occupancy
-
ఆ స్పెషల్ రైళ్లు.. ఇక రెగ్యులర్
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రత్యేక రైళ్లు ఇక రెగ్యులర్ జాబితాలోకి రానున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో నడిచే రైళ్లను క్రమబదీ్ధకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో రైళ్ల సంఖ్య పెరగడంతోపాటు ‘ప్రత్యేక’చార్జీల భారం కూడా తగ్గనుంది. సాధారణంగా ప్రయాణికుల రద్దీ, పండుగలు, వరుస, వేసవి సెలవులు వంటి రోజుల్లో సాధారణంగా నడిచే రైళ్లతోపాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తారు.ఈ రైళ్ల చార్జీలు కూడా తత్కాల్ చార్జీలకు సమానంగా ఉంటాయి. రెగ్యులర్ చార్జీల కంటే 20 శాతం ఎక్కువ. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వారం, పదిరోజుల ముందు ప్రత్యేక రైళ్ల కోసం ప్రణాళికలు వేసి అందుబాటులోకి తెస్తారు. కానీ కొన్ని రూట్లలో రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లకు కూడా ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ నంబర్లన్నీ సున్నా (0)తో మొదలవుతాయి. రెగ్యులర్ రైళ్లకు మాత్రం సాధారణ నంబర్లలను కేటాయిస్తారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లే నడుస్తుండగా, మరి కొన్నిమార్గాల్లో కోవిడ్ కంటే ముందు నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిర్దిష్ట కాల పరిమితికే ప్రత్యేకం ప్రస్తుతం అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున శబరిమలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతోంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి సుమారు 30కి పైగా స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి జనవరి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రద్దీ మేరకు మరో రూట్లో వీటిని మళ్లిస్తారు. ⇒ హైదరాబాద్ నుంచి శబరికి ప్రతిరోజు ఒక ట్రైన్ మాత్రం రెగ్యులర్‌గా నడుస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్లో మరో రైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన ఉంది. ⇒సికింద్రాబాద్ నుంచి షిరిడికి వెళ్లేందుకు అజంతా ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. ఆ రూట్లో కూడా ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లు అందుబా టుకి తెస్తారు. ⇒జంటనగరాల నుంచి తిరుపతికి ఐదారు రెగ్యులర్ రైళ్లు నడిచినా, ప్రయాణికుల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో గతంలో ‘ప్రత్యేకం’గా నడిచిన రైలును ఆ తర్వాత ‘సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్’గా రెగ్యులర్ చేశారు. ⇒హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, విజయవాడ, దానాపూర్, పటా్న, జైపూర్ తదితర నగరాలకు రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న రూట్లను ఎంపిక చేసి ఆ మార్గాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను దశలవారీగా క్రమబదీ్ధకరిస్తారు.వచ్చే నెలలో కొత్త టైమ్ టేబుల్...రైళ్ల వేళల్లో మార్పులు..చేర్పులు, హాల్టింగ్ స్టేషన్లు, కొత్త రూట్లు, కొత్తగా అందుబాటులోకి రానున్న రెగ్యులర్ సరీ్వసుల వేళలతో రూపొందించిన కొత్త టైమ్‌టేబుల్ జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నడుస్తూ రెగ్యులర్‌గా మారనున్న రైళ్ల వేళలను కూడా టైమ్‌టేబుల్‌లో చేర్చుతారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో డెము, మెము రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడుపుతున్నారు. సికింద్రాబాద్–వరంగల్, కాచిగూడ–మహబూబ్‌నగర్, కాచిగూడ–కర్నూల్, తదితర మార్గాల్లో నడిచే ఇలాంటి రైళ్లను కూడా తిరిగి రెగ్యులర్ జాబితాలో చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు. -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ‘మహాలక్ష్మి’పథకంతో ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తున్నా.. మరోవైపు ఇదే తీవ్ర ఆందోళనకూ కారణమవుతోంది. ఇప్పుడున్న ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు పాతబడ్డాయి. కొన్ని అయితే డొక్కుగా మారాయి. అలాంటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిస్తే ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు బస్సుల్లోని సీట్లలో చాలా వరకు మహిళలతో నిండిపోతుండటంతో.. పురుషులకు సీట్లు దొరక్క ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుతున్నారన్నదీ ఆందోళన రేపుతోంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ ఎన్ని బస్సులు కొందాం, ఏ కేటగిరీలో ఎన్ని ఉండాలన్న ప్రతిపాదనలు, సమావేశాలకే సర్కారు పరిమితం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అదనంగా 10లక్షల మంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ‘మహాలక్ష్మి’పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న దీన్ని పట్టాలెక్కించారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తోంది. బస్సుల్లో నిత్యం 10 లక్షల మందికిపైగా అదనంగా ప్రయాణిస్తున్నారు. గతంలో 66శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 90శాతం దాటింది. ప్రత్యేక రోజుల్లో 101 శాతానికీ చేరుతోంది. ఉచిత ప్రయాణానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్ చేసే నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.10 కోట్ల మేర పెరిగింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఏకంగా రూ.22.50 కోట్ల చొప్పున ఆదాయం నమోదైంది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ఇబ్బందులు వస్తున్నాయి. కర్ణాటకలో ఇదే తరహాలో పథకాన్ని ప్రారంభించినప్పుడు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మన ఆర్టీసీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించినప్పుడు ఈ అంశం కూడా వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన కొత్త బస్సులు సిద్ధం చేసుకుని పథకాన్ని ప్రారంభించి ఉండాల్సిందని.. అలా చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వేల బస్సులు అవసరం ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ కేటగిరీలకు సంబంధించి 7,292 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్పేర్‌లో ఉంచే బస్సులను కూడా వాడేస్తున్నారు. ఇప్పుడున్న రద్దీని నియంత్రించాలంటే కనీసం నాలుగు వేల అదనపు బస్సులు అవసరమని అంచనా. ఇటీవల వచ్చిన కొత్త బస్సులు 50 మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. మరో వెయ్యి ఎలకిŠట్రక్ బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేసింది. అవి అందేందుకు కొన్ని నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు అవసరం. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే, లేదా ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు తీసుకుంటేనే కొనుగోళ్లు సాధ్యం. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. -
‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్!
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని 0.3530 చదరపు మీటర్లుగా తేలుస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జాయింట్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలతో 22ఏ జాబితాను విడుదల చేశారు. మిగులు భూమిగా తేల్చిన మొత్తాన్ని 22 ఏ 1(డీ) జాబితాలో టీడీపీ ప్రభుత్వమే చేర్చింది. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలో భాగంగా మళ్లీ పక్కాగా సర్వే చేసి గాదిరాజు ప్యాలెస్‌లో వాస్తవ మిగులు భూమి కేవలం 0.1141 చదరపు మీటర్లుగా తేల్చింది. అంతేకాకుండా దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని గత మే నెలలోనే జాయింట్ కలెక్టర్.. స్థానిక తహసీల్దార్ ద్వారా నోటీసులు జారీ చేశారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పక్కాగా యాజమాన్య హక్కులను పొందేందుకు గాదిరాజు రామకృష్ణరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాస్తవాలు ఇలా ఉండగా... దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అయ్యన్నపాత్రుడు అసత్య ఆరోపణలు చేశారు. వీటిపై స్పష్టత తీసుకునేందుకు శుక్రవారమంతా మీడియా ప్రయత్నించినా ఆయన ముఖం చాటేశారు. దీన్ని బట్టి కావాలనే ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/విశాఖ సిటీ ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గాదిరాజు ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో యూఎల్సీ భూమి ఉన్నట్టు తేల్చిన విస్తీర్ణం కేవలం 0.1141 చదరపు మీటర్లు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా తేల్చిన సర్వే ప్రకారం మిగులు భూమి సుమారు 6 సెంట్ల మేర తగ్గింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పక్కాగా సర్వే చేసి వాస్తవ లెక్కలను తేల్చింది. దీన్నిబట్టి గత టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ లెక్కలను చూపి గాదిరాజు యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని అర్థమవుతోంది. అయితే, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం కుటుంబంపై దుష్ప్రచారమే చేయడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలకు దిగారు. గాదిరాజు ప్యాలెస్ కావాలని దాని యజమానిని ముఖ్యమంత్రి సతీమణి కోరారని అభూత కల్పనలను సృష్టించేశారు. ఇందుకు గాదిరాజు ప్యాలెస్ యజమాని రామకృష్ణరాజు ఒప్పుకోకపోవడంతో ఆ ప్యాలెస్‌ను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ అసత్య ఆరోపణలు చేశారు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎంపీ టికెట్, తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చంద్రబాబు మెప్పు పొందొచ్చని దిగజారుడు రాజకీయానికి దిగారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రక్షణ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ మొదలుకుని అనేక మంది టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేశారు. అందినకాడికి బినామీ పేర్లతో కబ్జా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుంచి రక్షించింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల్లో బోర్డులను పాతడంతో పాటు చుట్టూ అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాలెస్ అడిగారనేది పూర్తిగా అవాస్తవం.. గాదిరాజు ప్యాలెస్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తన అనుచరులను పంపించి అడిగించారన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌పై కూడా అభాండాలు వేయడం బాధ కలిగించింది. ప్యాలెస్ ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడంతో ప్యాలెస్ స్థలాన్ని 22ఏలో పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇప్పించారని ఒక పత్రికలో వార్త రాయడం అన్యాయం. ఇంత దారుణమైన, అసలు సంబంధంలేని వార్తను నేనెప్పుడూ చూడలేదు. నేను అయ్యన్నపాత్రుడిని కలిసినట్లు చెప్పడం సమంజసం కాదు. ఇప్పటివరకు కనీసం నేరుగా కూడా ఆయనను చూడలేదు. వాస్తవానికి ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు.. వేరే ప్రాంతంలో ఉన్న మోడల్‌ను చూసి నచ్చి ఇక్కడ నిర్మించుకున్నాను. పెద్దవారికి ఇది చాలా చిన్న విషయం.. ఇటువంటి బిల్డింగ్‌ను ఎవరైనా కట్టొచ్చు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నా.. ఇప్పటికీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరూ, ఎక్కడా కలవలేదు. రాజకీయాలతో ఏ సంబంధంలేని నన్ను, జిల్లా కలెక్టర్‌ను ఇందులో ఎందుకు లాగారో అర్థం కావడం లేదు. గాదిరాజు ప్యాలెస్ స్థలాన్ని 1997లో కొనుగోలు చేశా.. అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టా. ఈ భూమిలో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని.. ఏడాదిన్నర క్రితమే నోటీసు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బందిలో కొందరికి పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత స్థలం మిగులు భూమిలో ఉందని చూపించారు. వాస్తవానికి గతంలోనే నిబంధనల ప్రకారం అన్నీ చెల్లించి ప్రతి గజాన్ని రిజిస్టర్ చేయించుకున్నా. అది యూఎల్సీ స్థలమని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా. –గాదిరాజు రామకృష్ణరాజు, గాదిరాజు ప్యాలెస్ యజమాని వాస్తవాలు తెలుసుకోకుండా రాస్తే చర్యలు.. ప్యాలెస్‌కు సంబంధించిన భూమి చినవాల్తేరు గ్రామంలో సర్వే నెంబర్ 10/4ఏ2ఏ, 10/4ఏ2బీ/2ఏ, 10/5ఏ2లో 0.2937 చదరపు మీటర్ల విస్తీర్ణం మిగులు భూమిగా ఉన్నందున 2018లోనే ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఏ (1)(డీ) రిజిస్టర్లో నమోదైంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 84 ప్రకారం.. సదరు మిగులు భూమిని క్రమబద్ధీకరించుకోవాలని గాదిరాజు ప్యాలెస్ యజమానిని కోరుతూ ఈ ఏడాది మే 23న సీతమ్మధార తహసీల్దార్ నోటీసు జారీ చేశారు. ఒక పత్రికలో పేర్కొన్న విధంగా ప్యాలెస్ యజమాని ఎప్పుడూ కలెక్టర్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ఈ విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ అధికారి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేసి న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం బాబు మెప్పు కోసమే అయ్యన్న అసత్యప్రచారం డెప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆగ్రహం తిరుపతి కల్చరల్: కేవలం చంద్రబాబు మెప్పు కోసమే వైఎస్ కుటుంబంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని డెప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడంతోపాటు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం సీఎం జగన్ చేసే ప్రయత్నాలు గిట్టని టీడీపీ నేతలు నిత్యం అడ్డగోలు అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగానే 2018లో గాదిరాజు ప్యాలెస్‌కు సంబంధించిన 3వేల చదరపు గజాల భూమిని 22ఏ 1డీ సీలింగ్‌లో పెట్టిందని చెప్పారు. ఆ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఐదు నెలల కిందట ప్యాలెస్ యజమానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్ల కోసమే వైఎస్ జగన్ కుటుంబంపై అయ్యన్నపాత్రుడు బురదజల్లుతూ మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. అధికార దాహంతో అయ్యన్న చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో వేసవి రద్దీ పెరిగింది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కటక్, బికనేర్, రెక్సాల్, పట్నా తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 వరకు ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది ప్రయాణంచేస్తారు. మరో 60 వేల మంది వరకు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణిస్తారు. వేసవి సందర్భంగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లనుంచి సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. సొంత ఊళ్లకు వెళ్లేవారికంటే ఆధ్యాత్మీక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో తిరుపతి, విశాఖ, ముంబై, షిరిడీ, ఢిల్లీ, వారణాసి, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు తాకిడి పెరిగింది.గతంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 50 నుంచి 70 ప్రత్యేక రైళ్లను నడిపితే ఇప్పుడు వాటి సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం. అన్ని సదుపాయాలతో భారత్ గౌరవ్ రైళ్లు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లలో వందశాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ వేసవి సీజన్లో సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు 8 రైళ్లు బయలుదేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ఆధ్యాత్మీక క్షేత్రాలను సందర్శించేందుకు ఈ రైళ్లలో వెళుతున్నారు. ‘పూరీ– కాశి– అయోధ్య‘పేరుతో ఐఆర్సీటీసీ ఇటీవల భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ రైలులో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీయే అన్ని రకాల సేవలను అందజేస్తోంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతో పాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలులో సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించ వచ్చు.8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ ట్రైన్లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇప్పటి వరకు నడిచిన 8 ట్రిప్పుల్లో రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ కావడం విశేషం. -
వందేభారత్ సూపర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పట్టాలెక్కిన రెండు వందేభారత్ రైళ్లూ సూపర్ సక్సెస్ అయ్యాయి. టికెట్ ధర ఎక్కువైనా ప్రయాణికులు వాటిల్లో వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీంతో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి రైళ్లు కిక్కిరిసి పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్–తిరుపతి రైలు సగటు ఆక్యుపెన్సీ రేషియో 131 శాతం ఉండగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు 134 శాతం నమోదవుతోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 128 శాతం ఉండగా, తిరుగు ప్రయాణంలో 106 శాతంగా నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పట్టాలెక్కిన వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీలో ఇవే టాప్‌లో నిలవటం విశేషం. వేగమే ప్రధానం.. కాచిగూడ–తిరుపతి మధ్య 2017లో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించారు. అది మధ్యాహ్నం పూట ప్రయాణించేది కావటంతో బెర్తులకు బదులు చైర్‌కార్ మాత్రమే ఉంటుంది. దీంతో దానికి ఏమాత్రం ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 12 శాతానికి పడిపోయింది. ఫలితంగా దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దానిలాగే మధ్యాహ్నం వేళ, చైర్‌కార్‌తో ప్రయాణించే వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే అధికారులకు డబుల్ డెక్కర్ రైలే గుర్తొచ్చింది. దీంతో తిరుపతి వందేభారత్‌కు కేవలం 8 కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది. అధిక ఛార్జీ, పగటి వేళ ప్రయాణం, బెర్తులు ఉండకపోయినప్పటికీ జనం ఎగబడుతున్నారు. విశాఖపట్నం వందేభారత్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇందుకు వందేభారత్ వేగమే కారణమని స్పష్టమవుతోంది. విశాఖ, తిరుపతిలకు సాధారణ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడుతుంటే వందేభారత్ కేవలం 8 గంటల్లో గమ్యం చేరుస్తోంది. ఉదయం బయలుదేరితే మధ్యాహా్ననికల్లా గమ్యం చేరుతుండటంతో ప్రయాణికులకు ఒక పూట ఆదా అవుతోంది. సికింద్రాబాద్–విశాఖ వందేభారత్‌లో.. విశాఖ వెళ్లేప్పుడు ఎక్కువ మంది ప్రయాణిస్తుండగా, సికింద్రాబాద్–తిరుపతి సర్వీసులో మాత్రం, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. తిరుపతిలో దర్శనాలు పూర్తి చేసుకున్నాక, మధ్యాహ్నం రైలెక్కి అదే రోజు రాత్రికల్లా నగరానికి చేరుకోగలుగుతుండటం వారికి కలిసి వస్తోంది. తిరుపతి రైలు ఆదాయం అదుర్స్ జనవరి 15న విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైంది. కాగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19 వరకు దాని ద్వారా రైల్వేకు రూ.31 లక్షల ఆదాయం నమోదైంది. అయితే తిరుపతి సర్విసులో 8 కోచ్‌లు మాత్రమే ఉన్నా, పది రోజుల్లో రూ.17.50 లక్షల ఆదాయం వచ్చింది. త్వరలో తిరుపతి రైలుకు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వంద శాతం ఆక్యుపెన్సీతో భారత్‌గౌరవ్ రైలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు శనివారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఎస్సీ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఐఆర్సీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజాతో కలిసి ‘పూరి– కాశీ– అయోధ్య‘పేరుతో నడిచే ఈ రైలును ప్రారంభించారు. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే ఈ రైలుకు మొదటిరోజే నగర పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో బయలుదేరింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. కూచిపూడి నృత్యప్రదర్శన, డప్పు వాయిద్యాలు, ఇతర సాంస్కృతిక, కళారూపాలతో సాదరంగా ఆహా్వనించారు. జీఎం అరుణ్‌కుమార్ జైన్ స్వాగత కిట్లను అందజేసి ప్రయాణికులతో ముచ్చటించారు. జీఎం మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేవిధంగా భారత్‌గౌరవ్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పర్యాటకుల అభిరుచి, పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించినట్లు ఐఆర్సీటీసీ సీఎండీ రజనీ హసిజ తెలిపారు. పుణ్య క్షేత్రాల సందర్శన... ‘పూరి– కాశీ– అయోధ్య‘పేరుతో ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన ఈ పర్యాటక రైలులో ప్రయాణించేవారికి అన్ని రకాల సేవలను అందజేయనుంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం వంటి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. 8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ అయినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణుపాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమం, తదితర ప్రాంతాలను ప్రయాణికులు సందర్శించనున్నారు. -
ఉచిత నీటికి ‘ఆక్యుపెన్సీ’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకానికి ఆక్యుపెన్సీ ధ్రువీకరణ గండంలా పరిణమింంది. మహానగర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వేలాది నివాసాలు 200 చదరపు అడుగుల్లోపే ఉన్నాయి. వీటిలో చాలా భవనాలు 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింనవే. కానీ ఈ భవనాలకు విధిగా జీహెచ్ఎంసీ నుంచి జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ సమర్పిస్తేనే నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం వర్తిస్తుందని మున్సిపల్ పరిపాలన శాఖ తాజాగా వర్గదర్శకాలు జారీచేసింది. కానీ ఆక్యుపెన్సీ జారీచేసే విషయంలో బల్దియా చుక్కలు చూపుతోంది. చాలా మంది వినిÄñæగదారులు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ కోసం బల్దియా క్షేత్రస్థాయి కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు ధ్రువీకరణ జారీకి ససేమిరా అంటుండడం గమనార్హం. ఇదే సమయమయంలో వినియోగదారులకు డిసెంబరు–2020 నుంచి జూన్–2021 మధ్యకాలానికి జలమండలి నీటి బిల్లులు జారీచేసింది. ఈ బిల్లులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సుమారు ర.5వేల నుంచి ర.10 వేల మధ్యన ఉన్నాయి. దీంతో వినియోగదారుల గుండె గుభిల్లుమంటోంది. నిబంధనలు సడలించాల్సిందే.. గ్రేటర్ పరిధిలో సుమారు 10.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ నల్లాలు (డొమెస్టిక్) ఉన్నా యి. మరో రెండు లక్షల వరకు మురికివాడల (స్లమ్స్)కు సంబంధించిన నల్లాలున్నాయి. ఇప్పటికే స్లమ్స్ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతోంది. ఇదే తరహాలో డొమెస్టిక్ నల్లాలకు సైతం ఆక్యుపెన్సీ ధ్రువీకరణతో సంబంధం లేకుండా కేవలం నల్లా కనెక్షన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం, నల్లాకు నీటిమీటరును ఏర్పాటు చేసుకున్న వెంటనే ఉచిత నీటి పథకానికి అర్హులను చేయాలని వేలాదిమంది శివారు వాసులు డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం.. ఉచిత తాగునీటి పథకం అమలుకు మున్సిపల్ పరిపాలన శాఖ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాం. 2012 ఏప్రిల్‌కు ముందు నిర్మింన భవనాలకు సంబంధిత మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతులు, నిర్మాణ ప్లాన్‌ను జలమండలికి సమర్పించాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింన భవనాలకు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి అని మున్సిపల్ పరిపాలనశాఖ స్పష్టంచేసింది. ప్రతి నల్లాకూ నీటి మీటరును ఏర్పాటు చేసుకోవడం, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకున్న అనంతరమే ఈ పథకానికి అర్హత పొందుతారు. – ప్రవీణ్‌కుమార్, జలమండలి రెవెన్యూ విభాగం డైరెక్టర్ -
Railways: ‘స్పెషల్’ పేరుతో బాదారు.. ఇప్పుడేమో ?
