నెయ్యితో బరువు తగ్గొచ్చు..! | Would You Believe That Ghee Can Make You Lose Weight? | Sakshi
Sakshi News home page

నెయ్యితో బరువు తగ్గొచ్చు..!

Published Wed, Apr 27 2016 1:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

నెయ్యితో బరువు తగ్గొచ్చు..!

నెయ్యితో బరువు తగ్గొచ్చు..!

నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో కొవ్వు పెరిగిపోతుందని భయపడతాం. శరీర బరువు తగ్గించుకోవాలన్నపుడు భోజనంలో నెయ్యి వాడకం మానేస్తాం. అలాగే నెయ్యితో తయారు చేసే స్వీట్లు, వంటకాలకు దూరంగా ఉంటాం.  అయితే నెయ్యి తినడం వల్ల బరువు తగ్గుతారంటే నమ్ముతారా? అవును ఇది నజంగానే అధిక క్యాలరీలు కలిగిన పదార్థమే అయినా... నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడ ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలోనూ విరివిగా వాడే నెయ్యి వల్ల బరువు తగ్గుతారని, దీనికి తోడు అనేక ప్రయోజనాలు కూడ ఉన్నాయని చెప్తున్నారు.

నెయ్యిని రోజువారీ ఆహరంలో వినియోగించి ఆరోగ్యాన్ని పొందవచ్చని  డైటీషియన్లు సూచిస్తున్నారు. కొబ్బరి, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే నెయ్యి కూడ కలిగి ఉంటుందంటున్నారు. కొద్దిపాటి ఆమ్లాలు కలిగిన కొవ్వు మాత్రమే కలిగి ఉండే నెయ్యిని... కాలేయం స్వయంగా కరిగించుకొని.. శరీరానికి మంచి శక్తినిస్తుందని చెప్తున్నారు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడంవల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలకు దూరం కావొచ్చని, నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ ఆమ్లం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు.

నెయ్యిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం, అలాగే ఒమేగా-3 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. అంతేకాక నెయ్యి మాయిశ్చురైజర్ గా కూడ ఉపయోగ పడుతుంది. పొడిచర్మంతో బాధపడేవారికి, పెదాలు పగిలిపోయే సమస్య ఉన్నవారికి నెయ్యి సహకరించి మృదుత్వాన్ని చేకూరుస్తుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు మందుగా కూడ నెయ్యి ఉపకరిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నెయ్యిలో ఉండే బటిరిక్ ఆమ్లాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కడుపులో ఉండే గ్యాస్ ను బయటకు పంపించి, జీర్ణశక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది.

నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శరీరంలోని శక్తిహీనతను తగ్గించి కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని రక్షిస్తూ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు సహకరిస్తుంది. ఎ, డి, ఇ, కె, విటమిన్లను కూడ కలిగి ఉండే నెయ్యి... ప్రతిరోజూ భోజనంలో ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించడం కన్నా నెయ్యిని వినియోగించడం ఎంతో శ్రేయస్కరమంటున్నారు. సౌందర్య సాధనంగా కూడ నెయ్యిని వినియోగించవచ్చని, భారత మహిళలు పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా నెయ్యిని వినియోగిస్తారని, తల్లోని చర్మానికి పట్టిస్తే జుట్టు పెరుగుదలను కూడ మెరుగుపరుస్తుందని నమ్ముతారని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement