నెహ్రూ జూపార్కులో యువకుడి హల్‌చల్‌.. | Man Jumps Into Lion Enclosure At Nehru Zoopark In Hyderabad | Sakshi
Sakshi News home page

Nehru Zoological Park: నెహ్రూ జూపార్కులో యువకుడి హల్‌చల్‌..

Published Tue, Nov 23 2021 7:09 PM | Last Updated on Tue, Nov 23 2021 9:04 PM

Man Jumps Into Lion Enclosure At Nehru Zoopark In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్కులో ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ క్రమంలో యువకుడు.. సింహం ఎన్‌క్లోజర్‌లో దూకేందుకు ప్రయత్నం చేశాడు. చాలా సేపు .. సింహం ఎన్‌క్లోజర్‌కు దగ్గరలోనే కూర్చోని ఉన్నాడు.

దీన్నిగమనించిన సందర్శకులు జూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ యువకుడిని అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడి సందర్శకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement