![Lakme Fashion Week 2024Tollywood hero Naga Chaitanya pic goes viral - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/Naga%20Chaitanya%20Lakmefashionweek.jpg.webp?itok=DPGBf_w0)
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 ఈ నెల (మార్చి) 17 ఆదివారం దాకా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో మార్చి 13న ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రకరకాల థీమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మాగ్నమ్ ఐస్ క్రీం డిప్పింగ్ బార్ థీమ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాగ్నమ్ డిప్పింగ్ బార్‌లో తమ ఫ్యావరేట్‌ను ఫ్లావర్‌ను ఆస్వాదించారు. ఈ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా నిలిచారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో సస్టైనబిలిటీ డేలో ప్రముఖ నటి, మోడల్, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ దియా మీర్జా మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment