ఇటీవలి కాలంలో కొందరు విభన్నంగా వేడుకలు జరుపుకొని ప్రత్యేకతను చాటడం చూస్తున్నాం. తనకిష్టమైన బైక్ రైడింగ్ తో కల్యాణ మండపానికి వచ్చే పెళ్ళి కూతురు, హాబీగా ఉన్న హిప్నాటిజాన్ని పెళ్ళిలో ప్రదర్శించి కల్యాణ మండపంలో మాయమైన వధువు.. ఇలా విభన్న రీతుల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో ప్రత్యేకతలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా న్యూయార్క్ కు చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్.. ప్రసవానికి ముందు లేబర్ రూం లో ఓ పక్క నొప్పులు పడుతూనే ముఖానికి మేకప్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మేకప్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.
న్యూయార్క్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీ బ్లాగర్ అలాహా మజిద్ పోస్ట్ చేసిన విభిన్న చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రసవంకోసం ఆస్పత్రిలో చేరిన ఆమె... ఓ పక్క డెలివరీకి ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క తనకిష్టమైన మేకప్ పై దృష్టి సారించడం ప్రత్యేకతను చాటింది. లేబర్ రూం.. బ్యూటీ పార్లర్ ను తలపించింది. ఫాల్స్ ఐ లాష్ తో సహా పూర్తిశాతం మేకప్ తో అందర్నీ ఆకట్టుకొన్న అలహా అజిద్.. ప్రసవం తర్వాత తనకు పుట్టిన పాప సోఫియా అలయా కరిమిని పరిచయం చేస్తూ ఫిబ్రవరి 18న మొదటి ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.
ఏదో ఫంక్షన్ కు సిద్ధమైనట్లు ఆమె తన పాపకు జన్మనిచ్చేందుకు పూర్తిశాతం గ్లామర్ గా రెడీ అవ్వాలనుకున్నానని అజిద్ కామెంట్ కూడ పెట్టింది. తర్వాత లేబర్ రూం లోని మరిన్ని మేకప్ చిత్రాలను పోస్టు చేసింది. సాధారణ ప్రసవం అంటే ఎంతో కష్టం అని, అయితే తన మేకప్ హాబీ తన మనసును నొప్పులకు దూరం చేసిందని వివరించింది. లేబర్ రూం కు వెళ్ళేప్పుడే తనకిష్టమైన కొన్ని మేకప్ వస్తువులను కూడ తీసుకొని వెళ్ళానని చెప్పింది. అయితే ఆమె ఇష్టాలను గౌరవిస్తూ అలహా భర్తకూడ లేబర్ రూం లో ఆమెకు కావలసిన సహాయం అందించడంతో పాటు... మేకప్ కు కూడ సహాయపడి ప్రేమను చాటుకున్నాడు. అందుకే తన ప్రియమైన భర్తకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్ ను పోస్ట్ చేసింది. అనంతరం ఆమె పోస్టు చేసిన లేబర్ రూం మేకప్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఒక్కో ఫొటో వేలకొద్దీ లైక్ లు కామెంట్లతో దూసుకుపోతున్నాయి.
లేబర్ రూం లోనే ఫుల్ మేకప్!
Published Sat, Mar 19 2016 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM
Advertisement
Advertisement