యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది.
ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
దీనిపై కన్జర్వేటివ్ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్‌లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్ స్ట్రీట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
(చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!)
Comments
Please login to add a commentAdd a comment