
కొబ్బరినూనె, నెయ్యి, బ్లూకలర్ శోభితా ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్
అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఆనందంగా ఉండటం కూడా ముఖ్యం
నటి,హీరో అక్కినేని నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ గ్లామరస్ గౌనులో అయినా క్లాసిక్ చీరలో అయినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ బ్యూటీ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సాంప్రదాయ సౌందర్య సాధనాలే తన బ్యూటీ సిక్రెట్ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించింది.
వోగ్ బ్యూటీస్కోప్‌తో సంభాషించిన మేడ్ ఇన్ హెవెన్ యాక్టర్ శోభిత తన అందం రహస్యాలు, స్వీయ సంరక్షణకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అందంగా కనిపించడం మాత్రమే కాదు,ఆనందంగా ఉండటం కూడా ముఖ్యమని వివరించింది. స్వీయ సంరక్షణ, ఆత్మవిశ్వాసం ముఖ్యమని నిజమైన అందం లోపలి నుండే వస్తుందని తన నమ్మకని తెలిపింది.
శోభిత అందం రహస్యాలు
తనదైన అందాన్ని కాపాడుకునేందుకు సింపుల్ ,ప్రభావవంతమైన పద్దుతులు పాటిస్తానని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన ,మృదువైన చర్మం కోసం వినియోగించే కొబ్బరి నూనె. అదే తన సీక్రెట్ అని చెప్పింది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్ అని, కొబ్బరి నూనెతో చాలా సమస్యలకు చెక్ చెప్పవచ్చని, తనకు తీవ్రమైన మైగ్రేన్ వచ్చినపుడు ఇది నిజంగా హెల్ప్ చేసిందని తెలిపింది. అలాగే కొద్దిగా కొబ్బరి నూనెను నీటితో కలిపి, స్ప్రే బాటిల్‌లో వేసి, స్ప్రే చేసుకుంటే, తన జుట్టు అణిగి ఉంటుందని చెప్పింది. అంతేకాదు దద్దుర్లు, చర్మం పొడిబారడం ఇలా ప్రతీదానికి కొబ్బరినూనె వాడతానని తెలిపింది.

పెదాలకు నెయ్యికి మించింది మరేదీ లేదు
వివిధ రకాల పెదవి ఉత్పత్తులపై విచ్చలవిడిగా ఖర్చు పెట్టే బదులు, నెయ్యి అంత గొప్ప మాయిశ్చరైజర్ లేదనీ, లిప్ బామ్, లైనర్, కాజల్ వాడినప్పటికీ, పొద్దున్నే తన పెదవులపై నెయ్యి రాసుకుంటానని శోభిత తెలిపింది. పగిలిపోయిన పెదాలకు ఇది తప్పమరేఖరీదైన లిప్‌మాస్క్‌లు పనిచేయవని వెల్లడించింది. షూటింగ్ రోజుల్లో తప్ప భారీ మేకప్ లేకుండా, సాదా సీదాగానే ఉంటానని తెలిపింది. శోభిత తన లుక్స్ కి, నీలిరంగు ఇష్టపడతానని తెలిపింది.తన మానసిక స్థితిని ప్రకటించేలా మస్కారా, ఐషాడో, లిప్‌కలర్ అయినా బ్లూ రంగువే ఇష్టమని చెప్పుకొచ్చింది.
చదవండి: అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
అందం -సమతుల్యత
అందం అంటే చర్మానికి తగ్గట్టుగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండటమే అని శోభిత విశ్వాసం. ఖరీదైన పద్ధతులు, అధునాతన గాడ్జెట్‌ల ప్రపంచంలో కొత్త ట్రెండ్‌లను ఆనందిస్తూనే సాంప్రదాయ సౌందర్య చిట్కాలను పాటించడం తన స్టైల్ అని శోభిత తెలిపింది.
చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