make
-
ఐకామ్ ప్లాంటులో కారకల్ ఆయుధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది. -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కొత్తూరు: సెప్టెంబర్ 2వ తేదీన కార్మికుల సమస్యలపై పలు కార్మిక సంఘాల అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఇందులో భాగంగా పలు కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆదివారం కొత్తూరు పారిశ్రామికవాడ సమీపంలో కార్మికులతో కలిసి గేటు మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక చట్టాల సవరణ వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేçస్తూ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకొస్తున్నట్లు ఆరోపించారు. కార్మికవర్గానికి అన్యాయం చేసే మోదీ విధానాలను సమ్మెద్వార ఎండగట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా భూసేకరణ చట్టం ద్వార బలవంతంగా పేద రైతుల పొలాలను కార్పొరేట్ పరిశ్రమలకు ప్రభుత్వం అప్పగిస్తుందన్నారు. పేద రైతుల పొలాలను లాక్కోవడం, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యాక్షుడు పానుగంటి పర్వతాలు, సీఐటీయూ మండల కార్యదర్శి బీసా సాయిబాబా, నాట్కో కెమికల్ డివిజన్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్‌గౌడ్, నాట్కోఫార్మా ప్రధాన కార్యదర్శి మురహరిరెడ్డి, ఏకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నెయ్యితో బరువు తగ్గొచ్చు..!
నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో కొవ్వు పెరిగిపోతుందని భయపడతాం. శరీర బరువు తగ్గించుకోవాలన్నపుడు భోజనంలో నెయ్యి వాడకం మానేస్తాం. అలాగే నెయ్యితో తయారు చేసే స్వీట్లు, వంటకాలకు దూరంగా ఉంటాం. అయితే నెయ్యి తినడం వల్ల బరువు తగ్గుతారంటే నమ్ముతారా? అవును ఇది నజంగానే అధిక క్యాలరీలు కలిగిన పదార్థమే అయినా... నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడ ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలోనూ విరివిగా వాడే నెయ్యి వల్ల బరువు తగ్గుతారని, దీనికి తోడు అనేక ప్రయోజనాలు కూడ ఉన్నాయని చెప్తున్నారు. నెయ్యిని రోజువారీ ఆహరంలో వినియోగించి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొబ్బరి, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే నెయ్యి కూడ కలిగి ఉంటుందంటున్నారు. కొద్దిపాటి ఆమ్లాలు కలిగిన కొవ్వు మాత్రమే కలిగి ఉండే నెయ్యిని... కాలేయం స్వయంగా కరిగించుకొని.. శరీరానికి మంచి శక్తినిస్తుందని చెప్తున్నారు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడంవల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలకు దూరం కావొచ్చని, నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ ఆమ్లం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు. నెయ్యిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం, అలాగే ఒమేగా-3 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. అంతేకాక నెయ్యి మాయిశ్చురైజర్ గా కూడ ఉపయోగ పడుతుంది. పొడిచర్మంతో బాధపడేవారికి, పెదాలు పగిలిపోయే సమస్య ఉన్నవారికి నెయ్యి సహకరించి మృదుత్వాన్ని చేకూరుస్తుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు మందుగా కూడ నెయ్యి ఉపకరిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నెయ్యిలో ఉండే బటిరిక్ ఆమ్లాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కడుపులో ఉండే గ్యాస్ ను బయటకు పంపించి, జీర్ణశక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శరీరంలోని శక్తిహీనతను తగ్గించి కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని రక్షిస్తూ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు సహకరిస్తుంది. ఎ, డి, ఇ, కె, విటమిన్లను కూడ కలిగి ఉండే నెయ్యి... ప్రతిరోజూ భోజనంలో ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించడం కన్నా నెయ్యిని వినియోగించడం ఎంతో శ్రేయస్కరమంటున్నారు. సౌందర్య సాధనంగా కూడ నెయ్యిని వినియోగించవచ్చని, భారత మహిళలు పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా నెయ్యిని వినియోగిస్తారని, తల్లోని చర్మానికి పట్టిస్తే జుట్టు పెరుగుదలను కూడ మెరుగుపరుస్తుందని నమ్ముతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. -
కొడుకుల కోసం గాడిద స్వారీ..!
అహ్మదాబాద్ః ఎవరినైనా అవమానించాలనుకున్నపుడు, శిక్ష విధించాలనుకున్నపుడు వారికి గుండు గీయించి, లేదా ముఖానికి నల్ల రంగు పూసి గాడిదపై ఊరేగించడం దక్షిణాసియా రాష్ట్రాల్లో పురాతన ఆచారంగా కనిపిస్తుంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో నేటికీ అటువంటి ఆచారం ఒకటి కొనసాగుతోంది. అయితే దాని వెనుక కారణం మాత్రం భిన్నంగా ఉంది. గాడిదపై ఊరేగితే కొడుకులు పుడతారన్నది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు... దానిపై ఊరేగేందుకు ప్రజలు ఏకంగా వెయిటింగ్ లిస్టులో ఉండటం విశేషం. గుజరాత్ జనగథ్ జిల్లా బోర్ వావ్ గ్రామానికి చెందిన రమేష్ సువాగియా అనే 38 ఏళ్ళ రైతు గాడిదను ఎక్కేందుకు ముందుగా తన ముఖానికి నల్లని రంగు పూసుకున్నాడు. గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ బిక్షమెత్తేందుకు సిద్ధమయ్యాడు. గురువారం సంప్రదాయ పండుగ 'ధులేటి' (వారసులకోసం జరిపే పండుగ) సందర్భంలో తమ గ్రామంలో ఆచారంగా వస్తున్న గాడిదస్వారీ చేసేందుకు వేచిఉన్నవారిలో రమేష్ ఒకడు. పూర్వకాలంనుంచీ 'రాంగ్' పేరున గ్రామంలో ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పండుగనాడు గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ అందరివద్దా గోధుమలు, డబ్బును వసూలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ఒకప్పుడు పక్షుల మేతకోసమే ప్రారంభమైనట్లు చెప్తారు. ఇలా వసూలు చేసిన వాటిని సంవత్సరమంతా అక్కడి పక్షుల మేతకు వినియోగిస్తుంటారు. అయితే ఇదే సంప్రదాయంలో భాగంగా ఇలా చేస్తే వారసులు జన్మిస్తారన్న నమ్మడంతో కొడుకులు పుట్టాలనుకున్నవారు దీన్ని కొనాసాగిస్తున్నారు. నాకు 17, 6 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఈ సంప్రదాయాన్ని నేను ఏడేళ్ళక్రితం పాటించడం ప్రారంభించానని చెప్తున్నాడు రమేష్. తమ నమ్మకాన్ని మరింత పెంచే విధంగా గతేడాది తనకు కొడుకు పుట్టాడని, గాడిదపై ఊరేగుతూ ఈ సంప్రదాయం కొనసాగించడంలో తమకెటువంటి సంకోచం లేదని రమేష్ సువాగియా చెప్తున్నాడు. వచ్చే ఐదేళ్ళలో రాంగ్స్ పద్ధతిని పాటించేందుకు గ్రామంలోని సుమారు పది కుటుంబాలు ప్రతిజ్ఞ చేసి, వేచి చూస్తున్నాయని, ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తాము రెండు గాడిదలను అందుబాటులో ఉంచామని డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ వాడి తెలిపారు. అయితే ఈ ఆచారం దశాబ్దాలుగా కొడుకు పుట్టాలని కోరుతూ కొనసాగుతోందని, మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు పిల్లల్లేని దంపతులు, ఆడపిల్లల కోసం కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నామని సర్పంచ్ ప్రకాష్ గిరి అపర్నాథ్ తెలిపారు. -
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు. -
....చూస్తేనే వాంతి వస్తోంది!
సైబర్ సిక్నెస్... ఆధునిక యుగంలో ఓ కొత్త వ్యాధిగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధితో బాధపడేవారు నీరస పడిపోవడంతో పాటు... ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరిలో వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్న జనాభాలో 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది. స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఢెభ్భై ఏళ్ళ అమ్మమ్మలు, తాతలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులతో, స్నేహితులతో టచ్ లో ఉండగల్గుతున్నారు. ''మా కూతురు దుబాయ్ లో, మా అక్క ఫ్రాన్స్ లో, మా బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతున్నాను. వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూడగల్గుతున్నాను'' అంటుంది ఆగ్నేయ వేల్స్ లోని మన్‌మౌత్ షైర్ దేశానికి చెందిన 76 ఏళ్ళ జూన్. ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. అయితే ప్రస్తుతం జూన్ సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి. ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. తైవాన్ లోని కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు. అందులో సగంకంటే ఎక్కువ మంది.. ముఖ్యంగా పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు. ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్ లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్ టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని.. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పో్ర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు. అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ. ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు. వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు. -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు. -
ఐటీలో ఏపీని అగ్రగామిగా చేస్తాం
-
ముక్తికి మార్గం వైకుంఠ ద్వారం
నేడు ముక్కోటి ఏకాదశి వేడుకలు సర్వాంగ సుందరంగా ఆలయాల ముస్తాబు అనంతపురం కల్చరల్ : భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ విశిష్టత ఉంది. ప్రతి పర్వదినం వెనుక శాస్త్రీయ దృక్కోణం ఉంది. ఆ పరంపరలో భాగంగా ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఆస్తిక జనులకు బ్రహ్మానందాన్ని కల్గిస్తుంది. ముఖ్యంగా నగరంలో కలియుగ వైకుంఠాన్ని తలపించే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలలో అర్ధరాత్రి నుంచే భక్తజనం పోటెత్తుతారు. ఆరు నెలలు పగలని, ఆరు నెలలు రాత్రి అని పురాణాలు చెపుతున్నాయి. తొలి అర్ధభాగంలో దక్షిణాయనంగాను, మలి అర్ధ భాగం ఉత్తరాయనంగాను లెక్కిస్తారు. చీకటికి ప్రతిరూపమైన దక్షిణాయనం నుంచి వెలుగు రేఖలు ప్రసరించే ఉత్తరాయనంలోనికి దేవతలు ప్రవేశించే తొలి తిథిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ పవిత్ర దినాన వివిధ పూజోత్సవాలను నిర్వహించుకుంటాం. అలాగే శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసవ్రతం పాటించాలని, ప్రాతఃకాల పూజలను నిష్టగా ఆచరించాలని చెపుతారు. ముఖ్యంగా ‘వైకుంఠ ద్వార దర్శనం’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాబట్టే వైష్ణావాలయాలలో ఏకాదశి రోజున ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు. వైకుంఠ ద్వార ప్రవేశం సకల పాప హరణమని, ముక్తికి సులభ మార్గమన్నది అందరి విశ్వాసం. అదీ సూర్యోదయం ముందే దర్శించుకోలేని వారు సాయంత్రంలోపు స్వామివారి ఆశీస్సులందుకోవాలన్నారు. ముస్తాబైన ఆలయాలు : ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైనాయి. ప్రధానంగా ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, పాతూరులోని ప్రాచీన చెన్నకేశవాలయం, శ్రీనివాస నగర్‌లోని బాలాజీ మందిరం, రెవెన్యూ కాలనీలోని రామాలయం, హౌసింగ్‌బోర్డులోని వేంకటేశ్వరాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వంటివి విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా వైకుంఠ ద్వారాలను వినూత్న రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ సారి కొత్త సంవత్సరం, ముక్కోటి ఏకకాలంలో రావడంతో సాక్షాత్తు కలియుగ వైకుంఠాన్ని తలపించే విధంగా ప్రతి దేవాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకోనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఆలయూల వద్ద ఏర్పాటు చేశారు. ఈ రోజున తామర, జాజి, తులసి మాలలతో పూజించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తజన సందోహంతో రోడ్లన్ని కిక్కిరిసిపోతాయి. వైకుంఠ ఏకదాశికి పెన్నహోబిళం ముస్తాబు... పెన్నహోబిళం(ఉరవకొండ రూరల్) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయుం నేడు అత్యంత వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. ఆలయు ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు మాట్లాడుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే స్వామిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు అని తెలిపారు. ప్రత్యేక హోవూలు, లక్ష కుంకువూర్చన కార్యక్రవూలు జరుగుతాయుని పేర్కొన్నారు. ప్రాతఃకాల దర్శనం సర్వ శ్రేష్టం అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువు శ్రీదేవి భూదేవి సహితంగా ఉత్తరాయన ప్రారంభంలో ఉత్తర ద్వారం వద్దకు రాగా ముక్కోటి దేవతలు ఆయనను సేవించుకున్నారన్నది శాస్త్రోక్తి. ఈరోజున సకల దేవతారాధ్యుడు అయిన శ్రీమన్నారాయణుని పాదపద్మములను నియమనిష్టలతో అర్చించిన వారికి విశేష పుణ్యఫలం దక్కుతుందని విష్ణుపురాణం చెపుతోంది. ముఖ్యంగా స్వామివారిని సూర్యోదయానికి ముందు అంటే ప్రాతఃకాలంలోనే దర్శించుకోవడం అత్యుత్తమం. అవకాశం లేనివారు ఏకాదశి ముగిసేలోపు ఎప్పుడైనా దర్శించుకుని, పునీతులు కావాలి. ధనుర్మాసంలో తెల్లవారు జామునే లేవడం పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆరోగ్యరిత్యా కూడా చాలా మంచిది. - కొనకంచి సత్యనారాయణ, పండితులు -
ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోండి
చీరాల రూరల్, న్యూస్‌లైన్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి.జనార్దన్ అన్నారు. మంగళవారం ఆయన చీరాల వచ్చిన సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాలలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన 2008 నుంచి 2013 ఆగస్టు చివరి వరకు జిల్లాలో 83,170 కేసులు నమోదు కాగా అందుకోసం రూ. 235.25 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలానే జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో మూడు ప్రభుత్వ వైద్యశాలలు, ఆరు ప్రైవేటు వైద్యశాలలు పని చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో ఆరోగ్యశ్రీ కింద రోగులను పరీక్షించేందుకు ప్రత్యేక సదుపాయాలున్న రెండు గదులను నిర్మించామన్నారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 938 రకాల కేసులు చూస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట జిల్లా నెట్వర్క్ టీం లీడర్ కిరణ్‌కుమార్, స్థానిక ఆరోగ్యమిత్ర మురళి ఉన్నారు.