vinod reddy
-
టీఆర్ఎస్–బీజేపీలు అధికారం లేకుండా ఉండలేవు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీలు అధికారం లేకుండా ఒక్క క్షణం కూడా మనుగడ సాగించ లేవని, ప్రజల బాగోగుల కన్నా ఆ రెండు పార్టీల కు అధికారమే పర మావధి అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.జి.వినోద్‌రెడ్డి విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన వ్యాఖ్యల ను చూస్తూ ఊరుకుంటున్న టీఆర్ఎస్ ప్రభు త్వ వైఖరి సరైంది కాదని వినోద్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. -
బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు
హిమాయత్‌నగర్:రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తెర వెనుక స్నేహం చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఆర్జీ వినోద్ రెడ్డి విమర్శించారు. హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినా ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. తండ్రితో తిట్లు తింటూ.. కొడుకు కేటీఆర్‌ను పొగుడుతూ తన స్నేహ బంధాన్ని కిషన్‌రెడ్డి బహిర్గతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి పోయాక టీఆర్ఎస్ బండారాలు, అవినీతిని బయట పెడతానంటూ ప్రగల్భాలు పలికిన ఈటల రాజేందర్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు -
అరవయ్యేళ్లవారు కూడా ఎంజాయ్ చేస్తారు
‘‘కన్ను కొట్టి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ప్రియా ప్రకాశ్. ఆమె నటించిన క్రేజీ చిత్రం రైట్స్ మాకు దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అనువాద హక్కులకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను చూసి వాళ్లు రేట్ బాగా పెంచారు. భారీ హీరోకు పెట్టే బడ్జెట్‌తో కొనుగోలు చేశాం. దానికి కారణం సినిమా మీద ఉన్న ప్యాషనే’’ అన్నారు నిర్మాత గురురాజ్. ప్రియా ప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రలో ఒమర్ లూలు రూపొందించిన చిత్రం ‘ఒరు అధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సీహెచ్ వినోద్ రెడ్డి సమర్పణలో గురురాజ్ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒమర్ లూలు తీసిన రెండు లవ్ స్టోరీలు సూపర్ హిట్. ఇప్పుడు తీసిన మూడో లవ్‌స్టోరీలో ప్రియా ప్రకాశ్ కన్ను గీటే వీడియా వైరల్ అయ్యాక సినిమాలో మార్పులు, చేర్పులు చేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మాకు దక్కడానికి కారణమైన మిత్రులు సీతారామరాజు, సురేశ్ వర్మకు థ్యాంక్స్. ఇది ప్రేమ కథ అయినప్పటికీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అరవయ్యేళ్ల వాళ్లు కూడా ఇరవయ్యేళ్లవారిలా ఆనందిస్తారు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణమైన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. -
వైఎస్సార్సీపీ నేత హఠాన్మరణం
కోవూరు: అందరితో కలివిడిగా మెలుగుతూ, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్‌గా పార్టీకి ఎనలేని సేవలందిం చిన ములుమూడి వినోద్‌రెడ్డి(43) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కుటుంబసభ్యుల కథనం మేరకు..కోవూరులోని శాంతినగర్‌లో నివాసం ఉండే వినోద్‌రెడ్డి రోజూ తమ పొలంలోకి వెళ్లి పశువుల పాలు తీసి నెల్లూరులోని సోదరి ఇంట్లో ఇచ్చొస్తారు. అందులో భాగంగానే ఉద యం ఇనమడుగురోడ్డులోని పొలానికి బయలుదేరిన ఆయన మార్గంమధ్యలో పలువురు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. తమ పొలంలోనే జామాయిల్ చెట్లు కొడుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పశువుల వద్దకు వచ్చి పాలుతీస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆయన వద్ద పనిచేసే వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకుని నెల్లూరుకు బయలుదేరారు. పెన్నాబ్రిడ్జి వద్దకు వెళ్లేసరికే విగతజీవి గా మారాడు. అయినా నెల్లూరులోని సింహపురి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ములుమూడి రామచంద్రారెడ్డి కొడుకైన వినోద్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. పలువురి సంతాపం వినోద్‌రెడ్డి మృతితో కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆయన సింహపురి హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మృతదేహంతో కోవూరు శాంతినగర్‌లోని వినోద్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వినోద్‌రెడ్డి కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వివాదరహితుడైన వినోద్‌రెడ్డి తమ మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. సాయంత్రం వినోద్‌రెడ్డి మృతదేహానికి సమీప బంధువు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్ పి.రూప్‌కుమార్‌యాదవ్ నివాళుర్పించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, కోవూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుబ్బరామిరెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, పడుగుపాడు సర్పంచ్ గడ్డం రమణమ్మ, కోవూరు ఉపసర్పంచ్ ఇంతా మల్లారెడ్డితో పాటు పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు వినోద్‌రెడ్డి మృతదేహాన్ని కడసారి దర్శించుకున్నారు. ఆయన మృతిపై వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ కోవూరు ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు రవీంద్రబాబు సంతాపం తెలిపారు.