'బ్యూ'టిప్స్
సమ్మర్ కేర్
బయటికెళ్లేటప్పుడు తలకు హ్యాట్ కాని క్యాప్‌కాని పెట్టుకుంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది.సమ్మర్‌లో పాదాలకు, వేళ్లకు గాలి తగిలే పాదరక్షలనే వాడాలి. ఫంక్షన్‌లకు వెళ్లేటప్పడు పాదం మొత్తాన్ని కవర్ చేసే ఫ్యాన్సీ శాండల్స్, షూస్ వేసుకోవాలంటే... వేళ్ల మధ్య టాల్కమ్ పౌడర్ చల్లాలి.ఎండ నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ వాడేవాళ్లకు కళ్ల చుట్టూ మినహా మిగిలిన ముఖమంతా ట్యాన్‌తో ప్యాచ్‌లా ఉంటుంది. కాబట్టి సన్‌గ్లాసెస్ ధరించడంతోపాటు ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
సమ్మర్ మేకప్‌లో ఐ లైనర్ పెన్సిల్ కలర్ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేకప్ హెవీ కాకుండా ముఖం తీరుగా కనిపింపచేయడంలో గ్రే, చాకొలేట్, నేవీ షేడ్‌లు ముఖ్యమైనవి.సాయంత్రం పార్టీలకు లూస్ షిమ్మర్ పౌడర్ వేసుకుని పెదవులకు లేత రంగు లిప్‌గ్లాస్ వేస్తే బాగుంటుంది.తప్పని సరిగా ఫౌండేషన్ వేసుకోవాలనుకుంటే... అందులో కొంచెం లూజ్ పౌడర్ కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుబారదు. రోజంతా తాజాగా కనిపించవచ్చు.