న్యూఢిల్లీ : కోవిడ్ కాలంలో స్పెషల్ పేరుతో ఎడాపెడా టిక్కెట్ల రేట్లు పెంచినా... సబ్సీడీలు తగ్గించినా రైల్వే శాఖ కష్టాలు తీరలేదు. నిర్వహణ వ్యయం మెరుగవలేదు. తాజాగా ఆ శాఖ వెల్లడించిన గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. మెరుగుపడని ఓఆర్ కోవిడ్ వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పునరుద్ధరించినా ... గరిష్టంగా 65 శాతం రైళ్లనే నడిపించింది రైల్వేశాఖ. ఐనప్పటికీ ఆపరేటింగ్ రేషియో (ఓఆర్)లో మెరుగైన ఫలితాలు రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 97.45 శాతం అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి 98.36 శాతం ఓఆర్ సాధించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ పెట్టిన ఆర్జీతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సబ్సిడీలు రద్దు కోవిడ్ కాలంలో నష్టాలను తగ్గించుకునేందుకు సీజనల్ టిక్కెట్స్ రద్దు చేసింది, వికలాంగ, వృద్ధులు, రోగుల రాయితీలు రైల్వే పక్కన పెట్టింది. ఒకటేమిటీ కరోనా పేరుతో అందించే సబ్సీడీలు అన్నింటికీ కోత పెట్టింది... సామాన్యుల జేబుకు చిల్లు పెట్టింది ఇండియన్ రైల్వేస్. ఏడాది పాటు బాదుడు కార్యక్రమం నడిపించింది. ఐనా సరే సానుకూల ఫలితాలు పొందలేదు రైల్వేశాఖ. స్పెషల్ బాదుడు కోవిడ్ ఆంక్షల పేరుతో రైళ్లు నడిపించడంపై రైల్వేశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లను నడిపించకపోవడం, ఇదే సమయంలో ఆదాయం పెంచుకోవడం కోసం సాధారణ రైళ్లకు కూడా, స్పెషల్ స్టేటస్ తగిలించి టికెట్ రేట్లు పెండచడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసినా లక్ష్యాన్ని రైల్వేస్ అందుకోలేకపోయింది ఆదా పలు కీలక రూట్లలో ఎలక్ట్రిఫికేషన్ చేయడం ద్వారా రూ. 9,500 కోట్లు ఆదా చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులను క్రమబద్ధీకరించడం ద్వారా అదనంగా మరో రూ. 4,000 కోట్లు మిగులు వచ్చిందని ప్రకటించింది. చదవండి : సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
గ్రీన్ సిగ్నల్ : మమతా బెనర్జీ కీలక నిర్ణయం
సాక్షి, కోలకతా : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ అంతానికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాకుండానే తమ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో 100 శాతం అక్సుపెన్సీకి అంగీకారం తెలిపారు. శుక్రవారం 26 వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (కెఐఎఫ్ఎఫ్) ప్రారంభించిన ఆమె కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి రాష్ట్రంలోని సినిమా హాల్‌లను పూర్తిగా ఆక్రమించడానికి అనుమతించారు. సినిమా హాళ్లలో పూర్తి శాతం ప్రేక్షకులకు అనుమతినివ్వాలంటూ పరిశ్రమ పెద్దల ఇటీవలి అభ్యర్థనకు దీదీ అధికారికంగా శుక్రవారం అంగీకారం తెలిపారు. ఒకవైపు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించిన పళని సర్కారును కేంద్రం తప్పుట్టింది. వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతంనుంచి 100 పెంచాలని కోరుతూ ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కలైపులితాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. (పళని సర్కార్‌కు కేంద్రం షాక్!) సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు, ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు,స్థానిక మల్టీప్లెక్స్ చైన్ డైరెక్టర్ రతన్ సాహా మాట్లాడుతూ, సినిమా హాళ్ళలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే బాలీవుడ్ నిర్మాతలు పెద్ద బ్యానర్ చిత్రాలను బెంగాల్ లో విడుదల చేయడానికి వెనుకాడతారన్నారు. దుర్గా పూజ , క్రిస్మస్, నూతన సంవత్సరం లాంటి స్పెషల్ రోజుల్లో ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. దీంతో నిర్మాతలు, పంపిణీదారులను ఆందోళనలో పడిపోయారని సాహా చెప్పారు. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ క్యాప్‌ని తొలగించడం ఖచ్చితంగా థియేటర్ల యజమానులకుసాయపడుతుందనీ, నిర్మాతల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని కూడా సాహా అభిప్రాయపడ్డారు. అయితే చాలామంది హాల్ యజమానులు అక్టోబర్‌లో థియేటర్లు తెరవడానికి తీసుకున్న నిర్ణయానికి విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా సినిమా హాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమితినిస్తూ తమిళనాడు రాష్ట్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ప్రతికూలంగా స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం చర్య కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధమని, వెంటనే తమ జీవోను వెనక్కి తీసుకోవాలని పళని సర్కార్‌ను కోరింది. 50 శాతానికి మాత్రమే అనుమతి నివ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అటు దేశలో కొత్త వేరియంట్ యూకే స్ట్రెయిన్ కేసులు దేశంలో రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. -
అయ్యో.. ఆతిథ్యం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హోటల్ పరిశ్రమ పెనుసవాళ్లు ఎదుర్కొంటోంది. ఆక్యుపెన్సీ పడిపోయి, ఆదాయాలు తగ్గిపోయి ఆందోళన చెందుతోంది. రీసెర్చ్ సంస్థ ఎస్టీఆర్ నివేదిక ప్రకారం మార్చి 7 నాటికి ఆక్యుపెన్సీ 12 శాతం తగ్గగా.. మార్చి 21 నాటికి (లాక్డౌన్ ప్రకటించడానికి మూడు రోజుల ముందు) ఏకంగా 67 శాతం పడిపోయింది. ఆదాయాలు అంతకన్నా ఎక్కువగా పడిపోయాయి. ఫుడ్, బేవరేజెస్ అమ్మకాలు, ఈవెంట్స్ నిర్వహణ దెబ్బతినడంతో మార్చి 7 నాటికి ఆదాయంలో 20 శాతమే తగ్గుదల ఉండగా.. ఆ తర్వాత మార్చి 21 నాటికి ఏకంగా 73 శాతం పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గతేడాది ఆదాయాల్లో కనీసం 20 శాతం కూడా రాబట్టుకోవడం కూడా కష్టం కాగలదని హాస్పిటాలిటీ కన్సల్టింగ్ సంస్థ హోటెలివేట్ పేర్కొంది. గతేడాది రూ. 37,000 కోట్లుగా ఆదాయం ఉండగా.. 2020లో ఇందులో 15–20% మాత్రమే హోటల్ పరిశ్రమ ఆర్జించవచ్చని ఓ నివేదికలో తెలిపింది. సత్వరం ఒడ్డున పడేసే చర్యలు తీసుకోకపోతే దేశీయంగా బ్రాండెడ్.. సంఘటిత హోటల్ మార్కెట్ నెలల తరబడి మందగమనంలో పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణ లభ్యత లేక చిన్న స్థాయి హోటళ్లు దివాలా తీసే రిస్కులు ఉన్నాయని హోటెలివేట్ హెచ్చరించింది. దేశీయంగా సంఘటిత రంగంలో 1,000 బ్రాండ్లు.. 1,25,000 గదులు ఉన్నాయని అంచనా. ఇవి కాక అసంఘటిత రంగంలో 1,2,3 స్టార్ కేటగిరీకి చెందిన అన్‌బ్రాండెడ్ హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. లక్షల్లో ఉద్యోగాలకు ఎసరు.. వ్యాపారం పూర్తిగా నిల్చిపోయిందని పేరొందిన ఓ హోటల్ చెయిన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. బ్రాండెడ్ హోటళ్ల రంగంలోనే ఏకంగా 2,00,000 మంది పైగా సిబ్బంది ఉండగా అన్‌బ్రాండెడ్, అసంఘటిత హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు మొదలైన వాటి ద్వారా ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, సాధారణంగా చాలామటుకు హోటళ్ల వ్యయాల్లో జీతభత్యాలు మొదలైన వాటి వాటా 17–22% దాకా ఉంటుందని హోటెలివేట్ తెలిపింది. వ్యాపారం సజావుగా సాగినా సాగకు న్నా ఈ వ్యయాలు తప్పవని పేర్కొంది. సిబ్బంది జీతభత్యాల కోసం హోటళ్లకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంతగానో ఉందని వివరించింది. భారీ రుణభారం... వ్యాపార విస్తరణ కోసం, హోటళ్ల ఆధునికీకరణ కోసం సంఘటిత రంగ హోటళ్లు భారీగా రుణాలు తీసుకున్నాయి. 2020 జనవరి నాటికి వీటి మొత్తం రుణభారం దాదాపు రూ. 45,000 కోట్ల పైగా ఉంది. రాబోయే రోజుల్లో హోటళ్లు నెలవారీగా కట్టాల్సిన అసలు, వడ్డీలే వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని హోటెలివేట్ మేనేజింగ్ పార్ట్నర్ అచిన్ ఖన్నా చెప్పారు. వీటి చెల్లింపులకు సంబంధించి కనీసం 6–9 నెలల పాటైనా ఉపశమనం దొరికేలా ప్రభుత్వం, రుణాలిచ్చిన సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ కొనసాగించే యోచనేదీ లేదని ప్రభుత్వం చెబుతున్నా... వ్యాపారం మళ్లీ పట్టాలెక్కేందుకు చాలా నెలలు పట్టేస్తుందని హోటల్ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ప్రయాణాలపరమైన ఆంక్షలు సడలించినా హోటల్ వ్యాపా రాలు అప్పుడే పుంజుకోవడం కష్టమని భావిస్తోంది. పర్యాటకం ద్వారా (హోటళ్లు, టూరిజం సంస్థలు, మధ్యవర్తులు) దాదాపు 5.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 70% మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందనేది పరిశ్రమ వర్గాల మాట. ఇప్పటికే ఉద్యోగాల్లో కోత మొదలైందని, ఇది మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. -
శ్మశానంలో పచ్చ ‘భూ’తాలు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: విలువైన భూములనే కాదు ఊరవతల ఉన్న శ్మశాన భూములనూ వదలబోమంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు అండ చూసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లు శ్మశానాల్లో కూడా ప్లాట్లు వేసి అమ్ముకోవడానికి పావులు కదుపుతున్నారు. కోటి రూపాయల విలువైన స్థలాన్ని చదును చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శ్మశానంలో ఆక్రమణకు యత్నం కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామం దక్షిణం వైపు ఏపీ త్రయం గంగనాపల్లి, కొవ్వాడ, చీడిగ గ్రామ పొలిమేరలను కలుపుతూ పుంత మార్గం ఉంది. సర్వే నెంబర్ 79/18లో పుంతలోని కొంత భాగంలో బ్రాహ్మణులు, జంగాలు, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన శ్మశానం ఉంది. దాదాపు 40 సెంట్లు విస్తీర్ణంలోని భూమిని గతంలో కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని కొందరు యత్నించారు. శ్మశానమంటే ఇళ్ల స్థలాలు ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారని దాన్ని పోరంబోకు భూమిగా రికార్డుల్లో మార్చేందుకు కూడా ప్రయత్నించారు. అప్పట్లో సదరు సామాజిక వర్గాలు ప్రతిఘటించడంతో ఆక్రమణ తంతు ఆగింది. మళ్లీ ఇప్పుడు ఆ భూమిపైనే అక్రమార్కుల కన్ను పడింది. ఎమ్మెల్యే అండతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తి దాన్ని కబ్జా చేసేందుకు పావులు కదిపారు. చదును చేసేసి ప్లాట్లుగా విభజన చేసి అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారు పొక్లైన్తో చదును చేస్తూ అమ్మకాలు కూడా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ పక్కనే రైల్వే భూముల్లో కూడా అనధికారికంగా రోడ్డేసి ఆక్రమణకు యత్నిస్తున్నారు. స్థానిక అధికారులు కూడా ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి లేఅవుట్ వేసేసి, ప్లాట్లుగా విభజన చేసి సొమ్ము చేసుకునేందుకు పథక రచన చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు... కళ్ల ముందే శ్మశానాన్ని చదును చేసి కబ్జా చేసేస్తుంటే ఏ ఒక్క అధికారీ అడ్డు పడటం లేదు. పెద్దల అండదండలతో ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిసీ వారి జోలికే వెళ్లడం లేదు. ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారుల దృష్టికి వెళ్లినా నిలువరించే ప్రయత్నం జరగలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో సదరు గంగనాపల్లి గ్రామస్తులు నేరుగా ఆర్డీఓకు, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కోటి రూపాయల విలువైన భూమిని కబ్జా చేస్తూ, గ్రామంలో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపైనా, వారికి సహకరించిన వారిపైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. చదును యత్నాన్ని ఆపాం గంగనాపల్లిలో భూమిని చదును చేస్తున్నారని తెలుసుకొని వీఆర్ఓను పంపించి, ఆపించాం. సర్వేయర్‌ను కూడా పంపుతున్నాం. పరిశీలించాక సర్వేయర్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. పుంత భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతాం.– కె.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్, కాకినాడ రూరల్ -
జీఎస్టీ వద్దా? నిర్మాణం పూర్తయిన వాటిల్లో కొనండి!
రెరా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిర్మాణం పూర్తయిన గృహాలకు గిరాకీ పెరిగింది. కారణం.. వీటికి జీఎస్టీ లేకపోవటమే! ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధర కాస్త ఎక్కువైనా సరే నిర్మాణం పూర్తయిన (ఇన్వెంటరీ) గృహాలను కొనేందుకే ఎగబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన గృహాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వర్తించదు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు 12 శాతం జీఎస్టీ ఉంది. ఉదాహరణకు ఫ్లాట్ ఖరీదు రూ.60 లక్షలు అనుకుందాం. ఇది నిర్మాణంలో ఉంటే గనక 12 శాతం జీఎస్టీ అంటే రూ.7.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే నిర్మాణం పూర్తయిందనుకోండి జీఎస్టీ కట్టక్కర్లేదు. అంతేకాకుండా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న గృహాలకు సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్‌లతో పోలిస్తే నిర్మాణం పూర్తయిన వాటిల్లో ధర కాస్త ఎక్కువగా ఉంటుంది మరి. హైదరాబాద్‌తోపాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో గత రెండేళ్లుగా నిర్మాణం పూర్తయిన గృహాలకే డిమాండ్ ఉంది. పనిచేసే ప్రాంతాలకు దగ్గరగా, తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ప్రాంతంలోనే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం.. 2018–19 తొలి త్రైమాసికం నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 9,45,964 గృహాలు అమ్ముడుపోకుండా (ఇన్వెంటరీ) ఉన్నాయి. ఈ గృహాలు విక్రయమవ్వడానికి ఎంతలేదన్నా 41 నెలల సమయం పడుతుంది. అంటే లెక్కలేనన్ని గృహాలు నిర్మాణం పూర్తయి కొనుగోలుదారులను రారమ్మంటున్నాయన్నమాట. అద్దె లోంచి సొంతింట్లోకి.. ఈ రోజుల్లో సొంతిల్లు కొందామన్న నిర్ణయం తీసుకున్నాక.. గృహ ప్రవేశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే ఓపిక కొనుగోలుదారులకు ఉండట్లేదు. అందుకే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. నిర్మాణంలో ఆలస్యం, వసతుల ఏర్పాట్లు పూర్తయ్యే వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు అద్దె గృహాల్లో ఉన్న వాళ్లు రాత్రికి రాత్రే సొంతింట్లోకి వెళ్లిపోవచ్చు. అద్దె సొమ్మును నెల వారీ ఈఎంఐగా చెల్లించవచ్చు. గృహాన్ని అద్దెకిస్తే ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయ్.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే.. ప్రాజెక్ట్‌ల్లోని వసతులే కాకుండా గదుల విస్తీర్ణం, నిర్మాణంలోని నాణ్యత, శానిటరీ, ఎలక్ట్రిక్ ఇతరత్రా ఉత్పత్తుల వినియోగం వంటివి బ్రోచర్లు లేదా నమూనా ఫ్లాట్లలో కాకుండా వాస్తవంగా కళ్లతో చూసుకునే వీలుంటుంది. వాస్తవంగా ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం అభివృద్ధి, చుట్టుపక్కల రవాణా సదుపాయాలు, షాపింగ్, మార్కెట్, పార్క్‌లు, సెక్యూరిటీ ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. పెట్టుబడికైనా సరే.. ఒకవేళ మీరు సొంతంగా ఉండేందుకు కాకుండా పెట్టుబడి కోసం ఇల్లు కొనాలనుకున్నా సరే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటినే కొనడం ఉత్తమం. ఎందుకంటే కొనుగోలు చేసిన మొదటి నెల నుంచే అద్దె ఆదాయం మొదలవుతుంది గనక. నిర్మాణం పూర్తయిన గృహాలకు బ్యాంక్‌లకు కూడా రుణాన్ని త్వరగా మంజూరు చేస్తాయి. వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు గనక డెవలపర్లు కూడా వసతుల్లో, పార్కింగ్ వంటి వాటిల్లో ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. రెరా అమల్లోకి వచ్చాక నిర్మాణ గడువును కూడా డెవలపర్లు పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించే డెవలపర్లు.. రెరా వచ్చాక నాలుగైదు ఏళ్లని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యమైతే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలున్నాయి మరి. చ.అ.కు 500–800 ఎక్కువ.. ప్రాజెక్ట్ ప్రారంభ దశలోని ధరతో పోలిస్తే నిర్మాణం పూర్తయ్యే నాటికి విక్రయించే గృహాల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. చ.అ.కు సుమారు రూ.500–800 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అధిక ధర కారణంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్వోఐ) కూడా తక్కువగా ఉండే ప్రమాదముంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో సీవరేజ్, డ్రైనేజ్ వంటి నాణ్యత లోపాలను గుర్తించడం కష్టం. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోతే కొన్నేళ్ల తర్వాత నాణ్యత లోపాలు బహిర్గతమవుతాయి. -
రైల్వేశాఖ యూ టర్న్
సాక్షి, ముంబై : బుల్లెట్ ట్రయిన్ విషయంలో రైల్వే శాఖ యూ టర్న్ తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే బుల్లెట్ ట్రయిన్ అంత లాభదాయం కాదని పేర్కొన్న రైల్వ శాఖ తాజాగా మాట మార్చింది. భారత్‌లో పరుగులు తీయనున్న మొదటి బుల్లెట్ ట్రయిన్ పూర్తిగా పూర్తిగా లాభదాయకమని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆఫ్ సీజన్లోనూ బుల్లెట్ ట్రయిన్‌కు నష్టాలు వచ్చే అవకాశం తక్కువని ఆయన తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రయిన్ 100 శాతం ఆకుపెన్సీ కలిగి ఉండడమే కాక.. భారీగా లాభాలను గడిస్తుందని గోయల్ ట్విటర్లో ట్వీట్ చేశారు. దేశంలోని మొదటి బుల్లెట్ ట్రయిన్ 2023న పట్టాలు ఎక్కనుంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ట్రయిన్‌కు సుమారు 30 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం. దీనిపై వశ్చిమ రైల్వే శాఖ వివరణ ఇస్తూ.. ముంబై-అహ్మదాబాద్ రూట్ అత్యుత్తమ వ్యాపార మార్గాల్లో ఒకటి తెలిపింది. ఆఫ్ సీజన్లోనే రైల్వే శాఖ ఈ రూట్లో 233 కోట్ల రూపాయలను ఆర్జిస్తోందని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్ అధికారి రవీందర్ భాస్కర్ వెల్లడించారు. -
భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!
భారత్ లో లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. రాజభోగాల్లాంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాలుగు ట్రైన్లకు ఇక కాలం చెల్లనుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పర్యాటక ప్రియులకోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ప్రముఖమైన 'ప్యాలస్ ఆన్ వీల్స్' గతవారం తొలిసారిగా చక్రాలు నిలిచిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రారంభించిన 34 ఏళ్ళలో ఎప్పుడూ ఆగని ఈ ట్రైన్.. ప్రయాణీకులు లేని కారణంతో నిలిచిపోవడం ఇప్పుడు లగ్జరీ ట్రైన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విలాసవంతమైన సౌకర్యాలకు అనుగుణంగానే లగ్జరీ ట్రైన్లలో ఉండే ఛార్జీలు కూడ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న నాలుగు లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లు ప్రయాణికుల్లేక బోసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. భవిష్యత్తు ఏమిటోనన్న అయోమయ స్థితిలో పడ్డాయి. ఇండియన్ రైల్వే మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ 'ప్యాలెస్ ఆన్ వీల్స్' సహా మరో మూడు లగ్జరీ ట్రైన్లు... ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం 18 బుకింగ్స్ మాత్రమే జరగడంతో గతవారం ప్యాలెస్ ఆన్ వీల్స్ ను మొదటిసారి నిలిపివేశారు. అలాగే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ కూడ పీక్ టూరిస్టు సీజన్ అయిన గత డిసెంబర్ లో బుకింగ్స్ లేక రెండు ట్రిప్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2014-15 లో 35 నుంచి 40 శాతం, అంతకు ముందు 2011-12 లో ఇంకా 60 శాతం వరకూ ప్రయాణీకుల సంఖ్య తగ్గి, ఆక్యుపెన్సీ సమస్య ఏర్పడటంతో అప్పట్లో కొన్ని ట్రిప్పులను కూడ కుదించేశారు. వాయువ్య, మధ్య భారతదేశంలోని 12 ప్రాంతాలను కవర్ చేసే అత్యంత విలాసవంతమైన మహారాజా ఎక్స్ ప్రెస్ లో మాత్రమే గత ఐదేళ్ళలో 15 శాతం వరకూ ప్రయాణీకుల స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ అనేక ట్రావెల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, సూపర్ రిచ్ ప్రాధాన్యతలున్న జాబితాలో మాహారాజా ఎక్స్ ప్రెస్ నాల్గవ స్థానంలో కూడ నిలిచింది. అలాగే లాటిన్ అమెరికాలో ఈ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటూ మెక్సికో కూడ అభ్యర్థించింది. అత్యంత సంపన్నులైన వారికి అనువుగా.. ఖరీదైన, విలాసవంతమైన ఐదు రైళ్ళను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారు. ఒక్కరాత్రి ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి ఈ లగ్జరీ ట్రైన్లలో మార్గం, సీజన్, రైలును బట్టి ఒక్కో వ్యక్తికి సుమారు 500 డాలర్లు, అంటే సుమారు 30 వేల రూపాయల నుంచి 1800 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాలకు పైగా ఛార్జీలు ఉంటాయి. దేశంలోని మొత్తం ఐదు లగ్జరీ ట్రైన్లలో తొలి లగ్జరీ ట్రైన్... ప్యాలెస్ అన్ ది వీల్స్ ను మూడు దశాబ్దాలక్రితం రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్టీడీసీ) ప్రారంభించింది. తర్వాత రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ను కూడ ప్రారంభించిన ఆర్టీడీసీ.. ఇంచుమించు రెండు రైళ్ళనూ ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్, ఆగ్రాలను కవర్ చేసేట్లు ఒకే మార్గంలో నడుపుతోంది. ఆ తర్వాత మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన డెక్కన్ ఒడిస్సీ... మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లను కవర్ చేస్తుంది. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్నాటక నుంచి గోవా వరకూ నడిపే 'గోల్డెన్ ఛరియట్'.. దక్షిణ ప్రాంతంలో నడిచే ఒకేఒక్క లగ్జరీ ట్రైన్ గా చెప్పాలి. ఈ మొత్తం అన్ని లగ్జరీ ట్రైన్లలోనూ సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఇంటర్ కమ్, టీవీ, వైఫై, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతోపాటు... పాంట్రీ, లాంజ్, మ్యూజిక్, మనీ ఎక్సేంజ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు అనువుగా కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, దేశీయ ప్రత్యేక వంటకాలను వడ్డించే ప్ర్తత్యేక రెస్టారెంట్లు, బార్లు తో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో అటెండెంట్స్ కూడ ఉంటారు. ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునే ఈ లగ్జరీ రైళ్ళు.. సుమారు 14 నుంచి 19 బోగీలను కలిగి ప్రయాణీకులకు భారత రాచరిక మర్యాదలతో ఎర్రతివాచీ స్వాగతం పలుకుతాయి. అయితే తాజాగా విదేశీయులు, ఎన్నారైలు వారి దేశాలనుంచే క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించిన భారత రైల్వే... లగ్జరీ ట్రైన్ల ఆక్యుపెన్సీ సమస్య తీర్చేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
ఈ పాపం ఎవరిది?
భవనాలు లేకపోయినా విద్యుత్, నీటి కనెక్షన్లు ఇందులో నష్టపోయింది సామాన్యులే అధికారుల తీరుపైనా అనుమానాలు ఆక్యుపెన్సీ లేకుండా కనెక్షన్లు ఇవ్వడంపై విమర్శలు సర్కార్ ఆదేశాలతో మేల్కొన్న అధికారులు నీటి, కరెంట్ కనెక్షన్లపై ఆరా సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: గురుకుల్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలపై పలు శాఖల అధికారులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్టడాలు అక్రమమని తెలిసిన సమయంలోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఆక్యుపెన్సీ లేకపోయినా మంచినీటి, కరెంట్ కనెక్షన్లు ఎలా ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భూముల్లో సంపన్నులతోపాటు సామాన్యులు సైతం ఉన్నారు. తాజా చర్యలతో సామాన్యులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. గురుకుల్లో అక్రమాలకు సహకరించినా అధికారులనూ వదలొద్దనే డిమాండ్ విన్పిస్తోంది. ఇక్కడ ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 600 భవనాలు. వీటి నిర్మాణాలకు అనుమతుల్లేవు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేవు. ఆస్తిపన్నూ లేదు. అయినప్పటికీ విద్యుత్, మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇదీ గురుకుల్ ట్రస్ట్‌లోని అయ్యప్ప సొసైటీ భూముల్లోని భవనాల వ్యవహారం. ఇందులో సామాన్యులు సైతం ఉన్నా ఇక్కడి భవనాల్లో బడా బాబులే అధికం. ఉన్నతస్థాయి పలుకుబడి, అండదండలతోనే ఆస్తిపన్నులు చెల్లించకపోయినా, ఆక్యుపెన్సీ లేకున్నా నిరాటంకంగా నెట్టుకొచ్చారు. మూడేళ్ల క్రితం గురుకుల్ ట్రస్ట్‌లోని భవనాలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని మూణ్నాళ్ల తంతుగా ముగించారు. దాంతో, అక్రమంగా అంతస్తులు లేపినా ఏమీ కాదనే నిర్ణయానికొచ్చిన కొందరు మళ్లీ నిర్మాణాలను కొనసాగించారు. సుదీర్ఘ విరామం తర్వాత.. కొత్త సర్కారు అధికారంలోకి వచ్చాక ట్రస్ట్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. కొత్త సర్కార్ చర్యలకు దిగడంతో అంతిమంగా నష్టపోయింది సామాన్యులే. అధికారులనూ బాధ్యులను చేయాలి... సామాన్యులు నష్టపోవడం వెనుక పలు శాఖ అధికారుల పాత్ర ఉందని తెలుస్తోంది. అనుమతులు లేకుండా కట్టడాలు వెలిసినా.. ఆక్యుపెన్సీ లేకపోయినా విద్యుత్, నీటి కనెక్షన్లు ఇచ్చిన అధికారులనూ బాధ్యులను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం వీరి జోలికి పోని అధికారులు ఇప్పుడు తీవ్ర చర్యలకు సిద్ధమయ్యారు. విద్యుత్, నీటి కనెక్షన్లున్న వారికి మూడింతల పన్ను విధించేందుకు నిర్ణయించారు. మిగతా వాటికి కనెక్షన్లు ఇవ్వరాదని నిర్ణయించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనిదే విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వబోమని ఎంతోకాలంగా చెబుతున్నా దాన్ని అమలు చేసిన పాపాన పోలేదు. ఇకపై వీటిని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న పలు భవనాలను ఇప్పటికే కూల్చివేసిన అధికారులు, మరికొన్ని భవనాలను కూల్చివేసేందుకూ ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం 11 భవనాలకు సంబంధించిన 33 షట్టర్లకు తాళాలు వేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు.. గురుకుల్ భూముల్లోని ప్రధాన కూడళ్లలో సుమారు 20 చోట్ల అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడి భవనాలు అక్రమమని ఎవరూ కొనుగోలు చేయవద్దని అందులో పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోలో మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కూల్చివేసిన 24 భవనాలు, సీజ్చేసిన 11 భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఎప్పుడిచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తిరిగి వాటికి కనెక్షన్లు ఇవ్వరాదని ఆయా విభాగాలకు లేఖలు రాశారు. మరోవైపు సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ, నీటిపారుదల తదితర విభాగాల అధికారులు తమ్మిడికుంట చెరువు మార్కింగ్ పనులు మొదలుపెట్టారు. బోర్డుల ఏర్పాటు.. గురుకుల్ ట్రస్టుతోపాటు హైటెక్ సిటీ సమీపంలోని అసైన్డ్ స్థలాలపైనా రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఖానామెట్ సర్వే నెంబర్ 43 నుంచి 49 వరకు ఉన్న 30 ఎకరాల ఖాళీ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. రెగ్యులరైజేషన్ వర్తించదు గురుకుల్ ట్రస్టులో వెలసిన నిర్మాణాలకు రెగ్యులరైజేషన్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలు వర్తించవు. గురుకుల్ ట్రస్టులో ఉన్న ఖాళీ స్థలాలు, నిర్మాణాలకు సంబంధించి సంబంధితులకు వివిధ రకాల నోటీసులు ఇస్తాం. ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయింది. సమగ్ర నివేదికను రూపొందిస్తున్నాం. - సోమేశ్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ నీటి బిల్లులు మూడు రెట్లు అధికంగా వేస్తాం.. భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే నీటి కనెక్షన్ ఇస్తాం. ఇప్పటికే గురుకుల్లో భవనాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయని వాటిని పరిశీలిస్తున్నాం. కనెక్షన్ తీసుకున్న తేదీ నుంచి మూడింతలు బిల్లు చెల్లించాల్సిందే. బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తాం. - మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ జగదీశ్వర్ తాము మధ్యతరగతి ప్రజలమని, తమ గోడు తెలంగాణ సీఎం వినాలని అయ్యప్ప సొసైటీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవనాలు సీజ్ చేస్తుండడంతో శుక్రవారం అయ్యప్ప సొసైటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమకు మార్గం చూపాలని కోరుతున్నారు. - గచ్చిబౌలి పసుపు కుంకుమల కింద వచ్చిన ప్లాట్ పసుపు కుంకుమల కింద మా నాన్న ఇచ్చిన ప్లాట్ ఇది. తెలియక భవనం కట్టుకున్నాం. తప్పును సరిచేసుకునే మార్గం చూపండి. ప్లీజ్ కూలగొట్టడమే మార్గమని చెప్పొద్దు. - సుమారావు, అయ్యప్పసొసైటీ దినదినగండమేనా? దినదినగండంగా బతుకుతున్నాం. ఉన్న డబ్బంతా నిర్మాణాలకే వెచ్చించాం. భవనాలు కూల్చివేస్తే మేం ఎలా బతకాలి. నా భర్తకు గుండెపోటు వచ్చింది, అయ్యప్ప సొసైటీలో చాలామంది తెలంగాణగా వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రే మాకు దారిచూపాలి. - సులోచనా రెడ్డి, అయ్యప్ప సొసైటీ