Domestic routes
-
ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయ మార్గాల్లో ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.(చదవండి : ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు) చార్టర్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు.. ప్రయాణ సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టులో గానీ, హెలీప్యాడ్ వద్ద గానీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. వృద్ధులు, గర్భిణిలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని తెలిపింది. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : 630 విమానాలు రద్దు) -
విస్తారా పండుగ సేల్: 48 గంటలే..
సాక్షి, న్యూఢిల్లీ: విస్తారా విమానయాన సంస్థ దీపావళి పండుగ సేల్‌ను ప్రకటించింది. దేశీయ నెట్ వర్క్‌లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ రోజు (అక్టోబర్ 10వ తేదీ, గురువారం) నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అంటే 48 గంటలు మాత్రమే ఈ సేల్ లభ్యమవుతుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది. ప్రధానంగా జమ్మూ-శ్రీనగర్ మార్గంలో1199 లకే(ఎకానమీ క్లాస్) టికెట్ ను అందిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ రూ. 6 2,699 , బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 6,999 నుంచి ప్రారంభం. ఈ ఆఫర్లో ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నదీ కంపెనీ ప్రకటించలేదు గానీ, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. పండుగ సీజన్‌ను మరింత ఆనందంగా మలించేందుకు, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి ఈ డిస్కౌంట్ సేల్ దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వ్యక్తం చేశారు. Announcing Vistara’s Festive Season Sale with fares starting at ₹1,199 all-in for travel until 28th March 2020. Book your tickets today. Hurry, limited seats available. https://t.co/TbAEPrGMYJ pic.twitter.com/dLgZxDtNpB — Vistara (@airvistara) October 10, 2019 -
ఫెస్టివ్ బొనాంజా : ఎయిరిండియా కొత్త స్ట్రాటజీ
సాక్షి, న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. నవంబరు 30 నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను ప్రకటించింది. గోవా, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని శనివారం (అక్టోబర్ 27) ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెల చివరి నాటికి ఈ సర్వీసులను లాంచ్ చేస్తామని తెలిపింది.భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి...హోటల్ ఖర్చుల భారం నుంచి బయటపడండి.. నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆస్వాదించండి అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఢిల్లీ-గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్-ఢిల్లీ, బెంగుళూరు-అహ్మదాబాద్-బెంగుళూరులాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే అందిస్తామని ప్రవేశపెడతామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేట్‌నైట్ బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది. రెడ్‌ఐ విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని, ఈ నేపథ్యంలో ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది. #FlyAI : #airindia #redeyeflights #festivalbonanza Beat peak traffic, avoid hotel cost, enjoy cheapest fares on these latenight flights. Log on to https://t.co/T1SVjRD6o5 to grab fares you just can't believe. pic.twitter.com/VIO6sBj2xQ — Air India (@airindiain) October 27, 2018 -
విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ బుక్‌నౌ. ఫ్లైనౌ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్స్‌పై వర్తించే ఈ ఆఫర్ 2018, జూన్ 30 నాటికి ముగియనున్నట్టు అధికారులు చెప్పారు. వన్‌వే, రిటర్న్ జర్నీలు రెండింటికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అమస్టర్‌డ్యామ్, కొలంబో, పారిస్ తప్ప మిగతా అన్ని జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని విమానయాన సంస్థ ప్రకటించింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్స్ బేస్ ధరలపై కూడా 25 శాతం డిస్కౌంట్ని అందించనున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జులై 11,2018 నాటి నుంచి ప్రయాణ కాలానికి సంబంధించి కనీసం 15 రోజుల ముందస్తుగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మిగతా ఛార్జీలు, పరిమితులన్నింటిన్నీ టిక్కెట్ నియమ నిబంధనల్లో పేర్కొన్నట్టు కంపెనీ తెలిపింది. -
ఇండిగో భారీ ప్రమోషనల్ ఆఫర్
ముంబై: విమాన యాన సంస్థ ఇండిగో ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా దేశీయ విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. అన్ని కలుపుకొని రూ.834 నుంచి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది. ఎంపిక చేసిన డొమెస్టిక్ రూట్లలో ఈ తగ్గింపు ధరలను వర్తింప చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 17వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా అక్టోబర్ 30, 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మాత్రం ఇండిగో వెల్లడి చేయలేదు. అలాగే ఈ చార్జీలు నాన్ రిఫండబుల్ అని ఒక వేళ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించబడతాయని స్పష్టం చేసింది. దీంతోపాటుగా ఈ పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో ప్రస్తుత నెట్ వర్క్ లో 47 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు ఇండిగో ప్రకటించింది. కాగా ఇండిగో వెబ్ సైట్ లో చెక్ చేసినపుడు ఢిల్లీ-జైపూర్ టిక్కెట్ ఈ ప్రచార ఆఫర్ కింద రూ.867 ప్రారంభ ధరగా చూపిస్తోంది. ఢిల్లీ ముంబై టిక్కెట్ ధర నవంబర్ మధ్యలో ప్రయాణానికి రూ.2,030గా ఉంది. -
జెట్ ఎయిర్వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్
దేశీయ రూట్లలో.. అక్టోబర్ 15 వరకూ ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ దేశీయ రూట్లలో స్పెషల్ చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ స్పెషల్ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజ్ శివ్‌కుమార్ చెప్పారు. 750 కిమీ, లోపు దూరమున్న రూట్లలో ఈ స్పెషల్ చార్జీలు రూ.6,999 నుంచి, 750 నుంచి 1,000 కిమీ. దూరమున్న రూట్లలో చార్జీలు రూ.8,999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశీ నెట్‌వర్క్‌లోని తమ అన్ని విమాన సర్వీసులకు ఈ స్పెషల్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. డెరైక్ట్, వయా ఫ్లైట్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత సర్వీసులతో పాటు మల్టీ-కోర్స్ మీల్ ఆప్షన్లను కూడా అందిస్తున్నామన్నారు. ఇక 1,000 కిమీ. పైబడి దూరమున్న విమాన రూట్లకు సంబంధించిన చార్జీలపై 20% డిస్కౌంట్నిస్తున్నట్లు శివ్‌కుమార్ పేర్కొన్నారు. -
విమానం మోత వెనక కుమ్మక్కు!
ముంబై: ఒక్క వారంలో విమానయాన చార్జీలు 25 శాతం పెరగడం పట్ల ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) విస్మయం వ్యక్తం చేసింది. విమానయాన సంస్థలన్నీ కుమ్మక్కై చార్జీలను పెంచాయని, ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కాంపిటీషన్ వాచ్డాగ్ సీసీఐకి ఏపీఏఐ ఫిర్యాదు చేసింది. పండుగల సీజన్ సందర్భంగా దేశీయ విమానయాన సంస్థలు విమాన చార్జీలను పెంచడం రివాజుగా మారిందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లాకు ఏపీఏఐ ఫిర్యాదు చేసింది. విమానయాన ఇంధనం (జెట్ ఫ్యూయల్) ధరలు పెరగడంతో పలు విమానయాన సంస్థలు, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో, గోఎయిర్ ఒకదాని తర్వాత మరొకటి విమాన చార్జీలను 25 శాతం పెంచాయి. ఇలా పెంచడం కుమ్మక్కుకు నిదర్శనమని ఏపీఏఐ అధ్యక్షుడు డి. సుధాకర రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. తక్షణం సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. చార్జీలను తగ్గించినప్పుడు విస్తృత ప్రచారం నిర్వహించే కంపెనీలు చార్జీలు పెంచినప్పుడు మాత్రం కనీసం పత్రికా ప్రకటన కూడా చేయడం లేదని, పైగా పెంచిన చార్జీలు తక్షణం అమల్లోకి వచ్చాయని వివరించారు. సవివరమైన దర్యాప్తు జరిపి కుమ్మక్కు నుంచి సాధారణ ప్రజలను రక్షించాలని ఏపీఏఐ కోరింది.