nag chaitanya
-
పెళ్లికి ముందు చైతూ-శోభిత ఇన్ని ట్రిప్స్ వేశారా? (ఫొటోలు)
-
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Porsche Centre Chennai (@porschecentrechennai)పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌కార్‌తో ఉన్న నాగ చైతన్య ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్‌కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నేచురల్ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్‌తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్పీ పవర్‌ను, 468 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.నాగ చైతన్యకు ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్‌లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర కార్లు ఉన్నాయి. వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య రాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
లాక్మే ఫ్యాషన్ వీక్ : స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ హీరో, ఫోటోలు వైరల్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 ఈ నెల (మార్చి) 17 ఆదివారం దాకా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో మార్చి 13న ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రకరకాల థీమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by Lakmē Fashion Week (@lakmefashionwk) మాగ్నమ్ ఐస్ క్రీం డిప్పింగ్ బార్ థీమ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాగ్నమ్ డిప్పింగ్ బార్లో తమ ఫ్యావరేట్ను ఫ్లావర్ను ఆస్వాదించారు. ఈ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా నిలిచారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో సస్టైనబిలిటీ డేలో ప్రముఖ నటి, మోడల్, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ దియా మీర్జా మెరిసింది. -
Naga Chaitanya: రీల్ లవ్‌స్టోరీ హిట్..కానీ రియల్ ప్చ్..
Naga Chaitanya And Samantha Love Breakup Story In Telugu: గత రెండు నెలల కాలంగా చైసామ్‌ల విడాకుల అంశమే చర్చనీయాంశంగా నిలిచిందంటే అతి శయోక్తి కాదు. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ నాగచైతన్య, సమంత ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ మోస్ట్ లవబుల్ పదేళ్ల బంధానికి ఈ ఏడాది అక్టోబర్‌లో ఎండ్‌కార్డ్ పడింది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. అయినా వీరి బ్రేకప్ తరువాత నవంబరు 23న చై తొలి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మరోసారి తమ అభిమాన జంట గురించి చర్చించు కుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. చై-సామ్‌ల జీవితంలో ‘ఏమాయ చేసావే’ మూవీ పెద్ద మాయ చేసింది. ఇద్దరి సినీ జీవితాలను కీలక మలుపు తిప్పిన సినిమా ఇది. 2010 ఫిబ్రవరి, 26న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌కు సమంత పరిచయం కాగా, చైతుకి విజయాన్ని అందించిన తొలి మూవీ.ఏఆర్ రెహ్మాన్ సంగీతం మరో హైలైట్. ముఖ్యంగా ‘కుందనపు బొమ్మ’గా సామ్‌ను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చై-సామ్లకే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో కూడా మరుపురాని ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది. అలా మొదలైన వీరి ప్రయాణం ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత మజిలీ ద్వారా మరో భారీ హిట్ అందుకున్నారు. అంతలోనే ఈ ఆనందం ముచ్చటగానే మిగిలిపోయింది. ముఖ్యంగా ఫ్యామిలీ స్టోరీగా, సమంత, చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘మనం’ భారీ విజయాన్ని అందుకుంది. చై-సామ్ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచి పోయింది. భార్యాభర్తలుగా చైతు, సమంతా జీవించారు. ఈ మూవీ టైంలో నే వీరి మధ్య బంధంబలపడిందని, వీళ్ల లవ్ ట్రాక్ ఆ తరువాతే తనకు తెలిసిందని ఒక సందర్భంలో నాగ్ స్వయంగా చెప్పారు. నాగచైతన్య, సమంతల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ఇది పెద్దగా విజయంగా సాధించకపోయినా, నటనాపరంగా ఇద్దరూ ఆకట్టు కున్నారు. చైసామ్‌ల వివాహనంతరం వచ్చిన తొలి చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రశంస లందుకుంది. ఇందులో క్రికెటర్‌గా ఎదగాలనుకునే పూర్ణ అనే యువకుడిగా నాగచైతన్య, భర్తను దారికి తెచ్చకున్న శ్రావణిగా సమంత ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఈ సినిమా హిట్ మూవీగా నిలవడమేకాదు, పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇక నందినీరెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ‘ఓ బేబీ’. సామ్ కెరీర్లో మరో మైలు రాయి లాంటిది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీలో 70 ఏళ్ల వృద్ధురాలు బేబీగా సమంత నటన మరో మెట్టును అధిగమించింది. ఇందులో నాగచైతన్య అతిథిపాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వెండితెరపై ప్రేమికులుగా, దంపతులుగా, స్నేహితులుగా మొత్తం ఐదు సినిమాల్లో చై-సామ్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. నిజజీవితంలోనూ చూడ ముచ్చటైన జంటగా ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను కలచి వేసింది. ముఖ్యంగా రీల్ లవ్‌స్టోరీతో భారీ విజయాన్ని అందుకున్న తమ అభిమాన హీరో నాగ చైతన్య రియల్ లవ్‌స్టోరీ బ్రేకప్ను ప్రకటించడం ఇప్పటికీ శరాఘాతమే. -
సుకుమార్ కుమార్తె ఫంక్షన్ : టాలీవుడ్ స్టార్స్ తళుక్కు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ దర్శకుడు సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి ఆసక్తికరంగా మారంది. మహేష్ బాబు ఫ్యామిలీ,నాగ చైతన్య ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తదితర ప్రముఖులు ఈ ఫంక్షన్లో తళుక్కున మెరిసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, అక్కినైని నాగ చైతన్య, సమంత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి దంపతుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తండ్రి, టాలీవుడ్ మన్మధుడు, అక్కినేని నాగార్జునను తలపించేలా యువ సామ్రాట్ చైతూ లుక్ అందరిని కట్టిపడేస్తుంది. క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న చే లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రిన్స్ మహేశ్, ఎన్టీఆర్ కూడా తనదైన స్టయిల్లో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా సుకుమార్ ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సమంత ట్రై చేసిన కొత్త ఆసనం చూశారా
సాక్షి, హైదరాబాద్ : ఫిట్నెస్ మంత్రాతో అభిమానులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి తన యోగాసనంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవల సోషల్ మీడియాలో యోగా ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేస్తున్నసమంత తాజాగా భర్త నాగ చైతన్య తో కలిసి వేసిన ఆసనాల ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. (కొత్త ప్రయాణం) తోటపనితో పాటు, యోగాను కూడా ఇష్టపడతానని చెప్పిన సమంత, భర్తతో కలిసి చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తానన్నారు. తొలిసారి శీర్షాసనం కోసం ప్రయత్నించి విజయం సాధించామంటూ శీర్షాసనం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలి పోర్ట్రయిట్ ఫోటో అంటూ పెంపుడు కుక్క ఫోటోను కూడా ఉంచడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. సమంతా, నాగచైతన్య జంట యోగాలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చేసిన యోగా ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సూపర్ బెస్ట్ ట్రైనర్ అంటూ సంతోష్ గురించి కూడా సమంత ప్రస్తావించారు. -
చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి. -
నాగ చైతన్యకు నా థ్యాంక్స్...
హైదరాబాద్: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న శంకరాభరణం చిత్రంలోని ఒక సాంగ్ మేకింగ్ వీడియోను టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లాంచ్ చేశాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ , హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. 'శంకరాభరణం సినిమాలోని సాంగ్ మేకింగ్ వీడియో నాగ చైతన్య లాంచ్ చేశారు, చైతన్య కు నా థ్యాంక్స్' అంటూ ఈ చిత్ర సమర్పకుడు కోన వెంకట్ ట్వీట్ చేశారు. నిఖిల్, నందిత, అంజలి ప్రధాన పాత్రలుగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'శంకరాభరణం'. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. కథలోని హీరో ఎన్ఆర్ఐ. తనకు సంబంధించిన భూమిని విడిపించుకోవాలనే ఉద్దేశంతో అతడు సొంత ఊరికి వస్తాడు. అక్కడ హీరోకు అనేక ఆటంకాలు , కుట్రలు ఎదురౌతాయి. అయితే వాటినన్నింటినీ ఛేదించి తన భూమిని ఎలా విడిపించుకున్నడన్నదే కథ. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా భాగం బిహర్ లో జరిగింది. 2010లో విడుదలైన 'ఫస్ గయ రే ఒబామా' అనే హిందీ సినిమాకు మూలమనీ, దీనికి సంబంధించిన సౌత్ రైట్స్ మొత్తం తాము తీసుకున్నట్టు కో న వెంకట్ తెలిపారు. నోబెల్ ఆండ్రే ప్రొడక్షన్స్ సహకారంతో కేరళలో మొత్తం 30 సెంటర్లలో శంకరాభరణం విడుదల చేయనున్నట్లు కోన వెంకట్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్.. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు కూడా అందించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. Thank u @chay_akkineni for launching the theme song of SHANKARABHARANAM https://t.co/WW08mIi2rX pic.twitter.com/LsVDSxCvHI — kona venkat (@konavenkat99) November 19, 2015 Thank you so much @chay_akkineni for releasing the Theme of ShankaraBharanam.. Here it is, hope you like it :-) - https://t.co/TdY7nr4X4K — Nikhil Siddhartha (@actor_Nikhil) November 19, 2015