
వినోద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్, బీజేపీలు అధికారం లేకుండా ఒక్క క్షణం కూడా మనుగడ సాగించ లేవని, ప్రజల బాగోగుల కన్నా ఆ రెండు పార్టీల కు అధికారమే పర మావధి అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.జి.వినోద్‌రెడ్డి విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన వ్యాఖ్యల ను చూస్తూ ఊరుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభు త్వ వైఖరి సరైంది కాదని వినోద్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.