ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్.
ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment