సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణకు పరాయివా డు, కిరాయివాడు అయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. బిహార్‌తో కేసీఆర్‌కు రక్తసంబంధం ఉందని, అందుకే తెలంగాణలో బిహార్ అధికారుల రాజ్యం నడుస్తోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాలం చెల్లిపోయిందని, బిహార్‌కు పారిపోవడం ఖాయమన్నారు.
అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని, దీని వెనుక టీఆర్‌ఎస్, బీజేపీలు న్నాయని రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలను కలవని కేసీఆర్ పక్క రాష్ట్రం వారిని కలు స్తున్నారని, వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని రేవంత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment