
‘‘కన్ను కొట్టి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్. ఆమె నటించిన క్రేజీ చిత్రం రైట్స్ మాకు దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అనువాద హక్కులకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను చూసి వాళ్లు రేట్ బాగా పెంచారు. భారీ హీరోకు పెట్టే బడ్జెట్‌తో కొనుగోలు చేశాం. దానికి కారణం సినిమా మీద ఉన్న ప్యాషనే’’ అన్నారు నిర్మాత గురురాజ్. ప్రియా ప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రలో ఒమర్ లూలు రూపొందించిన చిత్రం ‘ఒరు అధార్ లవ్’.
ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సీహెచ్ వినోద్ రెడ్డి సమర్పణలో గురురాజ్ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒమర్ లూలు తీసిన రెండు లవ్ స్టోరీలు సూపర్ హిట్. ఇప్పుడు తీసిన మూడో లవ్‌స్టోరీలో ప్రియా ప్రకాశ్ కన్ను గీటే వీడియా వైరల్ అయ్యాక సినిమాలో మార్పులు, చేర్పులు చేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మాకు దక్కడానికి కారణమైన మిత్రులు సీతారామరాజు, సురేశ్ వర్మకు థ్యాంక్స్. ఇది ప్రేమ కథ అయినప్పటికీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అరవయ్యేళ్ల వాళ్లు కూడా ఇరవయ్యేళ్లవారిలా ఆనందిస్తారు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణమైన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment