న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయ మార్గాల్లో ప్రైవేట్ జెట్‌లు, చార్టర్ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.(చదవండి : ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు)
చార్టర్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు.. ప్రయాణ సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టులో గానీ, హెలీప్యాడ్ వద్ద గానీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. వృద్ధులు, గర్భిణిలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని తెలిపింది. కాగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : 630 విమానాలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment