ముక్తికి మార్గం వైకుంఠ ద్వారం | The way to salvation entrance to Vaikuntha | Sakshi
Sakshi News home page

ముక్తికి మార్గం వైకుంఠ ద్వారం

Published Thu, Jan 1 2015 5:26 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

The way to salvation entrance to Vaikuntha

  • నేడు ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • సర్వాంగ సుందరంగా ఆలయాల ముస్తాబు
  • అనంతపురం కల్చరల్ : భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ విశిష్టత ఉంది. ప్రతి పర్వదినం వెనుక శాస్త్రీయ దృక్కోణం ఉంది. ఆ పరంపరలో భాగంగా ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఆస్తిక జనులకు బ్రహ్మానందాన్ని కల్గిస్తుంది. ముఖ్యంగా నగరంలో కలియుగ వైకుంఠాన్ని తలపించే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలలో అర్ధరాత్రి నుంచే భక్తజనం పోటెత్తుతారు. ఆరు నెలలు పగలని, ఆరు నెలలు రాత్రి అని పురాణాలు చెపుతున్నాయి.

    తొలి అర్ధభాగంలో దక్షిణాయనంగాను, మలి అర్ధ భాగం ఉత్తరాయనంగాను లెక్కిస్తారు. చీకటికి ప్రతిరూపమైన దక్షిణాయనం నుంచి వెలుగు రేఖలు ప్రసరించే ఉత్తరాయనంలోనికి దేవతలు ప్రవేశించే తొలి తిథిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ పవిత్ర దినాన వివిధ పూజోత్సవాలను నిర్వహించుకుంటాం. అలాగే శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసవ్రతం పాటించాలని, ప్రాతఃకాల పూజలను నిష్టగా ఆచరించాలని చెపుతారు. ముఖ్యంగా ‘వైకుంఠ ద్వార దర్శనం’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

    కాబట్టే వైష్ణావాలయాలలో ఏకాదశి రోజున ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు. వైకుంఠ ద్వార ప్రవేశం సకల పాప హరణమని, ముక్తికి సులభ మార్గమన్నది అందరి విశ్వాసం. అదీ సూర్యోదయం ముందే దర్శించుకోలేని వారు సాయంత్రంలోపు స్వామివారి ఆశీస్సులందుకోవాలన్నారు.   
     
    ముస్తాబైన ఆలయాలు : ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైనాయి. ప్రధానంగా ఆర్‌ఎఫ్ రోడ్డులోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, పాతూరులోని ప్రాచీన చెన్నకేశవాలయం, శ్రీనివాస నగర్‌లోని బాలాజీ మందిరం, రెవెన్యూ కాలనీలోని రామాలయం, హౌసింగ్‌బోర్డులోని వేంకటేశ్వరాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వంటివి విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా వైకుంఠ ద్వారాలను వినూత్న రీతిలో తీర్చిదిద్దుతున్నారు.

    ఈ సారి కొత్త సంవత్సరం, ముక్కోటి ఏకకాలంలో రావడంతో  సాక్షాత్తు కలియుగ వైకుంఠాన్ని తలపించే విధంగా ప్రతి దేవాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకోనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఆలయూల వద్ద ఏర్పాటు చేశారు. ఈ రోజున తామర, జాజి, తులసి మాలలతో పూజించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తజన సందోహంతో రోడ్లన్ని కిక్కిరిసిపోతాయి.

    వైకుంఠ ఏకదాశికి  పెన్నహోబిళం ముస్తాబు...

    పెన్నహోబిళం(ఉరవకొండ రూరల్) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయుం నేడు అత్యంత వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. ఆలయు ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు మాట్లాడుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే స్వామిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు అని తెలిపారు. ప్రత్యేక హోవూలు, లక్ష కుంకువూర్చన కార్యక్రవూలు జరుగుతాయుని పేర్కొన్నారు.
     
    ప్రాతఃకాల దర్శనం సర్వ శ్రేష్టం

    అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువు శ్రీదేవి భూదేవి సహితంగా ఉత్తరాయన ప్రారంభంలో ఉత్తర ద్వారం వద్దకు రాగా ముక్కోటి దేవతలు ఆయనను సేవించుకున్నారన్నది శాస్త్రోక్తి. ఈరోజున సకల దేవతారాధ్యుడు అయిన శ్రీమన్నారాయణుని పాదపద్మములను నియమనిష్టలతో అర్చించిన వారికి విశేష పుణ్యఫలం దక్కుతుందని విష్ణుపురాణం చెపుతోంది. ముఖ్యంగా స్వామివారిని సూర్యోదయానికి ముందు అంటే ప్రాతఃకాలంలోనే దర్శించుకోవడం అత్యుత్తమం. అవకాశం లేనివారు ఏకాదశి ముగిసేలోపు ఎప్పుడైనా దర్శించుకుని, పునీతులు కావాలి. ధనుర్మాసంలో తెల్లవారు జామునే లేవడం పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆరోగ్యరిత్యా కూడా  చాలా మంచిది.            
    - కొనకంచి సత్యనారాయణ, పండితులు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement