జెట్ ఎయిర్‌వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్ | Jet Airways offers for special charges | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్

Published Tue, Jul 21 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

జెట్ ఎయిర్‌వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ స్పెషల్ చార్జీల ఆఫర్

దేశీయ రూట్లలో.. అక్టోబర్ 15 వరకూ
ముంబై:
జెట్ ఎయిర్‌వేస్ సంస్థ దేశీయ రూట్లలో స్పెషల్ చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ స్పెషల్ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్  రాజ్ శివ్‌కుమార్ చెప్పారు. 750 కిమీ, లోపు దూరమున్న రూట్లలో ఈ స్పెషల్ చార్జీలు రూ.6,999 నుంచి, 750 నుంచి 1,000 కిమీ. దూరమున్న రూట్లలో చార్జీలు రూ.8,999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశీ నెట్‌వర్క్‌లోని తమ అన్ని విమాన సర్వీసులకు ఈ స్పెషల్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. డెరైక్ట్, వయా ఫ్లైట్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత సర్వీసులతో పాటు మల్టీ-కోర్స్ మీల్ ఆప్షన్లను కూడా అందిస్తున్నామన్నారు. ఇక 1,000 కిమీ. పైబడి దూరమున్న విమాన రూట్లకు సంబంధించిన చార్జీలపై 20% డిస్కౌంట్‌నిస్తున్నట్లు శివ్‌కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement