trips
-
మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్‌ను రద్దు చేస్తున్న నెటిజన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద ట్వీట్‌పై వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రి చేసిన వివాదాస్పద ట్వీట్‌పై భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు టూర్లను రద్దు చేసుకున్న టికెట్ క్లిప్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఫిబ్రవరి 2న వచ్చే నా పుట్టినరోజు కోసం మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. నా ట్రావెల్ ఏజెంట్‌తో దాదాపుగా డీల్‌ని ఖరారు చేశాను. అయితే మాల్దీవుల డిప్యూటీ మినిస్టర్ చేసిన ఈ ట్వీట్ చూసిన వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాను. Was planning to go to Maldives for my birthday which falls on 2nd of feb. Had almost finalised the deal with my travel agent (adding proofs below👇) But immediately cancelled it after seeing this tweet of deputy minister of Maldives. #boycottmaldives pic.twitter.com/hd2R534bjY — Dr. Falak Joshipura (@fa_luck7) January 6, 2024 Sorry Maldives, I have my own Lakshadweep. I am Aatmanirbhar 🔥🇮🇳❤️ pic.twitter.com/kYcvnlLCrF — Akshit Singh 🇮🇳 (@IndianSinghh) January 6, 2024 Had a 3 week booking worth ₹5 lacs from 1st Feb 2024 at Palms Retreat, Fulhadhoo, Maldives. Cancelled it immediately after their Ministers being racists. Jai Hind 🇮🇳#BoycottMaldives #Maldives #MaldivesKMKB pic.twitter.com/wpfh47mG55 — Rushik Rawal (@RushikRawal) January 6, 2024 లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. భారత్ పర్యాటకాన్ని మాల్దీవుల పర్యాటకంతో పోల్చుతూ ఆ దేశ మంత్రులు హేళనగా పోస్టులు చేశారు. దీనిపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు. భారతదేశం, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికంగా మార్పు కనిపించింది. మునుపటి "ఇండియా ఫస్ట్" విధానం నుండి వైదొలగనున్నట్లు సూచనలు ఇచ్చారు. చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవులు, భారతదేశం 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ' వంటి విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
Rishi Sunak: విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ. 4 కోట్లు
యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కన్జర్వేటివ్ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్‌లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్ స్ట్రీట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!) -
ప్రధాని మోదీ ఫారిన్ టూర్ల ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ఇప్పటి వరకు అయితే విదేశీ పర్యటనల ఖర్చు 22. 76 కోట్ల రూపాయలకుపై మాటేనని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కాలంలో మోదీ 21 విదేశీ పర్యటనలు చేశారని, ఈ పర్యటనల కోసం రూ. 22.76 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2019 నుండి, ప్రధాని జపాన్ను మూడుసార్లు, అమెరికా, యుఎఇలను రెండుసార్లు సందర్శించారు. అలాగే 2019 నుండి రాష్ట్రపతి ఎనిమిది పర్యటనలలో అప్పటి దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఏడు, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక విదేశీ పర్యటన ( గత సెప్టెంబర్‌లో యూకేనుసందర్శించారు) ఈ పర్యటనల కోసం రూ. 6.24 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 2019 రాష్ట్రపతి ఎనిమిది విదేశీ పర్యటనల మొత్తం ఖర్చు 6,24,31,424, ప్రధానమంత్రి పర్యటన ఖర్చు రూ.22,76,76,934 అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 86 విదేశీ పర్యటనలు చేయగా దీని వ్యయం రూ. 20,87,01,475 అని కేంద్రం వెల్లడించింది. -
టీచర్స్ ట్రిప్ ఫైల్ని క్లియర్ చేయాల్సిందే! వెనక్కి తగ్గని ఆప్
ఉపాధ్యాయుల శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ప్రతిపాదనపై ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వివాదం ముదురుతోందే తప్ప పుల్‌స్టాప్ పడటం లేదు. మరోవైపు ఆప్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్స్‌ని శుక్రవారం మళ్లీ పంపించింది. ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో ఒక గవర్నర్ అడ్డంకిగా మారకూడదని ఆప్ గట్టిగా వాదిస్తోంది. ఆయన వెంటనే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సిందేనని ఆప్ పట్టుబడుతోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లను గవర్నర్ అడిగే అవకాశం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతేగాదు టీచర్ ట్రిప్‌కి సంబంధించిన ప్రతిపాదన ఫైల్ని క్లియర్ చేయమంటూ ఆప్ మళ్లీ గవర్నర్‌కి పంపించడం గమనార్హం. (చదవండి: ప్రైమరీ టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ: ఆప్ వర్సస్ గవర్నర్ మధ్య రగడ) -
డబ్ల్యూహెచ్ఓ పనితీరులో సంస్కరణల కోసం పిలుపునిచ్చిన మోదీ!
WHO must be reformed, India ready to play key role: గురువారం జరిగిన రెండవ గ్లోబల్ కోవిడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సరఫరా గొలుసులు స్థిరంగా ఉంచడానికి వ్యాక్సిన్లు, చికిత్సవిధానాల కోసం డబ్ల్యూహెచ్ఓ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కు(ట్రిప్స్)ల ఒప్పందాలు మరింత సరళంగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు మోదీ సదస్సులో కరోనా విషయమై మాట్లాడుతూ..." కోవిడ్ మహమ్మారి విషయంలో భారత్ సమిష్టి కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించింది. మేము వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయించాం. భారత్‌లోని వ్యాక్సినేషన్ ప్రక్రియ అతి పెద్దది. భారత్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్లను తయారు చేయడమే కాకుండా ఐదు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేము 98 దేశాలకు 200 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను సరఫరా చేశాం. అతి తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స పొందేలా సరికొత్త వైద్యా విధానాన్ని అభివృద్ధి చేశాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మేము సంప్రదాయ ఔషధాలకు పెద్ధ పీఠవేశాం. గత నెలలో ఈ పురాతన జ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మేము భారత్‌లో 'డబ్ల్యూహెచ్ఓ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్'కి పునాది వేశాం" అని అన్నారు. (చదవండి: ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ) -
అందరం మనమే ఆనందం మనదే
ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్ స్త్రీలు. అక్కడి ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ కోవిడ్ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్ ఈ గ్రూప్‌ను నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. సెప్టెంబర్ 20, 2020న ఇండోర్‌లో ఒక ఈవెంట్ జరిగింది. దానిని ఆర్గనైజ్ చేసింది ఆ నగరంలో ఉన్న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’. దాని స్థాపకురాలు శ్రేష్టా గోయల్. ఆ ఈవెంట్ పేరు ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’. ఇండియాలో కార్లున్న లక్షలాది ఇళ్లల్లో స్త్రీలకు ఆ ఇళ్లలోని వంట గదులో, వరండాలో అప్పజెబుతుంటారు డ్రైవింగ్ చేయడానికి కారు మాత్రం ఇవ్వరు. ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కారులో కూచోబెట్టి ఊరికో, ఉద్యోగానికో తీసుకెళ్లి దింపుతారు కాని స్టీరింగ్ అప్పజెప్పరు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే సేఫ్ డ్రైవర్లని తేలింది. అయినా సరే స్త్రీలకు కారు డ్రైవింగ్ ఇంకా నిరాకరింపబడే విషయంగానే ఉంది. అందుకే శ్రేష్టా ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. 10 రోజులు 200 మంది సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ దేశంలోని ఐదారు రాష్ట్రాలు, కేరళతో సహా కార్లు డ్రైవ్ చేసే స్త్రీలు వారు గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్‌లో తమ వాహనాలతో తిరిగారు. ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’ అని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో, మధ్యప్రదేశ్‌లో, ఇతరరాష్ట్రాలలో వివిధ శాఖలలో పని చేస్తున్న స్త్రీలు.. ముఖ్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు స్త్రీలను ఉత్సాహపరచడానికి వీడియోలు విడుదల చేశారు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనాన్ని నడపడం తెలియాలి. ఈ స్కిల్ స్త్రీలకు చాలా ముఖ్యం. కారు నడపడం లగ్జరీ కాదు. అవసరం. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఒంటరి కారు ప్రయాణాలు చేయగలరు. అడ్వంచర్లు చేయగలరు. నేనైతే కారులో జైపూర్ నుంచి బద్రీనాథ్‌కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. రాక్ ది రోడ్స్’ అంటూ ఇండోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అర్యామా సన్యాల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘డ్రైవింగ్ చేస్తే ఫోకస్ తెలుస్తుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ ఒక వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ విజయవంతమైంది. స్త్రీలు తమ డ్రైవింగ్ అనుభవాలు పంచుకుని స్త్రీలను ఉత్సాహపరిచారు. దీని కారకులలో ముఖ్యురాలు శ్రేష్టా గోయల్. అడ్వెం‘టూర్’ ఇండోర్‌లో ఒక ఫార్మాసూటికల్ కంపెనీ సి.ఇ.ఓ అయిన శ్రేష్టా గోయల్ తనకు అత్యంత ఇష్టమైన విషయం తన జిప్సీని డ్రైవ్ చేయడమే అని చెప్పుకుంటారు.‘జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అని చెబుతారామె. అందుకనే ఇండోర్‌లో ఆమె ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించారు. కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలు ఈ గ్రూప్‌లో సభ్యులు. ఇంటికి, ఉపాధికి సమయం ఇస్తూనే తమదంటూ జీవితాన్ని లోకం చూడటం ద్వారా గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్ ద్వారా ఒక చోట చేరారు. ‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ఈ టూర్లను అడ్వెంటూర్లని అంటారు. రెండు మూడు నెలలకోసారి వీరో పర్యటనను ప్లాన్ చేస్తారు. ‘అందరం మనమే ఆనందం మనదే’ అన్నట్టు తిరుగుతారు. నదులు, పర్వతాలు, అడవులు వీరి పర్యటనా స్థానాలు. అడపాదడపా ఇంటికి వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు పిండివంటలు ఇంటి అలంకరణలు... ఈ పని ఎలాగూ తప్పదు. దానికి సిద్ధమయ్యే ముందు ఈ లాక్డౌన్ ఇచ్చిన వొత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఒక విహారం అవసరం అని అక్టోబర్ 9న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ సభ్యులు ఇండోర్ నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు. చాలా బాగా అనిపించింది’ అంది శ్రేష్టా గోయల్. ఇండోర్‌లోనే కాదు దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఇలాంటి బృందాలు అవసరం అనిపిస్తుంది వీరిని చూస్తుంటే. -
బుల్లెట్ ట్రైన్ : రోజుకు 70 ట్రిప్పులు
సాక్షి, అహ్మదాబాద్ : ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు కేవలం రెండుగంటల్లో చేర్చే బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టి షెడ్యూల్ టైమ్‌లో పట్టాలెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) వేగవంతం చేసింది. ముంబయి నుంచి సబర్మతికి ఫాస్ట్ ట్రైన్ రెండు గంటల్లో, రూట్లోని 12 స్టేషన్లలో ఆగే బుల్లెట్ ట్రైన్ రెండుగంటల 58 నిమిషాల్లో గమ్యస్ధానాలకు చేరుకుంటాయని ఎన్హెచ్ఎస్ఆర్సీ అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రతి 20 నిమిషాలకూ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటుందని ఎన్హెచ్ఎస్ఆర్సీ పీఆర్ఓ ధనంజయ్ కుమార్ చెప్పారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిమీ వేగంతో దూసుకుపోతుందని, రోజుకు 70 ట్రిప్పులు నడపాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు ఏడుగంటల సమయం పడుతుండగా, విమాన ప్రయాణానికి గంట సమయం పడుతోంది. -
‘పట్నం’ పల్లెటూర్!
♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి క్షేత్రస్థారుు పర్యటనలు ♦ పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు నిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇకపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేం దర్‌రెడ్డి పల్లెబాట పట్టనున్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్న ఆమె ఇక పనుల నాణ్యతపై క్షేత్రస్థారుు పర్యటన చేయనున్నారు. జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తరుున నేపథ్యంలో మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పనులను తనిఖీచేసి నాణ్యతను పరిశీలించనున్నారు. ఈ మేరకు క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్న ఆమె.. వీటిని మరింత ముమ్మరం చేయాలని నిర్ణరుుంచారు. యాలాల మండలం తిమ్మారుుపల్లిని దత్తత తీసుకున్న సునీత.. ఈ గ్రామంలో ఇటీవల ఒకేసారి ఐదు వేల మొక్కలు నాటి రికా ర్డు సృష్టించారు. బహిరంగ మల విసర్జన, మద్యపాన నిషేధం, పారిశుద్ధ్య నిర్వహణపై విసృ్తత ప్రచారం చేపట్టారు. దీనికితోడు తాండూరులో ప్లాస్టిక్ నిషే ధంపై కూడా ప్రత్యేక చొరవ చూపుతు న్నారు. భూగర్భజలాల వృద్ధికి ఇంకుడుగుంతల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు సునీత ‘సాక్షి’కి వివరించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరు గుపరిచి.. ఉత్తీర్ణతాశాతం పెంపొందించే దిశగా కార్యక్రమాలు చేపడతామన్నారు. -
ట్రెక్కింగ్‌కి ఈ వస్తువులు తప్పనిసరి...
వర్షాకాలం టూల్ టార్చ్: వర్షాకాలం ప్రయాణాలు పెట్టుకున్నవారికి ముఖ్యంగా ట్రెక్కర్స్‌కి టూల్ టార్చ్ చాలా అవసరం. టార్చ్‌లైట్, కత్తి, పట్టకార, ప్లైర్, కంపాస్ రోల్డ్... ఇవన్నీ ఒకే దాంట్లో కలిపి ఉంటే వెంట తీసుకెళ్లడం చాలా సులువు. హిట్‌ప్లే.ఇన్‌లో ఇది రూ.1,499కే లభిస్తుంది. దోమల నివారణ బ్యాండ్ ప్రయాణంలో ఎక్కడికెళ్లినా రాత్రిపూట దోమల బెడద తప్పదు. ఆరుబయట ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. అందులోనూ దోమలు ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. దోమల నివారణ బ్యాండ్ (మస్కిటో రిపెల్లింగ్ బ్యాండ్) పిల్లల చేతికి తొడిగితే మీ ఆందోళన తీరుతుంది. ఇవి పిల్లలను ఆకట్టుకునే లిజార్డ్, కప్ప, బ్యాట్, సాలీడు.. వంటి రకరకాల మోడల్స్‌లో లభిస్తున్నాయి. రెండు బ్యాండ్స్ రూ.399కి లభిస్తున్నాయి. ఇవి నగరాలలోని పిల్లల వస్తువుల షాపుల్లోనూ, మెడికల్ స్టోర్లలోనూ లభిస్తాయి. పాదాలకు రక్ష... కాస్త రఫ్‌గా, ఇంకాస్త లైట్ వెయిట్‌గా, పాదాలకు సౌకర్యంగా, ఫ్యాన్సీ కలర్లలో లభించే షూని మగువ లు చాలా ఇష్టపడతారు. ట్రెక్కింగ్‌లో ఇలాంటి షూ కోసం వెదికేవారికి ఉడ్‌లాండ్ షాపులలో రూ.3,591 లకు లభిస్తున్నాయి. వీటిని స్నీకర్స్ అని అడిగి తీసుకోవాలి. బురదలోనూ, రాళ్లలోనూ పాదాలకు సౌకర్యంగా ఉండే ఈ షూలు మగవారికి సుఖంగా ఉంటాయి. వానాకాలపు ట్రెక్కింగ్‌లో రఫ్ అండ్ టఫ్ అనిపించే ఈ షూ ధర రూ.12,990. టింబర్లాండ్ ఔట్లెట్లలో లభిస్తున్నాయి. డ్రై బ్యాగ్... ప్రయాణానికి వెళ్లేటప్పుడు శుభ్రంగా సర్దుకున్న బ్యాగ్, మధ్యలోనే చిందరవందరగా మారిపోతుంది. విడిచిన దుస్తులు, వేసుకోవాల్సినవి అన్నీ ఒకే చోట పెడితే కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి సమస్య లేకుండా ఈ డ్రై బ్యాగ్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్ 30 కేజీల బరువును ఆపగలుగుతుంది. పైగా వాటర్‌ప్రూఫ్ కూడా. హిట్‌ప్లే.ఇన్ లో లభించే ఈ బ్యాగ్ధర రూ.1,249. ఫోన్ సురక్షితం.. పర్వతారోహణలో ఫోన్లో జీపీఎస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటే ఎంతో ఉపయుక్తం. కానీ, జిపిఎస్ సిస్టమ్ డెరైక్షన్స్ను ఫోన్లో అనుసరించడం వల్ల వర్షం పడుతున్నప్పుడు చూడటం కష్టం అవుతుంది. వర్షపునీటికి ఫోన్ పాడవుతుందనే భయం కూడా ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ వెదర్ ప్రూఫ్ ఫోన్ కేస్ సహాయపడుతుంది. హిట్‌ప్లే.ఇన్‌లో దీని ధర రూ.4,199. విశ్రాంతికి టెంట్... సాహస యాత్రికులకు ఈ టెంట్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నీటిని, గాలిని తట్టుకునే సామర్థ్యం గల ఈ టెంట్ దారి మధ్యలో మీరెక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. ఈ టెంట్‌కి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్ కూడా ఉన్నాయి. నైలాన్ ఫ్లోర్ ఉండటం వల్ల తడి నేలలోనూ అనువుగా ఉంటుంది. ఉడ్‌లాండ్ షాపులలో దీని ధర రూ.10 వేలు.