సాక్షి, న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. నవంబరు 30 నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను ప్రకటించింది. గోవా, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని శనివారం (అక్టోబర్ 27) ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెల చివరి నాటికి ఈ సర్వీసులను లాంచ్ చేస్తామని తెలిపింది.భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి...హోటల్ ఖర్చుల భారం నుంచి బయటపడండి.. నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆస్వాదించండి అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఢిల్లీ-గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్-ఢిల్లీ, బెంగుళూరు-అహ్మదాబాద్-బెంగుళూరులాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే అందిస్తామని ప్రవేశపెడతామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేట్‌నైట్ బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది. రెడ్‌ఐ విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని, ఈ నేపథ్యంలో ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది.
#FlyAI : #airindia #redeyeflights #festivalbonanza
— Air India (@airindiain) October 27, 2018
Beat peak traffic, avoid hotel cost, enjoy cheapest fares on these latenight flights.
Log on to https://t.co/T1SVjRD6o5 to grab fares you just can't believe. pic.twitter.com/VIO6sBj2xQ
Comments
Please login to add a commentAdd a comment