వందశాతం ఆక్యుపెన్సీ ఉన్న ప్రత్యేక రైళ్లు ఆ జాబితాలోకి
దీంతో ‘ప్రత్యేక’చార్జీలు కూడా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రత్యేక రైళ్లు ఇక రెగ్యులర్ జాబితాలోకి రానున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో నడిచే రైళ్లను క్రమబదీ్ధకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో రైళ్ల సంఖ్య పెరగడంతోపాటు ‘ప్రత్యేక’చార్జీల భారం కూడా తగ్గనుంది. సాధారణంగా ప్రయాణికుల రద్దీ, పండుగలు, వరుస, వేసవి సెలవులు వంటి రోజుల్లో సాధారణంగా నడిచే రైళ్లతోపాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తారు.
ఈ రైళ్ల చార్జీలు కూడా తత్కాల్ చార్జీలకు సమానంగా ఉంటాయి. రెగ్యులర్ చార్జీల కంటే 20 శాతం ఎక్కువ. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వారం, పదిరోజుల ముందు ప్రత్యేక రైళ్ల కోసం ప్రణాళికలు వేసి అందుబాటులోకి తెస్తారు. కానీ కొన్ని రూట్లలో రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లకు కూడా ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ నంబర్లన్నీ సున్నా (0)తో మొదలవుతాయి. రెగ్యులర్ రైళ్లకు మాత్రం సాధారణ నంబర్లలను కేటాయిస్తారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లే నడుస్తుండగా, మరి కొన్నిమార్గాల్లో కోవిడ్ కంటే ముందు నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
నిర్దిష్ట కాల పరిమితికే ప్రత్యేకం
ప్రస్తుతం అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున శబరిమలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతోంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్‌ల నుంచి సుమారు 30కి పైగా స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి జనవరి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రద్దీ మేరకు మరో రూట్‌లో వీటిని మళ్లిస్తారు.
⇒ హైదరాబాద్ నుంచి శబరికి ప్రతిరోజు ఒక ట్రైన్ మాత్రం రెగ్యులర్‌గా నడుస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్‌లో మరో రైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన ఉంది.
⇒సికింద్రాబాద్ నుంచి షిరిడికి వెళ్లేందుకు అజంతా ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. ఆ రూట్‌లో కూడా ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లు అందుబా టుకి తెస్తారు.
⇒జంటనగరాల నుంచి తిరుపతికి ఐదారు రెగ్యులర్ రైళ్లు నడిచినా, ప్రయాణికుల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో గతంలో ‘ప్రత్యేకం’గా నడిచిన రైలును ఆ తర్వాత ‘సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్’గా రెగ్యులర్ చేశారు.
⇒హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, విజయవాడ, దానాపూర్, పటా్న, జైపూర్ తదితర నగరాలకు రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న రూట్‌లను ఎంపిక చేసి ఆ మార్గాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను దశలవారీగా క్రమబదీ్ధకరిస్తారు.
వచ్చే నెలలో కొత్త టైమ్ టేబుల్...
రైళ్ల వేళల్లో మార్పులు..చేర్పులు, హాల్టింగ్ స్టేషన్‌లు, కొత్త రూట్‌లు, కొత్తగా అందుబాటులోకి రానున్న రెగ్యులర్ సరీ్వసుల వేళలతో రూపొందించిన కొత్త టైమ్‌టేబుల్ జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నడుస్తూ రెగ్యులర్‌గా మారనున్న రైళ్ల వేళలను కూడా టైమ్‌టేబుల్‌లో చేర్చుతారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో డెము, మెము రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడుపుతున్నారు. సికింద్రాబాద్–వరంగల్, కాచిగూడ–మహబూబ్‌నగర్, కాచిగూడ–కర్నూల్, తదితర మార్గాల్లో నడిచే ఇలాంటి రైళ్లను కూడా తిరిగి రెగ్యులర్ జాబితాలో చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment