మొన్న మొన్నటి వరకు చైనా కరోనాతో భయానక నరకాన్ని చవి చూసింది. అన్ని దేశాలు బయటపడ్డా చైనా మాత్రం అంతా తేలిగ్గా ఆ మహమ్మారి నుంచి బయటపడలేకపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న వేళా! మళ్లా చైనీయులకు ఏమైందో గానీ మొత్తం ముఖం కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తున్నారు. కరోనా టైంలో కేవలం ముక్కుకి మాత్రమే మాస్క్ వేస్తే ఇప్పుడు ఏకంగా మొత్తం ముఖానికి మాస్క్ ఏంటి? బాబోయ్!.. మళ్లీ చైనాలో ఏం మహమ్మారి వచ్చింది అని అన్ని దేశాలు ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే..
చైనాలో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. ఆ వేడికి అక్కడ ప్రజలు తాళ్లలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే..దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారట. ఈ ఎండ నుంచి రక్షించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ఇలా ఫేస్‌మొత్తం కవర్ చేసేలా 'ఫేస్‌కినిక్' అనే మాస్క్‌లు వేస్తున్నారట. చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో నివాసుతులు దగ్గర్నుంచి, పర్యాటకులు వరకు అందరూ కూడా పోర్టబుల్ ఫ్యాన్‌లను కూడా తీసుకువెళ్తున్నారట.
ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, వివిధ రకాల మొత్తటి దుస్తులను ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలు. అదీగాక అక్కడ మహిళలు ఫెయిర్ స్కిన్‌నే ఇష్టపడతారు అందువల్ల ఈ ఎండ నుంచి తమ మేను కాంతి తగ్గకుండా ఉండేందుకు వారంతా ఇలా ముఖమంతా కవర్ అయ్యేలా మాస్క్‌లు వేసుకుంటున్నారు. ఇవి చాలా తేలిగ్గా, సింథటిక్ ఉండటంతో చర్మం కమిలిపోకుండా ఉంటుందట. అంతేకాదు ఈ ఎండలు ఎలా ఉన్నా ఈ 'పేస్‌కినిక్' మాస్క్‌లు మాత్రం హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
(చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..)
Comments
Please login to add a commentAdd a comment