make-up
-
అంకిత పార్టీ లుక్‌పై ట్రోలింగ్, ఇంకాస్త రుద్దుకోకపోయావా?
తెరపై తళుకులీనే తారలు మేకప్ వేసుకోవడం సర్వసాధారణం. కెమెరా ముందు మాత్రమే కాదు ఏదైనా పార్టీలు, ఫంక్షన్స్ ఉన్నా సరే మేకప్ వేసుకున్నాకే అడుగు బయటపెడ్తుంటారు. కానీ సరిగా మేకప్ వేసుకోకపోయినా, దాని డోస్ ఎక్కువైనా సరే ప్రేక్షకులు అస్సలు సహించరు. మేకప్ ఎలా వేసుకోవాలో కూడా మేమే నేర్పాలా? అని చిందులు తొక్కుతారు. తాజాగా బాలీవుడ్ నటి అంకిత లోఖండేకు కూడా ఇలానే క్లాస్ పీకుతున్నారు నెటిజన్లు. అంకిత- విక్కీ జైన్ దంపతులు ఇటీవల రాహుల్ మహాజన్ భార్య నటల్య బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. ఈ నూతన దంపతులు బ్లాక్ డ్రెస్‌లో పార్టీలో తళుక్కుమని మెరిశారు. ఈ వేడుకలో తను ఎలా రెడీ అయిందో తెలుపుతూ మచ్చుకు కొన్ని ఫొటోలు వదిలింది అంకిత. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'నువ్వు ధరించిన డ్రెస్సుకు, వేసుకున్న మేకప్‌కు సంబంధమే లేదు, 'మరీ అంత మేకపా? నువ్వు సహజంగానే బాగుంటావు, కాస్త టచప్ మాత్రమే సరిపోతుంది, కానీ ఇలా ఓవర్ మేకప్ అస్సలు బాగోలేదు', 'చాలా, ఇంకాస్త రుద్దుకోకపోయావా?' అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అంకిత లుక్‌ను చూసి దీపికా పదుకోణ్, కెండల్ జెన్నర్‌తో పోల్చుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita) View this post on Instagram A post shared by 💥CASHMAKEUPARTISTRY 💥 (@cashmakeupartistry) చదవండి: కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే? -
మేకప్‌తో మంచి మార్కులు!
న్యూయార్క్: మేకప్ వేసుకోవటం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి చదువులో మంచి మార్కులు సాధిస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు అకడమిక్ పెర్ఫామెన్స్ పై మేకప్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు ముందుగా మహిళలను మూడు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూపు వారికి మేకప్‌ను వేయగా, రెండవ గ్రూప్ వారికి సంగీతం వినిపించారు. ఇక మూడో వారికి మొహంపై రంగులు అద్దారు. అనంతరం మూడు గ్రూపులకు చెందిన మహిళలకు జనరల్ సైకాలజీలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మేకప్ వేసుకున్న మహిళలు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో సంగీతం విన్నవారు నిలిచారు. మేకప్ వేసుకోవటం వల్ల తాము అందంగా ఉన్నామన్న భావన పెరిగి, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోజెంట్ సైకాలజీ అనే జర్నల్ ప్రచురించింది. -
నల్లని వలయాలకు చక్కని మందు
బ్యూటిప్స్ ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూత భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూత చర్మమే ముందుగా తెలియపరుస్తుంది. అందుకని... నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల ద్రవాలు సక్రమంగా చేరి, కంటిచుట్టూత చర్మం బిగువును కోల్పోదు. చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూత మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది. కంటి చుట్టూత చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి. -
బ్యూటిప్స్
మేకప్ పూర్తిగా తొలగించిన తరువాత గోరువెచ్చటి నీటిలో దూది, లేదంటే మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడుచు కోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచు కోవాలి. మేకప్ తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని తప్పక రాసుకోవాలి. దీని వల్ల ముఖ చర్మం పొడిబారకుండా ఉంటుంది. మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూ పేపర్, సేఫ్టీ పిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్-అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా ఇబ్బందిపడే అవసరం ఉండదు. -
కాలర్.. కట్‌చేస్తే ఆభరణం...
పార్టీకి వెళ్లాలంటే డిజైనర్ దుస్తులున్నా సరైనా ఆభరణాలు లేకపోతే మేకప్ సంతృప్తినివ్వదు. వేడుక అంతా తమదే అన్నట్టు తిరగాలంటే మెడనిండుగా నప్పే ఆభరణాలతో కళ కళలాడుతూ ఉంటేనే సాధ్యం. అవి బంగారు, వజ్రాభరణాలే కానక్కర్లేదు. కేవలం ఒక షర్ట్... దానికో కాలర్ ఉంటే చాలు. కట్ చేయచ్చు. ఇలా కంఠాభరణంగా రూపుకట్టేయచ్చు. పాత చొక్కాలు, ఫ్రాక్‌లు బ్యాగు అడుగనో.. పాత బట్టల మూటలోనో చేరుతూనే ఉంటాయి. వాటి కాలర్స్ చూస్తే ఏదైనా ఆలోచన వస్తుందా?! ట్రై చేయండి. ముందుగా నచ్చిన షర్ట్, ఫ్రాక్ (కాలర్ ఉన్నది) తీసుకొని కాలర్ భాగాన్ని కట్ చేయాలి. కాలర్ ప్లెయిన్దైతే మీ టాప్‌కి పూర్తి కాంట్రాస్ట్ ఉండే ప్రింట్లు లేదంటే ఎంబ్రాయిడరీ చేసి హారంలా ధరించవచ్చు. ఇది ఫ్యాషన్ జువెల్రీగా కూడా బాగుంటుంది. కాలర్కి ముత్యాలు ఇతర పూసలు, స్టోన్స్, ఎంబ్రాయిడరీ లేసులు కూడా అతికించి అందమైన కంఠాభరణాన్ని రూపొందించుకోవచ్చు. పెద్ద పెద్ద పూసలు, రిబ్బన్ మెటీరియల్‌ను ఉపయోగించి పిల్లల దుస్తుల మీదకు ఫ్యాన్నీ జ్యువెల్రీగా వాడచ్చు. హెయిర్ క్లిప్గానూ తయారుచేయవచ్చు. కాలర్కి రెండు వైపులా ఆభరణాలను అతికించి, మరో అందమైన ఆభరణాన్ని తయారుచేసుకోవచ్చు. ఈ తరహా కాలర్ డిజైన్స్ మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. -
బాజాభజంత్రీలకూ ఆన్లైనే!
♦ ఒకే వేదికగా పెళ్లి సర్వీసులందిస్తున్న అప్లీ ఎవర్ ♦ డెకరేషన్, క్యాటరింగ్, మేకప్ వంటి సేవలెన్నో.. ♦ పెళ్లి దుస్తులు, నగలు, పాదరక్షల కొనుగోలుకు వీలు ♦ ఇటీవలే రూ.2.75 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ రాకేష్ గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు’ అంటారు పెద్దలు. ఇందులో ఇంటి విషయం కాసేపు పక్కన పెడితే పెళ్లి మాత్రం నిజంగా పెద్ద తతంగమే. ఆహ్వాన పత్రికలు ముద్రించటం నుంచి బంధువుల జాబితా, డెకరేషన్, మేకప్, భోజనాలు, బ్యాండ్‌బాజా.. వంటివెన్నో సమకూర్చుకోవాలి. అందుకే పెళ్లంటే నెల రోజుల ముందు నుంచి పనులు మొదలుపెడితే గానీ పెళ్లి నాటికి పూర్తవ్వవు. అయితే మరి ఇంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా పెళ్లి కోసం నెలల తరబడి సమయం కేటాయించాలా? అన్ని సదుపాయాలనూ ఒకే వేదికపై పొందలేమా? ఇదే ప్రశ్న ఈ మిత్రత్రయానికి ఎదురైంది. అయితే అందరిలా వీళ్లూ అక్కడిలో ఆగిపోలేదు. సమాధానం వెతికే పనిలో వెడ్డింగ్ సర్వీసెస్ స్టార్టప్ ‘అప్లీఎవర్’ను ప్రారంభించేశారు. ఆ కంపెనీ ఏంటో.. దాని సేవలేంటో అప్లీ కో-ఫౌండర్ రాకేశ్ గుప్తా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆయన మాటల్లోనే... 12 విభాగాల్లో సేవలు.. ‘‘నేను, మదన్ ఎల్పీ, సుమిత్ హండా ముగ్గురం కలిసి గతేడాది అక్టోబర్‌లో రూ.20 లక్షలతో హైదరాబాద్ కేంద్రంగా అప్లీఎవర్ను ప్రారంభించాం. ప్రస్తుతం మేం ఫొటోగ్రఫీ, మేకప్, మెహందీ, డీజే, డెకరేషన్, కొరియోగ్రఫీ, క్యాటరింగ్ వంటి 12 రకాల విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఆయా విభాగాల్లో సేవలందించేందుకు 800-1,000 మంది వెండర్లు మావద్ద రిజిస్టరయ్యారు. అవసరమున్న సేవలను ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో డీల్ మీద రూ.5-15 వేల వరకు మార్జిన్లుంటాయి. ప్రస్తుతం నెలకు 3 వేల వరకుడీల్స్ జరుగుతున్నాయి. ప్రతి నెలా 50-70 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. లుక్ బుక్‌లో కొనుగోలు.. లుక్ బుక్ అనే అప్షన్లో ఏ దుస్తులకు, ఏ బూట్లు, నగలు మ్యాచ్ అవుతాయో వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు. సంబంధిత ఉత్పత్తుల కింద ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే పార్ట్నర్ సైట్ల నుంచి కొనుగోలు చేసే వీలుంటుంది. వీటి కోసం అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి 20-30 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కో కొనుగోలు మీద 5-15 శాతం క మిషన్ ఉంటుంది. ప్రస్తుతం 3 వేలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయిక్కడ. అప్లీ ఎవర్ యాప్ ద్వారా వివాహ వేడుకలకు బంధువులను ఆహ్వానించవచ్చు. పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకోవచ్చు కూడా. 2.75 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీడ్ రౌండ్లో భాగంగా రూ.2.75 కోట్ల నిధులను సమీకరించాం. దేశ, విదేశాలకు చెందిన 8 మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. యూనీ వెరైటీ ఫౌండర్ వరుణ్ అగర్వాల్, ఎజిలిటీ సొల్యూషన్స్ సీటీఓ సురేష్ వెంకట్, పీపుల్ కంబైన్ ఎండీ రాజ్ వై ఇందులో కొందరు. మరో ఆరు నెలల్లో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటూ మధ్య ప్రాచ్య, ఉత్తర అమెరికా దేశాలకు మా సేవలను విస్తరిస్తాం. ఇందుకోసం మరో మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయి. పలువురు వీసీ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ ఏడాది ముగింపులోగా సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
లేబర్ రూం లోనే ఫుల్ మేకప్!
ఇటీవలి కాలంలో కొందరు విభన్నంగా వేడుకలు జరుపుకొని ప్రత్యేకతను చాటడం చూస్తున్నాం. తనకిష్టమైన బైక్ రైడింగ్ తో కల్యాణ మండపానికి వచ్చే పెళ్ళి కూతురు, హాబీగా ఉన్న హిప్నాటిజాన్ని పెళ్ళిలో ప్రదర్శించి కల్యాణ మండపంలో మాయమైన వధువు.. ఇలా విభన్న రీతుల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో ప్రత్యేకతలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా న్యూయార్క్ కు చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్.. ప్రసవానికి ముందు లేబర్ రూం లో ఓ పక్క నొప్పులు పడుతూనే ముఖానికి మేకప్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మేకప్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. న్యూయార్క్ కు చెందిన మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీ బ్లాగర్ అలాహా మజిద్ పోస్ట్ చేసిన విభిన్న చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ప్రసవంకోసం ఆస్పత్రిలో చేరిన ఆమె... ఓ పక్క డెలివరీకి ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క తనకిష్టమైన మేకప్ పై దృష్టి సారించడం ప్రత్యేకతను చాటింది. లేబర్ రూం.. బ్యూటీ పార్లర్ ను తలపించింది. ఫాల్స్ ఐ లాష్ తో సహా పూర్తిశాతం మేకప్ తో అందర్నీ ఆకట్టుకొన్న అలహా అజిద్.. ప్రసవం తర్వాత తనకు పుట్టిన పాప సోఫియా అలయా కరిమిని పరిచయం చేస్తూ ఫిబ్రవరి 18న మొదటి ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. ఏదో ఫంక్షన్ కు సిద్ధమైనట్లు ఆమె తన పాపకు జన్మనిచ్చేందుకు పూర్తిశాతం గ్లామర్ గా రెడీ అవ్వాలనుకున్నానని అజిద్ కామెంట్ కూడ పెట్టింది. తర్వాత లేబర్ రూం లోని మరిన్ని మేకప్ చిత్రాలను పోస్టు చేసింది. సాధారణ ప్రసవం అంటే ఎంతో కష్టం అని, అయితే తన మేకప్ హాబీ తన మనసును నొప్పులకు దూరం చేసిందని వివరించింది. లేబర్ రూం కు వెళ్ళేప్పుడే తనకిష్టమైన కొన్ని మేకప్ వస్తువులను కూడ తీసుకొని వెళ్ళానని చెప్పింది. అయితే ఆమె ఇష్టాలను గౌరవిస్తూ అలహా భర్తకూడ లేబర్ రూం లో ఆమెకు కావలసిన సహాయం అందించడంతో పాటు... మేకప్ కు కూడ సహాయపడి ప్రేమను చాటుకున్నాడు. అందుకే తన ప్రియమైన భర్తకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్ ను పోస్ట్ చేసింది. అనంతరం ఆమె పోస్టు చేసిన లేబర్ రూం మేకప్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఒక్కో ఫొటో వేలకొద్దీ లైక్ లు కామెంట్లతో దూసుకుపోతున్నాయి. -
'బ్యూ'టిప్స్
సమ్మర్ కేర్ బయటికెళ్లేటప్పుడు తలకు హ్యాట్ కాని క్యాప్కాని పెట్టుకుంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది.సమ్మర్లో పాదాలకు, వేళ్లకు గాలి తగిలే పాదరక్షలనే వాడాలి. ఫంక్షన్లకు వెళ్లేటప్పడు పాదం మొత్తాన్ని కవర్ చేసే ఫ్యాన్సీ శాండల్స్, షూస్ వేసుకోవాలంటే... వేళ్ల మధ్య టాల్కమ్ పౌడర్ చల్లాలి.ఎండ నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ వాడేవాళ్లకు కళ్ల చుట్టూ మినహా మిగిలిన ముఖమంతా ట్యాన్తో ప్యాచ్‌లా ఉంటుంది. కాబట్టి సన్‌గ్లాసెస్ ధరించడంతోపాటు ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సమ్మర్ మేకప్‌లో ఐ లైనర్ పెన్సిల్ కలర్ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేకప్ హెవీ కాకుండా ముఖం తీరుగా కనిపింపచేయడంలో గ్రే, చాకొలేట్, నేవీ షేడ్లు ముఖ్యమైనవి.సాయంత్రం పార్టీలకు లూస్ షిమ్మర్ పౌడర్ వేసుకుని పెదవులకు లేత రంగు లిప్‌గ్లాస్ వేస్తే బాగుంటుంది.తప్పని సరిగా ఫౌండేషన్ వేసుకోవాలనుకుంటే... అందులో కొంచెం లూజ్ పౌడర్ కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుబారదు. రోజంతా తాజాగా కనిపించవచ్చు. -
స్లీప్ వెల్!
మన ఆరోగ్యానికి నిద్ర చేసే మేలు అంతా ఇంతా కాదు. నావరకైతే మంచి నిద్ర అంటే, ఎనిమిది గంటలు నిద్రపోవడం. అయితే నా పనుల భారం వల్ల ఆ నిద్రలేమిని భర్తి చేయలేకపోతున్నాను. అందుకే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు గంట పాటు ‘నిద్ర ఆసన’ వేస్తాను. ఇది శరీరానికి, మనుసుకు ఎంతో రిలాక్స్ ఇస్తుంది. నిద్రకు ముందు... మేకప్ తొలగిస్తాను. ముఖం శుభ్రంగా కడుక్కొని కొబ్బరినూనె రాస్తాను. నీళ్లు బాగా తాగుతాను. దిండు వాడను. వాడితే నాకు తలనొప్పి వస్తుంది. నా స్లీప్ సీక్రెట్: జీవితాన్ని ఈజీగా తీసుకో. పాజిటివ్‌గా చూడు. - నీతూ చంద్ర, హీరోయిన్ -
కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!
‘‘సంగీతం, రచన... ఈ రెండింటికీ వయసుతో సంబంధం లేదు. మనసులో ఇష్టం, ఆలోచనల్లో కొత్తదనం ఉంటే చాలు. ఏ వయసులోనైనా ఇవి చేయొచ్చు’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. కొన్ని ఆల్బమ్స్‌కి సంగీతం సమకూర్చడంతో పాటు, పాటలు కూడా పాడారామె. శ్రుతి పాటలు, కవితలు కూడా రాస్తుంటారు. కథా నాయికగా చేయాలంటే చాలామంది మీద ఆధారపడాల్సి ఉంటుందనీ, కానీ సంగీతం, రచనలకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదనీ శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కథానాయికగా ఓ పాత్రలో ఒదిగిపోవాలంటే, మేకప్‌మ్యాన్ చేసే మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ చేసే కేశాలంకరణ చాలా ముఖ్యం. అలాగే, పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైనర్ సెలక్ట్ చేసే డ్రెస్ వేసుకోవాలి. ఆ తర్వాత డెరైక్టర్ చెప్పినట్లు చేస్తే, కెమెరామ్యాన్ చిత్రీకరిస్తారు. తెరపై కనిపించాలటే ఇంతమంది మీద ఆధారపడాలి. అదేగనక కథలూ, కవితలూ రాయాలనుకోండి... మన బుర్ర, కొన్ని కాగితాలు, కలం చాలు. ట్యూన్స్ తయారు చేయాలన్నా అంతే! సంగీత పరికరాలుంటే మనకు నచ్చిన ట్యూన్ రెడీ చేసుకోవచ్చు. అదే నాయిక పాత్రలనుకోండి... కొన్నేళ్ల తర్వాత చేయలేం. అది తెలుసు కాబట్టే, ఇప్పుడు బిజీగా సినిమాలు చేస్తున్నాను. కొంచెం తీరిక చిక్కాక సంగీతం, రచనలపై దృష్టి సారిస్తా’’ అన్నారు. -
సూదులంటే భయం!
గ్లామర్ ఫీల్డ్‌లో ఏ చిన్న గాయమైనా, షేప్ అవుట్ అయినా వెంటనే ప్లాస్టిక్ సర్జరీలతో సరిచేసుకోవడం మామూలే. కానీ... కన్నడ నటి అయింద్రిత రాయ్ మాత్రం తన వద్ద అసలా ప్రస్తావనే తేవద్దంటోంది. షూటింగ్ నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది థాయ్‌లాండ్, దుబాయిల్లో ఎంజాయ్ చేసి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన అమ్మడు... గ్లాస్ డోర్‌ను గుద్ది ముక్కు పగలగొట్టుకుంది. దీంతో ముక్కపై మచ్చ ఏర్పడింది. ఈ గాటును పోగొట్టుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారట. అయితే... తనకు సర్జరీలంటే భయమని, సూదులంటే అసహ్యమని చెప్పిందీ భామ. సో... మేకప్‌తోనే మచ్చను కవర్ చేసుకొంటానని తెగేసి చెప్పేసింది. రీసెంట్గా ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న అయింద్రిత... పాపం మేకప్ కోసం చాలా సేపే కష్టపడాల్సి వచ్చింది. షారూఖ్‌కు షాక్! చూస్తుంటే టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టుంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్‌కు ఇద్దరు బుల్లితెర నటీమణులు నో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి సర్గుణ్ మెహతా వంతు! ఈ తార ఏకంగా బాలీవుడ్ బాద్షాతో కలసి చేసే ఎపిసోడ్‌నే వదిలేసుకుందట! ఈ టీవీ స్టార్‌కు షారూఖ్ అంటే తెగ పిచ్చి. కానీ... ఇంత మంచి అవకాశం వస్తే ఠక్కున కాదనేసింది. అభిషేక్‌తో ఎపిసోడ్‌కు సదరు భామలు రామని చెప్పిన తరువాత ఫరా... సర్గుణ్ను పిలిచింది. దీంతో పాటు షారూఖ్‌తో షోలో కూడా పాల్గొనమని ఆఫర్ ఇచ్చింది. అయితే గియితే కింగ్‌ఖాన్‌తో కలసి సినిమాలో పనిచేస్తాను గానీ... అందరు ఫ్యాన్స్‌లా కలిసే ఆలోచన తనకు లేదని అసలు విషయం చెప్పింది సర్గుణ్! నో చెప్పినందుకు ముందు ఫరా షాక్ తిన్నా... తరువాత సర్గుణ్ మాటలకు కన్విన్స్ అయిందట! ప్రస్తుతానికి ఒంటరే! సినిమాల కంటే ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌తో వార్తల్లో ఉంటుంది మలయాళ తార విమలారామన్. ఈ మధ్య ఎవరితోనో క్లోజ్ రిలేషన్ మెయిన్టేన్ చేస్తోందని మల్లువుడ్ కోడై కూసింది. అయితే వీటన్నింటికీ సింపుల్‌గా ఫుల్స్టాప్ పెట్టేసిందీ సుందరి. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని... ఒకవేళ ఉంటే తప్పకుండా అందరికీ పరిచయం చేస్తానని ఓ సందర్భంలో తేల్చి చెప్పింది విమల. ‘ప్రస్తుతానికైతే ఒంటరినే. ఇలానే ఎంతో హ్యాపీగా ఉంది’ అంటున్న విమలారామన్... తన ధ్యాసంతా పనిమీదే ఉందని... అందులోనే ఎడతెరిపి లేనంత బిజీగా ఉన్నానని సెలవిచ్చింది. కానీ... నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు కొందరు ఇండస్ట్రీ జనం. ఎవరేమనుకున్నా... మొత్తానికి అమ్మడు సింగిల్ అని సభాముఖంగా తెలియజేసి... కుర్రకారు గుండెల్లో మంటల్ని చల్లార్చింది! - వాంకె శ్రీనివాస్ -
ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్!
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్స్ ఛార్మి, ఇలియానా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మేకప్ లేకుండా ఇలియానాను అసలు చూడలేమంటూ ఛార్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... ఓ ప్రయివేట్ ఛానల్ కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె టకటకా సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా ఎక్కడికెళ్లినా మేకప్ కిట్ వెంట తీసుకు వెళ్లాల్సిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు ఛార్మి తడుముకోకుండా ఇలియానా పేరు చెప్పేసింది. మీరెప్పుడైనా ఇలియానాని మేకప్ లేకుండా చూశారా.. చూస్తే కనుక మేకప్ కిట్ దగ్గరే ఉంచుకోమని చెబుతారంటూ సెటైర్ వేసింది. వీరిద్దరూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రాఖీ' చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లకు....ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సరైన అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటే...ఛార్మి .. టాలీవుడ్లో అడపాదడపా వచ్చే అవకాశాలతో సరిపెట్టుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకుండా ఛార్మి ఒక్కసారిగా...ఇలియానాను అలా ఎలా అనేసిందబ్బా! -
నాది సహజ సౌందర్యం
నాది సహజ సౌందర్యం అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఐరన్‌లెగ్ నటి అన్న నోళ్లను అతి త్వరలోనే మూయించి టాప్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన నటి ఈమె. తమిళం, తెలుగు, హిందీ భాషల దర్శక నిర్మాతలు శ్రుతిహాసన్ కాల్షీట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. తాజాగా తమిళంలో పూజై చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సరసన మారిశన్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో మహేష్‌బాబు సరసన ఒక చిత్రంతో పాటు హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. విజయ్‌తో నటిస్తున్న చిత్ర షూటింగ్ నగరం శివారు ప్రాంతం వీసీఆర్ రోడ్డులో జరుగుతోంది. అయినా తన గ్లామరస్ నటనతోనే శ్రుతిహాసన్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముద్దుగుమ్మను స్ఫూర్తిగా తీసుకునే ఇతర హీరోయిన్లు ఎదగాలని ప్రయత్నిస్తున్నారన్నది పరిశ్రమ వర్గాల మాట. అయితే తాజాగా అందరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్ మరోసారి వార్లల్లో కెక్కారు. ఆమె ఏమన్నారంటే... సినిమా నటీమణులందరూ తెరపై అందంగానే కనిపిస్తారు. అందుకు కారణం మేకప్, ఫోకస్ లైట్స్. హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఇవే ముఖ్య కారణం. అయితే నేను మాత్రం ఎలాంటి మేకప్ లేకుండానే అందంగా ఉంటాను. నాది సహజ అందం. నా శరీరాకృతి కూడా కచ్చితమైన కొలతలతో ఉంటుంది. నా తల్లిదండ్రులు అందంగా ఉంటారు. అందువల్లే నేను అందంగా ఉన్నాను అని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. -
సున్నితమైన చర్మానికి మేకప్ వద్దు...
పిల్లలు ఉండేదే అందంగా! కానీ, వారిని వేడుకలకు ఇంకాస్త ముద్దుగా తయారుచేయడానికి అమ్మానాన్నలు ఉత్సాహం చూపిస్తారు. దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల మాటెలా ఉన్నా పిల్లల చర్మానికి హాని కలిగించే రసాయనాలు వాటిల్లో దాగి ఉంటున్నాయి. పిల్లలకు హాని కలిగించే అలాంటి ఉత్పత్తులను సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం... చర్మకాంతి పిల్లల మేను నిగారింపుతో ఉంటుంది. ప్రత్యేకించి మేకప్‌లు అవసరం లేదు. కానీ, తల్లి మేకప్ చేసుకుంటూ పిల్లలకూ ఆ సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చిన్నవయసులోనే వారి చర్మం రఫ్‌గా మారే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు పడక చర్మ సమస్యలు వస్తాయి. ఫేసియల్స్ పన్నెండేళ్ళ వయసు దాటిన నాటి నుంచి పిల్లలకు ఫేసియల్స్ అవసరం అని కొంతమంది అపోహపడుతుంటారు. దీంతో సౌందర్యశాలల్లో ఫేసియల్స్ చేయించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఫేసియల్స్కి వాడే క్రీములు, ఇతర మర్దనలు, ఆవిరి... వల్ల చిన్నవయసులోనే చర్మం పొడిబారడం, మొటిమల సమస్య పెరగడం, త్వరగా ముడతలు రావడం జరుగుతుంది. అందుకని కౌమారదశ దాటేంతవరకు ఫేసియల్స్ చేయించకూడదు. అది కూడా వైద్యుల సలహాలు తీసుకొని, వారి చర్మతత్త్వానికి సరిపడ చికిత్సలు ఎంచుకుంటే మేలు. పోషకాహారం స్వీట్లు, ఇతర జంక్‌ఫుడ్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడుతుంటారు. వీటినే ఎక్కువగా తీసుకునే పిల్లలను ఆరోగ్యపరమైన సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ప్రభావం వీరి మేని చర్మంపైనా పడుతుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే బాదం పప్పులు, గుడ్డు, ‘సి’ విటమిన్ లభించే పండ్లు.. రోజూ తీసుకునే ఆహారంగా తప్పక ఇవ్వాలి. ఆరుబయట ఆటలను ప్రోత్సహించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల మెరుగ్గా ఉండి, చర్మ నిగారింపు కూడా బాగుంటుంది. - డా. షాను, చర్మవైద్య నిపుణురాలు -
రూపం..అపురూపం..
ముద్దమందారంలాంటి ముఖారవిందం.. అరవిరిసిన కలువల్లాంటి కళ్లకు కాటుక బంధం.. సింధూర శోభితమై మెరిసిపోయే కస్తూరి తిలకం.. నునుసిగ్గుల బుగ్గలకు నల్లటి చంద్రబింబం.. సింగారి చేతులకు సిరిగంధం.. హరివిల్లును తలపించే పెళ్లి పట్టుచీర.. కాళ్లకు పారాణి.. అందానికే అర్థం చెప్పే తెలుగింటి నవవధువుకే సొంతమైన ఆభరణాలివి. పసుపు రాసిన ముఖానికి మరింత వన్నెతెచ్చే వయ్యూరాలివి. ఒకప్పుడు ఇంటి అందానికే పరిమితమైన పెళ్లికూతురు ఇప్పుడు బ్యూటీపార్లర్లకు పరుగులు పెడుతోంది. నలుగురిలోనూ నవ వధువే అందంగా కనిపించాలని బ్యూటీషియన్లు కూడా సరికొత్త మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. నుదుట బాసికం నుంచి కాళ్ల పారాణి వరకు సెలక్టెడ్‌గా చూసుకుంటూ పెళ్లి కూతురును సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తరహా బ్యూటీస్పాలు పెళ్లి కూతుర్ల పాలిట వరాలుగా మారారుు. విజయవాడ : పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి జరిగే పండుగ. దీనిని వినూత్నంగా, అందంగా జరుపుకోవాలన్న తపన అందరిలోనూ ఉంటుంది. ఇక నవ వధువునైతే అందంగా ముస్తాబుచేసి మురిసిపోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు. పెళ్లిలో వినూత్నంగా కనిపించి అత్తింటి వారి నుంచి నూటికి నూరు మార్కులు కొట్టేయూలని వధువు అనుకుంటుంది. ఇందుకోసం మరింత అందంగా ముస్తాబవుతుంది. యువతుల ఈ ఆసక్తిని గమనించిన బ్యూటీషియన్లు రకరకాల మేకప్‌లతో బ్యూటీషియన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నుదుట బాసికం నుంచి పెళ్లిలో కట్టే చీర వరకు అన్నీ వారే డిజైన్ చేస్తున్నారు. ఇలా.. కొందరిని పెళ్లిరోజు, మరికొందరిని పెళ్లికి వారం రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెళ్లి వేడుక ఏదైనా.. ఆయా మత సాంప్రదాయాల ఆధారంగా నవ వధువులను ముస్తాబు చేసుందుకు బ్యూటీషియన్లు ముందుకొస్తున్నారు. వాటర్ మేకప్, మడ్ మేకప్, స్ప్రే మేకప్ ఇలా వివిధ రకాల మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. పెళ్లిరోజు చీరను కూడా వారే కడుతున్నారు. రెండు గంటల ముందు నుంచే.. వేడుక ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పెళ్లి కూతురును ముస్తాబు చేయడం ప్రారంభిస్తారు. తొలుత వధువు పర్మనాలజీ, ముఖ కవలికలను బట్టి ఎలాంటి మేకప్ వేయాలో నిర్ణయిస్తారు. ముఖంపై మచ్చలు ఉంటే కనిపించకుండా కన్సెలర్ మేకప్ వేసి సిరిదిద్దుతారు. కొందరికి నుదుటి భాగం నలుపు రంగులో ఉంటుంది. అలాంటి వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషన్ మేకప్ వేస్తారు. అనంతరం కాంపాక్ట్ కోటింగ్ ద్వారా చూడచక్కగా తీర్చిదిద్దుతారు. పెళ్లిలో కట్టే చీరరంగు బట్టి కనురెప్పలపై మేకప్ డిజైన్ చేస్తారు. లిప్‌స్టిక్ కూడా ముఖ కవలికల ఆధారంగానే ఉంటుంది. పెదవులు పెద్దగా ఉన్న వారికి చిన్నవిగా చూపించే లిప్‌స్టిక్ వేస్తారు. ఇలా ప్రతి అంశాలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వధువును ముస్తాబు చేస్తారు. ఈ మేకప్ 6 నుంచి 7 గంటలు చెక్కు చెదరదు. శి‘రోజా’లు పెళ్లి సంప్రదాయూన్ని బట్టి బ్యుటీషియన్లు నవ వధువు హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లయితే పూలజడ, క్రిస్టియన్ పెళ్లి అయితే జుట్టు ముడివేసి ముఖంపైకి వెయిల్, ముస్లిం మ్యారేజ్ అయితే జుట్టు ముడివేసి పూలతో జడలా అల్లడం, ముఖంపైకి పూలు వచ్చేలా చేయడం చేస్తారు. రిసెప్షన్కైతే హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి డిజైన్ చేస్తారు. కొందరు పెళ్లి వేడుకకు వారం, పదిరోజుల ముందు నుంచే బ్యూటీస్పా సెంటర్లకు వెళ్తున్నారు. టానింగ్, పేషియల్స్, బాడీ పాలీషింగ్ వంటి సిటింగ్‌ల ద్వారా చర్మంలోని మృత కణాలను తొలగించి సౌందర్యవంతంగా తయూరుచేస్తున్నారు. చేతులు నిగనిగ లాడేందుకు మానెక్యూర్, పాదాలు అందంగా కనిపించేందుకు పెడిచ్యూర్, జుట్టు మిలమిలా మెరిసిపోయేందుకు స్పా చేస్తున్నారు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం.. వధువు ముస్తాబు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి ఇష్టానుసారమే మేకప్ వేస్తాం. ఇటీవల కాలంలో పెళ్లిళ్ల సమయంలోనే కాదు.. పెళ్లి కూతురును చేసేటపుడు కూడా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవ వధువులను తీర్చిదిద్దుతున్నాం. ఈ విషయంలో ముందుగానే బంధువులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఒక్కో వేడుకకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం. పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా మేము ఇస్తున్నాం. - ఉడత ముఖేష్‌కుమార్, వెర్టెక్స్ గ్రూప్, డెరైక్టర్ అందానికే ప్రాధాన్యత నవ వధువుకు మేకప్ వేసేందుకు ముందుగా ఆమె పర్శనాలటీ, ముఖ కవలికలు వంటివి పరిగణనలోకి తీసుకుంటాం. పెళ్లి పగలా, రాత్రా అనే అంశాన్ని బట్టీ మేకప్ డిజైన్ ఉంటుంది. కనురెప్పల మేకప్‌తో పాటు లిప్‌స్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చేతి గోర్లను షేప్ తీసుకురావడంతో పాటు అందంగా కనిపించేలా మెహిందీ వేస్తాం. పాదాలు మరింత అందంగా కనిపించేలా చూస్తాం. ఎంత సమయం పట్టినా.. పెళ్లి వేడుకలో అందంగా కనిపించడమే లక్ష్యంగా కృషి చేస్తుంటాం. - అను అగర్వాల్, బ్యూటీషియన్ -
ఆభరణానికే అందం...
చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి. నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్‌గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్‌లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు. పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి. షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్‌లు కూడా బాగుంటాయి. పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్‌కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది. అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి. రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు. బ్లౌజ్‌కు తగినవిధంగా...!: హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది. ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్‌ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు. మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు. 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది. 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి. 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది. 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్‌లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు ఎంపికలో ప్రత్యేకత ఉండాలి. మోడల్స్: కావ్య, ప్రియాంజలి ఫొటోలు: శివ మల్లాల కర్టెసీ: మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy@gmail.com -
వయసుకు తగినట్టుగానే ఉందా?
అలంకరణ నేడు ఫ్యాషన్ పోకడల మూలంగా వయసు పైబడిన వారు సైతం టీనేజ్ యువతుల్లా తయారవడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టు వేషధారణ, మేకప్ చేసుకుంటున్నారు. అతి అలంకరణ వయసు మరింత పైబడినట్టు చూపిస్తుంది. సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్నీ అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
ముడతలూ ఫ్యాషనే!!
ముస్తాబు క్రష్డ్ డిజైనర్ డ్రెస్సులు కొనుగోలు చేసేటప్పుడు, వాటికి వచ్చే ట్యాగ్‌లైన్స్ చదివి, అందులోని పద్ధతులను పాటించడం మర్చిపోవద్దు. ముడతల దుస్తులను ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ‘ఈజీ టు వేర్’ కాటన్, సిల్క్.. ఫ్యాబ్రిక్ ఏదైనా క్రష్డ్ డ్రెస్సులను ఇస్త్రీ చేయకూడదు. ఒకసారి ఇస్త్రీ చేస్తే మళ్లీ ముడతలు తేవడం సాధ్యం కాదు. ఇస్త్రీ మడత నలగకుండా ఒంటిమీద దుస్తులుండటం అందంగా భావిస్తారు ఎవరైనా..! కానీ, ధరించిన దుస్తులు ముడతలు ముడతలుగా ఉంటే.. !! ‘ఎవరైనా చిరాకు పడతారు’ అనేవారికి సరైన సమాధానం ముడతల దుస్తులు. అవేనండి క్రష్డ్ మెటీరియల్‌తో రూపొందించిన డిజైనర్ డ్రెస్సులు. ఎందుకంటే ముడతల దుస్తులే ఇప్పటి ట్రెండ్!!! ఎలా?! అని ఆశ్చర్యపోతే.. సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఈ కాలంలో దుస్తులు కేవలం అవసరమో, సౌకర్యం కోసమో మాత్రమే కాదు. దుస్తులు హోదాగా భావిస్తున్నారు. ఎంత ఫ్యాషనబుల్‌గా దుస్తులను ధరిస్తే అంత విలాసవంతులు గానూ, సృజనాత్మకత గలవారుగానూ గుర్తింపు పొందుతున్నారు. అందువల్లే రకరకాల ఫ్యాబ్రిక్స్ కళాత్మకతకు క్యాన్వాసులుగా మారుతున్నాయి. దేనికవి ప్రత్యేకతను చాటుతున్నాయి. సాంకేతిక పద్ధతులు... వస్త్రం అసాధారణంగా కనిపించేలా తయారుచేయడానికి తయారీదారులు వినియోగదారుల అంచనాలు ఏ విధంగా మారుతున్నాయో ఆలోచిస్తున్నారు. అందుకే విభిన్నమైన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఫ్యాబ్రిక్‌ని ఒక ప్రత్యేక ఆకర్షణ ఉట్టిపడేలా రూపొందిస్తున్నారు. ఆ పద్ధతుల్లో పుట్టుకొచ్చిన వస్త్రమే ‘క్రష్డ్ ఫ్యాబ్రిక్.’ ముడతలుగా ఉండే ఈ ఫ్యాబ్రిక్ చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది. సాధారణ పద్ధతులు... వస్త్రాన్ని మెలికలు తిప్పడం, రోల్ చేయడం ద్వారానే కాకుండా బాగా వేడిగా ఉండే ద్రవాలలో ఉడికించి ముడతలు తెప్పిస్తుంటారు. ఈ విధానంలో రాయి ఎలా కనిపిస్తుందో అలాంటి టెక్స్చర్ను మెటీరియల్‌కు తీసుకువస్తారు. మరొక పద్ధతిలో... ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌పైన రంగులు అద్ది, వేడి నీటిలో ఉడకబెట్టి, ఆ తర్వాత ‘రోల్’ చేస్తారు. ఈ వస్త్రంపై బరువును ఉంచి, అదనపు నీళ్లన్నీ బయటకు వచ్చేశాక దానిని ఆరబెట్టే యంత్రంలో ఉంచుతారు. ఈ ప్రక్రియ వల్ల ఫ్యాబ్రిక్ యాదృచ్ఛికంగా ముడతలు పడుతుంది. బాగా ముడతలు పడిన ఈ వస్త్రాన్ని డిజైనర్ దుస్తుల తయారీకి ఉపయుక్తం. మఖ్మల్ ముడతలు... క్రష్డ్ వెల్వెట్, పన్నె వెల్వెట్ ... అని ఈ మెటీరియల్ రెండు పద్ధతుల్లో లభిస్తుంది. వెల్వెట్ క్లాత్ తడిగా ఉన్నప్పుడు దగ్గరగా మడవడం వల్ల ముడతలు పడుతుంది. ‘పన్నె వెల్వెట్’ ప్రక్రియలో మెటీరియల్‌పై సాంకేతికపరంగా కొంత ఒత్తిడి తీసుకువచ్చి, ముడతలు చేస్తారు. ఈ వెల్వెట్‌ను కర్టెన్లు, దిండుగలీబులు, కార్ సీట్ కవర్లు, హ్యాండ్ బ్యాగులకు ఉపయోగిస్తారు. అయితే దుస్తుల తయారీ నిపుణుల దృష్టి ముడతలు పడిన మఖమల్ క్లాత్‌పై పడటంతో ఈ వస్త్రం మరింత వన్నెలద్దుకొని వనితల మేనిపైకి చేరింది. క్రష్డ్ వెల్వెట్ సంప్రదాయ దుస్తుల జాబితాలో చేరిపోయింది. దీంట్లో భిన్నమైన డిజైన్లు పడతుల మతులు పోగొడుతున్నాయి. సిల్క్ ముడతలు... సిల్క్, శాటిన్, షిఫాన్.. ఫ్యాబ్రిక్ లో ముడతలు తీసుకురావాలంటే వస్త్రాన్ని తయారుచేసేటప్పుడే ఒక ప్రత్యేకమైన టెక్స్చర్ను తీసుకురావాలి. దారం ఎంపిక, ముడతల ప్రక్రియ దశలవారీగా జరగాలి. ఇందులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం సిల్క్ ఫ్యాబ్రిక్‌ను మరింతగా అందంగా మార్చుతోంది. ఈ ఫ్యాబ్రిక్ డిజైనర్ దుస్తులకు ఎక్కువ ఉపయోగకారి. నిర్వహణ... మిగతా వాటితో పోలిస్తే క్రష్డ్ ఫ్యాబ్రిక్ నిర్వహణ సులువు. క్రష్డ్ ఫ్యాబ్రిక్ పూర్తిగా ముడతలతో నిండి ఉంటుంది. ఈ వస్త్రాన్ని మడత పెట్టేటప్పుడు చాలా దగ్గరగా, గట్టిగా కట్టి ఉంచాలి. మఖమల్ వస్త్రమైతే మెషిన్ వాష్ చేయడం మేలు. క్రష్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే పూర్తిగా డ్రై క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్రష్డ్ ఫ్యాబ్రిక్ అందమైనది, విలాసవంతమైనది. ధరించగానే ఆహార్యంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుంది. ఆ మార్పు మీరూ కోరుకుంటే మడత నలగని వస్త్రాలకే కాదు ‘ముడతలు’గల డ్రెస్సులకూ ఇప్పుడే ఆహ్వానం పలకవచ్చు. -
అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!
ముస్తాబు అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?! వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?! బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్‌గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి. అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్‌గా మారాయి. కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి. రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది. పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్‌లలో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్‌లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు... ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్‌క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్‌బ్రష్‌తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవి రింగులు గానూ, నెక్లెస్ ఎక్స్టెండర్స్గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్గానూ వాడచ్చు. ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి. బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు. ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్‌గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది. కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు: ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. -
కట్ చేద్దాం... ముడివేద్దాం..!
ముస్తాబు కురులను అపురూపంగా చూసుకుంటారు అమ్మాయిలు. బారుగా పెరగాలని రకరకాల నూనెలు రాసుకుంటారు. హెన్నాలు వాడుతారు. కలరింగ్‌లు చేయిస్తారు. అంత ఆప్యాయంగా పెంచుకున్న శిరోజాలను కట్ చేయడమా?! ‘ససేమిరా’ అంటారు ఎవరైనా!! కానీ ఇటీవలి కాలంలో అమ్మాయిల నోట పొడవైన జుట్టుకు ‘నో’ అనే మాటే వినపడుతోంది. అందులోనూ వేసవిలో అయితే మరింత కురచ కేశాలనే ఇష్టపడుతున్నారు. పొడవు, పొట్టి, గరుకు, వంకీలు తిరగడం... ఇలా శిరోజాల తత్త్వం ఏదైనా, ఏతరహాకు చెందినా రకరకాల హెయిర్ కట్స్‌తో, కేశాలంకరణతో కొత్త కొత్త స్టైల్స్ పోతున్నారు. అతివలు ఇష్టపడే హెయిర్‌కట్స్, హెయిర్‌స్టైల్స్‌తో పాటు హెయిర్ కేర్ పాటిస్తే ఈ వేసవిలో మరింత కూల్‌గా గడిపేయచ్చు. వేసవి హెయిర్ కట్స్... స్టెప్ కట్: దీన్ని ‘్ఖ’షేప్ కట్ అని కూడా అంటారు. చాలామంది భారతీయ వనితలు ఇష్టపడే హెయిర్ కట్ ఇది. అటు పొడవు, ఇటు పొట్టి కాకుండా భుజాలమీదుగా కదలాడుతుండే శిరోజాలు అందంగా కనిపిస్తాయి. చిరాకు అనిపిస్తే జుట్టును ‘రోల్’ చేసి పైకి మడిచి క్లిప్ పెట్టేయచ్చు. లేదా నడినెత్తిన బ్యాండ్‌తో బిగించేయవచ్చు. అండాకార ముఖాకృతి ఉన్నవారు, కేశాలు సాధారణ పొడవులో మందంగా ఉన్నవారు ఈ కట్‌ను ఎంచుకోవచ్చు. మృదువుగా, స్ట్రెయిట్‌గా శిరోజాలు ఉన్నవారికే ఈ తరహా కట్ బాగా నప్పుతుంది. ఇందుకోసం పర్మనెంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకోవచ్చు. ఫెదర్ కట్: యువతులకు అత్యంత ఇష్టమైన కట్ ఇది. స్టైల్‌గా... సులువుగా ఉపయోగించేలా, ముఖ్యంగా ఎక్కువ శ్రమ కలిగించని విధంగా ఉంటుంది ఈ హెయిర్ కట్. పైగా వయసు తగ్గినట్టు కనిపిస్తారు కూడా! ఈ తరహా కట్ టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. పొరలు పొరలుగా కట్ చేస్తారు కాబట్టి, పొట్టిగా ఉండే ఈహెయిర్ కట్ జుట్టును మందంగా చూపిస్తుంది. ఏ తరహా ముఖాకృతికైనా ఈ హెయిర్‌కట్ బాగా నప్పుతుంది. అలాగే ఆధునికం, సంప్రదాయం ఏ తరహా దుస్తులమీదకైనా ఈ హెయిర్ స్టైల్ చక్కని ఎంపిక. లేయర్డ్కట్: స్టైలిష్ హెయిర్కట్గా పేరొందింది. వెంట్రుకలను లేయర్లుగా కట్ చేసే ఈ పద్ధతిలో జుట్టు మందంగా కనిపిస్తుంది. అయితే ఇది స్ట్రెయిట్ జుట్టున్నవారికి నప్పుతుంది. పొడవు, పొట్టి, ఒత్తై జుట్టుకు కూడా సూటవుతుంది. బాబ్డ్ కట్: చెవుల కిందకు, భుజాలకు పైకి ఉండే హెయిర్‌కట్ ఇది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో స్త్రీలు సౌకర్యం కోసం ఈ స్టైల్‌ను ఎంచుకున్నారట. ఈ కట్లో ఉండే సౌలభ్యానికి ప్రపంచంలోని మహిళలంతా ఆకర్షితులయ్యారు. ఇప్పటికీ బాబ్డీ హెయిర్‌కట్ అతివల నోట అందమైన కట్‌గా ప్రశంసలు అందుకుంటోంది. బాబ్డీ హెయిర్కట్లోనే ఫ్రంట్ ఫెదర్, లేయర్ అంటూ ముఖం మీదకు పడేలా కొన్ని స్టైల్స్ తీసుకువస్తున్నారు. ఇది గుండ్రటి ముఖాకృతి గలవారికి బాగా నప్పే హెయిర్‌కట్. పొడవు జుట్టు వద్దనుకునేవారు తమ ముఖాకృతిని బట్టి ఈ హెయిర్‌కట్‌ను ఎంచుకుంటే సౌకర్యానికి సౌకర్యమూ, అందానికి అందమూ సొంతమవుతాయి. కేశసంరక్షణ... చలికాలంతో పోలిస్తే వేసవిలో వెంట్రుకలు ఊడడమనే సమస్య పెరుగుతుంటుంది. కారణం సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా కేశాలను తాకడం వల్ల శిరోజాల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. త్వరగా పొడిబారి, తెల్లజుట్టుకు కూడా కారణమవుతుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా శిరోజాలను తాకకుండా బయటకు వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్స్ వంటివి తలకు ఉపయోగించాలి. బయటకు వెళ్లేముందు కండిషనర్ను లేదా సన్‌స్క్రీన్‌ను పై వెంట్రుకలకు రాయాలి. బయట నుంచి వచ్చిన వెంటనే జుట్టును శుభ్రపరుచుకోవాలి. వేసవిలో కొంతమంది స్విమ్మింగ్‌ను ఇష్టమైన అలవాటుగా ఎంచుకుంటారు. ఈత కొలనులలో ఉండే ఉప్పు వల్ల జుట్టు పొడిబారి, వెంట్రుకల చివరలు చిట్లుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో క్లోరిన్ లేని నీటితో తలను శుభ్రపరుచుకుంటే వెంట్రుకలు చిట్లడం, నిస్తేజంగా మారడం ఉండదు. వేసవిలో వేడి అమితం. దీంతో జుట్టు తడి పోగొట్టడానికి హెయిర్ డ్రయ్యర్, బ్లోయర్, స్ట్రెయిటనర్.. వంటివి వాడుతుంటారు. ఈ పరికరాల వల్ల వెంట్రుకలు చిట్లి, మరింత దెబ్బతింటాయి. అందుకని వేసవిలో ‘వేడి’ పరికరాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. వేసవి చీకాకును పోగొట్టుకోవడానికి వారంలో ఎక్కువసార్లు తలస్నానానికి షాంపూను ఉపయోగిస్తారు. దీని వల్ల షాంపూలోనే ఉండే రసాయనాలు వెంట్రుకలపై ఉండే సహజసిద్ధమైన నూనెను తగ్గించి, వెంట్రుకలను గరుకుగా మారుస్తాయి. షాంపూతో తలంటుకున్న ప్రతీసారి ప్రొటీన్, కెరటీన్ ఉన్న కండిషనర్‌నే ఉపయోగించాలి. లేదా వారానికి రెండుసార్లు పెరుగుతో తలకు ప్యాక్ వేసుకొని, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చల్లని ప్రభావాన్ని చూపుతుంది. వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు. వేడినీటితో తలస్నానం చేసేవారు వేసవిలో ఆ అలవాటును మానుకోవడం మంచిది. సహజంగానే వేడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటుంటాయి. అలాంటిది వేడినీటి వల్ల వెంట్రుక కుదురు మరింతగా పొడిబారి జీవం కోల్పోతుంది. అందుకని తలస్నానానికి చన్నీటినే ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో శిరోజాల నిగనిగలను కాపాడుకున్నట్టే! పొడవాటి జుట్టున్నవారికి ఇబ్బంది కలిగించని కొన్ని వేసవి హెయిర్ స్టైల్స్ 1. {ఫంట్ కట్ ఉన్నవారికి ఈ హెయిర్‌స్టైల్ నప్పుతుంది. ఒక్కోపాయను తల పై భాగంనుంచి తీసుకుంటూ, పిన్నులు పెడుతూ సెట్ చేయాల్సి ఉంటుంది. 2. జుట్టు అంతా కలిపి, మధ్యన హెయిర్ బ్యాండ్ పెట్టి, తర్వాత ఒక్కో పాయను రౌండ్‌గా చుట్టి, పిన్నులు పెట్టాలి. మధ్య మధ్యన సన్నని జడ అల్లి, అలంకరించాలి. 3. ముందుగా హెయిర్బ్యాండ్తో జడ వదులుగా అల్లి, పైకిమడిచి పిన్నులతో అలంకరించాలి. 4. నుదురు పై భాగాన కొంత హెయిర్ తీసి, వెనకభాగాన్ని నడినెత్తిన కొప్పులా చేసి ఈ అలంకరణ చేయాలి. 5. జడను అల్లి, పైకి మడిచి, పిన్నులతో అమర్చాలి. తర్వాత నచ్చిన కేశాలంకరణ చేయవచ్చు. 6. జుట్టును రోల్ చేసి, పైన ముడిలా చుట్టి, ముందుభాగంలో హెయిర్ క్లిప్ వాడాలి. 7. నుదురుపై భాగం నుంచి ఒక వైపు పాయలుగా జుట్టును ఎడమచెవి వైపుగా అల్లి, చిన్న క్లిప్ పెట్టేయాలి. నుదురు, వీపు భాగాలలో వెంట్రుకలు పడి, చీకాకు కలిగే అవకాశం ఉండదు. 8. రెండు జడలు అల్లి, తల మీదుగా తీసి, పిన్నులు పెట్టేయాలి. 9. పాపిట భాగం నుంచి వెంట్రుకలను పాయలుగా తీసుకుంటూ ఒక వైపుకు జడ అల్లాలి. -
పెళ్లి కూతురికి పువ్వుల శోభ
పుట్టినింటి బంగారుతల్లి, మెట్టినింట సిరులరాణిగా, మారే శుభతరుణాన సిరిమల్లెలదే ప్రధాన అలంకరణ. ముద్దబంతిలాంటి మోము ,ముచ్చటైన వేడుకకు మురిసేవేళ గులాబీలదే అసలైన అలంకరణ. ఇంతుల నాజూకు చేతుల్లో వరసలుగా రూపుకట్టిన చామంతులదే చూడచక్కని అలంకరణ. మల్లెలు, గులాబీలు, చామంతులు.. పూలతేరులా వధువు మేనికి సింగారంలా మారితే...‘ఎంతందంగా ఉన్నావే..’ అంటూ ఆమె నవ్వులతో పోటీపడటమే సిసలైన అలంకరణ. వివాహ వేడుకలలో పువ్వుల సుగంధాలదే పెద్దపీట. పెళ్లికి ముందు జరిపే సంగీత్, మెహిందీ సంబరాల్లో బంగార ం కన్నా వధువుకు పువ్వులనే ఆభరణాలుగా అలంకరించడం ట్రెండ్‌గా మారుతోంది. వధువుతో పాటూ వేడుకలో పాల్గొనే ప్రతి పడతీ పువ్వుల అలంకరణ పట్ల మక్కువ చూపుతోంది. ఉత్తరభారతదేశంలో మొదలైన ఈ కళ ఇప్పుడు దక్షిణభారతదేశపు తెలుగింటి లోగిళ్లలోనూ సందడి చేస్తోంది. పువ్వుల ఎంపిక: బంతి, చామంతి, లిల్లీ, మల్లెమొగ్గలు, గులాబీలు.. ఏ పువ్వులనైనా ఆభరణాల అలంకరణకు ఎంచుకోవచ్చు. మెడలో హారాలు, చెవి లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, కాళ్లపట్టీలు, గాజులు.. అన్నీ పువ్వులే! అయితే ధరించిన దుస్తుల రంగుకు సూటయ్యేలా పువ్వుల ఎంపిక ఉండాలి. ఆభరణాల తయారీకి ఎంపిక... ఎంపికచేసుకున్న పువ్వులు, కుందన్స్ పొదిగిన లాకెట్స్, చమ్కీ, పూసలు, ముత్యాలు, బంగారు వర్ణపు లేసు, ఇతర ఆభరణాలు... ఇవన్నీ జతచేర్చడానికి సూది-దారం. మనిషి రూపురేఖలను బట్టి ఎంత పరిమాణంలో ఆభరణాలను తయారు చేయాలో ముందుగా కొలతలు తీసుకోవాలి. రకరకాల రూపాల్లో పువ్వుల ఆభరణాలను నచ్చిన విధంగా తయారు చేసుకున్నాక, వాటిని లేసుకు గుచ్చాలి. ఆ పైన నచ్చిన లాకెట్స్ జత చేయాలి. చిన్న చిన్న లాకెట్స్లా రూపొందించిన పువ్వులను ఇతర ఆభరణాలకూ అమర్చుకోవచ్చు. పువ్వుల ఆభరణాలకు విడిగా హుక్స్ అమర్చుకోవచ్చు. లేదా ఎలాంటి ఆభరణాలు అవసరం లేకుండా జరీ దారాలతోనూ కట్టేసుకోవచ్చు. నోట్: పువ్వుల ఆభరణాలు త్వరగా వాడిపోకుండా తయారీలో మొగ్గలు ఎక్కువ ఉపయోగించాలి. చల్లదనం ఉంటే పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మాఘమాసం పెళ్లి పందిళ్లు పువ్వుల అలంకరణతో మెరిసిపోతే... అతివల నగుమోము ఇలా పువ్వుల ఆభరణాల మధ్య మురిసిపోతుంది. - నిర్మలారెడ్డి మోడల్: గ్రీష్మ, ఫొటోలు: శివమల్లాల - కల్పన పువ్వుల ఆభరణాల నిపుణురాలు www.pellipoolajada.com -
వెల్వెట్వెచ్చని నెచ్చెలి
మీకేం ఇష్టమో తెలిసిన ఫ్రెండ్ ఒకరు మీకేం ఇష్టం ఉండదో తెలిసిన ఫ్రెండ్ ఇంకొకరు ఇద్దర్లో మీరు ఎవరి దగ్గర ఓపెన్ అవుతారు? మీకేది బాగుంటుందో చెప్పే ఫ్రెండ్ ఒకరు మీకేం బాగుండదో చెప్పే ఫ్రెండ్ ఒకరు ఇద్దర్లో మీరు ఎవర్ని సలహా అడుగుతారు? మీరెలా చెబితే అలా వినే ఫ్రెండ్ ఒకరు మీరేమీ చెప్పకుండానే వినే ఫ్రెండ్ ఒకరు ఇద్దర్లో మీరు ఎవరి తోడును కోరుకుంటారు? సమాధానం మీ మనసుకు తెలుసు. ఆ మనసుకు చక్కగా ఫిట్ అయ్యే నెచ్చెలే... వెల్వెట్! ముఖమల్ అంటే ఆధునికులు కొంత ఆలోచనలో పడతారు. అదే ‘వెల్వెట్’ అంటే ‘వావ్ గుడ్ ఫ్యాబ్రిక్’ అంటూ ఆ క్లాత్‌ని తమ మేనికి అతికించుకుంటారు. చూపులకు కాంతిమంతం, చుట్టుకుంటే మృదుత్వం కట్టుకుంటే కనువిందుచేసే సోయగం ముఖమల్ సొంతం అంటూ మురిసిపోతారు. చూపరుల మదిని కొల్లగొడతారు. రాచరికానికి కొత్త హంగులు అద్దిన ‘ముఖమల్’ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సామాన్యుడిని సైతం పలకరించింది. సింగిల్‌గానే కాదు నీరు ఏ పాత్రలో పోస్తే అందులో ఒదిగిపోయినట్టుగా వెల్వెట్ ఏ ఫాబ్రిక్‌తో కలిస్తే ఆ రూపకంగా సొబగులు అద్దుకుంటూ వచ్చింది. కాని తన గుర్తింపును మాత్రం ఏ మాత్రం కోల్పోకుండా అదే హంగు, ఆర్భాటంతో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. అంతే డిజైనర్ల లుక్‌ను ఆటోమేటిగ్గా తన వైపుకు తిప్పుకుంది. తన చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. చేయిస్తూ ఉంది. సంప్రదాయ తరహాలో ‘కుందనపుబొమ్మల’ను తీర్చిదిద్దే ముఖమల్ ఆధునిక తరహాలో ర్యాంప్షోలపైనా షార్ట్స్‌గా హోయలు పోతోంది. దుస్తులే కాదు యాక్ససరీస్నూ వెల్వెట్ విభిన్నతరహాలో మెరిసిపోతుంది. పట్టుతో తయారైన ముఖమల్ ఫ్యాబ్రిక్ మరింత మృదువుగా ఉండటమే కాదు కాంతిమంతంగానూ ఉంటుంది. దీనిని పోలినట్టుగా ఉండే ఇతర వెల్వెట్ నాణ్యతలో తేడా కనిపిస్తుంది. షిఫాన్ వెల్వెట్ -చాలా తక్కువ బరువుతో కాస్తంత ట్రాన్స్పరెంట్తో అట్రాక్ట్ చేస్తే, పై ఆన్ పై వెల్వెట్ ప్రింట్స్‌తో పలకరిస్తుంది. వీటిలో సిజిల్, క్రషడ్, ఎంబోస్డ్, హ్యామర్డ్, లేయన్స్, మిర్రర్.... వంటి రకరకాల ఫ్యాబ్రిక్‌గా కొత్త అందాలను సింగారించుకుని అతివల మనసులను కొల్లగొడుతుంది. క్రీ.పూ 12 వందల కాలంలో ప్రభువుల కోసమే రూపొందిన ముఖమల్ను మొట్టమొదట బాగ్దాద్ పట్టణంలో తయారుచేసినట్టు, ఆ తర్వాత కాశ్మీర్ వ్యాపారులు ప్రపంచానికి పరిచయం చేసినట్టు చరిత్ర చెబుతుంది. ప్రాచీన రోజుల్లో ముఖమల్ స్వచ్ఛమైన పట్టుతో తయారయ్యేది. అందుకే గజం ముఖమల్ క్లాత్ కొనాలంటే బోలెడన్ని బంగారు కాసులు ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో ఇది అత్యంత ఖరీదైన వస్త్రంగా ప్రపంచమంతా పేరుపొందింది. ఆ తర్వాత కాలంలో లినెన్, ఊల్, పాలియస్టర్, నైలాన్... వంటి విభిన్నరకాలైన సింథటిక్స్‌తో మేళవించి వెల్వెట్‌ను రూపొందించడం మొదలుపెట్టారు. దీంతో ధర పరంగానూ వెల్వెట్ అందరికీ అందుబాటులోకి దిగిరాకతప్పలేదు. వెల్వెటీన్: టీన్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ వెల్వెట్. కురచ డ్రెస్సులను ఇష్టపడే అమ్మాయిలను ఆకట్టుకునే ఫ్యాబ్రిక్. అలాగే మృదువుగా ఉండటంతో సౌక్యర్యంగా అనిపిస్తుంది. పెద్దగా సాగే గుణం ఉండదు. కాటన్ వెల్వెట్ అయితే చమటను పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. తడిగా ఉన్న పొడిగానే చూపులకు కనిపిస్తుంది. అంతేకాదు చలిని కట్టడి చేసి ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో చలికాలం ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్‌గా వెలుగొందుతుంది. స్టైల్‌గా, స్మార్ట్‌గా, స్టన్నింగ్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ కావడంతో ఈ క్లాత్‌పై మగ్గం పనితీరు అందంగా అమరుతుంది. జర్దోసీ జిగేల్మంటుంది. అద్దాలు మిరుమిట్టుగొలుపుతుంటాయి.చమ్కీలు చమక్కుమంటాయి. యాక్ససరీస్: వెల్వెట్ ప్రాబ్రిక్తో దుస్తులు మాత్రమే కాదు వివిధ రకాల యాక్సరీస్కూడా రూపొందుతున్నాయి. బ్యాగు లు, పర్సులు, చెప్పులు, బెల్ట్‌లు,.. గానూ కనువిందు చేస్తున్నాయి. -
కాలం మీ... వస్త్రగతం
గతం గతః మళ్లీ వెళ్లి బళ్లో కూర్చోలేం. బారు జళ్లో స్నేహితురాలిచ్చిన చామంతిని తురుముకోలేం. పెళ్లి కూడా అంతే! ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి... ‘నచ్చలేదు నాన్నా’ అని అలిగి, మూతి ముడుచుకోలేం. గతించినది ఏదీ తిరిగి రాదు. అంతేనా? మిగిలిందిక జ్ఞాపకాలేనా? భూతకాలపు రూపకాలేనా? లేదు లేదు, అమ్మాయిలూ... నిరాశపడే పనే లేదు! జారిపోయిన కాలం హస్తగతం కాకపోవచ్చు కానీ... ‘వస్త్రగతం’ అయి తీరుతుంది. రెట్రో స్టెయిల్స్, రెట్రో ఫ్యాషన్లు... మిమ్మల్ని (మీ చుట్టూ ఉన్నవాళ్లని కూడా)... పాత అనుభూతులలోకి మోసుకెళతాయి! రెట్రో అంటే... పరుగులు తీసే కాలం... ఒక్కక్షణం ఆగి, తలతిప్పి చూసే ఫ్యాషన్! మరి మీరెప్పుడు... కాలాన్ని మీవైపు తిప్పించుకోబోతున్నారు? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త లుక్‌తో మెరిసిపోవడం ఎలా?! అందరిలో అట్రాక్టివ్‌గా కనిపించేదెలా? అవే జీన్స్, అవే చుడీదార్లు, అవే లంగా ఓణీలు... కొత్తేమీ లేదా?! అని ప్రశ్నించే నేటి తరం అమ్మాయిలకు పాత లుక్‌ను కొత్తగా పరిచయం చేసే ట్రెండ్ రెట్రో! ఇందుకు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్లోనూ కసరత్తులు జరుగుతున్నాయి. కాలేజీ నుంచి కాన్స్ వరకు రెట్రో లుక్ ఇప్పుడు అంతటా హల్చల్ చేస్తోంది. నిన్నా మొన్న ‘అబ్బో పాత చింతకాయ పచ్చడి’ అనే ముఖం ముడిచే అమ్మాయిలే ‘ఓహ్ ఓల్డ్ ఈజ్ న్యూ యార్!’ అని ఎగిరి గంతేసే ఇయర్ మన ముందుంది. తలకట్టు నుంచి పాదాల వరకు... పాత సినిమాలను కొత్తగా తీస్తున్నట్టే ఫ్యాషన్‌ను పాత నుంచి కొత్తగా మార్చుకుంటున్నారు నేటితరం. 60ల కాలంలో పట్టులాంటి మృదువైన జుట్టును భుజాల మీదుగా వదిలేస్తేనే అందం అనుకునే అమ్మాయిలు ఇక నుంచి రంగురంగుల ప్రింట్లు ఉన్న క్లాత్‌ను రిబ్బన్‌లా వాడచ్చు. ఒకప్పుడు అశాఫరేఖ్, సైరాభాను, హేమమాలిని, శ్రీదేవి హెయిర్ స్టైల్స్‌నే కాదు డ్రెస్స్టైల్స్నూ ఇప్పుడు ఐశ్వర్యారాయ్, నేహాదుపియా, విద్యాబాలన్, దీపికాపదుకొనే, ప్రియాంకాచోప్రా సోనమ్‌కపూర్... వంటి తారాగణమంతా వరుసగా అనుకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. యాక్షన్ రీప్లే, ఓమ్శాంతి ఓమ్.. వంటి సినిమాల్లోనే కాదు రాబోతున్న లూటెరా, గుండే, బాంబే వెల్వెట్, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ముంబాయ్ దోబారా.. సినిమాల్లోనూ తారలు ‘పాత లుక్’లో కొత్తగా మెరిసిపోతున్నారు. బెల్‌బాటమ్స్ టు షార్ట్ కుర్తీలు 70-80 దశకంలో వదులుగా ఉండే బెల్‌బాటమ్ ప్యాంట్స్ హల్చల్ చేశాయి. అవే ఇప్పుడూ మార్కెట్లో కనువిందు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే విద్యాబాలన్, నేహాధూపియా వంటి తారలు బెల్‌బాటమ్స్ ధరించి పెద్ద పెద్ద ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. అలాగే దేహానికి అతుక్కుపోయేలాంటి షార్ట్ కుర్తీలు, ప్యాంట్లూ వచ్చేశాయి. వాటిలో లెగ్గింగ్స్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. మేకప్ టు యాక్ససరీస్! కళ్లకు దట్టమైన కాటుక, కంటి చివరల నుంచి పొడవుగా సాగే ఐ లైనర్లు, పెద్ద పెద్ద ఫ్రేమ్ ఉన్న కళ్లద్దాలు, హెయిర్ బ్యాండ్స్, ఆభరణాలూ పాత తరాన్ని అనుకరిస్తున్న లిస్ట్‌లో ఉన్నాయి. ‘సాధారణంగా ఏ ఫ్యాషన్ అయినా 10ఏళ్లకోసారి ఏదో రూపంలో కనిపిస్తుంది. డిజైనర్లు కూడా అందుబాటు ధరల్లో ఫ్యాషన్‌ని సృష్టించాలని తపిస్తారు. అలాంటప్పుడే రెట్రో ఊపిరి పోసుకుంటుంది. రెట్రోలో సింథటిక్ ఫ్యాబ్రిక్, షిఫాన్ వినియోగిస్తారు. ప్రస్తుతం అమ్మాయిలు చుడీదార్స్కు బదులు పలాజోస్ (లూజ్ప్యాంట్స్) వేసుకుంటున్నారు. అలాగే బైట్ ఎల్లోస్, బ్రైట్ గ్రీన్, ఎక్కువ రెడ్, అత్యంత తక్కువ వైట్ వాడుతూ ఎక్కువగా బ్లాక్‌తో మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తున్నారు. హెయిర్ ముడికడుతూ, బన్స్టైల్లో వేస్తున్నారు. - అయేషా, లఖోటియా ఫ్యాషన్ డిజైనర్ మీరూ రెట్రో లుక్‌లో కొత్తగా మెరిసిపోవాలనుందా? అయితే, మీ వార్డ్‌రోబ్‌లో ఈ తరహా డ్రెస్సులు ఉండేలా జాగ్రత్తపడితే చాలు విత్ యాక్ససరీస్‌తో సహా! పువ్వుల ప్రింట్లు, లేస్‌లు, కుచ్చులు, పోల్కా డాట్స్, గళ్లు, రిబ్బన్లు, హెడ్ బ్యాండ్స్ (హిప్పీ స్టైల్), గౌన్లు, అక్కడక్కడా చిరుగులు ఉండి బాగా వెలిసిపోయినట్టుగా ఉండే జీన్స్, లూజు ప్యాం్టట్స్. డ్రెస్సుల మీదకు ఆభరణాలుగా పొడవైన సన్నని చైన్ దానికి పెద్ద ఆకర్షణీయమైన లాకెట్. అమ్మలు, అమ్మమ్మల కాలం నాటి స్కార్ఫ్ (పువ్వుల ప్రింట్లు, ఎంబ్రాయిడరీ, పోల్కా డాట్స్ ఉన్న క్లాత్‌ని స్కార్ఫ్‌లా మెడకు చుట్టేసుకోవచ్చు. పాతకాలం నాటి మోడల్ టోపీ, కళ్లద్దాలు.. ఉంటే చూసుకుంటే చాటు రెట్రో స్టైల్‌ను ఫాలో అయిపోవచ్చు. -
మావాళ్లకంటే అమ్మాయిలే నయం!
జొహన్నెస్‌బర్గ్: ‘పార్టీకి సిద్ధమయ్యేందుకు అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ మా టీమ్‌లో కొందరు ఆటగాళ్లకంటే ఆడపిల్లలే నయం. మేకప్ కోసం వాళ్లు ఎంతో సమయం తీసుకుంటారు. కొందరు హెయిర్ జెల్ లేకుండా బయటికి రాకుంటే మరి కొందరేమో సన్‌స్క్రీన్, షవర్ జెల్ లేకుండా అడుగు పెట్టరు’...ఈ వ్యాఖ్య చేసిందెవరో కాదు భారత క్రికెట్ కెప్టెన్ ధోని. టీమిండియా సభ్యులకు భారత హైకమిషనర్ వీరేంద్ర గుప్తా ఇచ్చిన విందుకు జట్టు హాజరైన సందర్భంగా మహి ఈ మాటలు అన్నాడు. డిన్నర్ చేస్తూ కూడా ‘మేం భారతీయులమైనా తక్కువ తినే రకం కాదు. మాలో చాలా మందికి మూడు, నాలుగు సార్లు వడ్డించాల్సిందే’ అని అక్కడి సర్వర్లతో నవ్వుతూ అన్నాడు. టెస్టు మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఎలాంటి టెన్షన్ లేకుండా ధోని బృందం కొంత మంది భారత అభిమానులతో సరదాగా గడిపింది. మన ఉత్తమ బౌలర్ షమీ: గంగూలీ కోల్‌కతా: దక్షిణాఫ్రికాలో ఆడుతున్న భారత బౌలర్లలో షమీ అత్యుత్తమమని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసించాడు. ‘జహీర్, శ్రీశాంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు వారిని చూశాను. కానీ ప్రస్తుతం మాత్రం షమీ బాగా మెరుగ్గా కనిపిస్తున్నాడు’ అని దాదా అన్నాడు -
ఫౌండేషన్ వాడుతున్నారా?
సీజన్ మారింది. మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వార్డ్‌రోబ్‌లో చలిని తట్టుకోవడానికి దుస్తులను ఎలా సెట్ చేసుకుంటారో అలాగే సౌందర్య ఉత్పాదనల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చలికాలం ఫౌండేషన్ కట్టిపెట్టడానికి ముఖ్యమైన కాలం. ఈ కాలం చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం దురద పెడుతుంది. పొడిబారిన చర్మాన్ని మరింత ఇబ్బందిపెట్టకుండా వాతారణాన్ని తట్టుకునే విధంగా సరైన ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి. లిక్విడ్ ఫౌండేషన్ మేలైన ఎంపిక. మాయిశ్చైరైజర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్, నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మం పొలుసులుగా అవదు. ఏ మేకప్వేసుకున్నా ముందుగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. చర్మతత్త్వం తెలుసుకుంటే ఎలాంటి ఉత్పత్తులు వాడాలో సులువుగా తెలుస్తుంది. అందుకని కాలానుగుణంగా వచ్చే చర్మసమస్యలకు వైద్యనిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు ఉత్పాదనలను ఎంచుకోవాలి. వేసవిలో పౌడర్ వాడుతున్నాం కదా అని చలికాలంలోనూ ఉపయోగించడం సరైనది కాదు. పౌడర్ వాడటం వల్ల పొడిబారిన చర్మం పొరల్లోకి చేరి మరింత తేమను కోల్పోయేలా చేస్తుంది. పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఉన్నవాటిని ఎంచుకోవాలి. లిక్విడ్ ఫౌండేషన్‌లో మాయిశ్చరైజర్స్, చర్మం పై తేమను ఉంచే సుగుణాలు ఉన్నాయా, లేవా అనేది ప్రొడక్ట్ లేబుల్‌పై చూసి ఎంచుకోవాలి. ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం ఫెయిర్‌గా, మెడ నలుపుగా కనిపించే ప్రమాదం ఉంది.