ పాట అంటే అప్పటి యూత్‌కే కాదు.. ఇప్పటి యూత్‌కీ క్రేజ్. ఇంకా చెప్పాలంటే ‘ఫ్రెండ్షిప్’ అంటే ఈ పాటే చాలామందికి గుర్తొస్తుంది. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్‌ని మార్చి పాడారు ఏఆర్ రెహమాన్. రీసెంట్గా కాలిఫోర్నియాలో షో చేశారాయన. ఎంత దూరం వెళ్లినా సొంత దేశాన్ని మరచిపోరు కదా. ఆ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడగానే, ఆ ప్రాంగణమంతా చప్పట్లో మార్మోగింది. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. -
స్టైలిష్.. క్రేజీ..
ఫిడ్జెట్ స్పిన్నర్‌కు గిరాకీ ఒత్తిడి తగ్గుతుందని కొందరు.. సరదా కోసమని మరికొందరు ఊపందుకున్న విక్రయాలు మారాం చేస్తున్న పిల్లలు పెద్దలదీ అదే దారి కొత్తొక వింత.. ఇదీ తెలుగు నానుడి. ఇప్పుడిది అక్షరాలా నిజమైంది. సినిమాలు, టీవీలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయో అని చెప్పడానికి ఈ కథనమే ప్రత్యక్ష నిదర్శనం. తణుకు : ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా రకరకాల రంగులతో గిర్రున తిరుగుతున్న ఓ చక్రం ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. దీనిపేరు ఫిడ్జెట్ స్పిన్నర్. ఇదో ఆట వస్తువు. దువ్వాడ జగన్నాథం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీనిని వాడాడు. అంతే... ఇది క్రేజీగా మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి చేతుల్లోనూ ఇమిడిపోతోంది.. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని కొందరు.. సరదా కోసమని మరికొందరు.. ఏదేమైనా ఈ స్పిన్నర్ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తోంది. రూ.50 నుంచి అందుబాటులో.. జిల్లాలో స్పిన్నర్లకు ప్రస్తుతం గిరాకీ బాగా పెరిగింది. బ్యాట్‌మేన్, ఎల్ఈడీ లైట్లు, సైకిల్ ఛైన్, బ్లూటూత్ వంటి రకాలతోపాటు కొన్ని బంగారంతో చేసిన ఫిడ్జెట్ స్పిన్నర్లూ అందుబాటులో ఉన్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకూఇవి పలుకుతున్నాయి. ఆన్లైన్లో సైతం వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో స్పిన్నర్లు అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ మూడు రెక్కలతో మధ్యలో చక్రం మాదిరి ఉండే ఫిడ్జెట్ స్పిన్నర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అత్యధికంగా అమ్ముడుబోతున్న ఆటవస్తువుల్లో ఇది ఒకటిగా ప్రాచూర్యం పొందింది. 1993లోనే స్పిన్నింగ్ టాయ్ పేరుతో ఇది తయారైనా అప్పట్లో అంత ఆదరణ రాలేదు. ఇజ్రాయిల్‌కు చెందిన ఒక మహిళ దీన్ని తయారు చేసినట్టుగానూ.. కేథరిజ్ హిట్టింజర్ అనే వ్యక్తి తయారు చేశాడని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్లో గతేడాది దీనిపై కథనం ప్రచురితం కావడంతో ఒక్కసారిగా ప్రాచూర్యంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్ట్రెస్ రిలీజింగ్ టాయ్ అంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చైనాలోని సెల్‌ఫోన్ యాక్సరీస్ తయారు చేసే కంపెనీలూ ఈ స్పిన్నర్లు తయారీలో నిమగ్నమయ్యాయంటే వీటికి ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గినా.. ఇప్పుడు ఎవరి చేతుల్లో చూసినా ఫిడ్జెట్ స్పిన్నర్ దర్శనమిస్తోంది. దీనివల్ల కొంత మేర ఒత్తిడి తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. అయితే దీన్ని అతిగా వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం దీనిపై పిల్లల్లో క్రేజ్ పెరిగింది. ఒక్కోసారి దీనికి బానిసలుగా మారితే మాన్పించడానికి కష్టపడాల్సి వస్తుంది. వై.రామకృష్ణ, మానసిక నిపుణలు, తణుకు -
కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్
-
కాలేజీ గాళ్స్ క్రేజీ డ్యాన్స్:కోట్ల వ్యూస్
భువనేశ్వర్: ఇంటర్నెట్ లో ఒడిశా అమ్మాయిలు చేసిన డాన్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రముఖనటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా ముకాబులా పాటతో మొదలైన ఈ కాలేజీ గర్స్ డాన్స్ ఫెరఫామెన్స్ వివిధ పాపులర్ బాలీవుడ్ పాటలకు వరకు సాగింది. ఒకరితో మొదలైనా.. చిరవకి సామూహికంగా స్టెప్పులేశారు. నెటిజన్ల క్రేజ్‌తో ఈ వీడియో యూ ట్యూబ్‌ను క్రాష్ చేస్తోంది. సుమారు నాలుగు నెలలక్రితం జనవరి 2, 2017న పోస్ట్ చేసిన ఈ వీడియోపై ఇప్పటికీ క్రేజ్ తగ్గ లేదు. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ దీనికే నిదర్శనం.. 12కోట్ల, 6లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది. మరి ఆ సందడి ఏంటో ఒకసారి మీరు కూడా తిలకించండి.. -
ఈ క్రేజ్ ఏంటో?
బీజింగ్ : రూబిక్ క్యూబ్ గేమ్ తెలుసు కదా? లాజిక్, మ్యాజిక్ కలగలిసిన ఆట. భుజబలంతో కాదు.. బుద్ధి బలంతో ఆడాల్సిన ఆట. క్యూబ్ లో ఒకే రంగులో ఉన్న తొమ్మిది భాగాలనూ ఒకేవైపు ఉండేలా సెట్ చేయాలి. అలా ఆరు వైపులా సరి చేయాలి. మీరైతే దానిని ఎంతసేపట్లో సరిచేయగలరు? చెప్పలేం అంటారా? అయితే చైనా ఈ గేమ్ పై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. రూబిక్ క్యూబ్ ఆడటం వల్ల తమ పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని బాగా నమ్మతారు. ఒక్క బీజింగ్ లోనే 200కి పైగా క్యూబ్ శిక్షణ స్కూళ్లున్నాయి. ఇటీవల కాలంలో చైనాలో క్యూబింగ్ గేమ్ ఆడేవాళ్ల సంఖ్య బాగా పెరిగిందని వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ప్రతినిధి క్రిస్ క్రుగెర్ తెలిపారు. 2004లో ప్రపంచ క్యూబ్ అసోసియేషన్ ఏర్పడి, అప్పటి నుంచీ ప్రతినెలా పోటీలు నిర్వహిస్తోంది. డబ్ల్యూసీఏ నిర్వహించిన తొలి పోటీలో కేవలం 100 మంది మాత్రమే పాల్గొనగా, ఆ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందని వెల్లడించారు. అమెరికాలో కూడా ఈ క్రీడకు విశేష ఆదరణ ఉందని, కానీ శిక్షణ అవకాశాలు మాత్రం చాలా తక్కువని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని ప్రజలు యూట్యూబ్ వీడియోల ద్వారా క్యూబింగ్ గేమ్ లోని మెలకువలు తెలుసుకుని సాధన చేస్తున్నారని వివరించారు. క్యూబ్ గేమ్ వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతతో పాటు చేతికి, కంటికి మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఇటీవల బీజింగ్ లో కూడా డబ్ల్యూసీఏ పోటీలను నిర్వహించింది. దాదాపు వెయ్యి మంది క్యూబ్ మేధావులు తమ తమ ప్రతిభాపాటవాలతో అందర్నీ కట్టిపడేశారు. ఈ పోటీలో చైనాకు చెందిన వాంగ్ ఖియాంగ్ అనే ఆరేళ్ల బుడతడు కేవలం 30 సెకన్లలోపే రూబిక్ క్యూబ్ సెట్ చేశాడు. కిండర్ గార్డెన్ నుంచే క్యూబ్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన వాంగ్.. తొలిసారిగా ఈ పోటీలో పాల్గొని అందరి దృష్టీ ఆకర్షించాడు. వాంగ్ ఒక్కడే కాదు.. ఒకసారి ఒక క్యూబ్ సెట్ చేయడమే కష్టమనుకుంటే ఒకేసారి రెండు చేతులతో రెండు క్యూబ్ లు సరిచేసేసి శభాష్ అనిపించుకున్నారు కొందరు. ఇంకొందరైతే చేతులతో కాదు.. కాళ్లతో చేస్తాం అని చేసి చూపించారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే, కళ్లు తెరిచి చేస్తే గొప్పదనం ఏముంది? మేం కళ్లు మూసుకుని కూడా చేస్తాం అని చెప్పడమే కాకుండా.. క్యూబ్ సెట్ చేసి ఔరా అనిపించారు మరికొందరు. ఇలా మొత్తం 18 రకాలుగా తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. -
సరదా కామెంట్.. ఎంత పని చేసింది!
నేపితా: దేశాధ్యక్షుడిపై సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ కామెంట్ జైలుకు పంపేలా చేస్తుందని మయన్మార్ యువకుడు కూడా ఊహించి ఉండడు. తన భర్తను అరెస్ట్ చేశారని బాధితుడి భార్య శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు. కొందరు అధికారులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సమాచారం అందుకుని అతడిని అరెస్ట్ చేశారని, తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారని బాధితుడి భార్య హిన్ హిన్ విన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెప్టెంబర్ 23 తన భర్తను ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని తెలిపింది. వాస్తవానికి అక్కడి టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రకారం.. అధ్యక్షుడిని, ఆ తరహా హోదాలో ఉండే వ్యక్తిని 'ఇడియట్' అని, లేదా 'క్రేజీ' అని ఆన్ లైన్లో సంబోధిస్తూ కామెంట్ చేయడం నేరం కిందకి వస్తుంది. 2013లో టెలికమ్యూనికేషన్ చట్టం ప్రతిపాదించారు. అయితే అప్పట్లో మయన్మార్ లో సైనిక తరహా నియంతృత్వ పాలన కొనసాగేది. ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గత మార్చిలో ఎన్నికలు జరిగినా.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని చట్టాలు కఠినంగా ఉండటం వల్ల సాధారణ పౌరులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆంగ్ విన్ హ్లెయింగ్ భార్య ఆరోపించింది. గత నెలలో ఆర్మీపై కామెంట్లు చేశాడన్న ఆరోపణలతో నటుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి
►రెండు బైక్‌లు ఢీ: రోడ్డుపై పడిపోయిన వ్యక్తి... ►ఆయన పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం ►తండ్రి మృతి...కూతుళ్లకు తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందగా, కుమార్తెలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బుర్ర జగన్(35) సోమవారం రాత్రి తన కుమార్తెలు స్వీటీ(11), క్రేజీ(3)లతో కలిసి బైక్(29 బీజీ 5802)పై యాచారం వస్తున్నాడు. ఆయన భార్య వెనుక నుంచి బస్సులో వస్తోంది. మంచాల మండలం లోయపల్లికి మల్లేష్ ఎదురుగా వస్తున్నాడు. ఈక్రమంలో ఖానాపూర్ స్టేజీ సమీపంలో వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పైనుంచి రోడ్డుపై పడిపోయిన జగన్ పైకి లేచేందుకు యత్నిస్తున్నాడు. అంతలోనే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు(ఏపీ29జడ్2589) ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వీటీ, క్రేజీ, మల్లేష్‌లను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులోనే జగన్ భార్య కూడా ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గెలుపు గుర్రంగా వస్తున్న శృతి
-
వీళ్లకు అవంటే యమక్రేజ్!
పంచామృతం ప్రతి మనిషికీ ఒక పిచ్చి ఉంటుంది. హాబీ రూపంలో కావొచ్చు, ఆసక్తిగా కావొచ్చు. ఆ పని ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి పిచ్చితో ప్రపంచంతో పనిలేదన్నట్టుగా బతికేయొచ్చనిపిస్తుంది. ఆ పిచ్చిలో ఉన్నప్పుడు మనకు మనమే ముద్దొస్తాం, మనకు మనమే గ్రేటనిపిస్తాం. మరి ఇదే విషయం గురించి కొంతమంది సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారి వ్యక్తిగత ఆసక్తులను గురించి వాకబు చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి... పేరుకైతే ‘దబాంగ్ ఖాన్’ కానీ సల్మాన్‌ది కళాహృదయం. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రసిద్ధ పెయింటర్లు గీసిన వాటిని సేకరిస్తూ ఉంటాడు. అలాగే మనసు స్పందించినప్పుడు తను కూడా బ్రష్‌కు పని చెబుతూ ఉంటాడు. కింగ్‌ఖాన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే మహా ఇష్టం. మార్కెట్లోకి వచ్చే అధునాతన స్మార్ట్‌ఫోన్స్, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్ను కొనేయడం అంటే షారూఖ్‌కు తెగ సంబరమట. ఏదైనా కొత్త గాడ్జెట్ కనిపిస్తే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడు. కొనే సామర్థ్యం ఉంది కాబట్టి ఎంచక్కా కొనేసుకొంటాడు. అలాగే ఆయన కార్ల పిచ్చి కూడా ఉంది. షారూఖ్ గ్యారేజ్‌లో కనీసం ఏడు కార్లు అయినా పార్కింగ్‌లో ఉండాల్సిందే! నటనకు పరిపూర్ణ నిర్వచనంలా కనిపించే విద్యాబాలన్ ఆఫ్ ద రికార్డ్‌లో అచ్చమైన అతివ. ఆమెకు చీరలు సేకరించడం అంటే యమ క్రేజ్! పట్టు చీరలంటే పిచ్చి. విద్యను బాగా ఎరిగిన వారు ఇచ్చే సమాచారం ప్రకారం ఆమె వద్ద వెయ్యికిపైగా వెరైటీ వెరైటీ చీరలున్నాయి! తండ్రి హీరోగా ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తాను హీరోయిన్గా అంతే స్టార్‌డమ్‌ను సంపాదించడం అనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్న సోనమ్ కపూర్ ఒక స్టైల్ దివా. ఆమె వార్డ్రోబ్ బ్రాండెండ్ వేర్‌తో నిండి ఉంటుంది. అలాగే సోనమ్‌కు హ్యాండ్‌బ్యాగ్స్ అంటే కూడా క్రేజే. ఈమెకు సరికొత్త వంటకాల గురించి తెలుసుకొని వండటం అంటే తెగ ఆసక్తి. వంటల పుస్తకాలను సేకరించి అందులోని థియరీని ప్రాక్టికల్ చేసి తనకు తెలిసిన వారికి వండిపెట్టడం అంటే కంగనకు చాలా ఇష్టమట. వంట గురించి మంచి మొబైల్ అప్లికేషన్లు ఉంటే చెప్పరా? అంటూ తన సహచర నటీనటులను అడుగుతూ ఉంటుందట.