Full
-
ఓటు ప్లాట్‌ఫామ్‌పై వందేభారత్
గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది. కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్‌లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్‌బిల్ట్ ఇంజిన్‌తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్‌లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏకంగా మూడు రైళ్లతో.. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్‌ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా.. ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్‌కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు. ప్రచారం చేయాలని.... ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది?
మొన్న మొన్నటి వరకు చైనా కరోనాతో భయానక నరకాన్ని చవి చూసింది. అన్ని దేశాలు బయటపడ్డా చైనా మాత్రం అంతా తేలిగ్గా ఆ మహమ్మారి నుంచి బయటపడలేకపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న వేళా! మళ్లా చైనీయులకు ఏమైందో గానీ మొత్తం ముఖం కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తున్నారు. కరోనా టైంలో కేవలం ముక్కుకి మాత్రమే మాస్క్ వేస్తే ఇప్పుడు ఏకంగా మొత్తం ముఖానికి మాస్క్ ఏంటి? బాబోయ్!.. మళ్లీ చైనాలో ఏం మహమ్మారి వచ్చింది అని అన్ని దేశాలు ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే.. చైనాలో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. ఆ వేడికి అక్కడ ప్రజలు తాళ్లలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే..దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారట. ఈ ఎండ నుంచి రక్షించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ఇలా ఫేస్మొత్తం కవర్ చేసేలా 'ఫేస్కినిక్' అనే మాస్క్‌లు వేస్తున్నారట. చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో నివాసుతులు దగ్గర్నుంచి, పర్యాటకులు వరకు అందరూ కూడా పోర్టబుల్ ఫ్యాన్లను కూడా తీసుకువెళ్తున్నారట. ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, వివిధ రకాల మొత్తటి దుస్తులను ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలు. అదీగాక అక్కడ మహిళలు ఫెయిర్ స్కిన్‌నే ఇష్టపడతారు అందువల్ల ఈ ఎండ నుంచి తమ మేను కాంతి తగ్గకుండా ఉండేందుకు వారంతా ఇలా ముఖమంతా కవర్ అయ్యేలా మాస్క్‌లు వేసుకుంటున్నారు. ఇవి చాలా తేలిగ్గా, సింథటిక్ ఉండటంతో చర్మం కమిలిపోకుండా ఉంటుందట. అంతేకాదు ఈ ఎండలు ఎలా ఉన్నా ఈ 'పేస్కినిక్' మాస్క్‌లు మాత్రం హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా.. అయ్యప్పా..
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ఈసారి భారీ సంఖ్యలోనే మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది. మరోవైపు జంటనగరాల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప భక్తులు శబరికి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈసారి ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఉన్నది ఒక్కటే.. ► సాధారణంగా ప్రతి ఏటా కనీసం 2.5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్తింది. ఈసారి లక్ష మందికి పైగా మాలధారణ చేసినట్లు అంచనా. ప్రతి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం వల్ల శబరికి వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు. కానీ కనీసం 30 వేల మందికి పైగా భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ► హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల రోజుల వరకు కనీసం టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. ఈసారి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. ► ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. ► విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత... ► రైళ్ల కొరత కారణంగా అయ్యప్ప భక్తులు, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లే సాధారణ ప్రజలు సైతం ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహణాలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి: ‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’ -
మిషన్ ‘ఆయిల్ పామ్’.. సబ్సిడీ తీరు ఇలా..
సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్ సాగును జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతుల్లో 56 శాతం పామాయిలే... మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఒక్క పామాయిల్‌పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే... సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది. ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్ పామ్ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ ఏపీ.. ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్‌కు 19.81 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది. -
గ్రీన్ సిగ్నల్ : మమతా బెనర్జీ కీలక నిర్ణయం
సాక్షి, కోలకతా : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ అంతానికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాకుండానే తమ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో 100 శాతం అక్సుపెన్సీకి అంగీకారం తెలిపారు. శుక్రవారం 26 వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (కెఐఎఫ్ఎఫ్) ప్రారంభించిన ఆమె కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి రాష్ట్రంలోని సినిమా హాల్‌లను పూర్తిగా ఆక్రమించడానికి అనుమతించారు. సినిమా హాళ్లలో పూర్తి శాతం ప్రేక్షకులకు అనుమతినివ్వాలంటూ పరిశ్రమ పెద్దల ఇటీవలి అభ్యర్థనకు దీదీ అధికారికంగా శుక్రవారం అంగీకారం తెలిపారు. ఒకవైపు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించిన పళని సర్కారును కేంద్రం తప్పుట్టింది. వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతంనుంచి 100 పెంచాలని కోరుతూ ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కలైపులితాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. (పళని సర్కార్‌కు కేంద్రం షాక్!) సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు, ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు,స్థానిక మల్టీప్లెక్స్ చైన్ డైరెక్టర్ రతన్ సాహా మాట్లాడుతూ, సినిమా హాళ్ళలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే బాలీవుడ్ నిర్మాతలు పెద్ద బ్యానర్ చిత్రాలను బెంగాల్ లో విడుదల చేయడానికి వెనుకాడతారన్నారు. దుర్గా పూజ , క్రిస్మస్, నూతన సంవత్సరం లాంటి స్పెషల్ రోజుల్లో ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. దీంతో నిర్మాతలు, పంపిణీదారులను ఆందోళనలో పడిపోయారని సాహా చెప్పారు. అయితే 50 శాతం ఆక్యుపెన్సీ క్యాప్‌ని తొలగించడం ఖచ్చితంగా థియేటర్ల యజమానులకుసాయపడుతుందనీ, నిర్మాతల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని కూడా సాహా అభిప్రాయపడ్డారు. అయితే చాలామంది హాల్ యజమానులు అక్టోబర్‌లో థియేటర్లు తెరవడానికి తీసుకున్న నిర్ణయానికి విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా సినిమా హాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమితినిస్తూ తమిళనాడు రాష్ట్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ప్రతికూలంగా స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం చర్య కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధమని, వెంటనే తమ జీవోను వెనక్కి తీసుకోవాలని పళని సర్కార్‌ను కోరింది. 50 శాతానికి మాత్రమే అనుమతి నివ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అటు దేశలో కొత్త వేరియంట్ యూకే స్ట్రెయిన్ కేసులు దేశంలో రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. -
బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజులు మంజూరు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఆ సంఘం నేతలు బీసీ లెజిస్లేచర్ కమిటీని సోమవారం కలసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రావల్కోల్ నరేశ్, కె.నర్సింహా పాల్గొన్నారు. -
కౌలురైతు మృతిపై పూర్తి స్థాయి విచారణ
సాక్షి కథనానికి స్పందించిన అధికారులు వీకే రాయపురం (సామర్లకోట) : మండల పరిధిలో వీకే రాయపురం గ్రామంలో మృతి చెందిన కౌలు రైతుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబు తెలిపారు. ‘కలిసి రాని సాగు కాటికి తరిమింది’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వీకే రాయపురం గ్రామం చేరుకుని రైతుల నుంచి, మృతుని భార్య సత్యగౌరి నుంచి గురువారం కాకినాడ ఆర్డీఓ రఘుబాబు, వ్యవసాయశాఖ ఏడీఏ సి.భవాని, తహసీల్దార్ ఎల్.శివ కుమార్, ఏఓ ఎన్.శామ్యూల్‌జాన్ సమాచారం సేకరించారు. ఆర్డీఓ విలేకర్లతో మాట్లాడుతూ మలిరెడ్డి సూరిబాబు అనే కౌలు రైతు మృతి చెందడంతో అతని మృతికి కారణాలపై విచారణ చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం చేస్తూ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణాలలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు సంఘ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అడబాల చిట్టిబాబు, వెలమర్తి శ్రీను, ఓదూరి నాగేష్, మలిరెడ్డి సూరిబాబు, ధర్మరాజు, వెంకన్న, చక్రం కసిరెడ్డి వీర్రాజులు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా సూరిబాబు తండ్రి నుంచి భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడని తెలిపారు. బ్యాంకు రుణాలు ఇవ్వక పోవడంలో బయటవ్యక్తుల నుంచి నూటికి రూ.5 చొప్పున అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తూ అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మలిరెడ్డి సూరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. వైద్య ఖర్చుల కోసం ఎటువంటి అప్పులు చేయలేదని వ్యవసాయం కోసమే అప్పులు చేసాడని గ్రామస్తులు తెలిపారు. అయితే సూరిబాబు వ్యవసాయం చేయడంలేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి గంగరాజు కూడా కౌలు రైతుగా వ్యవసాయం చేసి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు వివరించారు. ఆ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని ఐదు ఏళ్ల కుమారుడు రిషాల, ఏడాది కుమార్తె వైష్టవి మహాలక్ష్మిలను ఆ తల్లి ఏవిధంగా పెంచుతుందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ విచారణలోని పూర్తి సమాచారం మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, ఈ మేరకు యథార్థ విషయాలు తెలియజేయాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందని అ«ధికారులు తెలిపారు. మృతి చెందిన సూరిబాబుకు ఇటీవల జారీ చేసిన కౌలు కార్డు ఆధారంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో కుండపోత
మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మి.మీ. వర్షపాతం పొంగిన వాగులు, వంకలు చింతూరు, వీఆర్‌పురం మధ్య నిలిచిన రాకపోకలు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో పడిన చెట్లు ఏడు గంటలు నిలిచిన ట్రాఫిక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు సగటు వర్షపాతం 11.0 మి.మీ. సాక్షి, రాజమహేంద్రవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షాలు కురిశాయి. మెట్ట, డెల్టాల కన్నా ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఏజెన్సీలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా విలీన మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైంది. విలీన మండలాలైన వీఆర్‌పురంలో 46.6 మి.మీ, ఏటపాకలో 33.3, చింతూరులో 30.0, కూనవరంలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద అత్తాకోడళ్ల వాగు పొంగి రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా వ్యహరించారు. విలీన మండలాల్లో విస్తారంగా వర్షాలు పడి వరదలు వస్తుండడంతో చింతూరు ఐటీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఐటీడీవో పీవో చినబాబు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు నాలుగు మండలాల తహసీల్దార్లతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 08748–285259 నంబరు ద్వారా సంప్రదించాలని కోరారు. భద్రాచలం వెళ్లి గోదావరి వరద పరిస్థితిని తెలుసుకున్నారు. అకస్మాత్తుగా వచ్చే సబరి వరదపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘాట్‌రోడ్డులోని టైగర్ క్యాంప్ వద్ద చెట్లు కూలి రహదారిపై పడ్డాయి. మధ్యాహ్నం నుంచి ఇరువైపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకు చెట్లను తొలగించారు. . మైదాన ప్రాంతంలోనూ నిరంతరం వర్షం... జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో కూడా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొద్దిపాటి వర్షం పడుతూనే ఉంది. మధ్య మధ్యలో తెరపిస్తున్న వరుణుడు మళ్లీ వర్షం కురిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. స్కూలు పిల్లలు పాఠశాల రాకపోకలు సమయంలో ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు లేక దుకాణాలు బోసిపోయాయి. చిరు వ్యాపారులు రోడ్లపైకి రాలేకపోయారు. ఏజెన్సీ తర్వాత జిల్లాలో అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 26.2 మి.మీ, సీతానగరంలో 25.2, రాజమహేంద్రవరం రూరల్‌లో 20.2, ఆత్రేయపురం మండలంలో 13.0, పెద్దాపురంలో 15.8, ముమ్మిడివరంలో 7.4, అమలాపురం, కాకినాడల్లో 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తునిలో 1.0 మి.మీ వర్షపాతం నమోదవగా జిల్లా సగటు వర్షపాతం 11.0 మిల్లీ మీటర్లగా నమోదైంది. -
వ్యాపారం ఘనం..వసతులు శూన్యం
ప్రతి రోజు 6 నుండి 8 లక్షల వ్యాపారం మత్స్య వ్యాపార కేంద్రంగా ఓడలరేవు వసతులు కల్పించాలని మత్స్యకారుల వినతి అల్లవరం : అపార మత్స్య సంపదకు నిలయమైన ఓడలరేవులో నిత్యం వందలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఆదాయం పరంగా ఎంతో వృద్ధి చెందినప్పటికీ వసతుల పరంగా అధ్వాన స్థితిలో ఉంది. పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చే మత్స్యకార కుటుంబాలు ఎనిమిది నెలలు పాటు తీర ప్రాంతంలో నివాసాలు ఏర్పాటుచేసుకుని ఉపాధి పొందుతుంటారు. కనీస సౌకర్యాలు కరువు లక్షలాది రుపాయలు వ్యాపారం జరుగుతున్నా వేటాడిన మత్స్య సంపదను విక్రయించేందుకు కనీస సౌకర్యాలు ఇక్కడ కరువైయ్యాయి. తీరంలోకి వచ్చే వందలాది బోట్లకు ల్యాడింగ్ సౌకర్యం లేక నది మధ్యలో లంగరు వేసి మత్స్య సంపదను మర బోట్లు ద్వారా గట్టుకి చేరవేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల మత్స్యకారులకు అదనపు వ్యయం అవుతోంది. ప్రకటనలకే పరిమితమైన జెట్టీ.. పదిహేనేళ్ల క్రితం ఓడలరేవు తీరంలో జెట్టీ నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఓడలరేవులో జెట్టీ నిర్మాణానికి రూ.3.9 కోట్లు మంజూరయ్యాయి. దీని నిర్మాణానికి స్థల సేకరణ ఆలస్యం కావడంతో కార్యరూపం దాల్చలేదు. నిర్మాణ వ్యయం పెరగడంతో ధవళేశ్వరం హెడ్‌వర్కు జెట్టీ నిర్మాణానికి రూ.5.04 కోట్లు అవసరమని అంచనాలు రుపొందించారు. ఇటీవల మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ జెట్టీ స్థలాన్ని పరిశీలించి త్వరలో పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో వ్యాపారం.. ఈ రేవులో నిత్యం వంద బోట్ల ద్వారా చేపలవేట సాగిస్తున్నారు. ప్రతి రోజు రూ. 6 నుండి 8 లక్షలు వరకూ విక్రయాలు జరుగుతూ కాకినాడ, విశాఖపట్నం నరసాపురం మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా నక్కపల్లికి చెందిన 30 బోట్లు, ఉప్పాడ నుండి 30 బోట్లు స్థానికంగా మరో 40 బోట్ల ద్వారా వైనతేయ నది ముఖద్వారం గుండా సముద్రంలోకి వేటకు వెళ్తాయి. తెల్లవారుజామున బయలుదేరి మధ్యాహ్నం వరకూ వేటాడిన చేపలను తీర ప్రాంతంలోకి తీసుకువచ్చి విక్రయిస్తారు. ఇలా విక్రయించిన చేపలకు రూ.6 నుండి 8 వేలు వరకు గిట్టుబాటు లభిస్తుంది. సోనాబోట్లు, మెకనైజ్డ్ బోట్లలో చేపల వేటకు వేళ్లే మత్స్యకారులు వారం రోజల పాటు చేపలను వేటాడి తిరిగివస్తూంటారు. వారం రోజల పాటు సముద్రంలో గడిపేందుకు ఒక్కొక్క సోనాబోటుకు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుంది. వారం పాటు వేటాడిన చేపలు విక్రయిస్తే ఖర్చులు పోను రూ.40 వేలు మిగులుతుంది. ఒక్కొక్క సారి చేపలు లభించక నష్టం కుడా వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటాడిన చేపలను విక్రయించేందుకు సౌకర్యాలు లేక నేలపైన అమ్మకాలు జరపవలస్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. అలాగే వేటాడిన చేపలను విక్రయించడానికి కమీష¯ŒSపై స్థానికులే దళారులుగా వ్యవహరిస్తారన్నారు. -
అద్దెకు రెక్కలు
నెల ముందుగానే బుకింగ్ షురూ లాడ్జిలన్నీ హౌస్‌ఫుల్ అంటున్న నిర్వాహకులు సమ్మెటివ్ పరీక్షల నేపథ్యంలో జాతర సిబ్బందికీ వసతి కరువే వెంకటగిరి: పోలేరమ్మ జాతర వెంకటగిరిలోని లాడ్జి యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. జాతరలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో పలువురు లాడ్జిల్లో ఆశ్రయం పొందుతారు. అయితే ఈ ఏడాది లాడ్జిల నిర్వాహకుల చెప్పే అద్దెలు విని నోరెళ్లబెడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని దోచుకునేందుకు లాడ్జిల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నెలముందే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ హౌస్‌ఫుల్ అని సమాధానమిస్తున్నారు. ఎలాగోలా చేయాలని కోరితే చేంతాడంత అద్దెలు చెబుతున్నారు. పట్టణంలో సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆరు రెట్లు వరకు పెంచి గదుల స్థాయి(ఏసీ, నాన్ఏసీ)రూ.2 వేలు నుంచి రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక బుధవారం ఏ సమయంలో రూము తీసుకున్నా, గురువారం ఉదయం 10 గంటల వరకు తప్పనిసరిగా ఉంచుకుని రెండు రోజుల అద్దె చెల్లించాల్సిందేనని షరతులు పెడుతున్నారు. అధికారులకు తప్పని తిప్పలు జాతర విధుల్లో పాలుపంచుకునేందుకు వచ్చే పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ఏటా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మదర్ అకాడమి స్కూలుతో పాటు పలు పాఠశాలల్లో వసతి కల్పిస్తారు. అయితే ఈ ఎడాది ఈనెల 21వ తేదీ నుంచి సమ్మెటివ్ ఎసెసెమెంట్ –1 పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. సరిగ్గా జాతర ప్రారంభమయ్యే 21వ తేదీన సంస్కృతం సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభం అవుతాయి. వెంకటగిరిలోని ఉన్నత పాఠశాల స్థాయిలో సంస్కృతం సబ్జెక్ట్æ లేకపోవడంతో 22వ తేదీన ప్రారంభంకానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా ఈ పరీక్షలు నిర్వహించనుండడంతో జాతర విధులకు హజరయ్యే సిబ్బందికి వసతి ఏర్పాటుపై స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాడ్జి యజమానులను కొన్ని గదులు కేటాయించాలని హుకుం జారీ చేస్తుండడంతో వారి ఆశలకు గండిపడనుంది. ఇక ప్రత్యామ్నయంగా స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలను సిబ్బంది వసతి కోసం వినియోగించే చర్యలు చేపట్టారు. -
చండూరులో భారీ వర్షం
► పొంగిన వాగులు, వంకలు ► రాకపోకలకు అంతరాయం ► అతలాకుతలమైన జనజీవనం చండూరు : చండూరులో బుదవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొగిపొర్లుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 29 తేదిన 29.8మి.మీ. వర్షం పాతం నమోదుకాగా 30న 11.4మి.మీ, 31న 4సెం.మీల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరింది. చండూరు–మునుగోడు, చండూరు– శిర్దేపల్లి, గట్టుప్పల–బంగారిగడ్డ, చండూరు చిట్టి వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు సైతం రెండు గంటలకుపైగా ఆగాయి. శిర్దేపల్లి వాగు పారడంతో ఎంపీడీఓ శైలజకు సైతం ఇబ్బంది తప్పలేదు. ఉడతలపల్లి కుంట తెగడం తో నీరంత వృథాగా పోతోంది. బీసీ బాలికల వసతి గృహం, పోలీస్‌స్టేషన్‌లోకి భారీగా నీరు చేరింది. ప్రభుత్వ పాఠశాలలోకి నీరు చేరడంతో విద్యార్థులు వెళ్లడానికి తిప్పలు పడాల్సి వచ్చింది. -
యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులరద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. కొండపైకి వాహనాలు అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లారు. సుమారు 35వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 28ఏఎల్ఆర్305: క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు -
శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్స్ ఫుల్
ఇంద్రకీలాద్రి : శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులన్నీ ఆదివారం కిటకిటలాడాయి. రికార్డు స్థాయిలో యాత్రికులు విజయవాడకు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. నగర శివారులో ఆర్టీసీ ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులలో యాత్రికులు స్నాన ఘాట్లకు చేరుకున్నారు. శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్ బస్సులు నిండిపోవడంతో యాత్రికులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించారు. ఫుట్‌బోర్డు ప్రయాణం వద్దని ఆర్టీసి సిబ్బంది వారించినా యాత్రికులు పట్టించుకోలేదు. మరో వైపు జక్కంపూడి వైవీ.రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ శాటిలైట్ స్టేషన్ ఆదివారం పుష్కర యాత్రికులతో నిండిపోయింది. మరో వైపున భవానీపురం స్నాన ఘాట్లు యాత్రికులతో నిండిపోవడంతో పుష్కర స్పెషల్ బస్సులను గొల్లపూడి వైపు మళ్లించారు. బస్సులను నైనవరం ఫ్లైవోవర్ మీద నుంచి కాకుండా జక్కంపూడి మీదగా గొల్లపూడి స్నాన ఘాట్లకు తరలించారు. అయితే పుష్కర యాత్రికులకు సరైన సమాచారం లేకపోవడంతో కొంత మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంకలో చంటి పిల్లలతో చేతిలో లగేజీలో ఎటు వెళ్లాలో తెలియన అనేక మంది యాత్రికులు తీవ్ర ఆగచాట్లకు గురయ్యారు. -
జర్నలిజం కోర్సుతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలి జం కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ మేరకు సమాజంలో జరిగే విషయాలపై అవగాహన, భాషపై పట్టు సాధిస్తే భవి ష్యత్‌లో వృత్తిలో రాణించవచ్చని కేయూ దూరవిద్యా కేంద్రం జర్నలిజం విభా గం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. దూరవిద్యా కేంద్రంలోని జర్నలిజం విద్యార్థుల ఫీల్డ్ విజిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా, ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా విద్యార్థులు ఆకాశవాణి వరంగల్ కేంద్రంను సందర్శించగా పనితీరు, రేడియో కేంద్రాల్లో ఉద్యోగావకాశాల వివరాలను ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ చల్లా జైపాల్‌రెడ్డి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సూర్యప్రకాశ్, ప్రోగ్రాం అనౌన్సర్ డాక్టర్ వి.వీరాచారి, గాదె మోహన్ తెలిపారు. జర్నలిజం విభాగం అధ్యాపకులు కె.నర్సిం హారాములు, డి.రామాచారి, సుంకరనేని నర్సయ్య, డి.శ్రీకాంత్, పులి శరత్, వం గాల సుధాకర్, పి.పద్మ పాల్గొన్నారు. -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
బుక్కరాయసముద్రం : మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్మోహన్రెడ్డి హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు సీనియర్, జూని యర్ అనే భేదాలు లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఒకరినొకరు పంచుకొని నివృత్తి చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చదువుతోపాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, డాక్టర్ జమీల్ బాషా, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
వాడపల్లిలో నిఘా షురూ
ఫ్లడ్‌లైట్లు ఏర్పాట్లు వాడపల్లి(దామరచర్ల) ప్రముఖ పుణ్యక్షేత్రం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కరాల సందర్భంగా నిఘా ఏర్పాట్లను ప్రారంభించారు. పుణ్యక్షేత్రంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలు మరో పదకొండు రోజులుండగానే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్నానఘాట్,పార్కింగ్,దేవాలయ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రంలో పలు చోట్ల ఇప్పటికే ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయినచోట్ల లైటింగ్ టెస్ట్ చేస్తున్నారు. -
కోటిలింగాలలో పెరిగిన వరద ఉధృతి
భయం గుప్పిట్లో నిర్వాసితులు వెల్గటూరు : మండలంలోని కోటిలంగాలను ఎల్లంపల్లి వరద ఉధృతి ముంచెత్తుతోంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండడంతో నిర్వాసితులు భయంగుప్పిట్లో గడుపుతున్నారు. ఎప్పుడు ఏ విష పురుగులు ఇళ్లలోకి చేరుకుంటాయోనని భయాందోళన చెందుతున్నారు. కొందరు స్వయంగా ఇళ్లను వదిలి వెల్గటూర్‌లో అద్దెకుంటున్నారు. నదీతీరంలోని ఆలయం ఎదుట విద్యుత్ స్తంభానికి వేసిన 146 ఎఫ్ఆర్ఎల్ స్థాయికి వరద నీరు చేరుకుంటోంది. పుష్కరఘాట్లు మునిగిపోయాయి. వరద ప్లాట్‌ఫాంపైన బట్టలు మార్చుకునే గదులను ముంచెత్తి ఆలయ సమీపంలోకి చేరుకుంది. పెద్దవాగులో బ్యాక్ వాటర్ పెరిగి పంట పొలాలను ముంచెత్తింది. ఊరు చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలోకి వచ్చే ప్రధాన రహదారిపై ఉన్న అలుగు ఒర్రె వంతెన ఈ రాత్రికి మునిగిపోయేలా ఉంది. ఈ వంతెన మునిగితే గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోతాయి. ఇలాగే ఉంటే గ్రామంలో కలరా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం ఐదు ఇళ్లు మాత్రమే ప్రమాదపుటంచున్న ఉన్నాయని ఆ కుటుంబాలనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం అందరినీ తరలించాలని కోరుతున్నారు. -
ఘనంగా గురుపూర్ణిమా
-
లేబర్ రూం లోనే ఫుల్ మేకప్!
ఇటీవలి కాలంలో కొందరు విభన్నంగా వేడుకలు జరుపుకొని ప్రత్యేకతను చాటడం చూస్తున్నాం. తనకిష్టమైన బైక్ రైడింగ్ తో కల్యాణ మండపానికి వచ్చే పెళ్ళి కూతురు, హాబీగా ఉన్న హిప్నాటిజాన్ని పెళ్ళిలో ప్రదర్శించి కల్యాణ మండపంలో మాయమైన వధువు.. ఇలా విభన్న రీతుల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో ప్రత్యేకతలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా న్యూయార్క్ కు చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్.. ప్రసవానికి ముందు లేబర్ రూం లో ఓ పక్క నొప్పులు పడుతూనే ముఖానికి మేకప్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మేకప్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. న్యూయార్క్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీ బ్లాగర్ అలాహా మజిద్ పోస్ట్ చేసిన విభిన్న చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రసవంకోసం ఆస్పత్రిలో చేరిన ఆమె... ఓ పక్క డెలివరీకి ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క తనకిష్టమైన మేకప్ పై దృష్టి సారించడం ప్రత్యేకతను చాటింది. లేబర్ రూం.. బ్యూటీ పార్లర్ ను తలపించింది. ఫాల్స్ ఐ లాష్ తో సహా పూర్తిశాతం మేకప్ తో అందర్నీ ఆకట్టుకొన్న అలహా అజిద్.. ప్రసవం తర్వాత తనకు పుట్టిన పాప సోఫియా అలయా కరిమిని పరిచయం చేస్తూ ఫిబ్రవరి 18న మొదటి ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. ఏదో ఫంక్షన్ కు సిద్ధమైనట్లు ఆమె తన పాపకు జన్మనిచ్చేందుకు పూర్తిశాతం గ్లామర్ గా రెడీ అవ్వాలనుకున్నానని అజిద్ కామెంట్ కూడ పెట్టింది. తర్వాత లేబర్ రూం లోని మరిన్ని మేకప్ చిత్రాలను పోస్టు చేసింది. సాధారణ ప్రసవం అంటే ఎంతో కష్టం అని, అయితే తన మేకప్ హాబీ తన మనసును నొప్పులకు దూరం చేసిందని వివరించింది. లేబర్ రూం కు వెళ్ళేప్పుడే తనకిష్టమైన కొన్ని మేకప్ వస్తువులను కూడ తీసుకొని వెళ్ళానని చెప్పింది. అయితే ఆమె ఇష్టాలను గౌరవిస్తూ అలహా భర్తకూడ లేబర్ రూం లో ఆమెకు కావలసిన సహాయం అందించడంతో పాటు... మేకప్ కు కూడ సహాయపడి ప్రేమను చాటుకున్నాడు. అందుకే తన ప్రియమైన భర్తకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్ ను పోస్ట్ చేసింది. అనంతరం ఆమె పోస్టు చేసిన లేబర్ రూం మేకప్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఒక్కో ఫొటో వేలకొద్దీ లైక్ లు కామెంట్లతో దూసుకుపోతున్నాయి.