Private Jets
-
ప్రైవేట్ జెట్ ఉన్న ఈ టాప్ బిలియనీర్ల గురించి తెలుసా? (ఫొటోలు)
-
Rishi Sunak: విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ. 4 కోట్లు
యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కన్జర్వేటివ్ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్‌లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్ స్ట్రీట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!) -
ప్రైవేట్ జెట్స్‌కు ‘కరోనా’ రెక్కలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఆర్థిక కార్యకలాపాలు మొదలుకుని సాధారణ రవాణా సాధనాల దాకా దాదాపు అన్నీ స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రయాణాలపరంగా కాస్త వెసులుబాటు లభించినప్పటికీ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇలాంటి గడ్డు కాలంలో ప్రైవేట్ విమానాలకు డిమాండ్ భారీగా నెలకొంది. దీంతో వాటి చార్జీలకు కూడా బాగా రెక్కలొచ్చాయి. కరోనా వ్యాప్తి భయాల కారణంగా బడా పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐ) దేశీయంగానైనా, విదేశాలకైనా సాధారణ ఫ్లయిట్లలో ప్రయాణించేందుకు ఇష్టపడకపోతుండటం, ప్రైవేట్ జెట్లవైపు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణం. దీంతో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రైవేట్ జెట్ కంపెనీలతో పాటు కొన్ని షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల పోర్టల్ .. మేక్మైట్రిప్ కూడా తాజాగా బరిలోకి దిగింది. ప్రయాణాలపై ఆంక్షలు తొలగడంతో వివిధ ప్రాంతాలకు చేరేందుకు ప్రయాణికులు ఫ్లయిట్లను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇతరత్రా రవాణా సాధనాలపైనా దృష్టి పెడుతున్నారని మేక్మైట్రిప్ సీవోవో (ఫ్లయిట్స్ వ్యాపార విభాగం) సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు. సురక్షితం, సౌకర్యవంతం.. భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉండటంతో పాటు సురక్షితంగా, తమకు కావాల్సిన విధంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ప్రైవేట్ విమానాలు ఉపయోగకరంగా ఉంటున్నాయని సౌజన్య తెలిపారు. దీంతో వీటిని అద్దెకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. మరోవైపు, కరోనా వైరస్ రాక మునుపు రోజుకు 30–40 చార్టర్ రిక్వెస్ట్‌లు వచ్చేవని ప్రస్తుతం డిమాండ్ తొమ్మిది రెట్లు పెరిగిందని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈవో కనికా టేక్రివాల్ తెలిపారు. అయితే, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రాత్రికి రాత్రి ప్రయాణ నిబంధనలు మారిపోతుండటంతో కేవలం 50–60 శాతం మాత్రమే సర్వీసులు అందించగలుగుతున్నామని వివరించారు. మేక్మైట్రిప్ ప్రధానంగా కార్పొరేట్లు, హెచ్ఎన్ఐలు, సంపన్న ప్రయాణికులు లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న జెట్‌సెట్‌గో క్లయింట్ల సంఖ్య చాలా విస్తృతంగానే ఉంది. ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు మొదలుకుని, సినిమా నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడాకారులు, హెచ్‌ఎన్‌ఐఏలు మొదలైన వారు క్లయింట్లుగా ఉన్నారు. ఇక 2016 నుంచి ఎయిర్ చార్టర్ వ్యాపారంలో ఉన్న జెట్‌స్మార్ట్ (ఇండ్‌జెట్స్ ఇండియా) సంస్థకు ప్రముఖ లాయర్లు, వ్యాపారవేత్తలు మొదలైనవారు క్లయింట్లుగా ఉన్నారు. ఖరీదైన వ్యవహారమే... ప్రైవేట్ విమానాలను సాధారణంగా మెట్రో నగరాల మధ్య, ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రథమ శ్రేణి పట్టణాలకు ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఎంచుకుంటున్నారు. ఇదేమంత చౌకైన వ్యవహారం మాత్రం కాదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ అద్దె చార్జీలు గంటకు రూ. 85,000 నుంచి రూ. 4 లక్షల దాకా ఉంటోందని జెట్‌స్మార్ట్ సీఈవో అనూప్ సెహాన్ తెలిపారు. దీనికి జీఎస్టీ, ఎయిర్పోర్ట్ చార్జీలు మొదలైనవి అదనం. ఒకవేళ వన్–వే ట్రిప్ అయిన పక్షంలో సదరు విమానం తిరిగి వెళ్లేందుకు అయ్యే చార్జీలను కూడా కట్టాల్సి ఉంటుంది. -
ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయ మార్గాల్లో ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.(చదవండి : ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు) చార్టర్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు.. ప్రయాణ సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టులో గానీ, హెలీప్యాడ్ వద్ద గానీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. వృద్ధులు, గర్భిణిలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని తెలిపింది. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : 630 విమానాలు రద్దు) -
ఇక ప్రైవేట్ జెట్లు...!
సంపన్న భారతీయులు, కంపెనీలు ఇక ’ప్రైవేట్ విమానాలు’ సొంతం చేసుకునే అవకాశం కలగబోతోంది. అదీకూడా ఈ విమానాల నిర్వహణ, వాటి మరమ్మతుల బాధ్యత లేకుండానే... ప్రైవేట్ జెట్లకు యజమానిగా ఒకరుంటే వాటిని మరొకరు ఆపరేటర్ రూపంలో నిర్వహించే వీలు కల్పించే ప్రతిపాదనకు దేశీయ విమానయానశాఖ తుదిరూపునిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఓ కంపెనీ లేదా ప్రైవేట్‌వ్యక్తి విమానాన్ని కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలను మరో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పగించవచ్చు. ఈ రెండుకంపెనీలు, వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విమానాల నిర్వహణ, ఆదాయ,వ్యయాలు ఏ మేరకు భరించాలన్నది ఖరారు చేస్తారు. ప్రస్తుతమున్న నియమ,నిబంధనల ›ప్రకారమైతే ఓ ప్రైవేట్ వ్యాపారవేత్త విమానాన్ని ఆపరేట్ చేయాలంటే ప్రభుత్వపరంగా ఉన్న నియంత్రణలు పాటించాల్సిన అవసరముంది. ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన ఫ్లయిట్ సెఫిటీ ఇన్చార్జీ మొదలుకుని ఇతర విమాన సిబ్బంది నియామకం వరకు అన్నీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి విమానాలను ప్రైవేట్ కంపెనీలు నడపడానికి ’నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్’ కేటగిరి కింద విడిగా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు లేని కారణంగా తమ విమానాల నిర్వహణకు నాన్ షెడ్యూల్్డ ఆపరేటర్ కంపెనీలపై ప్రైవేట్ యజమానులు ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలలో ప్రైవేట్ జెట్ల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతినే మనదేశంలోనూ అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ తరహా పద్ధతిని ఇక్కడ అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆర్థికశాఖతో పాటు కేంద్ర విమానయానశాఖ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ విమానాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారంగా మారిన కారణంగా వ్యాపారవేత్తలు వెనకడుగు వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాము విమానం కొనుగోలు చేశాక దాని బాధ్యతలు చూసేందుకు విడిగా ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటే చాలా మంది వ్యాపారవేత్తలు ముందుకు వస్తారని పేర్కొన్నాయి. ’భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ కంపెనీల ఆలోచన అనేది పెద్దగా పుంజుకోలేదు. ఓ ప్రైవేట్ యజమాని విమానాన్ని కొనుగోలు చేసి విమానాల నిర్వహణ కంపెనీకి దానిని అప్పగించే పద్ధతి ఇక్కడా అమల్లోకి వస్తే మాత్రం ప్రస్తుతమున్న పరిస్థితిలో మార్పు వస్తుంది. ఈ కంపెనీలు విమానాలు నడిపేందుకు అవసరమైన అన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల యజమానులకు సమస్య ఉండదు’ అని బిజినెస్ ఎవియేషన్ ఆపరేటర్ అసోసియేషన్ ఎండీ ఆర్కే బాలి చెబుతున్నారు. జీఎస్టీ తగ్గించాలి... ప్రస్తుతం విమానాన్ని దిగుమతి చేసుకునే వ్యాపారవేత్తలు కస్టమ్‌్స సుంకాలతో పాటు 28 శాతం వస్తు,సేవా పన్ను (జీఎస్టీ) చెల్లించాలి. నాన్ షెడ్యూల్్డ ఆపరేటర్లు కస్టమ్‌్స పన్నులతో పాటు జీఎస్టీ కింద 18 శాతం పన్నులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారవేత్తలకు కూడా జీఎస్టీ పన్నును 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది వ్యాపారవేత్తలు నేరుగా విమానాలు దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది దేశీయ విమానయానరంగ వ్యాపారం పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. -
ప్రైవేటు జెట్స్ కి డిమాండ్ అంతంతే: ఎంబ్రాయర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ జెట్స్ (సొంత విమానాలు) విభాగంలో డిమాండ్ స్థిరంగా ఉందని చిన్న విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్ తెలిపింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గడంతో ప్రైవేట్ జెట్స్ డిమాండ్ స్థిరంగా ఉండటానికి కారణమని ఎంబ్రాయర్ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు) క్లాడియో కామిలియర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఏటా 8 నుంచి 10 ప్రైవేటు జెట్స్కి డిమాండ్ ఉందన్నారు. సుమారు 150 ప్రైవేట్ జెట్స్ ఇండియాలో ఉండగా అందులో 21 ఎంబ్రాయర్ ఎగ్జిక్యూటివ్ జెట్స్ ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లలో చైనా కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 490 ఎగ్జిక్యూటివ్ జెట్స్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎంట్రీలెవెల్ బిజినెస్ జెట్ ఫినోమ్ 100ఈ విమానాన్ని టైటాన్ ఏవియేషన్ గ్రూపునకు అందచేశారు. ఈ విమానం కొనుగోలు చేసిన వ్యక్తి పేరును తెలియచేయడానికి కంపెనీ నిరాకరించింది.