
నాగచైతన్య-శోభిత ప్రస్తుతం పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

పెళ్లి తర్వాత శీశైలంలో జంటగా కనిపించారు. మొన్నీమధ్యే ముంబైలో రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

పెళ్లి తర్వాత ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతూ-శోభిత తన ప్రేమ సంగతులు బయటపెట్టారు.

గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లు.. పెళ్లికి ముందు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎక్కడ కలిశారో రివీల్ చేశారు.

మొదటగా ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో నాగచైతన్య-శోభిత కలిశారు.

ప్రేమలో పడ్డాక కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌కి వెళ్లారు!

గతేడాది నాగచైతన్య పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోడానికి లండన్ వెళ్లారు. ఈ ఏడాది మార్చిలో మరోసారి లండన్ వెళ్లారు.

రీసెంట్‌గా ఆగస్టులో గోవా వెళ్లగా.. అక్కడే చైతు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు.

దీంతో గోవా నుంచి రాగానే నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.

పెళ్లికి ముందే ఇన్ని హాలీడే ట్రిప్స్‌కి వెళ్లారు గానీ ఎక్కడా బయటపడలేదు.

ఈ ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు ఒకటి రెండు ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో రూమర్స్ మొదలయ్యాయి.

మరి ఇప్పుడు పెళ్లి తర్వాత చైతూ-శోభిత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్తారో?