సరదా కామెంట్.. ఎంత పని చేసింది! | Myanmar man jailed for comments on President Htin Kyaw | Sakshi
Sakshi News home page

సరదా కామెంట్.. ఎంత పని చేసింది!

Published Fri, Sep 30 2016 7:02 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సరదా కామెంట్.. ఎంత పని చేసింది! - Sakshi

సరదా కామెంట్.. ఎంత పని చేసింది!

నేపితా: దేశాధ్యక్షుడిపై సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ కామెంట్ జైలుకు పంపేలా చేస్తుందని మయన్మార్ యువకుడు కూడా ఊహించి ఉండడు. తన భర్తను అరెస్ట్ చేశారని బాధితుడి భార్య శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు.

కొందరు అధికారులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సమాచారం అందుకుని అతడిని అరెస్ట్ చేశారని, తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారని బాధితుడి భార్య హిన్ హిన్ విన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెప్టెంబర్ 23 తన భర్తను ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని తెలిపింది. వాస్తవానికి అక్కడి టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రకారం.. అధ్యక్షుడిని, ఆ తరహా హోదాలో ఉండే వ్యక్తిని 'ఇడియట్' అని, లేదా 'క్రేజీ' అని ఆన్ లైన్లో సంబోధిస్తూ కామెంట్ చేయడం నేరం కిందకి వస్తుంది.  

2013లో టెలికమ్యూనికేషన్ చట్టం ప్రతిపాదించారు. అయితే అప్పట్లో మయన్మార్ లో సైనిక తరహా నియంతృత్వ పాలన కొనసాగేది. ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గత మార్చిలో ఎన్నికలు జరిగినా.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని చట్టాలు కఠినంగా ఉండటం వల్ల సాధారణ పౌరులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆంగ్ విన్ హ్లెయింగ్ భార్య ఆరోపించింది. గత నెలలో ఆర్మీపై కామెంట్లు చేశాడన్న ఆరోపణలతో నటుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement