సాక్షి, కోలకతా : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ‍్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ అంతానికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాకుండానే తమ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో 100 శాతం అక్సుపెన్సీకి అంగీకారం తెలిపారు. శుక్రవారం 26 వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (కెఐఎఫ్ఎఫ్) ప్రారంభించిన ఆమె కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి రాష్ట్రంలోని సినిమా హాల్‌లను పూర్తిగా ఆక్రమించడానికి అనుమతించారు. సినిమా హాళ్లలో పూర్తి శాతం ప్రేక్షకులకు అనుమతినివ్వాలంటూ పరిశ్రమ పెద్దల ఇటీవలి అభ్యర్థనకు దీదీ అధికారికంగా శుక్రవారం అంగీకారం తెలిపారు. ఒకవైపు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించిన పళని సర్కారును కేంద్రం తప్పుట్టింది. వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతంనుంచి 100 పెంచాలని కోరుతూ ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కలైపులితాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. (పళని సర్కార్‌కు కేంద్రం షాక్!)
సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు, ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు,స్థానిక మల్టీప్లెక్స్ చైన్ డైరెక్టర్ రతన్ సాహా మాట్లాడుతూ, సినిమా హాళ్ళలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే బాలీవుడ్ నిర్మాతలు పెద్ద బ్యానర్ చిత్రాలను బెంగాల్ లో విడుదల చేయడానికి వెనుకాడతారన్నారు. దుర్గా పూజ , క్రిస్మస్, నూతన సంవత్సరం లాంటి స్పెషల్ రోజుల్లో ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. దీంతో నిర్మాతలు, పంపిణీదారులను ఆందోళనలో పడిపోయారని సాహా చెప్పారు. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ క్యాప్‌ని తొలగించడం ఖచ్చితంగా థియేటర్ల యజమానులకుసాయపడుతుందనీ, నిర్మాతల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని కూడా సాహా అభిప్రాయపడ్డారు. అయితే చాలామంది హాల్ యజమానులు అక్టోబర్‌లో థియేటర్లు తెరవడానికి తీసుకున్న నిర్ణయానికి విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సినిమా హాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమితినిస్తూ తమిళనాడు రాష్ట్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ప్రతికూలంగా స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం చర్య కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధమని, వెంటనే తమ జీవోను వెనక్కి తీసుకోవాలని పళని సర్కార్‌ను కోరింది. 50 శాతానికి మాత్రమే అనుమతి నివ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అటు దేశలో కొత్త వేరియంట్ యూకే స్ట్రెయిన్ కేసులు దేశంలో రోజుకు రోజుకు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment